Monday, February 1, 2010

హైదరాబాదీ 'ఇరానీ చాయ్': నో లింగవివక్ష భాయ్

హైదరాబాద్ అనగానే మొఘలాయీ బిర్యాని, ఇరానీ చాయ్ స్ఫురణకు వస్తాయని అంతా చెబుతారు. భీకరంగా ఆకలి వేస్తున్నప్పుడు నిమ్మరసం పిండిన ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి నంజుకుంటూ బిర్యాని లాగిస్తే నా సామిరంగా స్వర్గం కనిపించాల. హైదరాబాద్ హౌజ్ లో ఆలస్యంగా సర్వ్ చేస్తారు గానీ... అక్కడ చికెన్ బిర్యాని చాలా రుచికరంగా ఉంటుంది. ఆడా మగా వెళ్లి హోటళ్ళలో ఈ బిర్యాని ఆస్వాదిస్తూ హైదరాబాద్ పేరును దేశ విదేశాలలో మార్మోగేలా చేస్తారు.

ఇక రోడ్లపక్క ఉండే ఇరానీ చాయ్ కూడా భలే కమ్మగా ఉంటుంది. అక్కడ దొరికే ఉస్మానియా బిస్కట్లు నంజుకుంటూ చాయ్ తాగితే...మజా వస్తుంది. (అక్కడ ప్లేటులో పెట్టిన బిస్కట్లు అన్నీ పూర్తిగా తినాలి కాబోలు అని పొరపడి ఆకలి లేకపోయినా...తిన్న సోదరులున్నారు. అలాగే...'ఉస్మానియా లావ్ భాయ్' అని ఆర్డర్ ఇస్తే...ఇదేంట్రా...అని వెర్రి చూపులు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు.)   
సరే...తిండి బాగున్నప్పుడు భార్యా, బిడ్డలు పక్కన వుండాలని, వారితో కలిసి తినడం, తాగడం చేయాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది.
రోడ్డు పక్క హోటల్ లో దొరికే ఇరాని చాయ్ లాగించడానికి వెళ్ళినప్పుడల్లా...నాకు లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఆ పదం అటుకుతుందో అతకదో కానీ...అక్కడైతే..అంతా మగ వాళ్ళే. ఒక ఆడ పురుగూ కనిపించదు. ఇది నాకు నచ్చలేదు. సంధ్యక్క లాంటి ఫెమినిస్టులు ఉన్న నేలపై ఇదేమి దారుణం?
ఈ హోటల్ వాళ్ళు లేడీస్ రావద్దు....అని చెప్తారంటే నేను నమ్మను. మరి ఎందుకో...ఐ.టీ.లో పనిచేస్తూ బాగా సంపాదిస్తున్న ఆడపిల్లలు సైతం నాకు అక్కడ కనిపించలేదు. ఇరాని చాయ్ నచ్చకనే వారు రావడంలేదేమో నాకు తెలియదు.
ఈ ఆదివారం బాపట్ల నుంచి విష్ణు ఫాదర్ షణ్ముఖ రావు గారు తెప్పించి ఇచ్చిన గుత్తి వంకాయతో హేమ చేసిన కూర తిని....ఒక కునుకు తీసి నేను ఆమె సాయంత్రం వాకింగ్ కు బయలుదేరాము. ఆ కూడా ఫెయిల్ అయ్యింది...'తిండి విషయాలు బ్లాగ్లో రాయడం ఏమిటి?' అని కుటుంబ  సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలపడం వల్ల దాని గురించి రాయడం లేదు.   
ఇంట్లో పాలు ఎందుకో మాడు వాసన వస్తున్నాయని హేమ  అనగానే...ఎలాగైనా...ఇరాని చాయ్ తాగించాలని అనుకున్నాను. ఇంతలో నాకు అత్యంత సన్నిహితుడైన జర్నలిస్టు పంతంగి శంకర్ ఆదివారం ఒకసారి పలకరించి పోదామని వచ్చారు. ముగ్గురం కలిసి ఖైరతాబాద్ చౌరస్తా పక్కన ఉన్న "సర్వి" హోటల్ లో ఇరాని చాయ్ కోసం వెళ్ళాం. అక్కడ ఒక్క ఆడ మనిషీ లేరు. హేమ దర్జాగా వచ్చి టీ తాగుతుంటే...జనం గుడ్లుఅప్పగించి చూడడం ఆరంభించారు. అది నాకే కొంచం ఇబ్బంది అనిపించింది.
మనం ఇవేవీ పట్టించుకునే రకం కాదు కాబట్టి...కాసేపు అక్కడ ఉండి  ఇంటికి వెళ్ళాం. తీరా...చూస్తే...ఆ చాయ్ చల్లగా...తియ్యగా...ఘోరంగా ఏడ్చింది. ఇలా మంచి ఇరాని చాయ్ హేమకు తాగించాలన్న నా కోరిక తీరలేదు. ఈ సారి సికింద్రాబాద్ లో ఉన్న ఒక  ప్రసిద్ధ హోటల్ లో ఆమెకు ఈ చాయ్ తాగించాలని నిర్ణయించుకున్నా.
ఇరాని చాయ్ హోటళ్లు...అందులో కనిపించని  స్త్రీలు...గురించి మా మహాలక్ష్మి మేడం తో కొద్ది సేపు కిందట చెప్పాను. నాకు ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం (చెన్నై) లో చదువు చెప్పిన ఆమె...సెంట్రల్ యూనివెర్సిటీ లో కొన్ని క్లాసులు తీసుకోవడానికి చెన్నై నుంచి వచ్చారు. ఆదివారం ఆమె చార్మినార్ ఏరియాకు వెళ్లారట. 
"నువన్నది నిజమే...మీ హైదరాబాద్లో నేను కూడా గమనించాను. కొన్ని బేకరీ షాప్స్ లో మహిళలు కనిపించలేదు. ఇదే విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది," అని మహాలక్ష్మి మేడం చెప్పారు.  మనం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.    

16 comments:

Ramu S said...

డియర్ ఫ్రెండ్స్,
నా మెషిన్ ఫెయిల్ కావడం వల్ల ఈ పోస్ట్ బైట ఒక చోట కంపోజ్ చేసి హడావిడిగా పోస్ట్ చేశాను. అందువల్ల కొన్ని అక్షర దోషాలు వచ్చాయి. ఒక చోట...."ఆ కూడా ఫెయిల్ అయ్యింది" అని వచ్చిన మాటలు గందరగోళం కలిగించాయి. దాన్ని..."ఆ కూరా ఫెయిల్ అయ్యింది (అంటే కుదరలేదు)" అని చదువుకోగలరు. తిట్టుకోకుండా...క్షమించండి...రాము

Anonymous said...

>> linga vivaksha

is it something to do with the conservative islamic background of Hyd muslim culture?

సుజాత వేల్పూరి said...

ఇరానీ హోటల్ సంగతి సరే, ఏ రెస్టారెంట్ కైనా మహిళలు ఒంటరిగా వెళ్లి కాఫీయో, టిఫెనో తీసుకున్న సందర్భాలెన్ని చూశారో గుర్తు తెచ్చుకోండి.ఆడో మగో, కంపెనీ ఉంటేనే స్త్రీలు కాస్త ఫ్రీగా రెస్టారెంట్ కి వెళ్ళి తినగలిగే పరిస్థితి మొదటినుంచీ ఉంది మనకి. అందులోనూ కేవలం టీలు, బిస్కెట్ల కోసం రెస్టారెంట్ కి వెళ్ళే స్త్రీలు తక్కువ. కాలేజీ కాంటీన్ల నుంచి, ఆఫీసు కెఫెటేరియా ల వరకూ స్త్రీలు ఒంటరిగాకంటే ఎవరితోనైనా కలిసి వెళ్లడానికే ఇష్టపడతారు.

కొన్ని ఇరానీ కెఫేలలో సిగిరెట్లు స్వేచ్ఛగా తాగేస్తుంటారు.అలాంటి చోట్లకు వెళ్ళడం ఏ స్త్రీకైనా ఇబ్బందే!

ఆ కెఫేల వాళ్ళు ఎటువంటి వివక్షా పాటించకపోయినా ఎక్కువ శాతంపురుషులుండే ఇరానీ కేఫ్ ల జోలికి స్త్రీలు ఎక్కువగా వెళ్ళడానికి ఆసక్తి చూపరనుకుంటా.

ఈ ఐడియా మీరు ఏ తొమ్మిదో టీవీకో అందిస్తే సంధ్యక్కనీ, రాజకుమారినీ పిలిచి చర్చ పెట్టేస్తాడు.

And, above anon's comment also makes sense.

Sujata M said...

పాయింటే ! నేనూ గమనించాను. ఇలాంటి జాయింట్లలో ఆడవాళ్ళు కనపడరు. బిర్యానీ, రంజాన్ రోజుల్లో దొరికే హలీం లాంటి అహార పదార్ధాలు మాత్రం అందరూ తింటారు అనుకుంటాను. కానీ మరి సినిమాల్లో (బొమ్మరిల్లు) హీరోయిన్లు Irani chai తాగుతారే ?!? ఇంకా, కమ్ముల శేఖర్ సినిమాల్లో (ఆనంద్ - స్టీం ఇడ్లీలూ, కాఫీ, గోదావరి - కాఫీ) హీరోయిన్లే చొరవ తీసుకుంటారు ఇలాంటి ఈటరీల్లో తినడానికి. ఏమో - సినిమాలు సూపర్ ఫీషియల్ అనుకుంటాను. రెండో పాయింటు - ఐ న్యూసూ, సంపాదనా, అమ్మాయిలూ అంటం అస్సలు పొసగలేదు. సంపాదనకీ, టేస్టు కీ పొంతన లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. అసలు స్టాటస్టిక్స్ ప్రకారం, ఎంత చెత్త నీళ్ళయినా, ఏమయిపోయినా, చట్పటా గా ఉండే పానీ పూరీ, ఆ నీళ్ళూ తినే స్టాళ్ళదగ్గర ఆడవాళ్ళదే పై చేయి అనుకుంటాను. అక్కడ టీ.సీ.ఎస్సు, ఇంఫోసిస్సూ గర్ల్సు కూడా కనిపిస్తారు. ఇదేదో పరిశోధించాల్సిన విషయమే !

అసలు ఏమాటకామాటే చెప్పుకోవాలి. భోజనం లో మనం మెచ్చేసుకునే టేస్టులూ, కూరగాయల తాజా దనాలూ, లోకల్ గుబాళింపులూ చదువర్లలో మన పట్ల కామ్రేడరీ ని పెంచేస్తాయి సార్. ఎంతయినా మనుషులు అంతా భోజన ప్రియిలే. దేశవాళీ (ఆర్గానిక్ అనాలా ?) టొమేటోలూ, ఇప్పుడే వల్లో పడ్డ చేపలూ, పెరటి చెట్టుక్కాసిన దబ్బ పళ్ళూ, లేత తోటకూరా .. ఇలా సంభాషణలు పాకాన పడటానికి బోల్డన్ని పదార్ధాలు. సిడ్నీ షెల్డన్ నుంచీ - మన వంశీ దాకా తమ రచనల్లో తిండిని వర్ణించి ఊరించేస్తారు.

మూడో విషయం.. మీ పనిమనిషి భర్త మరణాన్ని గురించి చదివి నపుడు అరుంధతీ రాయ్ రాసిన గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ గుర్తు వచ్చింది.

Anonymous said...

టెంప్లెట్ మార్చారా! బావుందండి .
ఆడ పురుగులేవిటండీ .....ఆయ్ , హన్నా !

Anonymous said...

In almost all the tea stalls of Irani tea and other eateries maintained by muslim community we never find any ladies as customers and this is nothing new.
The news just in that the kidnapped girl Vyshnavi of Vijayawada was brutally killed by burning in a furnace of an industrial shed at Guntur.Whither humanity!ALL ANIMALITY in our society.Just for the sake of some property which never accompanies us with us after we leave this physical body these wicked people take the lives of innocent kids who are nothing to do with the properties and family disputes.Really a heart rending tragoic story of an innocent beautiful girl.
JP Reddy.

Anonymous said...

మీరు గోదావరి సినిమా చూసారా..? అందులో హీరో తన మరదలిని (సెకండ్ హీరో-ఇన్) ఇలానే ఇరానీ కేఫ్ కి తీసుకెలితే, ఎవరైనా ఆడవాల్లని ఇలాంటి చోటికి కాఫీ తాగడానికి తీసుకువస్తారా బావా ? అని అడుగుతుంది. అది మగాడు దర్శకత్వం వహించిన సినిమానే అయినా , ఆ ఫీలింగు మాత్రం కేవలం మగవాడిదే అంటే మాత్రం నేను ఒప్పుకోను. నిజానికి ఇరానీ కేఫ్ లన్నీ కొంచెం రఫ్ గా వుంటాయి. అమ్మాయిలు రావడానికి ఇస్టపడే క్లాస్ లుక్కు గానీ, పోష్ కల్చరుగానీ అందులో వుండదు. ఆమాటకొస్తే బయట బడ్డీ కొట్లల్లో ఆడవాల్లు మామూలు ఛాయ్ తాగడం కూడా నేను చూడలేదు. జెనెరల్ గా వాల్లు కాఫీ-డే లు ప్రిఫర్ చేస్తారనుకుంట . అంతే కానీ వాల్లు రావాలనుకుంటే ఎవ్వరూ ఆపరు. అలాంటప్పుడు ఇది వివక్ష ఎలా అవుతుంది.

Kranthi Post said...

అన్నయ్యా ,
జర్నలిజం గురించి ... విలువలూ .. పతనం గురించి.. మేనేజ్మెంట్ల శ్రమ దోపిడి గురించి.. తప్పుడు రిపోర్టింగ్ .. మనలోని black sheeps గురించి.. ఇంకా మీడియా కబుర్లు బ్లాగ్ ట్యాగ్ లైన్ లోని విషయాల గురించి రాయన్నా.
ఇరానీ చాయ్ గురించి .. టీవీ లేని మూడు రోజుల గురించి కాదన్నా .. నీ నుంచి ఇంకా ఏదో కావాలి.
అన్నట్టు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు.

Anonymous said...

రామన్నయ్యా, ఆర్కేతో రోజా ఇంటర్వ్యు లో ఒక చోట రోజా కు ఎంత కర్చు అవుతుందని అడిగారు. ఆమె నెలకు రెండు లక్షలు అవుతుందని చెప్పింది. నాకెందుకో ఆయన అలా అడగడం, ఆమె సమాధానం చెప్పడం మర్యాదగా అనిపించలేదు. ద్వంద్వార్ధాలు వెతుక్కొనే అవకాశంకల్పించారు.

sandy said...

sir,aamaindhi meeku.postlu levu.avadaina warning ichaada?reply me.waiting 4 u r reply


ur's sandy

kvramana said...

Anna
I appreciate the way you analysed the media activities. Let me be frank, these posts are boring. I don't know why should you be so surprised at this Irani chai culture. At least coming from this region, this is normal. I suggest you to go to some function halls in the old city or those on the way to the new airport. These halls have a different entrance for 'Ladies'. If you attend some of these Nikhah programmes, you will not find a single 'Ladies' coming through the entrance meant for 'Gents'. Please don't bore us with your discoveries on Irani chai and Gutti Vankaya koora and siesta or whatever. I am sorry if i am being rude, but these Swati weekly type posts are not worth reading. The Irani chai episode gave me an impression as if you went out on the streets of Hyderabad for the first time in your life. And I sincerely believe that the blog is not NOT NOT NOT meant for this kind of stuff. This is definitely amusing but not thought provoking.
Ramana

Anonymous said...

What happened to your system?Still under repair being in Hyderabad city?You are missing very badly the comments on the kidnap annd murder of Vyshnavi in Vijayawada and the role played by media.Today have come across ABN Andhra Jyothi putting mike infront of the mother and brothers of late vyshnavi for their comments on the deaths as well on the public opinion of encounter of the criminals etc.Is it so essential to speak to them at this hour of mental agony of the worst tragedy of the family?

JPReddy

Anonymous said...

Yes sir,
certainly there are more important issues to be discussed. Don't side track your blog.
Nanduri Subbarao.

Saahitya Abhimaani said...

Subba Rao garoo,

Now and then side dishes are a must.

Ramu Garoo,

This thought has never occurred to me that women are not to be seen in Irani Restaurants. Quite a good observation.

May be because of the rowdy atmosphere and free cigarette smoking in these places, women do not come to these Restaurants.

But if Irani Restaurant owners see and able to read your blog, I hope they would change their ambiance and their business would increase like anything.

sarada said...

ramu sir nenunnandi irani restaurant ki velli chai taage ammaini.....

Anonymous said...

http://dissidentvoice.org/2010/01/media-democracy-in-action-the-importance-of-including-truth-emergency-inside-the-progressive-media-reform-movement/

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి