Monday, March 29, 2010

తెలుగు ఛానెల్స్ కు దొరికిందిరా... తాజా బకరా.....శ్యామల

ఒక మూడు రోజుల నుంచి తెలుగు ఛానెల్స్...తాను జోగినిగా చెప్పుకుంటున్న శ్యామల చుట్టూ తిరుగుతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే...ఆమె మీద సానుభూతి కన్నా...చాలా చలాకీగా ఉన్న ఆమెను సుందరంగా/రమ్యంగా/ సెక్సీ గా చూపడంపై ఈ ఛానెల్స్ దృష్టి పెట్టడం. 

శ్యామలను ఇంతగా హైలైట్ చేయడం ఆరంభించింది...zee-24 gantalu ఛానల్ వారు. శుక్రవారం రాత్రి రెండు గంటలకు పైగా...'శ్యామల ఆంటీ' పేరుతో ఒక సెమీ బూతు మాటల కార్యక్రమం నడిపారు. ఆమె కారు దిగిన దగ్గరి నుంచి....స్టూడియో లోకి వచ్చే దాకా...తీసిన వీడియో ఫూటేజ్ ను చాలా అందంగా చూపి గ్లామరైస్ చేశారు. ఇక యాంకర్ ఈశ్వర్ గారు...ఆమెతో చాలా తమకంగా మాట్లాడుతూ...నానా చెత్త ప్రశ్నలు వేసారు. 'హా..మీరు అలా చేతులు తిప్పుతుంటూ మాట్లాడుతుంటే..." నుంచి..."శ్యామల ఆంటీ అందం చూసి అంతా ఫ్లాట్ అయిపోతున్నారు...." వంటి చాలా చిలిపి స్థాయి మించిన స్టేట్మెంట్లు పదేపదే ఇచ్చారాయన. ఆమెకు 'ఆంటీ' అని తగిలించింది ఈశ్వర్ గారే నట. నిజానికి...గంభీరమైన గళంతో సంసారపక్షంగా యాంకరింగ్ చేసే...ఈశ్వర్ గారు శ్యామల విషయంలో ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు.

జనరల్ గా శైలేష్ గారి బృందం...ఇలాంటి స్టోరీల నుంచి మాగ్జిమం పిండుతుంది. అందుకు అది అనుసరించే మార్గం....ఫోన్ కాల్స్. 'చెప్పండి...శ్యామల ఆంటీ లో మీకు నచ్చింది ఏమిటి?'  అని ఆ యాంకర్ అడగడం..ఒకడు ''ఓహ్...ఆంటీ..మీరు చాలా సెక్సీగా ఉన్నారు..." అనడం..."అయితే..నాలో మీకు బాగా నచ్చింది ఏమిటి?" అని ఆ అక్కయ్య హావభావాలు, చిలిపి చేష్టలతో తెలుసుకోగోరడం...జరిగాయి. ఆమె మనసు ఎవరు దోచుకున్నదీ తెలుసుకునే ప్రయత్నం చేసారు ఈశ్వర్. ఆ కామెంట్స్, ఫోన్ కాల్స్ నాకు పరమ చికాకుగా అనిపించాయి. అయితే....ఆ సమయంలో చాలా మంది ఫోన్లో ఆమెతో మాట్లాడాలని ఉబలాట పడ్డారట. అంతే....కార్యక్రమం విజయవంతం అయినట్లే కదా! 

మర్నాడు...నేను ఊళ్ళో లేను. 'సాక్షి' వాళ్ళు శ్యామలను, మరొక జోగినిని లైన్ లోకి తెచ్చి ఘోరంగా కార్యక్రమం నడిపారని, అది చూసి రోత పుట్టి టీ.వీ.చూడడం ఆపానని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. వాళ్ళిద్దరూ...ఒకర్ని ఒకరు పొడుచుకోవడం...శ్యామల అంతకు ముందు జీ..లో చేసిన వ్యాఖ్యలపై మరొక సీనియర్ జోగిని గారు విమర్శలు గుప్పించడం జరిగిందట. N-TV కూడా కచ్చితంగా ఈ కార్యక్రమం ప్రసారం చేసే ఉంటుంది. ఇలాంటి స్టోరీ లకు మసాలా దట్టించడంలో దిట్టలు కొలువై ఉన్నారు....చౌదరి గారి దర్బారులో.

ఇక ఈ రోజు...మన TV-9 రంగ ప్రవేశం చేసింది. నిజానికి...బ్రహ్మాండం బద్దలయ్యే స్టోరీలు సైతం...ఇతర ఛానెల్స్ చేసాక రవిప్రకాష్ చానెల్ ముట్టుకునేది కాదు. కాస్త సేలబుల్ ఎలిమెంట్ ఉంటే...అందునా ఆడోళ్ళ యవ్వారం అయితే...ఈ చానెల్ కొన్నాళ్ళుగా నిర్మొహమాటంగా అలాంటి స్టోరీ లను ఫాలో అప్ చేస్తున్నది. అందులో భాగంగా....శ్యామల అక్క TV-9 స్టూడియో లో ప్రత్యక్షం అయ్యారు...సోమవారం సాయంత్రం. యాంకర్ భద్రి గారు కూడా...ఫోన్ కాల్స్ తీసుకుని...ఆమె పర్సనల్ వివరాలు అందించి వీక్షకులను రంజింపచేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక సినిమా మసాలా ఉంది. దర్శకుడు శంకర్ ఫోన్ లైన్లోకి వచ్చి...శ్యామలకు సినిమా చాన్స్ ఇస్తానన్నాడు. ఆ ఊపులోనే...తాను జోగినిలకోసం ఒక ట్రస్టు పెడతానని శ్యామల ప్రకటించారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి HM-TV వాళ్ళు 'పిన్ని వర్సెస్ ఆంటీ' అని ఒక కార్యక్రమం నడిపారు. వాళ్ళు...శ్యామల కు ఆ సీనియర్ జోగిని గారికి మధ్య మాటల యుద్ధాన్ని రెండు విడివిడి బాక్స్ లలో చూపారు. అది లైవ్ కాదనుకుంటా. మొత్తం మీద...ఛానల్స్ ఇలా ఒక విధివంచిత జోగినిని తెరకు ఎక్కించి....కార్యక్రమాలు నడిపాయి. 

నిజానికి...జోగినిలు, మాతంగులు వంటి వ్యవస్థలపై ఒక స్టోరీ చేసి...శ్యామల ధైర్యం, చదువు, చొరవలను ఒక కేస్ స్టడీ గా ఒక అర్ధగంట కార్యక్రమం చేస్తే...అది బాధ్యతాయుతంగా ఉండేదనిపించింది.  అలాకాకపోయినా...శ్యామల జీవితంపై ఒక స్ఫూర్తిదాయక స్టోరీ చేస్తే బాగుండేది. ఇలాంటి వాళ్ళను సెక్సీ గా చూపుతూ...స్టూడియో లైట్స్ తిమ్మిరిలో ఉన్న వాళ్ళను పోరంబోకు ప్రశ్నలు అడుగుతూ....పనీ పాటా లేని కాలర్స్ తో వాళ్ళను ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేయిస్తూ... కాలక్షేపం  చేయడం టీ.ఆర్.పీ. రేసులో సాగించే...ఒక పిచ్చి పరుగు. ఒక ఘోరం, ఒక పాపం.
-------------------------------------------------------------

నోట్: ఈ పోస్టు శీర్షికలో 'బకరా' అన్న పదం వాడడం శ్యామల గారిని కించపరచడానికి కాదు. ఛానెల్స్ వెకిలిని ప్రస్తావించడానికే. ఆ పదం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని...శ్యామల గారికి సవినయ విన్నపం. ఇతర జోగినులకు సాయం చేయాలన్న ఆమె తలంపునకు వందనం.

15 comments:

శరత్ కాలమ్ said...

మీరూ శ్యామల గారి ఫోటో పెట్టివుంటే వారిని మేమూ చూసేవాళ్లం కదా.

యంగ్ ఇండియన్ said...

ఖర్మ కాలి ....... నిన్న చూసాను.యషొనాథ్ మహ తమకంతో ప్రష్నలు అడుగుతున్నాడు దానికి ఆంటి కవ్వించె సమాధానాలు... కొంపదీసి అర్ధరాత్రి కాలెదుకదా అనే అనుమానం వచింది. మిడ్నైట్ మసాల వస్తుందేంటి .....టైం చూస్తే సాయంత్రమే అవుతుంది. మీకు ఏ హీరో ఇస్ష్టం అని అడగ్గా...దానికి ఆవిడ నా హైట్కు ప్రభాస్ అయితే సరిపొతుణ్ది అనడం...దీనమ్మా ఏమి హైటు ఉందిరా అని కుర్రకారు తనని కామెంటు చేసారని ఆమే ఓ టైపులో చెప్తుంటే ఏదో ... ఎవరో దేవినట్లయింది. జయప్రకాష్ నారయణ గుర్తొస్తున్నాడు ...ఈ రొచ్చు చానళ్ళ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని తెలుగు లోకం ఎదురుచూస్తున్నది. వీళ్ళకి సమాజహితం పట్ల ఏ మాత్రం భాద్యత లేదు ఉన్నాదల్లా కాసులు సరిచూసుకోవడమే.

Anonymous said...

News has changesd its defination
N: New
E: Entertainment for
W: wondefull
S: Sex stories....

Ramu S said...

అదనపు సమాచారం....
1) జీ..న్యూస్ వాళ్ళు 'స్టన్నింగ్ బ్యూటీ..శ్యామల అంటీ.." అన్న మాటలతో ఆ స్టొరీ వాడారు.
2) ఎన్-టీ.వీ.లో యశోనాథుడు ఆ పాత్ర పోషించాడన్నమాట. పయోముఖ విషకుంభాల జాతర...

రాము

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

అవును నిన్న పొరపాటున ఛానల్స్ మారుస్తూ ఉంటే... ఏదో న్యూస్ ఛానల్లో.., N-TV అనుకుంటా..., ఛీఛీ.., మానవత్వాన్ని పరిహసించే ఆ భాష..., ఛీఛీ..
వెంటనే...,
""దొంగ ’లంజ’కొడుకులసలే మెసలే ఈ
తెలుగు మీడియా లో చూడలేవు
తలవంచుకుని ’వరల్డ్ మూవీస్’ కి వెళ్ళిపో నేస్తం!
ఎనభై వేలు పెట్టి కొనుక్కున్న LCD, ఈ ధూర్తులు వెదజల్లే లేకి భాషని చూడటాని కాదు నేస్తం!! ""
అని శ్రీశ్రీ గారు చెప్తున్నట్టు అన్పించి ’వరల్డ్ మూవీస్’ కి వెళ్లిపోయా.

Rajendra Devarapalli said...

సరేనండి,అందరూ ఇంత యిదిగా టీవీల కార్యక్రమాలమీద ఇదవుతున్నారు కాబట్టి యిజ్జూసి ఓసారి ప్రయత్నించండి
http://www.whitedot.org/issue/iss_front.asp

Anonymous said...

ఏంటో తెలియదు కాని.. N టివి వాళ్ళు పెద్దగ ఏమి అంటే దర్ద్రం గా ప్రోగ్రాం చెయ్యలేదు..సాదా సీదా గ జరిగింది.. శివా రెడ్డి ( మిమిక్రీ ఆర్టిస్ట్ ) ఫోన్ లైన్ లోకి వచ్చి రాజకీయ నాయకుల్లా మాట్లాడి ప్రోగ్రాం నడిపించేశారు..

శివుడు
రాజమండ్రి

Anonymous said...

@sarat: http://www.youtube.com/watch?v=M0GDSmPlvYs

Ramu S said...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారూ...
చాల మంచి లింక్ సూచించినందుకు థాంక్స్. చాలా బాగుంది.
థాంక్స్
రాము

మయూఖ said...

జోగిని వ్యవస్థను రద్దు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నాయి కదు సర్,అదే జోగినిలతో టి.వి.లలో ప్రొగ్రాం లు ఏమిటి సార్.ఇంతకూ జోగిని వ్యవస్థ ఉన్నట్లా,లేనట్లా?

Anonymous said...

EVM ల పనితీరుపై వెనక్కి తగ్గిన ఎలక్షన్ కమిషనర్ , BSNL ప్రైవేటీకరణ కు శాం పిట్రోడా సిపార్సు నివేదిక తెలంగాణ సమస్య, అంధ్రాలో బలహీన ముఖ్యమంత్రి, పాత బస్తీలో అల్లర్లు తదితర వార్తల నేపద్యంలో :

నవీన్ చావ్లా: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సహకరించాడు(అట)
శ్యాం పిట్రోడా: భారత దేశంలో శాంకేతిక విప్లవానికి ఆద్యుడు, రాజీవ్ గాంధీకి సన్నిహితుడు
పిట్రోడా సిఫారసులు:
30 శాతం వాటా అమ్మాలి.
3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి
9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్‌ వర్క్‌ని ఔట్ సోర్సింగ్‌ చేసుకోవాలి.
సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో
ఈ మధ్య దేశంలో జరిగే కొన్ని అవాంచనీయ సంఘటనలకు(పాకిస్తాన్ మంత్రి ఫోటో ప్రచురణ, మహారాజా ఎక్స్ప్రెస్ కి గీసిన రూట్ మేప్ లో ఢిల్లీ ని పాకిస్తాన్లో చిత్రించడం మొదలైనవి ) ఇంతవరకూ ఎవర్నీ బాధుల్ని చేయలేదు ... ఎందుకో తెలీదు
బహుశా వీటన్నింటి వెనుకా నకిలీ కణిక వ్యవస్త హస్తం ఉన్నట్లు అనుమానం . నకిలీ కనికుడికి ఇందిర ,రాజీవ్ లంటే పడదు, వాల్లను Unpopular చెయ్యాలి.ఇందుకు ఇందిర, రాజీవ్ లకు సన్నిహితులైతే వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే పొడిచినట్టు అని భావించి ఉంటాడు. ఆ విధంగా ఇందిర ,రాజీవ్ లకు సాధ్యమైనంత వరకు అపఖ్యాతి తేవాలని నకిలీ కణికుడి ఉద్ధేశ్యం లా కనిపిస్తుంది ,ప్రస్తుతం ఇందిర, రాజీవ్ లు జీవించిలేరు. అయినా సరే ఆ అపఖ్యాతిని వాల్లకు మూటగట్టాలని భావిస్తున్నాడు. నిజానికి ఇప్పూడున్నది ఇందిరా కాంగ్రెస్ కాదు ... ఇటలీ కాంగ్రెస్ . మరి ఈటలీ కాంగ్రెస్ చేసిన తప్పుకి ఇందిరాకాంగ్రెస్ ఎలా బాధ్యత వహిస్తుంది . *** పేపర్ చదివితే ఈ విషయం స్పష్టమౌతుంది ... దేశంలో అత్యంత వెనుకబడిన వాల్లు ముస్లింలు, సహజీవనం తప్పుకాదు అని సుప్రీం కోర్టు వాఖ్య ...ఇత్యాదివన్ని అతని సృష్టే ... మొత్తానికి దేశంలో ఏదొ జరిగి పొతోంది ... అన్నింటికీ ఏదో లింకుంది .

శరత్ కాలమ్ said...

@Anonymous
Thank You

lakshman said...

http://busymovies.net/Digest/Jai/Jogi1.html

http://busymovies.net/Digest/Jai/Jogi2.html

http://busymovies.net/Digest/Jai/Jogi3.html

Anonymous said...

Ramu garu,

I am one of the (un)fortunate viewers who happened to sit through the NTV's version of Shyamala Aunty. Cudos to Yashonath.. he used his little brains to successfully remove Aunty tag to Shyamala!!!

I pity you really!!! I pray the almighty GOD to give you more stregth and willpower to sitthrough and withstand all this TV nonsense. But, never feel let down and back off. GOD bless you!!!

P.S: I also liked the link http://www.whitedot.org/issue/iss_front.asp. The best part of this was the 'TV turnoff week'. Its high time we seriously think of such a campaign.

What an Idea sirji!!!

Anonymous said...

the brain behind sex stories in ntv is rajasekhar. not the poor yashonadh. he became free these days as murthy left ntv.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి