Tuesday, February 9, 2010

ముస్లిం కోటాపై 'ఈనాడు' ఓవర్ యాక్షన్

'ముస్లిం కోటా చెల్లదు' అనే వార్తకు ఈరోజు 'ఈనాడు' పత్రిక సముచిత ప్రాధాన్యం ఇస్తూనే..పతాక కథనం (బ్యానర్ స్టోరీ) గా ప్రచురించింది. కానీ..అది వాడిన ఒక ఏడుగురు న్యాయమూర్తుల ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నాయి. 

జడ్జీలు వృత్తిధర్మంలో భాగంగా...కేసును అధ్యయనం చేసి ఒక తీర్పు ఇస్తారు. ఒక బెంచిలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వార్తకు ప్రాణం...కేసులో అంశాలను ఎవరు సమర్ధించారు, ఎవరు వ్యతిరేకించారు? అన్న పాయింట్ కాదు. తీర్పు సారం ఏమిటన్నది వార్త. అలాంటిది 'ఈనాడు' వారు..."చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు" అనే శీర్షిక కింద ఒక ఐదుగురు జడ్జిల ఫోటోలు, "సమర్ధించిన న్యాయమూర్తులు' శీర్షిక కింద మరొక ఇద్దరి ఫోటోలు మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించారు.

ఇది నాకు అభ్యంతరకరంగా తోచింది. ఇంత సున్నిత అంశంపై ఇచ్చిన తీర్పుకు ఇలాంటి డిస్ ప్లే ఇవ్వడం మంచిది కాదు. ఆ ఫోటోలు అంత ప్రముఖంగా ప్రచురించేటంత రిలవన్సు కలిగి వున్నాయని అనిపించడం లేదు. మరే పత్రికా...ఇలాంటి సాహసం చేయలేదు. జడ్జిలూ మానవమాత్రులే...వారి మీదకు ఒక వర్గం వారిని ఉసికొల్పేలా ఫోటోలు వాడడం బాగోలేదు. అది బాధ్యతాయుతమైన పని కాదు.

12 comments:

Anonymous said...

Eenadu and DC appear to be rivals. But, with the similar page design, highlighting the split verdict, they prove to be upsurged from the same roots.
Both the papers feel that they are the Vulgates of Telugu and English journalism. Both are claimed to be highly circulated dailies and AP dil ka dadkans. Another strange coincidence is the journalists (rank and file) work for the both papers are Kaagaz Ke Phool. They flaunt and boss around the natural flowers with pretentious originality. Dear Ramu,A keen treatise is most required on the disenchantment of Eenadu and DC KUPASTHA MANDOOKAS (It must be done objectively, because, you were also from Eenadu well (koopam).

Anonymous said...

i dont see anything wrong in that.

displaying a photo is as good as writing in the news script.

owaisis dont need a photo to instigate the crowd

Eanaadu's bigger crime in the recent past is to glorify the T nuisance. They are dedicating more than a page or two everyday on this dead horse.

Anonymous said...

Yes... I agree With you.

Unknown said...

సర్
సరిగ్గా మీకు అనిపిన్చి నట్లుగానె నాకుఅనిపిన్చిన్ది

Anonymous said...

The very first question that arose in my mind after briefly going through the report is..' why did they publish the photographs of the Judges? ' I don't think Eenadu had done this earlier.

Anonymous said...

Generally judges photos of any court from bottom to top will not be published in any newspaper for prounouncing their judgements.Did Ramoji Rao publish the photos of judges in his case of Margadarshi for their judgements.Then why this time?It is most unproffessional,unethical and irrevelant and it is just to create sensation by telling every body that so and so judge gone against one section and favoured other sections so that there would be anger against them through eenaadu.This is the culture of Ramoji Rao.What a degradation of his status in his proffession!

పుల్లాయన said...

naku kuda meelage anipinchindi.

పానీపూరి123 said...

> వారి మీదకు ఒక వర్గం వారిని ఉసికొల్పేలా ఫోటోలుచూడంగానే, నేను అదే అనుకున్నాను...

Anonymous said...

yas ramu garu naku alany anipichidi

Anonymous said...

నాకు సమర్దులేవరో సర్కారీ తోత్తులెవరో తెలిసింది.

Anonymous said...

కీలకమైన ఒక చట్టాన్ని లెజిస్లేచర్ లో ఎవరు వ్యతిరేకించారో, ఎవరు అనుకూలమో వార్త రాయాల్నా వద్దా?

లెజిస్లేచర్ లాగే ప్రజా స్వామ్యానికి న్యాయ వ్యవస్థ మరో పిల్లర్. అంతే.

మనం ఒక వ్యవస్థకు పవిత్రత ఆపాదించినం అంటే అక్కడ కుళ్ళుకు అవకాశం ఇస్తున్నట్లే.

Anonymous said...

It is unfortunate that papers like Eenadu and DC chose to highlight sensitive part of judgement. I heard that chvm also from eenadu?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి