Friday, February 5, 2010

గిల్లి కజ్జం పెట్టిన 'ఆంధ్రజ్యోతి'--పిచ్చి ఫోటోతో 'ది హిందూ'

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణా ప్రజలు, వద్దు..సమైక్యతే ముద్దు...అని ఇతర రెండు ప్రాంతాల వారు కోరుకుంటున్నారు. రెండు పక్కలా వాతావరణం ఉద్విగ్నంగా ఉన్న సమయంలో మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ...ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో "వేమన వర్సిటీకి తెలంగాణా వీ.సీ." అనే స్టోరీ ప్రచురించి...ఆ నిర్ణయం ఏదో భయంకరమైన తప్పు అన్న కలర్ ఇచ్చింది. 

కడపలో ఉన్న యోగి వేమన విశ్వ విద్యాలయం వీ.సీ.గా ఇంతకు ముందు  ప్రొఫెసర్ అర్జుల రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన మంత్రి పొన్నాల గారికి దగ్గర. ఆ విశ్వ విద్యాలయం కొత్తగా ఏర్పడినప్పుడు ఉన్న సమస్యలను ఆయన చాకచక్యంగా సరిచేసారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న జిల్లా అయినా...చేతనైనంత బాగానే వ్యవహారం నడిపారు. 
అలాంటి వ్యక్తిని మళ్ళీ వీ.సీ.ని చేయాలని గవర్నర్ గారు నిర్ణయించినట్లు ఆ పత్రిక కథనం. ఎందువల్ల గవర్నర్ ఆ నిర్ణయానికి వచ్చారో రాస్తే బాగుంటుంది కానీ...గిల్లి కజ్జం పెట్టినట్లు...."తెలంగాణా వ్యక్తికి అక్కడి పదవి ఇవ్వటమా!" అనే రీతిలో రాయడం తప్పు. పైగా...రెడ్డిగారు ఎక్కడ పుట్టింది...వంటి సూక్ష్మ వివరాలు ఇస్తే ఏమిటన్నట్లు? "ఒరేయ్ బాబు...రాయలసీమలో ఉన్న విశ్వ విద్యాలయానికి తెలంగాణా వాడు వస్తున్నాడు...మరి చూసుకోండి," అని అక్కడి జనాలను రెచ్చగొట్టినట్లు కాదా? 

"రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని కడప కేంద్రంగా ఉన్న వర్సిటీకి వీ.సీ.గా నియమించడంలో...." అన్న వాక్యం కూడా ఈ వార్తలో ఉంది.
 "ది హిందూ' ఫోటో కౌశలం

జర్నలిజంలో ఫోటోల ప్రచురుణలో ఎడిటర్లు తప్పనిసరిగా కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఒక రాజకీయ నాయకుడో, అధికారో వేదికపై తన పక్క సీట్లో కూర్చున్న మరొక ప్రముఖురాలిని చూస్తున్నప్పుడు ఒక కోణంలో ఫోటో తీసి..."వేదికపై ఉన్న స్త్రీని ఓరకంట చూస్తున్న ప్రముఖుడు" అని కాప్షన్ రాయవచ్చు. అలాగే...దీర్ఘాలోచనలో ఉన్న ప్రముఖుడి ఫోటో మరొక యాంగిల్ లో తీసి....ఆయన మీటింగ్ లో ఒక కునుకు తీస్తున్నట్లు కాప్షన్ రాయవచ్చు. ఇవన్నీ...ఫోటోగ్రాఫర్ ప్రతిభ, అతితెలివి మీద ఆధారపడే అంశాలు. 

ఈ రోజు మన 'ది హిందూ' ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఎక్కడో రోడ్డు మీద సహపంక్తి భోజనం చేస్తున్న ఫోటో ప్రచురించింది. కోదండ రామ్ గారు ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ కింది నుంచి (లో యాంగిల్) ఈ ఫోటో తీసారు. ప్రచురితమైన ఫోటో చూస్తే ఎలా ఉంది అంటే...కోదండ రామ్ గారు పిచ్చి ఆకలితో చాలా ఆబగా తింటున్నట్లు ఉంది. ఇలాంటి ఫోటోలు ప్రచురించేటప్పుడు పేజి ఎడిటర్లు జాగ్రత్త పడాలి. 

12 comments:

Saahitya Abhimaani said...

When I read these kind of cheap journalistic overtures,I remember the famous novel by Irving Wallace "The Almighty" where the protogonist cum Villain schemes ultimately his own destruction and downfall.

Anonymous said...

Did it occur to you Mr Ramu that Mr Kodandaram was indeed very hungry and ate greedily ? Its not a crime to enjoy one's meal. What if all of Hindu's photos turned out like this ?

Anonymous said...

yes ramu garu kodaram photo chala chydalamuga vaysaru adrmu bojanmu chystapudu alny untudi ani hhindu editar ku thyliyakapovadam darunamu

Anonymous said...

do contemporary journalistic values allow the photos that are published in today's (sat, 6th feb 2010)eenadu

In one photo of pakistan bombing, the deadbody's intestine is seen

in hyd building collapse, a dead baby photo has been taken with great focus & clarity

the other photos on that hyd building tragedy are equally gore.

our self declared ethical journo gang of Ramu & co, pl. wake up from T hangover.

Anonymous said...

in today's eenadu a journo reported uddhav thackarey's comments that Rahul treated mumbai as his ATM.

in the bracket, he defined ATM = any time money.

Anonymous said...

నాకయితే అసహ్యంగా ఏమీ లేదు. ఏ ఒక్కరికి అనిపించినా పేజీ ఎడిటర్ ది తప్పే. ఆ జాగ్రత్తలు తీసుకోవడానికే అన్నన్ని జీతాలు ఇచ్చేది.


srinivas

Anonymous said...

అసహ్యజ్యోతి. రాష్ట్రప్రజల్ని ముక్కలు చేయడంలో వీళ్ళ వెస్టెడ్ ఇంటరెస్ట్ ఏంటనేది ముందు కనుక్కోవాలి.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఒకవేళ ఆంధ్రా, తెలంగాణ వేఱువేఱు రాష్ట్రాలైతే తెలంగాణ ప్రొఫెసర్ ఒక ఆంధ్రప్రాంత విశ్వవిద్యాలయానికి వి.సి.గా పనికిరాడా ? అంతకంటే గొప్ప వ్యక్తి దొఱకడనుకున్నప్పుడు విదేశాలనుంచైనా ప్రొఫెసర్లని రప్పించాల్సిందే. అటువంతప్పుడు తెలంగాణవాడు ఆంధ్రాకి పనికిరాడా ? I strongly believe Andhrajyothy has KCR as its sleeping partner.

--తాడేపల్లి

Anonymous said...

my dear poor tadepally, the actual reason behind AJ is its editor belogs to khammam and he supports telangana. The editors in AJ mostly are telanagana agitators. No wonder... as rk is kamma he supports tdp top boss. waht a shame.. split personality.

Anonymous said...

recently telangana students in a college boycotted classes by saying they don't want the particular lecturer as he belongs to andhra. Do we stooped down to a level where attributing regionalism, casteism, religion etc to gurujees. shame. society pays. Now teachers are fueling regionalism. It is another shame.

Anonymous said...

Yes. Tadepally has guessed it right. AJ Editor and KCR are famous as booze buddies.

Anonymous said...

I think AndhraJyothi's focus was on the 'constructive' point of view. But the caption was a blunder. They also shouldn't have written about the 'Telangana-Samaikya' issue.

Anonymous said...

what is wrong in projecting the desire of Telangana people by AJ

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి