Thursday, November 25, 2010

స్పోర్ట్స్...పాలిటిక్స్...పిచ్చి మనుషులు-తిక్కలోళ్ళు.. కంతిరిగాళ్ళు

"దొంగ లంజకొడుకులసలే...మసలే...ఈ లోకం..." అని మహాకవి ఎందుకు అన్నాడో నాకు కాలేజ్ లెవెల్ లోనే అర్థమయ్యింది. నా పదేళ్ళ కొడుకుకు స్కూలు లెవెల్లోనే ఈ విషయం అర్థమయినందుకు బాధపడాలో, గర్వపడాలో నాకు తెలియడం లేదు. 'డాడీ...మేము ఆడకుండా వుండాలని టోర్నమెంట్ లేటు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు," అని తిరుపతి నుంచి వాడు ఫోన్ చేస్తే కాసేపు కాంగా ఉండిపోయాను. 'ఫిదెల్...మనుషులు అలానే ఉంటారు. ఇబ్బందులు పెట్టాలని చూస్తారు....దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ," అని చెప్పి సముదాయించాను.

తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో పాల్గొని, అటు నుంచి అటు బళ్ళారి లో జరిగే సీ.బీ.ఎస్.ఈ. క్లస్టర్ లెవెల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఈ నెల 21 న ఫిదెల్ తన టీం తో వెళ్ళాడు. రెండు విభాగాలలో U-14 జట్లకు తను కెప్టెన్. తప్పించుకోలేని పని ఒత్తిడి వల్ల నేను తనతో వెళ్ళలేదు. హైదరాబాద్ జిల్లా తరఫున పాల్గొన్న వాళ్ళ జట్టు టీం ఈవెంట్ లో విజేత అయ్యింది..తిరుపతిలో. వ్యక్తిగత విభాగాలలో పాల్గొంటే గానీ జాతీయ  పోటీలకు వెళ్ళలేరు. ఈ జట్టులోని ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా అందుకు అర్హత సాధిస్తారు. కాబట్టి...వీళ్ళ టీం క్లస్టర్ పోటీలకు బళ్ళారి వెళ్ళే హడావుడిలో వుందని తెలిసిన నిర్వాహకులు...వ్యక్తిగత విభాగంలో పోటీలు నిర్వహించకుండా ఆలస్యం చేశారు. సీ.బీ.ఎస్.ఈ.పోటీల కోసం వీళ్ళు బళ్ళారి బస్ ఎక్కాక పోటీలు నిర్వహించి తాము అనుకున్న కొందరు జాతీయ పోటీలకు వెళ్ళే ఏర్పాటు చేశారు. బళ్ళారి వెళ్ళే ముందు ఫిదెల్ ఫోన్ చేసి నాతో మాట్లాడాడన్న మాట. ఆటల్లో మనం వెనుక బడడానికి కారణం ఇలాంటి చెత్త, లేకి పాలిటిక్స్. స్కూల్ ఫెడరేషన్ కు, సీ.బీ.ఎస్.సీ.వాళ్లకు మధ్య ఒక అవగాహన ఉన్నా ఇలాంటి పరిస్థితి నివారించవచ్చు. 

మొత్తానికి తిరుపతిలో చేదునిజాలు చూసి....నిరాశపడి బళ్లారి చేరుకున్నాక...మావాడి భారతీయ విద్యా భవన్ జట్టు టైటిల్ సాధించింది. కర్నాటక సబ్-జూనియర్ నంబర్ వన్ ఆటగాడు వేదాంత్ ను ఫిదెల్... టీం ఈవెంట్ లో ఓడిచడం అక్కడ సంచలం సృష్టించింది. దాని వల్ల ఈ జట్టు తేలిగ్గా టైటిల్ గెలిచి జాతీయ పోటీలకు అర్హత సాధించింది. అక్కడ వ్యక్తిగత విభాగంలో ఫిదెల్ ఫైనల్ కు చేరుకున్నాడు. కానీ ఫైనల్ లో
వేదాంత్ చేతిలో ఓడిపోయాడు. అయినా...ఇది మంచి ఫలితమే అనిపించింది. తిరుపతిలో మిస్ అయినా...ఇప్పుడు వీళ్ళ జట్టు జాతీయ పోటీలకు వెళ్ళవచ్చట.

ఈ ఆటల కారణంగా ఈ మహాకవి మాటలను నేను చాలా సార్లు గుర్తు చేసుకున్నాను. ఈ మధ్య ఇది మరీ ఎక్కువయ్యింది. పత్రికల్లో చోటా మోటా ఫోటో, వార్త కోసం కక్కుర్తి పడే చెత్తగాళ్ళు, పొద్దున్న లేచిన దగ్గరి నుంచి అబద్ధాల మీదనే బతికే దుర్మార్గులు, భజన చేసిన వారు మంచివారు...చేయనివారు చెడ్డవారు... అని నమ్మే అమాయకపు బేలమనుషులు, తలమీద వెయ్యి రూపాయల నోటు పెడితే అర్థరూపాయకైనా అమ్ముడుపోని తిక్కల వెధవలు కనిపిస్తున్నారు ఈ క్రీడాబరిలో.  బాడ్మింటన్ ను ప్రాణంగా భావించి స్వశక్తితో యూనివెర్సిటీ స్థాయి దాకా వచ్చి...ఇలాంటి ఒకరిద్దరు దగుల్బాజీగాళ్ళ వల్ల కెరీర్ కోల్పోయిన నేను...ఫిదెల్ విషయంలో ప్రయోగం చేసే స్థితిలో లేను. ఆటలకు అడుగడుగునా అడ్డంవస్తున్నవాళ్లకు ఎలాంటి శిక్ష ఇవ్వాలో చిన్నపాటి నుంచే ఒక ఐడియా వుంది. మనం వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తున్నది చాలాసార్లు. వీళ్ళు శ్రీ శ్రీ అన్నట్లు 'దొంగ లంజకొడుకులు" కాదు. పాపం...ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో,  తమ చర్యలు ఆటగాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని అమాయకులు. ఈ ఏడాదికి వీరిని క్షమించడం మంచిదేమో....చూద్దాం.
టేక్ ఇట్ ఈజీ.  
(నోట్- ఇంకొక గమ్మత్తైన విషయం గమనించాను. ఈ బ్లాగులో ఆటల గురించి, ఆటల్లో ఆదిమ మానవుల గురించి రాస్తే...అది తమ గురించే అనుకుని లోలోపల కుళ్లిపోయే సెక్షను ఒకటి తయారయ్యింది నాకు. నేను ఇన్నాళ్ళు క్రీడా పోషకుడు అనుకుంటూ గౌరవిస్తున్న ఒకాయన...ఆ విషయం నాతో అనకుండా...నాకు తెలిసిన వారి దగ్గర, మా వాడి కోచుల దగ్గర వాపోతున్నాడు. ఇలాంటి వాళ్లకు, ఇంకొన్ని పిల్ల కాకులకు చెప్పేది ఒక్కటే...మనం ఎవడికీ జంకం, బెదరం. కంతిరి రాజకీయాలు తెలియక కాదు, సత్యం జయిస్తుందని నమ్ముతూ మిన్నకుంటున్నాం. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. కంటికి కన్ను...పంటికి పన్ను...అని మనం అనుకుంటే....అది పెద్ద విషయం కాదు.)

12 comments:

Unknown said...

నమస్తే రాము గారు. నేను మీ బ్లాగు ని నేను రెగ్యులర్ గా చుస్తూంటాను.
గడ్డి తెనె ఎధవ నాయాళ్ళు మరారు.
గంగ్రాట్స్ టూ ఫిదెల్

astrojoyd said...

nice retart

Raja said...

congrats to Fidel for his win in bellary...!


Lanja Kodukulu,Sadist munda kodukulu anni fields lo untaru, sports is not an exception.


Raja

Vinay Datta said...

congratulations to Fidel, yourself and Hema garu.

Anonymous said...

చెడు వినకు, కనకు, అనకు........ఇది నిన్నటి సామెత. ఒకప్పటి పిచ్చి మారాజుల కాలంలో, ఉన్నది ఉన్నట్లు ముఖం మీద మాట్లాడే వాళ్ళూ, అలా మాట్లాడడాన్ని హర్షించే మహానుభావులూ ఉన్న ఆ కాలంలో, శత్రువుతో పోరాడాలనుకున్నా ఎదురు బొదురుగా ముఖా ముఖీ తేల్చుకునే మగధీరులూ ఉన్న నాటిరోజుల్లో ఆ సూక్తి అక్షర సత్యం. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమనే సూక్తి కూడా ఇదే కోవలోకి వస్తుంది. నిజంగా నేడు అలా ఎవరైనా రెండో చెంప చూపితే అవతలివాడు చేతులెత్తి దండంపెట్టి వెళ్ళిపోతాడా? ఖచ్చితంగా ఆ చెంపా ఈ చెంపా పగలగొడుతూనే ఉంటాడు. ఇదీ నేటి కలికాలపు వైచిత్రి!
మనలాంటివాళ్ళందరూ నాకెందుకులే అనుకుని చెడు వినకుండా, కనకుండా, ఇది చెడూ అని అనకుండా మన మానాన మనo కళ్ళూ, చెవులూ, నోరూ మూసుకొని ఊరుకుంటే ఈ ప్రబుద్ధులు మరింతగా రెచ్చిపోయి తమ తప్పుడు పనులు నిర్విఘ్నంగా, నిస్సిగ్గుగా చేసుకుంటూ పోతారు. అందుకే నేనంటాను "చెడు విను, కను, అను(ఇది చెడూ అని)" ఇదే నేటి పరిస్థితులకు సరిపోయే సామెత. కాదంటారా? ఈ దొంగ ........కొడుకులపై మీ/ మన పోరాటాన్ని కొనసాగిద్దాం. Don't get disappointed. Fidel will get whatever he deserves. Coz, he is son of Ramu and he knows well how to pave his own way to SUCCESS. My hearty congrats to u & Snehit(Fidel).

kvramana said...

anna
i am waiting for a post on this blog about the A Raja tapes involving Nira Radia, A Raja, Barkha Dutt and Vir Sanghvi. Surprisingly, almost all the so called national TV channels ganged up and blacked out the tapes. Not a single channel either tried to show the tapes or talk to 'award winning' journalists to tell the truth. Why don't you give it a try in the interest of free and fearless press.
K V Ramana

Ramu S said...

Ramana bhai
I request you to write a piece on it. I'll mail you an article on it.
Thanks
Ramu

Ramu S said...

here is a website where you get the full truth behind the 2G Scam...with all CBI Documents...

http://indiasreport.com/magazine/data/the-radia-papers-raja-tata-ambani-connection/

Thirmal Reddy said...

Kudos to Fidel. Way to go. He's learning the truth in life albeit in a harder route.

@Ramu
Sir jee, the same website you mentioned in your earlier post has a phone con-script of the controversial conversation between Nira Radia and an unknown middle man. Here it is.
http://indiasreport.com/magazine/data/radia-tapes-corporate-bureaucrat-politician-nexus-the-n-k-singh-connection/

It reveals some unethical lobbyists who are under a media camouflage as journalists. Disgrace at its heights.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Ramu S said...

Tirumal...
Thanks boss..
Cheers
Ramu

Lathanjal said...

రాము సర్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో మీ బ్లాగుకు అవార్డుకు ఎంపికైనందుకు ముందుగా నా శుభాకాంక్షలు..

Unknown said...

Ramu sir,

congratulations for the laadli media award for best blog


if it is the first telugu blog to win an award then it is end of the beginning of electronic media

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి