Sunday, February 14, 2010

పువ్వంటి ప్రేమకు....పండంటి పెళ్లి జీవితానికి....5 సూత్రాలు

"వీడి తెలుగు చదివితే...ప్రాణం లేచివచ్చినట్లయింది," అని గురువు గారు బూదరాజు గారు ఒకసారి, "తెలుగంటే ఇలా రాయాలి," అని 'ఈనాడు' అధిపతి రామోజీ రావు గారు వేరొకసారి పొగిడితే...వాళ్లకు ఒక రహస్యం చెప్పెయ్యాలనిపించింది. పెద్దోళ్ళు కాబట్టి అప్పట్లో చెప్పలేకపోయాను. అదేమిటంటే...ఆరేడేళ్ళ ప్రేమ జీవితంలో నేను రాసిన నాలుగు వేల పైచిలుకు ప్రేమలేఖల మహత్యం. 

ఆదివారం నాడు 'వాలెంటైన్స్ డే' సందర్భంగా నిజమైన ప్రేమికులందరికీ శుభాకాంక్షలు చెబుతూ...పువ్వంటి ప్రేమ జీవితానికి, పండంటి లవ్ మ్యారేజ్ లైఫ్ కు స్వానుభవంతో నేర్చిన ఐదు ముఖ్యమైన సూత్రాలు అందించే ప్రయత్నమిది.

1) సినిమాలో లా....టాం..టాం చేసుకోవద్దు...
ప్రేమ నిజంగానే ఒక మధురం. సాధారణంగా కాలేజ్ లైఫ్ లో శరీరకంగా, మానసికంగా కలిగే మార్పుల వల్ల ఈ లవ్ డబ్ మొదలవుతుంది. మనసు ఎప్పుడు స్పందిస్తుందో మనం చెప్పలేం. ఇంటర్ చివర్లో ఒక మల్లె పందిరి కింద...ఆమెను చూసాను. అప్పుడే మనసు మునుపెన్నడూ లేని ఉద్వేగానికి లోనయ్యింది. 'బాస్..ఈమె నీ జీవిత భాగస్వామి' అని చెప్పింది మనసు.  రెచ్చిపోకుండా...చాల ప్రాక్టికల్గా విశ్లేషణ చేసి ఒక ఏడాది పొయ్యాక మనసులో మాట తెలియజేసా. 
ఈ తుక్కు సినిమాలలో...పోరంబోకు మిత్రబృందం లవర్లను ఎగదోయడం, సహకరించడం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నేనొక సర్వే చేస్తే తేలింది ఏమిటంటే...ప్రేమ గురించి..సినిమాలలో లాగా పదిమందికి చెప్పుకుని...ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు రియల్ లైఫ్ లో ఫెయిల్ అయ్యారు. ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడేది ఎందుకంటే...ప్రేమ విఫలం అయితే నలుగురిలో పలచన అవుతామన్న భయంతో.
ప్రేమ రెండు గుండెల మధ్య మొలకెత్తి...మొగ్గ తొడిగి..విరబూయాల్సిన ఒక అద్భుతమైన అనుభూతి. నేను కనీసం నాలుగేళ్ళు నరమానవుడికి చెప్పలేదు...విషయాన్ని. మా నాన్న కు మాత్రం చెప్పాను ఓ మూడేళ్ళు పొయ్యక. అద్భుతమైన వ్యక్తి...మా నాన్న...జీవితంలో నాకు ఇచ్చిన స్ఫూర్తి గురించి ఫాదర్స్ డే (జూన్ లో మూడో ఆదివారం) రోజు మరిన్ని వివరాలు రాస్తాను.


2) శారీరక సంబంధం...వద్దు...సంయమనం ముద్దు 
ప్రేమించేందుకు ఒక అమ్మాయి దొరగ్గానే...శరీరాలు గొడవ చేయడం ఆరంభిస్తాయి. కొద్దిగా టెంప్ట్ అయినా కొంప కొల్లేరు అవుతుంది. ప్రేమను విజయవంతం చేసుకోవాలంటే...శారీరక సంబంధాన్ని పెళ్లి దాక పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి. సెక్స్ అనే అంశం మధ్యలో దూరిందంటే...సంబంధం మధ్యలోనే తెగతెంపులు అవుతుందనే. ఈ సినిమాలలో అన్నీ వక్రపు పనులు చూపిస్తూ...పిచ్చి పాటలతో మనలను తెగ రెచ్చగొడుతున్నారు. వాటి ప్రభావంలో పడవద్దు. ఒకటి రెండు సార్లు సెక్స్ లోకి దిగితే...వ్యామోహం తగ్గడం మొదలవుతుంది. ఆ శారీరక వ్యామోహాన్ని పెళ్లి అయ్యే వరకు భద్రంగా పదిలపరుచుకుంటే....ఆనక అద్భుతంగా ఆస్వాదించవచ్చు. 

3) సంపాదన లేకపోతే...ఇంతే సంగతులు...
మార్క్స్ చెప్పినట్లు...ఈ వ్యవస్థలో అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే. ఉజ్జోగం సజ్జోగం లేకుండా...పిల్లను/కుర్రాడిని వెంటేసుకుని...ఊర్లో తిరగడం ప్రమాదకరం. అప్పుచేసి పార్కులకు, సినిమాలకు, బీచులకు తిరగడం ముప్పు తెస్తుంది.
ప్రేమ పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలంటే...ముందు ఆర్ధికంగా స్థిరపడాలి. మనకొక మంచి ఉజ్జోగం ఉంటే...మిగిలిన అన్ని పరిస్ధితులు వాటంతట అవే సర్దుకుంటాయి. సినిమాలలో లాగా గూండా పనులు చేయకుండా..ఒక గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదిస్తే...దర్జాగా బతకవచ్చు. నేను ప్రేమలో పడగానే...ఉజ్జోగం సాధించడం ధ్యేయంగా లక్ష్యాలు పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయ్యింది. 
అంతా అనుకుంటున్నట్లు...తల్లిదండ్రులు కిరాతకులు కాదు. మన మంచి కోరే వ్యక్తులే వారు. సంపాదన, గౌరవం ఉన్న అబ్బాయి/ మంచి అమ్మాయి  దొరికితే...వాళ్ళేమీ అడ్డుపడరు. మనం స్వచ్ఛమైన ప్రేమతో వారిని జాగ్రత్తగా ఎలా ఒప్పిస్తామా? అన్నదే ప్రశ్న. తల్లితండ్రులతో తెగతెంపులు చేసుకోకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి...ఎందుకంటే...కనిపెంచిన వారు వలచిన వారికన్నా ఏ మాత్రం తక్కువ కాదు.

4) కట్నం లేని వివాహం...ఆనందానికి సోపానం...
చాలా మంది లవర్స్ ఇబ్బంది పడేది ఇక్కడే. "ప్రేమించుకున్నాం...పెద్ద వాళ్ళు ఒప్పుకున్నారు. మీ వాళ్ళను కొద్దిగా కట్నం ఇవ్వమను...సమస్య సెటిల్ అవుతుంది," అని మగపిల్లలు ఒక డైలాగ్ కొడతారు. ఇది దారుణం. కట్నం తీసుకుని చేసుకుంటే...లవ్ మ్యారేజ్ సవ్యంగా సాగే అవకాశం తక్కువ. మనం సంపాదించిన డబ్బుతో మన పెళ్లి మనం చేసుకుంటే! చాలా మజా వుంటుంది. అత్తమామల నుంచి ఏ ప్రయోజనం ఆశించినా అది తప్పే. 
నా పెళ్ళికి మా నాన్న, నేను చెరిసగం ఖర్చులు భరించుకున్నాం. ఇప్పటి వరకూ మామ గారి నుంచి ఏ పండగకూ బట్టలు, కట్నకానుకలు (అంటే..మంచాలు కంచాలు వగైరా..) నేను స్వీకరించలేదు. డబ్బు వైపు మనసు మళ్ళింది అంటే...మన ప్రేమలో ఏదో లోపం ఉన్నట్లే. ఫ్రీగా వచ్చే డబ్బులో సుఖం లేదు బ్రదర్.

5) అడుగడుగునా..అవగాహన, నమ్మకం...
ఇక ప్రేమ, పెళ్లి అయిపోయాయి. ఇప్పుడు జీవితం ఆరంభమయ్యింది. పాపం..అమ్మాయి మనలను నమ్ముకుని...అయిన వాళ్ళను కాదని..జీవితం పంచుకునేందుకు వచ్చింది. ఏ క్షణంలోనూ ఆమెను నిరాశ పరచకూడదు. అది ఘోరం, పాపం. (నేను ఇక్కడ  మేల్ యాంగిల్ నుంచి ఇది రాస్తున్నా. అంతమాత్రాన ఆడ వారిని తక్కువ చేస్తున్నట్లు భావించకండి. మీరు ఎంత వాదించినా....ఈ ప్రేమ వ్యవహారంలో ఇద్దరి ప్లానింగ్ ముఖ్యం...అమలు బాధ్యత, ఎక్కువ చొరవ చూపాల్సింది జెంట్. పైగా మన సమాజంలో ఆడ పిల్లలు ఇలాంటి విషయాలను డీల్ చేసే శాతం బహు తక్కువని నా పరిశీలన.)
ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం చాలా ముఖ్యం. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మోసం చేయకూడదు. కొన్ని సార్లు కుటుంబ సభ్యులు విచిత్రంగా బిహేవ్ చేస్తారు...అప్పుడు ప్రణాళికాబద్ధంగా, బ్యాలెన్సుడ్ గా వ్యవహరించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా..ఇద్దరి మధ్య అవగాహన, నమ్మకం సడలకూడదు. సమస్యలన్నీ...దాపరికంలేకుండా...పంచుకొని..చర్చించుకుని...నిజాయితీతో వ్యవహరిస్తే ముందుకు సాగడం పెద్ద కష్టం కాదని చెప్పేందుకు నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఒక్కటి మాత్రం ముమ్మాటికీ నిజం...నిజాయితీగా ప్రేమించి...పెళ్లి చేసుకుంటే...చక్కటి ప్లానింగ్ తో హాయిగా చిలకా గోరింకల్లా జీవించవచ్చు. అయితే...ఇది చదివి ఆహా...ప్రేమ పెళ్లి పూల పాన్పు... అని భ్రమపడకండి. అందరి పెళ్లి జీవితాల్లో మాదిరిగానే...సమస్యలు ఉంటాయి. సంక్షోభాలు ఉంటాయి. వాటిని నెచ్చెలి/ చెలికాడి సంపూర్ణ సహకారంతో, సానుభూతితో...అధిగమించవచ్చు. జీవితాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటే...అటు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా భేషుగ్గా సాగిపోతాయి.  

కుల మతాలకు అతీతంగా...స్వచ్ఛమైన ప్రేమతో దగ్గరై...ఆదర్శంగా బతుకుతున్న....బుడన్-పద్మశ్రీ, క్రాంతి-పద్మల వంటి జంటలకు ఆత్మీయ శుభాభివందనలు తెల్పుతూ ముగిస్తున్నా....హాపీ వాలెంటైన్స్ డే.   

12 comments:

బొందలపాటి said...

తెలుగులో ప్రేమలేఖలు రాసే రోజులకి కాలం చెల్లిపోతోంది అనుకొంటా..! ఈ మధ్య మా పల్లెటూర్లో ఓ లవ్ లెటర్ కేసు నా దృష్టి లో పడింది. ఆ కేసు లో అబ్బాయి అమ్మాయి కి వచ్చీ రాని ఇంగ్లీషు లో లవ్ లెటర్ రాశాడు. దానిలో మాటల అర్ధాన్ని గురించి పెద్దవాళ్ళు సందేహపడి, నా చేత చదివించుకొన్నారు...

VEMAVARAPU GOPALA KRISHNA MURTHY said...

what you have written is accurate if every thing goes well. Even though some times if fate is not in favor misunderstandings come automatically. Then we can't blame anyone. One should have a support of luck whatever ideology we adopt and believe.

Ramu S said...

Dear friends,
I am trying to figure out the love marriages in the media field. The following five names have come to my mind. While making your comment on this post, you are requested to suggest me the "lovers turned married couples" (as I am planning to have a get-together).
1) Mahatma Kodiyar (TV5) and Swaroopa (TV1)
Note: Mahatma's parents were also from different castes and states. Love brought them together
2) Pesangi Bhaskar (Deccan Chronicle) and Maheeja (former Eenadu)
3) Pillalamarri Balabhaskar (ABN-Andhra Jothi)and Sireesha (scientist)
4) Manukonda Nageswar Rao (Eenadu Journalism school principal) and Sreedevi

5) Pamidikalva Madhusudan and Sobhasri (former Eenadu)

Sujata M said...

ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - పోరాటాలకి వ్యతిరేకంగా ఏదో వ్యంగ రచనేమో అనుకుని ఇటు వచ్చాను. మీరు సీరియస్ గానే రాసారు. అన్నీ మంచి పాయింట్లే. నిజంగానే ఏ పత్రిక లో నన్నా ప్రచురించండి. ఎక్కువ మంది జనం చదువుతారు. అన్నట్టు ఈనాడు లో మీ తెలుగు అంత పాపులర్ అయిందంటే - మీకు బోల్డన్ని అభినందనలు. అసలు ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్యాసాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ఆరోజుల్లో ఇండియా టుడే తెలుగు కొత్తగా వస్తున్నప్పుడు ఎంతో చక్కగా, గౌరవంగా అనువదించిన తెలుగు వ్యాసాలు ఎంత బావుండేవో !

Sujata M said...

ఈ మధ్య జరుగుతున్న రాజకీయ - సంస్కృతి - బ్లా బ్లా - పోరాటాలకి వ్యతిరేకంగా ఏదో వ్యంగ రచనేమో అనుకుని ఇటు వచ్చాను. మీరు సీరియస్ గానే రాసారు. అన్నీ మంచి పాయింట్లే. నిజంగానే ఏ పత్రిక లో నన్నా ప్రచురించండి. ఎక్కువ మంది జనం చదువుతారు. అన్నట్టు ఈనాడు లో మీ తెలుగు అంత పాపులర్ అయిందంటే - మీకు బోల్డన్ని అభినందనలు. అసలు ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్యాసాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ఆరోజుల్లో ఇండియా టుడే తెలుగు కొత్తగా వస్తున్నప్పుడు ఎంతో చక్కగా, గౌరవంగా అనువదించిన తెలుగు వ్యాసాలు ఎంత బావుండేవో !

Anonymous said...

sir,u forgot kareem(former tv9,tv5 &now with studio-n) with sireesha(tv5)

Swarupa Kodiyar said...

Premikula rojuku, prema vivahalu chesukunna journalist dampatulaku mee blog lo intha priority ichinanduku abhinandanalu, kruthagnathalu. Snehithuluga undi premikuluga mari pellitho okkatina meeku, hema gariki kuda subhakaankshalu.
-Swarupa Kodiyar

Anonymous said...

చొక్కా కొన్నంత యాక్సిడెంట్ ల్ గా మొగుడు పెళ్లాలై, కుడురుకుంటూ సర్దుకుంటూ, జీవన పరిణామ సిద్దాంతంలో లాగా ఒక్క మోఖాలయ్యే జీవితాల్లో కూడా భలే తృప్తి ఉంటుంది. ఇద్దరి రహస్యాలు ఒక్కటయ్యాక కలిగే భరోసా భలేగా ఉంటుంది. కొత్త పెళ్ళాం మనసులో తనదైన చోటు కోసం వేసే తలకిందుల వేషాలు రాసే వాడుంటే తరగని ప్రేమ కథలే. ఆమె తనకు అందుతుందా లేదా అన్న గుబులు లేని నిశ్చింత బాసిపెట్లు వేసుకున్న చోట తనలోని ప్రతీ ప్రత్యేకతను ఆస్వాదించడం మరపు రాని జ్ఞాపకం.

Anonymous said...

Ur abject emphasis on morals, ethics scare me personally. I dislike such moralists (of course, detestation of an amoralist like me must be a compliment to u).
Life is equally made miserable by u the monogamists who cage the world in institutional marriage and also by philanders who maintain only amorous relations with women.
But, Mr. Ramu! don't burden ur readers, students (of OU) and importantly ur children, with the luggage of ur ideals of Victorian era.

శరత్ కాలమ్ said...

మీ రెండవ పాయింటు గురించి: నిజంగా ప్రేమిస్తే మాత్రం శారీరక సంబంధానికి దూరంగా వుండటమే మంచిది. శారీరక సంబంధాల వ్యామోహం తగ్గి తద్వారా కొన్నాళ్ళకి చిరాకులు ఎక్కువయ్యి ప్రేమ పలుచబడుతుంది. అయితే ఇందులో ఇంకో సమస్యా వుంది. వ్యామోహం పెళ్ళి అయాక అయినా తీరుతుంది కదా/ తగ్గుతుంది కదా? అప్పుడు? అందువల్ల ప్రేమికులు పెళ్ళికి ముందు పూర్తిగా కలిసిపోయినా కూడా వ్యామోహం తగ్గకుండా వుంటేనే నిజమయిన ప్రేమికులు అనుకోవచ్చేమో! అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది కదా. పెళ్ళయ్యాక వ్యామోహం తగ్గి జీవితాన్ని జీవఛ్ఛవంగా లాగించడం లేదా విడాకులు కంటే అదేదో ముందే తెలిస్తే మరో సూటబుల్ వ్యక్తిని ఎన్నుకోవడానికి వీలు వుంటుందేమో!

Ramu S said...

శరత్ గారూ...
బాగుంది సార్...మీ సూచన. నాకు తెలిసిన చాలా మంది ప్రేమికులు పెళ్లి ముందు కాలుజారి వేళ్ళు కాల్చుకున్నారు. మీరు చెప్పిన దాన్నే మరో విధంగా ఎందుకు అనుకోకూడదో! "మనది నిజమైన ప్రేమ అయితే...పెళ్లి అయ్యే దాక అమ్మాయిని ముట్టుకోకుండా (ప్లటోనిక్) ఉందాం.ఇది మనకొక పరీక్ష...," అనుకోవచ్చు కదా!
రాము

Anonymous said...

raamu gaaru.. emi chestaam cheppndi.. mana taatala chinnappudu.. vaallaki 21 ellake peellulu ayyevi.. maa time vache tappataki maga vaariki 30lu.. ammaiki 28 daaka vachesthunte.. korika elaa aaguthundi.. tappadu saar....

tappu ayite kshaminchandi.. but mee blog lo ee comment unchandi...


sivudu..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి