Saturday, June 2, 2012

సగంతృప్తితో ఐ.ఎస్.జే.కు రాం..రాం..


తెలుగు నేల మీద జర్నలిజం స్కూల్ నడపడం చాలా కష్టం. అన్ని మీడియా సంస్థలు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తుంటే...ఫీజులు వసూలు చేసి స్కూల్ నడపడం కష్టం. అందుకేనేమో...రామానుజం గారు కపిల్ గ్రూప్ వారి ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజాన్ని మొదలు పెట్టి...ఫస్ట్ బ్యాచ్ తయారు కాకముందే పారిపోయారు. స్కూలు ఆరంభంలో నన్ను పట్టించుకోని రామచంద్ర మూర్తి గారు...స్కూల్ నడపమని నన్ను కోరారు రెండేళ్ళ కిందట. అక్కడ చేరాక అర్థమయ్యింది జర్నలిజం స్కూల్ ను నడపడం చాలా కష్టమని. నేను సెకండ్ చాయిస్ కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సింది లేదు. 

నా అంత తురుంఖాన్ జర్నలిస్టు లేడని రోజూ విర్ర వీగే జర్నలిస్టులతో....ఇవ్వాల్టి మాటను ఎల్లుండికి మార్చిపారేసే పెద్ద మనుషులతో వేగడం కష్టం. అయినా.....ఏదో చేయాలన్న తపన, మన అవసరం దృష్ట్యా మొత్తం మీద మూడు బ్యాచులు నడిపాం. పిల్లలను సాధ్యమైనంత బాగా తీర్చిదిద్దాం. పేపర్లలో ప్రకటనలకు అప్పటికే రామానుజం గారు చాలా ఖర్చు పెట్టారని, ఇక మీదట యాడ్స్ లేకుండానే బండి లాంగించాలని మూర్తి గారు విషమ పరీక్ష పెట్టారు. మొదట్లో హెచ్.ఎం.టీ.వీ, తర్వాత ద హన్స్ ఇండియా ల లో ప్రకటనలు వేసి సరైన స్పందన రాక నానా చావు చచ్చాను. వేరే టీం అయితే స్కూల్ బాగు పడుతుందేమో నేను మార్చ్ లో రాజీనామా పత్రం సమర్పించి జూన్ ఫస్టున బాధ్యతల నుంచి వైదొలగాను. కాస్త ఖర్చు చేసి నడిపితే....నిజానికి దీన్ని బాగా తీర్చి దిద్దవచ్చునని కపిల్ గ్రూప్ ఛైర్మన్ వామన రావు గారికి కూడా చెప్పాను. కానీ...రెండు సంస్థలు నష్టాలలో ఉన్నందున తాత్కాలికంగా ఐ.ఎస్.జే.ను మూసివేశారు. అదొక్కటే బాధ కలిగించే విషయం. అయినా....మూర్తి గారు త్వరలోనే మళ్ళీ దీన్ని తెరుస్తారని అనుకుంటున్నాను. 

నేను విజిటింగ్ ఫాకల్టీ గా ఉన్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలకు తీసిపోని విధంగా ఇక్కడ పిల్లలను తయారు చేసాం. అదొక తృప్తి. నిన్న ఆఫీసుకు వెళ్లి...అన్ని లాంఛనాలను పూర్తిచేసుకుని, మూర్తి గారిని కడసారి కలిసి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలిపి బైటికి వచ్చాను. కాసేపట్లో వస్తామనగా వామన రావు గారు కనిపించారు. ఆయనకూ ఒక మాట చెప్పి వచ్చాను. మూర్తి గారి లాంటి ఎడిటర్ దగ్గర పనిచేయడం బాగుంటుందని...Osmania University, Administrative Staff College of India లలో మంచి అసైన్మెంట్లను వదిలి ఐ.ఎస్.జే.లో చేరిన నాకు  అక్కడ అద్భుతమైనదిగా అనిపించిన అంశం ఒకటి ఉంది. అదే...వందల కోట్ల విలువ చేసే కపిల్ గ్రూప్ ఛైర్మన్ వామన రావు గారి simplicity. ఆయన నడవడిక, ఇతరులతో మాట్లాడే తీరు, ఇతరులకు ఇచ్చే గౌరవం...నిజంగా అద్భుతం. ఐ.ఎస్.జే. లో నేను నేర్చుకున్న పాఠం....ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. Hats off to Vamana Rao garu. 

చెపితే...ఎచ్చులు అనుకుంటారు గానీ సరదాకు ఒక విషయం చెప్పాలి. నేను ఐ.ఎస్.జే.లో చేరిన కొన్ని రోజులకే హెచ్.ఎం.టీ.వీ. టాం రేటింగ్స్ లో మూడో స్థానానికి చేరుకుంది. సార్...మీది గోల్డెన్ లెగ్...అని ఒక ఉద్యోగి అంటే...'ఆపు నీ చాదస్తం' అని నేను రెండేళ్ళ కిందట మందలించాను. నిన్న ఫోన్ చిప్ ఇచ్చే ముందు చూసుకుంటే...టాం రేటింగ్స్ తాజా ఫలితాలు వచ్చాయి. అందులో హెచ్.ఎం.టీ.వీ. అన్నిటికన్నా చివరి స్థానం లో ఉండని లెక్కలు చెబుతున్నాయి. నిన్నకాక మొన్న పుట్టిన V6 ఛానల్ కన్నా హెచ్.ఎం.టీ.వీ. పరిస్థితి గణనీయంగా దిగజారడం బాధ కలిగించింది. జగన్ భజన మాని....ఈ చానల్ ఎప్పటిలాగా నైతిక జర్నలిజానికి పెద్ద పీట వేస్తుందని ఆశిస్తాను. ఎంతో ఉత్సాహంతో నమ్మకముంచి వామన రావు గారు పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తున్నాను.  
------
నోట్: నేను ఎల్లుండి నుంచి కలకత్తా లో ఒక పది రోజులు వుంటాను. అక్కడ నివసిస్తున్న తెలుగు బ్లాగర్స్ ఎవరైనా ఉంటే...నాకు మెయిల్ పంపండి. సరదాగా అక్కడ కలుద్దాం.

7 comments:

katta jayaprakash said...

It is a known fact that the ratings of hmtv gone down.Why this happened when it got good ratings earlier?Where di Ramchndra Murthy wrong? As per inner circles there are people in hmtv who are after money and harass the reporters to get more money through corruption and other illegal means and RC Murthy has become slave with these people and hence he is silent.I it is tiure what a fall down of RC MUrthy from his past dasha to the present disha!Hope he realises the situation and act accordingly.

JP.

Anonymous said...

can we know link to see the latest TAM ratings

నరేష్ నందం (Naresh Nandam) said...

రామ్ గారూ, కొన్ని వేలమంది జర్నలిస్టులకు మూర్తిగారు ఎప్పటికీ ఆదర్శమే. హెచ్.ఎం.టివి కోసం ఆయన కొన్ని వడపోతల తర్వాత ఏరికోరి సెలెక్ట్ చేసుకున్న ట్రైనింగ్ టీమ్‍లో మెంబర్ అయినందుకు నాలాంటి మరో 40మంది ఇప్పటికీ గర్వపడుతున్నాం.
ఒక 24గంటల న్యూస్ చానెల్‍కు సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎడిటర్‍గా బాధ్యతలు నిర్వహించటం ఈజీ కాదు. అప్పటికే హెల్త్ బాగోకపోయినా వామనరావు గారి ప్రోద్బలంతో ఆయన మరో బాధ్యతను తలకెత్తుకున్నారు. అదే ఐఎస్‍జె. ఆ తర్వాత హన్స్ ఇండియా.
నా అవగాహన మేరకు.. రామానుజం గారు ముందుగానే తప్పుకున్నప్పటికీ, మీ ఆధ్వర్యంలో ఐఎస్‍జె బాగా నడుస్తుందనే నమ్మకం అందరికీ ఉందనుకుంటాను. కానీ, ప్రస్తుతం వస్తున్న కొత్త చానెళ్లన్నీ తమ టీమ్‍కు తామే ట్రైనింగ్ ఇచ్చుకోవటం, ఐఎస్‍జెలో కోర్సు ఫీజు భారీగా ఉండటం (దేశంలోని ఇతర సంస్థల్లాగే క్వాలిటీ జర్నలిస్టులను తయారుచేయాలంటే ఆమాత్రం తీసుకోక తప్పదనుకుంటాను) వంటివి ఐఎస్‍జె బాలారిష్టాలను దాటలేకపోవటానికి కారణాలు కావచ్చు. మీరు కూడా బాగా కష్టపడినప్పటికి కొంత నిరుత్సాహం చెందినట్లు కనిపిస్తోంది.

హెచ్.ఎం.టివిలో రకరకాల మనస్తత్వ మనుషులున్నారు. వారందరితో పనిచేయటమంటే.. ఇక ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల నేర్పు, ఓర్పు సాధించటమే.

హైదరాబాద్ మీడియా హౌస్‍లో మీ అనుభవాలను ఇలాగే నిస్సంకోచంగా ఇకముందు పంచుకుంటారని ఆశిస్తూ...
ALL THE BEST FOR YOUR FUTURE ENDEAVORS!

Unknown said...

Yes Ramu Garu,

I'm observing that, these days Hans India, HMTV writing some pro-jagan articles.. donno exact reason....

sree said...

రాం గారూ...
హెచ్ ఎం టివికి మీరెప్పుడు రాం రాం అన్నారో అస్సలు తెలీలేదు సార్......... మేమక్కడే పనిచేస్తున్నా తెలీని విషయాలు ఎన్నో ఉంటున్నాయి. అది మా అదృష్టమనుకోండి. సార్ మరి భవిష్యత్ కర్తవ్యం ఏమిటి? కలకత్తానుంచి తిరిగి వచ్చాకా ఏం అద్భుతాలు సృష్టించబోతున్నారు?

MUDALVAN said...

wage board prakaram ivvalsina arrearsni eggottadaniki ramoji newstodayni moosesi nashtallo unna ushodayaloki andarini marchi santakalu teesukunnadu..ee vishayanni bloglo detailedga rayandi
kottaga paper pettinavallu,,,,nashtallo unnavaallu arears ivvakkaraledani telisindi nijamenaaa....

Unknown said...

sorry

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి