Monday, March 22, 2010

రామోజీపై ఉండవల్లి 'ఇన్ స్టాల్మెంట్' పోరాటం!?

కాంగ్రెస్ ఎం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ 'ఈనాడు' అధిపతి రామోజీ రావుపై ఇన్ స్టాల్ మెంట్ (వాయిదా) పద్ధతిన 'పోరాటం' చేస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి వీలుచిక్కినప్పుడు ఆయన ఉన్నట్టుండి రామోజీ మీద ఏదో ఒక హడావుడి చేయడం...'సాక్షి' పత్రిక దాన్ని పతాక శీర్షికన ప్రచురించి బ్రహ్మాండం బద్దలై పోతున్నదన్నట్లు చిత్రీకరించడం జరుగుతున్నది. 


రాష్ట్రంలో తాను చెప్పిందే వేదం అన్న దురహంకారంతో రామోజీ చెలరేగిపోతున్న కాలంలో ఆయనకు ఉండవల్లి ముకుతాడు వేయగలిగారు. 'మార్గదర్శి'లో కంతలు లేవనెత్తి...రామోజీ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఒక కుదుపు కుదిపారు. రామోజీ లాంటి వ్యక్తిని ఇరుకునపెట్టిన నిజాయితీపరుడిగా పేరున్న ఈ ఎం.పీ.ని జనం మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఉండవల్లి దీన్ని 'ఇన్ స్టాల్ మెంట్ పోరాటం'గా మార్చి ప్రచారం పొందుతున్నారు. తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా....'రామోజీ ని వదిలే ప్రసక్తే లేదు' అన్న స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఇది బాగోలేదు.

చట్టం ముందు అందరూ సమానులే...అన్నది నిజం. ఈ రోజుల్లో డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళు అందరికన్నా కొద్దిగా ఎక్కువ సమానం...అని అందరికీ తెలిసిందే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే...ఉండవల్లి ఖైరతాబాద్ లోని 'ఈనాడు' ఆఫీసు ముందో, సచివాలయం ముందో ఆమరణ నిరసనకు దిగాలి...రామోజీని చర్లపల్లి జైలు పంపే దాకా పట్టు వీడకూడదు. అంతేతప్ప...'లేడికి లేచిందే పరుగు' తరహా ట్రిక్స్ కు పాల్పడకూడదు. అది జనాలను తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది.


రామోజీ అంటే ఎగిరెగిరి పడే 'సాక్షి' ఉండవల్లి వార్తకు ఈ రోజు అంత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 'కొరడా తీయండి' అని పతాక శీర్షికతో పాటు...రెండో పేజీలో మూడు పెద్ద వార్తలు ప్రచురించింది. మీ పోరాటం మీడియా కోసమా? జనం కోసమా? ఈ 'సాక్షి' అతి స్పందన వల్ల ఉండవల్లి క్రెడిబిలిటి దెబ్బతింటున్నది.


అయ్యా..ఉండవల్లి గారూ...ఎవ్వరొచ్చి న్యాయం చేయమన్నా...న్యాయ పోరాటానికి సిద్ధమని అంటున్నారు కదా! మీ కాంగ్రెస్ నేతలు నడుపుతున్న ఛానల్ లో ఉద్యోగులకు భద్రత లేదు. ABN--ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉద్యోగులకు కనీసం అప్పాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వడం లేదు. వందలమంది చిన్న ఉద్యోగులకు మీడియాలోనే కాదు...ఏ పరిశ్రమలో అయినా.. ఉద్యోగ భద్రత లేదు. ప్రైవేటు సంస్థలలో చాలా మంది ఉద్యోగుల  జీవితాలు సంక్షోభంలో ఉన్నాయి. దయచేసి ఈ యాజమాన్యాల మీద కూడా పోరాటం చేసి పుణ్యం మూట కట్టుకోండి. 

అలాగే...నిన్న వీరు ముఖ్యమంత్రి రోశయ్యకు రాసిన లేఖలో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, విశ్వనాథ సత్యనారాయణ ల ప్రస్తావన తెచ్చారు. వాళ్ళ కుటుంబీకులు చిట్స్ లో తప్పులు చేస్తే...దానికి వీళ్ళు బాధ్యులా? రామోజీ మీద పగతో ఉండవల్లి మరీ ఇంత దిగాజారాల్సిన పనిలేదనుకుంటా. 


ఉండవల్లి గారూ...నిజంగా మార్గదర్శి  చేసింది 'ఘోర నేరం' అని మీరు నమ్మితే....అధికారపక్షంలో ఉండి, ఆ పార్టీ అధినేత సోనియా ప్రసంగాలు అనువదించే నేతగా వెలుగుతూ ఇంతవరకూ రామోజీని జైలుకు పంపలేనందుకు మీరు మీ పదవికి రాజీనామా చేయండి. ఇది నిజంగా ఒక ఎం.పీ.గా ఉన్న మీకు సిగ్గుచేటైన విషయం. లేదంటారా..ఇందాక అనుకున్నట్లు ఈ సినిమా జనం లాగా ఆమరణ దీక్షకు దిగండి. అంతవరకూ నేనులేస్తే మనిషిని కాను...అని చేసే హడావుడిని ఒక పబ్లిసిటీ స్టంట్ గా జనం భావించాల్సిఉంటుంది.

13 comments:

SADASIVARAO said...

ఉండవల్లి గారు,
ఎక్కడ తప్పు జరిగితే వాసనతో పసిగడతాను అని చెప్పినమీకు .రామోజీ తో తప్ప మీ బుద్ది పనిచేయదు. ఎందుకని?.పబ్లిక్ కు అన్యాయం జరిగితే స్పందించే సహ్రుదయులయితే చార్మినర్ బాంక్,క్రుషి బాంక్,అవుటర్ రింగ్ రోడ్ అక్రమాలు ,ఆయేషామీరా హత్యకేసు , బొగ్గుగనుల వ్యవహారంలో కాని తెలంగాణ విషయంలో కాని, ,ప్రజల తరుపున ఎందుకు స్పందించరు .ఇవన్ని చూడటానికి ప్రభుత్వం కోర్టులు వుంటే రామొజీ విషయం లో కూడా ఇవి వున్నై కదా .మీ వ్యక్తిగత కక్షకు కాని పాపులారిటీ కి కాని ఈ అస్రం పనిచేస్తుంది అంతే కాని జనాలు మరిచారు అనగానే తెరపైకి తెస్తారు .మీ ప్రభుత్వమే పనిచేస్తుంది కేంద్రంలో రాష్రంలో అనిమరిచారేమో ?
సదాశివరావు

Anonymous said...

మీరు చెప్పింది నిజం. ఉండవల్లికి ప్రజాసంక్షేమం కన్నా, ప్రచారమే ఎక్కువ ఇష్టం. ఆఖరులో మీరన్నది చాలా ముఖ్యమైన అంశం. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నట్టు? అంత చేతకానె వారు ఎందుకు వీధికెక్కడం? ఉండవల్లికి ఉందనుకున్న విశ్వసనీయత అంతా రామోజీమీద అపనమ్మకం వల్ల(నిరంకుశ ధోరణుల వచ్చిందేకానీ ఆయన ఘనత కానే కాదు.

Anonymous said...

మీరు చెప్పింది నిజం. ఉండవల్లికి ప్రజాసంక్షేమం కన్నా, ప్రచారమే ఎక్కువ ఇష్టం. ఆఖరులో మీరన్నది చాలా ముఖ్యమైన అంశం. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నట్టు? అంత చేతకానె వారు ఎందుకు వీధికెక్కడం? ఉండవల్లికి ఉందనుకున్న విశ్వసనీయత అంతా రామోజీమీద అపనమ్మకం వల్ల(నిరంకుశ ధోరణుల వచ్చిందేకానీ ఆయన ఘనత కానే కాదు.

Anonymous said...

ఉండవల్లి కి ఊసరవెల్లి కి తేడా ఏమిలేదు. అయన చేసేవి మాత్రం చెప్పుకోడు...గత ఎన్నికల్లో ఆయన ఎలా గెలిచాడో గోదావరి జిల్లాల ప్రజలందరికి తెలుసు...
ముళ్ళపూడి మీద ఆయనచేసే కామెంట్స్ మంచిదికాదు.

Trader said...

Do you think expressing your anguish over here in this blog will make any difference.?

Try to select another channel along with blogs, to reach the actual destination.

If you want to convey your message to those whom you blame or want to target, this will not work.. as per me.

I am not criticizing you or discouraging you, but i just want to let you know that all your efforts are being lost in vain, if they dont read your blog.


Venu.

తుంటరి said...

మీరు రాసింది బాగుంది కాని ఈ కింది పాయింట్లు అంత కన్విన్సింగ్ గా లేవు.

చట్టం ముందు అందరూ సమానులే...అన్నది నిజం. ఈ రోజుల్లో డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళు అందరికన్నా కొద్దిగా ఎక్కువ సమానం...అని అందరికీ తెలిసిందే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే...ఉండవల్లి ఖైరతాబాద్ లోని 'ఈనాడు' ఆఫీసు ముందో, సచివాలయం ముందో ఆమరణ నిరసనకు దిగాలి...రామోజీని చర్లపల్లి జైలు పంపే దాకా పట్టు వీడకూడదు. అంతేతప్ప...'లేడికి లేచిందే పరుగు' తరహా ట్రిక్స్ కు పాల్పడకూడదు.

అయ్యా..ఉండవల్లి గారూ...ఎవ్వరొచ్చి న్యాయం చేయమన్నా...న్యాయ పోరాటానికి సిద్ధమని అంటున్నారు కదా! మీ కాంగ్రెస్ నేతలు నడుపుతున్న ఛానల్ లో ఉద్యోగులకు భద్రత లేదు.

ఆ పార్టీ అధినేత సోనియా ప్రసంగాలు అనువదించే నేతగా వెలుగుతూ ఇంతవరకూ రామోజీని జైలుకు పంపలేనందుకు మీరు మీ పదవికి రాజీనామా చేయండి. ఇది నిజంగా ఒక ఎం.పీ.గా ఉన్న మీకు సిగ్గుచేటైన విషయం.

Anonymous said...

రాము గారు, ఈ రోజు మీరు రాసిన టపా చూసి నాకు మీరెస్థాయి జర్నలిస్ట్ అర్థమౌతున్నాది. ఖచ్చితం గా మీరు ఒక ఆర్డినరి విలేకరి నాలుగు తెలుగు పదాలను ఉపయోగించి రాతలు రాస్తున్నారు. మీ రడిగిన ప్రశ్నలన్ని చాలా పేలవమైనవి. వాటి తో ఎవరైనా మీడిల్ క్లాస్ ప్రజలను ఆకట్టు కోవచ్చు. ఇంత పేలవమైన టపాకి చాలా మంది తెలుగు వారి ప్రతిస్పందన చూస్తె మన వారి స్థాయి తెలుస్తున్నాది.

Anonymous said...

It is crystal clear that Undavalli has been after under the direction of YS Jaganmohan Reddy as the latter has to fulfill the wishes of his late father to take revenge against Ramoji to settle personal and political scores.Unfortunately Undavalli has become a laughing stock in the fight between Ramoji and YSR and his son.
There are many corporate and media bosses who have been going against the law of the land who are being patronised by the congress party but tragically Undavalli is blind,deaf and dumb towards these illegal things but his eyes,ears and mouth always work overtime to attack Ramoji Rao..Let the law take it's own course and guilty be punished.HOW MANY DAYS DOES THE BOFORS CASE HAD TO FACE THE TRIAL AND FOR THE FINAL JUDGEMENT?
jp.

Anonymous said...

Dear Ramu..
this was the least expected from a seasoned journalist like you. After all UNDAVALLI is a member of parliament. YOur comments suggests that he shouldn't hold any respect towards the judicial system of our country. Should he join the bandwagaon and come to streets to settle things. Do you really mean it. Some thing is fishy here. On one side you agree that ramoji has made mistake (if not clarify) on the other hand you try to make this type of comments. Make your stand clear. Infact I dont think its an analysis itself

Ramu S said...

తుంటరి కింది anonymous gaaru..
నేను ఏ స్థాయి లేని పనికిమాలిన జర్నలిస్టును సర్. ఆర్డినరీ కన్నా కింద స్థాయి విలేకరిని. నిజానికి ఇప్పుడు విలేకరినే కాదు. తెలుగు నాలుగు మాటలు వచ్చు అన్న మీ పరిశీలన కూడా తప్పు.
కాస్త కూచొని ఆలోచించండి...ఇది పేలవమైన టపానో కాదో తెలుస్తుంది..

@ another anonymous

Sir, Ramoji might or might not have committed the crime but Undavalli is not willing to take it to a logical conclusion. He has started playing it to the gallery. When you expect him to respect the judiciary, why should he shoot off a letter to Rosaiah now? Let the law take its own course.

Cheers
Ramu

రాము

Anonymous said...

dear ramu...

what is a logical conclusion for a legal case filed in court. Should the scores be settled in the public view or law has to take its own course. Undavalli has raised the issue and made sure that a case is filed. As a member of parliament he has every right to raise such a issue coz there are doubts of violation of rules. You must have noticed supreme court has validated the appointment of s.s.prasad in this case today. This may be the very reason undavalli has once again raised and questioned the government. I cautiously stated Government rather than Rosaiaha because even if Y.S.R. was undavalli has responded in the same way.

thanks

Anonymous said...

ఈ టపా మా ఉర్లో టీ కొట్టు దగ్గర అభిప్రాయలు వేలిబుచే వారిని గుర్తుకు తెసుతున్నాది. లాఫింగ్ స్టాక్ గా మారింది ఉండవల్లి కాదు ఈ దేశ ప్రజాస్వామ్య పని తీరు. ఉండవల్లి ని ఢీ కొనాలన్నా, లేక అనలైస్ చేయా లన్న జె.పి. రెడ్డి లాంటి వారు చాలా చిన్న వాడు. అరుణ్ కుమార్ స్థాయి ఖచ్చితం గా సగటు ఆంధ్రా రాజకీయ నాయకుల కన్నా చాలా ఎక్కువ, అరుణ్ శౌరి, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారికన్న కొంచెం తక్కువ. గెలిచిన మొదటి సారే అతను చూపిన ధైర్యం అమోఘ మైనది. దాని వెనక సి.యం. సపోర్ట్ ఉంది కదా అనకండి ఆయన సపోర్ట్ చాలమంది వెనక ఉంది కాని వారంతా ఉండవల్లు కాలేరు. ఉదా|| చిరంజీవి కూతురిని ఎత్తుకేళ్ళి పెళ్ళి చేసుకోవటానికి సలహాలు శిరిష్ భరద్వాజకి చాలా మంది ఇచ్చి ఉంటారు కాని పని యక్సిక్యుట్ చేసే వాడిలో నిజం గా ధైర్యం ఉండాలి. ఎక్కడ పొరపాటు వచ్చిన సీను లో వాడె ఉండడు కదా! ఆ రీస్క్ తీసుకొని శిరీష్ కి సహజ మైన ధైర్యం ఉండ బట్టె శ్రీజను పేళ్ళి చేసుకో గలిగాడు. రిస్క్ తీసుకో లేని వాళ్ళు అందరు ఇలా బ్లగులు పేట్టుకొని అనాలిసిస్ లు చేస్తుంటారు.
వాస్తవం గా ఇంత తెగింపు ఉన్న ఇతని వర్గాన్నికి సంబందిచిన వారిని తెలుగు సినేమా జోకర్లు కామేడి సీనుస్ లో వారిని చూపించి కుతి తిర్చు కుంట్టూ ఉంటారు వారికేదొ పెద్ద ధైర్య సాహసాలు ఉన్నట్టు. నాకు తెలిసి ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల లో రాజశెకర రేడ్డి తరువార ఒక్క మగాడు ఉండవల్లి మాత్రమే .ఆయనను ఓడించటానికి ఎన్ని ఎత్తులు వేసిన ఆఖరికి సారీ చెప్పిన తరువాత దళితులు కూడా మేము నిన్ను ఓడిస్తామన్నా నేగ్గుకు వచ్చాడు.

ఈ దేశ ప్రజాస్వామ్య పని తీరు ఎలా ఉందో కింద టపాను చదవండి.

http://wwwammaodi.blogspot.com/2010/03/blog-post_16.html

kvramana said...

Anna Ramu
I found this post in a bad taste. Some words you have used like 'Durahankaram' and 'mukutadu' are not called for and they show your bias against Ramoji Rao. I also fail to understand the reason for you to get into this issue on this particular blog. I think you should look at Ramoji Rao just as a chief editor of Eenadu as far as this blog is concerned. All his other businesses do not fall under the purview of the blog.
I also did not like the way Undavalli is being projected as a hero and Ramoji Rao as a villain. Undavalli is part of a system and a process. We still don't know the force behind Undavalli particularly after YSR's death. In the case of Ramoji Rao as a businessman owning Margadarsi and as karta of his HUF, he is entitled to play within the interpretation of the laws either of the Chitfunds Act or the income tax act. Just because an MP is making some noise about it, the statutes, rules and interpretation are not set aside. It is a legal process and the state government is definitely not entitled to handle it since the issue is about evasion of taxes.
I think this blog should keep off such issues.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి