Saturday, February 13, 2010

హెచ్.ఎం. టీవీ వార్షికోత్సవం...మూర్తి గారికి శుభాభివందనం

"ఈ మూర్తి గారు...చాలా స్ట్రిక్ట్. మొన్నీమధ్య ఒక బ్రా కంపెనీ యాడ్ సంపాదించాం. అది కాస్త అసభ్యంగా ఉందని ఆ ప్రకటనను ఛానల్ లో వాడడం కుదరదని మాకు చెప్పారు. ఒక నాలుగు లక్షల ఆదాయం తెచ్చే యాడ్ వద్దని ఆయన తేలిగ్గా అనేసారు," అని హెచ్.ఎం.టీవీ ఉద్యోగి ఒకరు ఒక ప్రింటింగ్ ప్రెస్ లో కనిపించి చెబితే...కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి పట్ల అంతకు ముందు ఉన్న అభిమానం ఎంతగానో పెరిగింది.

అదే యాడ్...మన నైన్ వాడికో, ఫైవ్ వాడికో, ఎన్ వాడికో, ఐ వాడికో, ఐ బీ ఎన్ వాడికో ఇస్తే...ఒక్క బ్రా మాత్రమే తెచ్చారే...ప్యాంటీది కూడా తెండి...డబ్బులిస్తే...రోజంతా జనానికి చూపుతాం...అని అనివుండే వారేమో అనిపించింది. 

ఇప్పుడున్న ఛానెల్స్ లో కాస్త సంసార పక్షంగా ఉన్నది హెచ్.ఎం.టీవీ అని చెప్పడానికి నాకు మనసులో ఇసుమంత సంకోచమైనా లేదు. తెలంగాణా వార్తలు ఎక్కువ ఇస్తారు...అన్న అపవాదు మూటగట్టుకున్నా..'దశ దిశ' పేరిట మూర్తి గారు చేసిన ప్రయత్నం వారి ఉద్దేశ్యాన్ని చాటిచెప్పింది. సమస్యకు ఆజ్యం పోసే వారు, ఆ సమస్య మనకు లాభాలు ఎలా తెస్తుందా అని ఆలోచించే వారు అధికంగా ఉన్న ఈ మీడియా లో మూర్తి గారి సారధ్యంలోని బృందం విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని అనిపిస్తున్నది. సముద్రపు ఒడ్డున బికినితో తడిసి ముద్దై వయ్యారాలు ఒలకబోసే భామలు, బట్టల్లేని అమ్మాయిల పాత క్లిప్పింగులు, ముద్దు సీన్లు...నాకు ఇంతవరకూ ఈ ఛానల్ లో కనిపించలేదు. ఏదో ఒక మిషతో బూతు చూపే ప్రయత్నం వీరు చేయలేదు...నేను చూడగా. మున్ముందు కూడా దీనికే కట్టుబడతారని నమ్ముతున్నా.

ఈ తెలంగాణా గొడవ సందర్భంగా...మీడియాకు దూరం కావడం బాధ కలిగి ఏదో ఒక ఛానల్ లో పనిచేస్తే బాగుండు కొన్నాళ్ళు...అని నాకు అనిపించింది. ఇప్పుడున్న ఎడిటర్లలో ప్రొఫెషనలిజం లేనివారు, ఫ్లూక్లో కొట్టుకొచ్చి స్థిరపడిన వారు, యాజమాన్యం తొత్తులు, కులగజ్జి గాళ్ళు, ముఠాలు మెయిన్ టైన్ చేసి నాణ్యతను తుంగలో తొక్కిపారేసే వారు...ఎక్కువగా  ఉన్నారని జనం భావన. నాకూ ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కాస్త మనం పనిచేసే వాతావరణం ఉన్న ఛానల్ ఏమిటా అని ఆలోచన చేస్తే...హెచ్.ఎం.-టీవీ అనిపించింది. ఆ తర్వాతనే...మిగిలిన ఒకటి రెండు పేర్లు స్ఫురణకు వచ్చాయి.
మూర్తిగారు నేను ఈ-మెయిల్ లో పంపిన రెస్యుమేకి స్పందించకపోవడం...ఇంతలో పీ.హెచ్.డీ.మరో తొమ్మిది నెలల్లో పూర్తి చేయకపోతే...పేరు తొలగిస్తామని ఉస్మానియా వారు హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా...పరిశోధన-బోధన పనికి పరిమితం అయ్యాననేది ఇక్కడ అప్రస్తుతం. మన తెలివి మీడియాకు పనికిరాదని మూర్తి గారు భావించినా...అది తప్పు కావచ్చు, కాకపోవచ్చు.

ముందుగా టీ.టీ.వీ.గా ఉన్న ఛానల్ను తెలంగాణా కలర్ రాకుండా ఉండేందుకు..హెచ్.ఎం.టీవీ గా మార్చి హంస బొమ్మతో లోగో రూపొందించారు. నీళ్ళను నీళ్ళుగా, పాలను పాలుగా విడదీసే హంస ను ఎంచుకోవడం...ఆ నియమానికి కట్టుబడి ఉండాలని ప్రయత్నించడం అభినందనీయం. ఒక చిట్ వ్యాపారి యజమానిగా ఉన్న ఛానల్...మూర్తి గారికి పూర్తి ఎడిటోరియల్ స్వేచ్ఛ ఇవ్వకపోతే...ఇలా నడపడం కుదరదు. 

వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణం సందర్భంగా ఈ ఛానల్ మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా...కథనాలు చూపింది. "శ్రీకాంత చారి తెలంగాణా కోసమని ఒంటికి నిప్పు అన్టించుకుంటే...అన్ని ఛానెల్స్ చాలా అతిగా చూపాయి. టీ.వీ-నైన్ వాడు...ప్రాణాపాయ స్థితిలో ఉన్న చారి మూతి దగ్గర గొట్టం పెట్టి ఏదో ప్రశ్న అడుగుతున్నాడు. మనసును కలిచివేసే ఈ సీన్ ను మాటి మాటికీ చూపవద్దని నేను అన్ని ఛానెల్స్ ను కోరాను. ఒక్క మూర్తి గారు మాత్రమే సానుకూలంగా స్పందించారు," అని నిఘా విభాగంలో ఉన్న ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి చెప్పారు. మీడియాలో మృగ్యమవుతున్న విలువల మీద ఈ ఛానల్ పెట్టినన్ని చర్చలు మరే ఛానల్ పెట్టలేదనే చెప్పవచ్చు.

మూర్తి గారు పవర్ఫుల్ ప్రజెంటర్ కాకపోయినా...ఆయన వాక్యాలలో సమన్వయం ఉంది. నమ్రత ఉంది. మన నైన్ తదితరుల లాగా స్టూడియో లలో వెకిలి నవ్వులు, వెర్రి ప్రశ్నలు లేవు. నింపాదిగా అడగడం...ఇతరులకు మర్యాద ఇవ్వడం...సీనియారిటీ మీద వస్తుంది...నిగర్వులకు. 
నాకు బాగా నచ్చిన ప్రయోగం....ఈ ఛానల్లో మగ యాంకర్లు. ఇతర ఛానెల్స్ ఆడ యాంకర్స్ ను అందంగా చూపి జనం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. ఒక కుక్కమూతి జర్నలిస్టు వార్తల మీద కాకుండా..యాంకర్ల దుస్తుల మీద మనసుపెట్టి...వాడే ఆ అమ్మాయిలకు కాస్త పలచటి, కురచ బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మూర్తి గారు ఇద్దరు ముగ్గురు చాకుల్లాంటి యాంకర్లను తయారు చేసారు. 
 
మరి...ఇలా సంసార పక్షంగా ఉంటే ఛానల్ నడుస్తుందో లేదో తెలియదు కానీ...విలువలను నమ్ముకున్న వారికి తాత్కాలికంగా నష్టం జరిగినా శాశ్వతంగా మంచి జరుగుతుందని నాకుంది. చేసింది తక్కువ...చెయ్యాల్సింది చాలావుంది. జర్నలిస్టుల జీవితాలలో అనిశ్చితి నింపకుండా...వృత్తిలో నీతీ నిబద్ధతలను మూర్తి గారు మరింత పెంచాలని, నైతికతతో ఛానల్ ఎలా నడపాలో ప్రపంచానికి చాటాలని ఆశిద్దాం. వుయ్ విష్ హెచ్.ఎం.టీవీ ఆల్ ది బెస్ట్.

22 comments:

Anonymous said...

Happy birth day to hmtv. All the best.

Anonymous said...

Good compliments on the ocassion of the first anniversary of hmtv.It is common as we see in our society to be sincere in the initial period followed by all sorts of unethical and unproffessional things but in the case of hmtv under the able,efficient and value based leadership of Murthy garu the channel will rewrite the history and become a number one in the media irrespective of loss and profit balance sheet as long as people love and like it.
It may be recalled that Murthy was instrumental in giving second birth to Andhra jyothi with his valu based proffessional work with dedicated staff under his guidance.We wish good days to Murthy garu and to the electronic media in the existing highly polluted electronic media environment and his organisation will become The AP pollution control Board by becoming a leading light to others who are travelling in dark without any proper goal but the goal of earning money.

JP Reddy

JP Reddy.

సుజాత వేల్పూరి said...

మీలా ఇలా నలుగురూ ఇలాంటి చానెల్ గురించి నాలుగు మంచి మాటలు చెప్తే జనం ఎక్కువగా ఇటువంటి ఛానెల్ నే ఆదరిస్తారు. కుప్పలు తెప్పలుగా సంపాదించకపోవచ్చుగానీ మూత మాత్రం పడదు ఈ ఛానెల్.

మూర్తి గారు నెమ్మదైన స్వరంతో సూటిగా, సంయమనంతో అడిగే ప్రశ్నలు, ఆయన సంభాషణలు నాకు చాలా నచ్చుతాయి.

మీరు చెప్పినట్లు హంస లోగో ఎన్నుకోవడమే ఎంతో విజ్ఞత తో కూడిన విషయం!(ఎంత మందికి లోగో అర్థమైందో కానీ)

అసందర్భమైనా చెప్తున్నా....ఆయన రాసిన వార్తా రచన-సూత్రాలు పుస్తకం ఎంతో మంది జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడింది.

Saahitya Abhimaani said...

May their tribe multiply. All the best for HM TV on the eve of their anniversary.

Anonymous said...

sir,ibn kaadu ABN.SEE TO IT.IBN CHANNEL VUNNA ,ADHI ENG CHANNEL.SO EKKADA ABN ani anukauntunaa.

maa godavari said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం.
రామచంద్ర మూర్తి గారితో చర్చించి
ఆయన కోరిన మీదటే భూమిక హెల్ప్ లైన్ (1800 425 2908)
హెచ్ ఎం టీ వీ సమ్యుక్త ఆధ్వర్యంలో
సమస్యల్లో ఉన్న ముఖ్యంగా గ్రుహ హింసకు గురవుతున్న స్త్రీల కోసం ఒక హెల్ప్ లైన్ ప్రారంభమైంది.
ప్రతి శుక్రవారం 1.30 నుండి 2 గంటలవరకు నేను లైవ్ లో ఉంటూ బాధిత స్త్రీలకు సలహా,సమాచరం ఇస్తుంటాను.

satyavati kondaveeti said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం.
రామచంద్ర మూర్తి గారితో చర్చించి
ఆయన కోరిన మీదటే భూమిక హెల్ప్ లైన్
హెచ్ ఎం టీ వీ సమ్యుక్త ఆధ్వర్యంలో
సమస్యల్లో ఉన్న ముఖ్యంగా గ్రుహ హింసకు గురవుతున్న స్త్రీల కోసం ఒక హెల్ప్ లైన్ ప్రారంభమైంది.
ప్రతి శుక్రవారం 1.30 నుండి 2 గంటలవరకు నేను లైవ్ లో ఉంటూ బాధిత స్త్రీలకు సలహా,సమాచరం ఇస్తుంటాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I have some complaints about the quality of the picture of HMTV. I am not an avid viewer of it.Now, I will spend more time viewing it.

Ramu S said...

Yes sir
adi ABN-Andhra Jyothi. Porapaatu dorlindi.
Ramu

jeevani said...

నిన్న అనంతపురంలో దిశ దశ కార్యక్రమానికి ముందుగా ఆయనకు సన్మాన సభ జరిగింది. ఆయన సన్మానాలు ఇష్టపడరట. మూర్తి గారు ఎస్కేలో పీహెచ్ డీ చేశారట. మొహమాట పెట్టి సన్మాన సభ పెట్టారు. ఆయన చెప్పిన కొన్ని మాటలు " జర్నలిజం నాకు తపస్సు లాంటిది. అది నా జీవితంలో నితంతర ప్రక్రియ. సెక్సు, నేరం లేకుండా మీడియాను నడపలేమన్న ఒక మూఢ విశ్వాసం ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. వీటికి అతీతంగా ఒక చానెల్ నడపలేమా? వీటికి సమాధానంగా పెట్టిందే హెచ్ ఎం టీవీ. విలువలని కోల్పోకండి, రాజకీయనాయకులతో మమేకం కాకండి. జర్నలిస్టు అంతిమంగా ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉండాలి " అన్నారు.

ఆయన సాత్వికత వినయం నాకు బాగా నచ్చింది. మీ పొస్టు చదివాక గౌరవం రెట్టింపు అయింది. ఒక వ్యవస్థ కుళ్ళిపోయింది అనుకున్నపుడలా ఇలాంటి గొప్ప వ్యక్తులు తారసపడి మళ్లి నమ్మకం కలిగిస్తుంటారు. ఇకనుంచి నేను HM టీవీ క్రమం తప్పకుండా చూస్తాను.

అన్నయ్యా, 2000 తర్వాత మళ్ళీ AV NARASIMHA RAO గారిని నిన్న కలిశాను.

Shiva Bandaru said...

మూర్తిగారి వల్లే ఆంద్రజ్యోతి పత్రిక విజయవంతం అయ్యింది. మూర్తి హయాంలో ఎడిట్ పేజీ బాగా క్లిక్ అయ్యింది, వ్యాసాలు కూడా నిస్పాక్షికంగా ఉండేవి. మూర్తి వెల్లిపోయిన తరువాత అది టాబ్లాయుడ్ టైపులోకి మారిపోయింది..

Vinay Datta said...

Thank you very much for the report on HM TV. I'll try to get a connection of it or tune to it on the internet.

Regards.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I agree with Mr. Shiva.
During Mr. K. Rmamachandra Murthy's tenure with AJ, the editorial is excellent.

నిజం said...

మూర్తి గారికి జన్మదిన శుభాకాoషలు.ఐ like దశ దిశా ప్రోగ్రాం వేరి వెల్

Anonymous said...

ఏమనుకోవద్దు, నే తప్పుగ మాట్టాడితే ! ఇది వాల్లవాల్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండుమీద కూడా కుంచెం ఆధారపడి ఉంటదేమో ! మన దేసపరిస్తితుల్లో కొద్దిమంది చాదస్తపు బేపనోళ్ళని అక్కడక్కడా పైపొజిషన్స్ లో పెడితేనే గానీ సమాజం ట్రాకులోకి రాదనుకుంతా.

Saahitya Abhimaani said...

భేపనోళ్ళు ఏమిటి రెడ్డిగారూ. "బ్రాహ్మణులు" ఒకటికి పదిసార్లు అనుకోండి. నోటికి వస్తుంది. తెలియకపోతే తెలుసుకోండి. అంతేకాని, ఇతర కులాల పేరు ఉచ్చరించటం కూడ రాకుండా వాళ్ళను మెచ్చుకుంటున్నట్టుగా వ్రాయకండి. ఇదే నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించటం అంటే. ఆ పైన చాదస్తం ఏమిటి. ఆ చాదస్తం లేక మీరేమిటి సాధించింది. మీలో మీరు మాట్లాడుకునేప్పుడు మీకు చేతయినట్టుగా మాట్లాడుకోండి. నలుగురూ చదివే బ్లాగులోకి వచ్చి ఇలా వ్రాయటం పధ్ధతి కాదు.

Ramu S said...

Hi
Lets avoid caste related comments henceforth.
cheers
Ramu

Just said...

Yeah, HMTV is a boon for those who got tired watching the 9s. Hope Murthygaru will continue to have the same freedom in running the channel going forward even while the channel increases its market share.

BTW Ramugaru, u have any authentic figures of Telugu news channels market share in AP? HMTV's i heard is around 5%. Is that right?

Konatham Dileep said...

తెలుగు వార్తా చానెళ్లపై ఆశలు వదిలేసుకున్న సమయంలో కారుచీకట్లో కాంతిరేఖలా HMTV కనపడుతోంది. HMTVకి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

చదువరి said...

ఇప్పుడున్న తెలుగు వార్తా చానెళ్ళలో హెచ్చెమ్‍ టీవీ అత్యుత్తమమైనది. విలువల పట్ల నిబద్ధత కలిగిన చానెలది. వాళ్ళకూ ఉన్న తెలంగాణ పక్షపాతం నాకు నచ్చదు. ఆ పక్షపాతం కొంత కనబడినప్పటికీ దశ-దిశ సమావేశాలు బాగా ఉంటున్నాయి.

పొద్దున ఆరున్నర నుండి ఏడు దాకా వచ్చే కార్యక్రమం - ఇద్దరు సమర్పకులు సమర్పించేది - నాకు అంతగా నచ్చదు. ఏదో.. ’పోర్షను’ అప్పజెబుతున్నట్టుగా ఒకరి తరవాత ఒకరు టకటకా మాట్టాడుతూంటారు, ఈజ్ లేదు. ఆ కుర్రాడు తన ’పోర్షను’ చెప్పగానే ఆ అమ్మాయి వంక చూసేవాడు. ఈ మధ్య ఆ అలవాటును మాన్పించారు. దశాబ్దాల కిందట దూరదర్శన్ జాతీయ చానెల్లో వచ్చిన ఇలాంటి జంటసమర్పణ కార్యక్రమం ఇంకా బాగుండేది.

హెచ్చెమ్ టీవీ నుంచి ఇంకా కొత్త తరహా కార్యక్రమాలు - ముఖ్యంగా చరిత్ర గురించి, సైన్సు గురించి, పుస్తక సమీక్షలు, ఫలానాది ఎలా పనిచేస్తుంది, వగైరాలు - రావాలని నా ఆశ.

srikanth said...

okarito okariki godavalu pette TV9 rajanikanth, NTV Kommineni la kanna murthy gaari vartavyakhya adbutam ga untundi. america lo unna raatri 8:30 ayindante HMTV tune chestaanu. okko raoju aayana karyakramanni nirrvahinchaka pote edo veliti laaga anipistundi.

Anonymous said...

I am currently in USA, and i watch this channel everyday since i came to know and i love it.I feel more relaxed when i watch this channel if i compare with other "Number" channels.
I subscribed for "TV9" telugu in USA but now i disconnected that channel after comparing it with HMTV.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి