Wednesday, June 1, 2011

ఫ్లోరోసిస్ పైన HM-TV యుద్ధం

నల్గొండ తదితర జిల్లాలలో లక్షల మంది వెన్నువిరిచి జీవచ్ఛవాలను చేసిన ఫ్లోరోసిస్ పైన HM-TV యుద్ధం ప్రకటించింది. గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం లో భాగంగా ఈ చానెల్ పలు కార్యక్రమాలు రూపొందించింది. గడిచిన శుక్రవారం నాడు...నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి లో జరిగిన కార్యక్రమంలో గద్దర్, డాక్టర్ రాజిరెడ్డి, దుస్చర్ల సత్యనారాయణ, చానెల్ చీఫ్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గార్లతో కలిసి నేను కూడా పాల్గొన్నాను. ఇది ఒక చారిత్రిక ఘటనగా నాకు అనిపించింది. చానెల్ వారి ఈ ఇనీషియేటివ్ మీద త్వరలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ రాస్తాను.

ఈ సమస్యపైన నాకు కొంత అవగాహన ఉండబట్టి, సమస్య పరిష్కారంలో ప్రజా ప్రతినిదుల, ప్రభుత్వాల పాత్రపైన నాకు అసహ్యం వుంది కాబట్టి...నేను కూడా రాజా రెడ్డి, మూర్తి గారితో పాటు వెళ్లాను. అక్కడ ప్రదర్శనలో పాల్గొని గద్దరన్న అప్పటికప్పుడు కట్టిన పాటకు తాళం వేసాను. దాని తాలూకు రెండు ఫోటోలు ఇవి. గద్దర్ మాట్లాడుతున్న వ్యక్తి...సత్యనారాయణ గారు. ఒకప్పటి బ్యాంకు అధికారి అయిన ఆయన లేకపోతె...ఇప్పుడు నల్గొండ కు కృష్ణ నీళ్ళు వచ్చేవి కావు. ఈ సందర్భంగా ఈ సమస్య గురించి, ప్రజా సమస్యలు-మీడియా పాత్రపై మూర్తిగారి ప్రసంగం వింటే...మనం ఇంకొన్ని ఏళ్ళు యాక్టివ్ జర్నలిజం లో వుంది వుంటే బాగుండేది...ఇలాంటి జర్నలిజం చేయడానికి వీలు వుండేది అని పలుమార్లు అనిపించింది.
ఇక్కడ వున్నవి...నేను ఒక అమెరికన్ వెబ్ సైట్ కు రాసిన స్టోరీలు.

నోట్: నా మొబైల్ ఫోన్ లో తీసినందున ఫోటోల నాణ్యత బాగోలేదు. క్షమించాలి.

14 comments:

Anonymous said...

అదేంటన్నయ్యా, మీ ట్యాగ్ లైనె "నైతిక జర్నలిజమే ద్యేయంగా" లో నైతిక మాత్రమే కనిపిస్తోందిప్పుడు:)

muralirkishna said...

ram gaaru deeni meeda merugaina samjam kosam krushi chese channel eppudo uddam chesinidi..konchem swami bakthi taggiste baavuntundemoo kadaa...tv9 eppdudo deeni meeda poradindi and valla meeda enno karyakramaalu chesindi..memu chestunnamu anandi manam Maatrame chestunnamu anatam baaledu

koteswar said...

baabooo murali krishna, tv 9 chesindi 2004 tarvatha kadaa... anthaku mundey 2002 lo teja tv deeni py regular bulletin lalo series of stories ichindi marichaavaa? identi baasooo, aa vishayam cheppavenduku? teja stories valley kadaa sagar amr project ni tdp government tondaragaa purthi chesindi,,idi nijam kaadaaa? 2002 komatireddy venkat reddy hunger strike ni marichaava...florin baadhitha villages ki drinking water 2004 ki mundey sagar project nundi ivvadam nijam kaadaaa.. ayinaa florosois badhitullo 2002 ki 2011 ki choopinchey manushulu yemynaa maaaraaraa? manushulu vaalley.... stories avey... channel maathram verey-- memey mundu chesaamani, problem solve chesaamani 2004 tarvatha tv9 cheppu kovedamey tappu.. ippudu hm tv ni nuvvu tappu padutunnaavu ? hm tv varu problem py poradutunnaaru.. hm tv varu tv9 laagaa goppalu cheppukovadam ledu .. veilithey abhinandinchu brotheroo.. tv9 ki chemcha laa matladaku..

koteswar said...

baaboo muralikrishna.. bahusha nuvvu tv9 nundey idi pampavanukunta. tv9 puttindi 2004 lo kada.. idi nijamey kada..anthaku 2yrs mundey teja tv news bulletins lo nalgonda florin problem py series of stories nadipindi. kavalantey nuvvu thota bhavanarayana ni adugu. sarigga appudey, ippati minister komati reddy venkat reddy one week hunger strike chesadu. kavalantey manthri ni adugu. teja tv stories - komati reddy hunger strike tho spandinchina tdp government sagar amr project ni warfooting lo complete chesindi.2004 ki mundey florin badhitha villages ki drinking water supply start chesindi. kaavalantey history chaduvu.inka kavalantey florin victims ki 147 crores spl project sanction chesina appati panchayath raj manthri nagam janardhan reddy ni adugu..nalgonda florin stories memey veluguloki techamani tv9 cheppukovadamey tappu, problem solve chesamani cheppadam inka tappu. ayina 2002 ki 2011ki badhitha manushulu gaa okariney chooputunnaru. manushulu maraledu-stories maraledu-channels marayi.tv9 laga hmtv goppalu cheppu kovadam ledu.samasya py fighting modalu pettindi. dinilo randhranveshna cheyaku brotheroo. veelythey hm tv ni appreciate cheyi

muralirkishna said...

koteswer avesapadaku nenu tv9 avuno kaado kaani nuvvu maatram HMTV chemchaala maatladutunanvu ani maatram nee dabba chooste ardham avutundi..ainaa..kandaku leni durda kattipeetaku annatlu nuvvu enduku avesapadtunavu ..nuv emanna ram ki tokaaa ..madni daa sarigga naadi adeparisthi..kabattai naaku emi ibbandi ledu teja tv ni pogadaataaniki ..machi evaru chesina manchee ..kaani HMtv ye antaa chesindi ante tappu

srikanth said...

స్వాతంత్ర్యం వచ్చి అర్ధ శతాబ్ధం మీద అర్థ దశాబ్ధం దాటినా కనీస తాగు నీరు కల్పించలేని దుస్థితి లో ఉన్నాము ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనం. నల్గొండ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తరాలకు తరాలు నడుములు విరిగి మూలన పడుతున్నా పాలకులు పట్టించుకోరు. ప్రపంచం లో ఎక్కడ ఏ అనర్థం జరిగిన విరివిగా స్పందించే సాటి సమైక్య వాదులు పట్టించుకోరు.

అక్కడ పుట్టడమే వాళ్ళు చేసిన నేరం అనుకుని కుమిలిపోతూ జీవచ్ఛవాలుగా బతకడమే వారికి మిగిలింది. ఇక ఏ టీవీ ముందు అని వదులాడుకునే బదులు ఎంత వరకు సమస్య ని పరిష్కరించాం అన్నది ముఖ్యం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి అతను దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరిన్ బాధితుల కోసం బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చేసిన ఆయన అభినందనీయుడు.

ఇక ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఉన్న పది తెలంగాణా జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా మరియు రాష్ట్ర రాజకీయాలలో నిత్య రాజకీయం నెరిపే జానా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటి రెడ్డి సోదరులు, మొత్కుపల్లి, జులకంటి రంగారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉప్పునూతల, పాల్వాయి పురుషోత్తం రెడ్డి తదితర తలలు పండిన వాళ్ళంతా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లే అంటే వాళ్ళ కన్నా చూస్తున్న వాళ్ళకే ఎక్కువ సిగ్గుగా ఉంటుంది.

Bendalam KrishnaRao said...

saamajika badhyatha antee idee..migilina media samsthalu HMTV ni chuusi kallu theravaali..

- Krishna, Srikakulam

NEWS ARTICLES said...

వారు ముందు చేశారు... వీరు ఇప్పుడు చేస్తున్నారు అని వాదించుకునేకంటే... ఎవరు ఫ్లోరైడ్‌పై పోరాటం చేసినా అభినందించడం మన బాధ్యత. ఫ్లోరోసిస్‌పై తేజ, టీవీ9 పోరాటం వల్ల కొంతమందికైనా లాభం కలిగే ఉంటుంది. అలాగే హెచ్‌ఎంటీవీ పోరాటం ఇంకొంత మందికి ఉపయోగపడాలని కోరుకుందాం. న్యూస్ ఛానల్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం

Ramu S said...

Chaakirevuji...
Well said. చాలా మంచి మాట చెప్పారు. సమస్య పూర్తిగా పొయ్యేవరకూ అన్ని ఛానల్స్ దీని మీద ఉద్యమం నడపడం ఎంతైనా అవసరం. తొక్కలో పోటీ ఎందుకో అర్ధం కావడం లేదు. అప్పట్లో రవి ప్రకాశ్ గారు చేసిన ఉద్యమం కూడా తక్కువేమీ కాదు. అది చాలా మంచి పోరాటం. టీవీ..నైన్ వారిలాగా హంస టీవీ వారి ఉద్యమం చల్లారకుండా ఉండాలని నేనూ కోరుకుంటున్నాను.
రాము

SANTOSH THIPPARAJU said...

hmtv పోరాటానికి అందరం సంఘీభావం తెలుపుదాం...
ప్రయత్నిద్దాం.. ప్రగతి సాధిద్దాం.
ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొడుదాం.
పాలకులు చేయలేనిది... పాలితులుగా మనం చేసి చూపిద్దాం
రండి చేయి కలపండి..

SANTOSH THIPPARAJU said...

నల్గొండ జిల్లా... మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో.. ఉద్యమాలకు ఊపిరి పోసిన ఖిల్లా. ఎంతో ఘన చరిత్ర కలిగిన నల్గొండ జిల్లా అందమైన ముఖంపై నల్లని ఫ్లోరోసిస్ మచ్చ. దీని గురించి... తెలియని వారికి.. అనుభవించని వారికి ఏ మాత్రం అర్థం కాని వేదన. కొన్నేళ్ల నుంచి పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న ఒకానొక భయంకరమైన సమస్య. అందుకే సమస్య శాశ్వత పరిష్కారానికి హెచ్‌ఎంటీవీ... జలసాధన సమితి, ఫిఫ్త్‌ పిల్లర్‌తో కలసి మరోసారి నడుంబిగించింది. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో విముక్తి పోరాటం కొనసాగిస్తోంది. జలం హాలాహలమని తెలిసినా... ప్రాణాధారం కోసం తాగుతున్న వారితో కలసి ఉద్యమానికి రూపకల్పన చేసింది.

SANTOSH THIPPARAJU said...

తెలంగాణ సాయుధపోరాటానికి నాంది పలికిన ఖిల్లా నల్లగొండ జిల్లా. దేశ్‌ముఖ్ దొరలను తరిమికొట్టిన నేలగా చరిత్రకెక్కిన ప్రాంతమది. ఇంతటి ఘనచరత్ర ఉన్న నేల నుంచి పుట్టిన విషం ... ఆనేక మందిని పీల్చి పిప్పిచేస్తోంది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా నల్లగొండ. పక్కనే గలగలపారే కృష్ణమ్మ.. మరోపక్క కాలుష్యపు విషపుటంచులతో పారే మూసీనది. చుట్టూ నీరున్నా... మంచినీరు తాగడమే దుర్భరమైన స్థితి వారిది. 40 ఏళ్ళ వయస్సున్న వారూ చిన్నపిల్లలే. నడవాలంటే ఊతకర్ర ఉండాల్సిందే. తల్లి పాలలో ఫ్లోరైడ్... గేదె పాలలో ఫ్లోరైడ్.. పండించిన పంటలో ఫ్లోరైడ్... అంతెందుకు కన్నీళ్లలో కూడా ఫ్లోరైడ్. ఎటు చూసినా ప్లోరైడే... దీనికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు?

SANTOSH THIPPARAJU said...

శ్రీశైలం, నాగార్జునసాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల తరువాత.. వాటి ప్రభావం ఈ జిల్లాపై స్పష్టంగా పడింది. నల్లగొండ జిల్లాకు సంబంధించిన భూములలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పుల ద్వారానే నీరు కలుషితమై.. అంతా ఫ్లోరిన్ మయమైపోయిందన్నది వాదన. అయితే పర్యావరణ శాఖ.. జిల్లాపై వీటి ప్రభావం స్పష్టంగా ఉంటుందని అప్పట్లోనే చెప్పింది. అయినా పాలకులు దానిని మరిచారు... ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. ఫ్లోరైడ్‌ను 1937లోనే గుర్తించినా సమస్యపై తొలుత ఉద్యమం రూపుదాల్చింది 1979లో. దానికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి టంగూటూరి అంజయ్య జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీరు అందించేందుకు సొరంగ మార్గానికి శంకుస్ధాపన చేశారు.. పనులు మూడేళ్ళలో పూర్తి చేస్తామన్నారు. కానీ జరుగలేదు. ఆ తరువాత ఎన్టీ రామారావు దానికే 1983లో తిరిగి శంకుస్ధాపన చేశారు.. మూడేళ్ళలో పనులు పూర్తిచేస్తామని ఆయనా చెప్పారు. అదీ నీటిమూటగానే మిగిలిపోయింది. 1987 ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు. అదీ రూపుదాల్చేలేదు. 1988లో దీని నిర్మాణం చేపట్టడం కష్టమైన పనని ..ఇప్పట్లో వీలు కాదని చేతులెత్తేసారు. ఇలా అయితే సాధించలేమనుకున్న జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1992_93లో కలెక్టరెట్ వద్ద ఆరు నెలల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేపట్టింది. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి విజయభాస్కర్‌రెడ్డి ‌ప్రభుత్వం మూడేళ్లలో హామీలను నేరవేరుస్తామని చెప్పింది.. అదీ జరుగలేదు.. 1992 నుంచి జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యపై చేయని ఉద్యమంలేదు. ఎక్కని గడపాలేదు. చివరకు ఫ్లోరైడ్ బాధితులు 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మాస్ నామినేషన్ వేసి 480 మంది పోటీలో నిలబడ్డారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదైన బ్యాలెట్ ఎన్నిక. అయినా తమ ఆవేదన.. తమ లక్ష్యం నెరవేలేదు.. ప్రధానమంత్రులను కలిశారు. రాష్ట్రపతులను కలిశారు. ఐక్యరాజ్యసమితికి విన్నవించారు.. అయినా ఫలితం శూన్యం. ఇక స్వచ్చంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు చెబుతున్న లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 950 గ్రామాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను గుర్తించారు వారు. 70 వేల మంది ప్లోరైడ్‌తో అంగవైకల్యం కలిగిఉండటం. 7 లక్షల మంది దంత సమస్యలతో బాధపడుతున్నారని 2001 ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. ఫ్లోరైడ్‌ను పూర్తిగా తరిమికొట్టాలంటే ఉపరితలంగా ఉన్న కాలువలు.. నదుల ద్వారా నీరు అందించడమే పరిష్కారమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. దేవాదుల, ,శ్రీశైలం సొరంగ మార్గం నుంచి, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా తాగునీరందించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Revelli said...

This problem has been there for ages...so much was written, telecast, fought over it and the process has not stopped nor will it in near future for the simple fact that we are too far way from solving it.
Campaigns by HMTV or TV9 or any other media house will only act as amplifiers to what is happening on the ground - unfortunately not much seems to be happening. Not that nothing has happened...there have been efforts to ensure safe drinking water on earlier occasions. Somehow, the efforts appear to have not miblised/involved the people concerned. Water treatment plants were set up at a few places sometime ago. Sadly, there was no mechanism to ensure the functioning of those plants and now even if someone does get water from them it would only be more dangerous for there would be more rust than water.
What is needed is a collaborative effort - this phrase sounds pretty attractive and difficult to achieve!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి