Wednesday, March 31, 2010

సైన్స్ రిపోర్టింగ్ కు ప్రాధాన్యమివ్వని తెలుగు పేపర్లు

ఎప్పుడూ...రాజకీయం, సినిమా, క్రైం వార్తలకు బాగా అలవాటు పడిన తెలుగు పేపర్లు సైన్స్ రిపోర్టింగ్ ను పెద్దగా పట్టించుకోవు. ఇది మరొకసారి ఈ రోజు  నిరూపితమయ్యింది. అంత్యంత కీలకమైన 'బిగ్ బ్యాంగ్' ప్రయోగం విజయవంతమైన వార్తకు అటు 'ఈనాడు' గానీ..ఇటు 'ఆంధ్రజ్యోతి', 'సాక్షి'గానీ ప్రాముఖ్యమిచ్చి మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించలేదు. మొదటి పేజీలో 'హై లైట్' బాక్స్ ఇచ్చి...వార్తను మాత్రం లోపల ప్రచురించారు. ఆ తెలుగూ సరళంగా ఉన్నట్లు అనిపించలేదు. వీళ్ళందరికీ...సానియా పెళ్లి వ్యవహారం ముఖ్యమయ్యింది.


"విశ్వ" ప్రయత్నం...శీర్షికన..'ఈనాడు' 13 వ పేజీలో అట్టడుగున ఈ వార్త వేసింది. ఇది దారుణం. "విశ్వసాగర మథనానికి సంబంధించి భారీ ప్రయోగం దిగ్విజయంగా సాగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగం. భౌతిక శాస్త్ర చరిత్రలోనే ఇది మేలి మలుపు కానుంది," అన్న ఇంట్రో తో ఇచ్చిన వార్తకు ఇంత తక్కువ ప్రాధాన్యతా? మొదటి పేజీలో సగం పేజీ vivel వారి యాడ్ ఉంది...పోనీలే..అనుకుందాం. మరి...ఎంతో నష్టపోతూ..జనం కోసమే జర్నలిజం చేస్తున్న...మన వేమూరి రాధాకృష్ణ సారు ఈ వార్తను ఐదో పేజీకి పంపారు. "బిగ్ బ్యాంగ్ సక్సెస్" అని శీర్షిక ఇచ్చారు. ఫుల్ ఇంగ్లిష్.

జనం ఎజెండా నా ఎజెండా అని ఒక 'ప్రత్యేక వ్యాసం' రాసిన వే.రా. "ప్రకటనల 'సాక్షి'గా వివక్ష" అన్న వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చొత్తారు. కాగ్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పై దాడి చేస్తూ...రాసిన ఆ వ్యాసరాజం స్థానంలో ఈ సైన్స్ వార్త వేయొచ్చు కదా! 'సాక్షి' ఏమైనా భిన్నంగా చేస్తుందని అనుకుంటే...అదీ నిరాశ పరిచింది. మూడో పేజీలో వార్త టాప్ లో ప్రముఖంగా ప్రచురించడం...ఈ కీలక ప్రయోగంలో పాల్గొన్న ఏలూరుకు చెందిన శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ ఫోటో వేయడం...గుడ్డిలో మెల్ల.


The Hindu ఈ వార్తకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. 'Big Bang machine' creates record collisions' అనే శీర్షికతో..."Could be seen as a giant leap for mankind, CERN chief" డెక్ తో వార్త ఇచ్చింది. 
"Scientists smashed sub-atomic particles into each other with record energy on Tuesday, aiming to recreate conditions just after the Big Bang that gave rise to the universe 13.7 billion years ago," అన్న లీడ్ వాక్యంతో ప్రారంభించింది. 


ఇలాంటి సైన్స్ వార్తలు సాధారణ జనాలకు ఏమి అర్ధం అవుతాయి?...అర్ధమయ్యే వార్తలే మొదటి పేజీలో వేస్తాం....అన్న పిచ్చి వాదన మన తెలుగు సంపాదకులు చేస్తారు. ఈ మహానుభావులకు అర్ధం అయ్యిందే వార్త. విజ్జ్ఞాన మైలురాళ్ళ గురించి అవగాహన లేక, వాటి ప్రాముఖ్యత గుర్తించలేక, ఆంగ్లంలో వచ్చే ఆ కాపీ లను సరళమైన తెలుగులో రాసే జనం లేక అన్ని పత్రికలూ సతమతమవుతున్నాయి. మిగిలిన పేపర్లు, ఛానెల్స్ ఈ అంశానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాయో చూడాలి.  

4 comments:

Saahitya Abhimaani said...

If such educative news is reported, who will give Advertisements.

The target of all media reformers should be the ADVETISEMENT MAFIA which is ruling the roost.

రవిచంద్ర said...

అర్థమయ్యే వార్తలే వేస్తామన్నది ఎంతటి పిచ్చి వాదనో చూడండి. జర్నలిజం ప్రజలతో మమేకమైన వృత్తి. కాబట్టి వారి కోసం కొరుకుడు పడని విషయాలను కూడా సంక్షిప్తంగానైనా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించాల్సిన బాధ్యత వారిపై ఉంది.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

బాగా చెప్పారు. Positive thinking పెంపొందించే వార్తలకు మన తెలుగు పత్రికలు ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చాంద్రయాన్ project చెయ్యాలా వద్దా అని ఒక చర్చ ఎప్పుడో The Week లో ప్రచురించారు. ఆ చర్చలో ఒక విషయము నన్ను ఆకట్టుకుంది. ఈ project వల్ల సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాకుండా మన సైన్స్ విద్యార్థులకు మంచి moral boost ఇస్తుందని ఒకరు చెప్పారు. (Space science మీద స్కూలు విద్యార్థుల్లో కొంత ఆసక్తి రేకెత్తించిందని నా అభిప్రాయం)Technical రంగంలో వున్న నాకు దాంట్లో ఎంతో నిజం వుందనిపించింది. పాఠకులు గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకోవటానికి, సాధించటానికి ఈ వార్తలు ఉపయోగపడాలి.అలా జరుగేలా మనమందరం కృషి చేద్దాము. మీకు అలాంటి ప్రణాళిక వుంటే చెప్పండి. నేను నా వంతు కృషి చేస్తాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇందులో మసాలా లేదు కదా.కాబట్టి వీళ్ళకి నచ్చి వుండదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి