Friday, March 5, 2010

జర్నలిస్టుల కోసం....ఆదివారం e-తెలుగు సమావేశం

కంప్యూటరులో, ప్రత్యేకించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల ముగిసిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం ఈ వర్కుషాపులలో ప్రధాన అంశం. కంప్యూటర్లతో ప్రత్యక్ష డిమాన్‍స్ట్రేషను చెయ్యడం ఈ వర్కుషాపుల్లో ఒక భాగం.

ఈ వర్కుషాపుల్లో భాగంగానే పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసాం.తేదీ, సమయం: 2010, మార్చి 7, ఆదివారం. ఉదయం 9:30 నుండి 12:30 వరకు.
స్థలం: Honeypot Career Campus
302 3rd Floor Vijaytha Classic Empire,
Above Bata Showroom 1st Floor,
Chaitanyapuri, Hyderabad - 500660
Phone No: 040-32990226, 040-30726688 
Moblie: 9396533666


సూచనలు


Land Mark : Beside ICICI Bank 
1 Km from Dilshuknager Bus stop on Highway  before Gaddiannram Market
Chaitanyapuri  (BusStop)

Map:
http://maps.google.com/maps?f=q&source=s_q&hl=en&geocode=&q=hyderabad&sll=36.527295,-95.712891&sspn=47.072136,78.134766&ie=UTF8&hq=&hnear=Hyderabad,+Andhra+Pradesh,+India&ll=17.368487,78.532387&spn=0.003461,0.006802&z=18&iwloc=A

ఆహ్వానితులు: పాత్రికేయులందరూ ఆహ్వానితులే.


కార్యక్రమాంశాలు:


    * కంప్యూటరులో తెలుగు: ఏ విధమైన సాఫ్టువేరుగానీ, ఫాంట్స్ గానీ, ఇతర ఉపకరణాలుగానీ కొనే అవసరమేమీ లేకుండానే కంప్యూటరులో తెలుగు వాడుకోగలిగే సౌకర్యాలు మీ కంప్యూటరులోనే ఉన్నాయి. అనేకమైన ఉపకరణాలు అంతర్జాలంలో ఉచితంగా లభిస్తున్నాయి. వీటికి సంబంధించిన అనేక విశేషాలను తెలియజేసే అంశం ఈ కార్యక్రమంలో ఒక భాగం.
    * యూనికోడు: విశ్వవ్యాప్తంగా యూనికోడు అనేది ప్రామాణిక కోడు. గతంలో వివిధ రకాలైన స్వంత క్యారెక్టరు ఎన్‍కోడింగులతో వెబ్‍సైట్లు ఏర్పాటు చేసుకున్న సంస్థలన్నీ ఇప్పుడు యూనికోడుకు మారిపోతున్నాయి.  అసలీ యూనికోడు ప్రాశస్త్యం ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజాలేమిటి? ఈ విశేషాలను తెలియజేసే అంశం ఈ కార్యక్రమంలో మరో భాగం.
    * అంతర్జాలంలో తెలుగు వెలుగు: అంతర్జాలంలో తెలుగు వేగంగా విస్తరిస్తోంది. తెలుగు కంటెంటు అనేక రూపాల్లో వెల్లివిరుస్తోంది. ఈమెయిళ్ళు, బ్లాగులు, వికీపీడియా, వార్తా వెబ్‍సైట్లు, అంతర్జాల పత్రికలు, యాహూ వంటి ప్రముఖ అంతర్జాతీయ పోర్టళ్ళు, గూగుల్ వంటి వెతుకులాట సైట్లు, సోషల్ నెట్‍వర్కింగ్ సైట్లు, వ్యక్తిగత వెబ్‍స్సైట్లు, ప్రభుత్వ వెబ్‍సైట్లు,.. ఇలా అనేక రకాల వెబ్‍సైట్లు ఇప్పుడు తెలుగులోనే వస్తున్నాయి. ఈ సైట్లు చాలావాటిలో కంటెంటు చదవడమే కాదు రాసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. స్వంత వెబ్‍సైట్లను, బ్లాగులను ఉచితంగా ఏర్పాటు చేసుకునే సౌకర్యం కూడా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంది. అలాగే రచయితలు తమ రచనలను వెబ్‍లోనే కాక, పుస్తకాలుగా ముద్రించుకునే సౌకర్యం కూడా లభ్యమౌతున్నది. వీటన్నిటి గురించిన వివరాలను ఈ విభాగంలో తెలియజేస్తాం.

పాత్రికేయులకు  ఉపయోగాలు: ఎదైనా విషయంపై  తక్షణమే వ్యాసం  వ్రాయటానికి (ఉదాహరణకు  ప్రముఖుని మరణం,వర్ధంతి, పుట్టిన రోజు, తిరుగుబాటు, సంప్రదింపు  వగైరాలు)  కావలసిన సమాచారానికై అంతర్జాలంలో తెలుగులో అన్వేషణ, పాఠకులు మరియు పాత్రికేయుల నుంచి తెలుగులో వ్యాసాలు అందుకొని   మార్పులు చేసి ప్రచురణకు పంపటం , తెలుగులో మీ స్వంత బ్లాగులు తయారు చేసుకోవటం, కానీ ఖర్చు లేకుండా, ప్రచురణకర్తల చుట్టూ  తిరిగే అవసరం లేకుండా   మీ పుస్తకాలు  మీరు ప్రచురించుకోగలగడం. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరపటానికి అవసరమయే మెళకువలు నేర్చుకోవటం.  కంప్యూటరులో తెలుగు వాడకానికి సంబంధించిన సందేహ నివృత్తి.  

3 comments:

Anonymous said...

ఇ-తెలుగు వారి కృషి అభినందనీయం. అది విజయవాడ వరకూ త్వరగా వ్యాపించాలని కోరుతున్నాను. పాత్రికేయులకు కంప్యూటర్ పాఠాలు నేర్పాలనుకోవడం చాలా మంచి ఆలోచన. మన వాళ్లల్లో ఇంకా కొత్త విషయాలు నేర్చుకొనే లక్షణం బతికి ఉందని ఆశిద్దాం..

cbrao said...

e-తెలుగు

Our web site:http://etelugu.org/
Contact us at: http://etelugu.org/contact

Telephone
e-తెలుగు: Secretary -Kasyap -93965 33666
e-తెలుగు: President -Veeven - 98664 95967
e తెలుగు: Treasurer -Chakravarti -94414 18139

రవిచంద్ర said...

ఇది చదివిన వాళ్ళు, మీకు తెలిసిన పాత్రికేయులను కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి