Sunday, July 22, 2012

అటు రెడ్ల అండా...ఇటు క్రైస్తవ దండా...


నిన్న ఒక పని మీద నల్గొండ వెళ్లాను. అక్కడ పలువురితో మాట్లాడితే అర్థమయ్యింది ఏమిటంటే...జగన్ మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని. జనంలో ఆయన తండ్రి మీద సానుభూతి ఉంది. సోనియా గ్యాంగ్ అక్కడ, బొత్స బాబు టీము ఇక్కడ సరిగా వ్యవహరించకపోవడం వల్ల, సీ.బీ.ఐ.లక్ష్మినారాయణ గారి అతి వల్ల జగన్ బాబుకు కాలం కలిసి వచ్చే అవకాశం ఉండని నాకు అర్థమయ్యింది. పైగా చంద్రబాబు ను అమాంతం ఎత్తి సీ.ఎం.సీటు మీద కూర్చోపెట్టాలన్న కమ్మ ఛానెల్స్ వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల కూడా జగన్ కు మేలు చేసే అంశం.  

మతం సున్నితమైన అంశం కాబట్టి లోతుగా చర్చించుకోవడం కుదరదు గానీ...వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించి మంచి పనిచేసింది. ఈ విధంగా రెండు మేళ్ళు 
జరుగుతున్నాయి. పేరు చివర్న 'రెడ్డి' అని ఉండడం వల్ల...ఆ కులస్థులు...'మనోడు' అనుకుని కాలర్లు ఎగరేస్తారు. ఎగరేసారు...ఎగరేస్తున్నారు. ఆ కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించింది కాబట్టి ఆ మతం లో ఉన్న వారు కూడా ఆదరిస్తారు, ఆదరిస్తున్నారు. రెడ్లు, క్రైస్తవులు మాంచి ఓటు బ్యాంకు గా మారి ఆ కుటుంబానికి మేలు చేసేందుకు సిద్ధంగా వున్నారని నాకు అర్థమయ్యింది. డబల్ ధమాకా అంతే ఇదే మరి. ఇవేమీ తెలియక...కే.ఏ.పాల్ లాంటి ప్రచారకులు తెగ రెచ్చిపోయి దొరికిపోతున్నారు. తను కూడా..పాల్ రెడ్డి అని పెట్టుకుని ఉంటే...బాగుండేదేమో.  

మతం ఒక మత్తు..కులం ఒక గజ్జి...అనుకుంటుంటే...ఆ మత్తును, ఈ గజ్జిని అంటించుకుని రెంటి వల్లా ప్రయోజనం పొందుతున్న తెలివిగల సెక్షన్ ను చూస్తుంటే...నవ్వాలో ఏడవాలో తెలియదు. వీళ్ళను వీళ్ళ మనసులు ప్రశ్నించవా? ఏమో...ఆ దేముడికే తెలియాలి. ఆమెన్.

15 comments:

GMR said...

ramu garu make eesari pakka ga ardam iena vishyam emitante meeru ysr party ani....

durgeswara said...

ఇంకొక అనుమానం కూడా ఉందిలెండి. దేశాన్నిమాతాంతరీకరించాలన్ని సంకల్పంతో పనిచేస్తున్న శక్తులు ప్కడ్బందీగా అటుకేంద్రంలోనూ ఇటూ రాష్ట్రంలోనూ తమ బొమ్మలను స్తిరపడెలాచెస్తున్నాయి. జగన్ ఆమతస్తుడు కాకుంటే గాలి జనార్ధనరెడ్డీకిపట్టినగతే పట్టుండేది. ఇప్పుడు తమచానల్లే పైలెవెల్ క్రిందలెవెల్ లో గొడవలు రాకుండా మల్లీ ఆశక్తులు గట్టిగానే పనిచెశాయనే గుట్టు లోతుగా అలోచిమ్చేజనానికి అర్ధమవుతున్నదంటూన్నారు.. ఆసూచనలు మనకు కనపడుతున్నాయి కదా . నిన్నటంత వైరం లేదీనాలుగురోజులనుంచి . ఈవిషయం మీలాంటివారికి తెలియక కాదనుకోండి

Anonymous said...

మీకు ఇక కాట్లు పడతాయి...యాంటీ రాబిస్ వాక్సిన్ చేయించుకోండి!!!జగన్ మీద రాస్తారా...మీమీద ఇక దండయాత్ర మొదలవుద్ది చూడండి!!!
ఇక కామెంట్ మోడరేషన్ కి పని పెట్టండి బాబు...దయచేసి...

Pavani said...

జగని కి సుమారు 70 శాతం వోట్లు పడ్డాయి, తన పార్టీ కి మొన్న 50% శాతం దాకా వచ్చాయి. మీరు చెప్పిన రెండు కేటగిరీల్లో ఇంతమంది ఉంటారాండి?

Prashant said...

వీళ్ళను వీళ్ళ మనసులు ప్రశ్నించవా?....good quote !

Sudhakar said...

You are absolutely right...YSR & Family has jumped in with a vision 2020 (while CBN is busy with powerpoints) master equation with pakka statastics about voting pie data & sentiments of the state. YSR started with a pada yatra & continued with 108, arogyasri etc...the only unexpected thing happend was the death of YSR...but the master equation has taken care of that incident also...hats off to the planner of this strategy !

Chinna said...

70% voters in all communities except Kammas are in favor of Jagan.
Jagan has got 49% votes, Cong 23% and TDP 22% in recent by-polls.
Reddys may be 10-12 %, and Christians almost 2% and therefore other communities also voted to Jagan.

Chinna said...

Jagan got 49% votes,Cong 23% and TDP 22% in recent by-polls.
Except kammas, remaining castes are in favor of YSRCP.

Andhra Pradesh Live said...

I visited khammam district this weekend. I found the atmosphere in favor of jagan.

Surya Alla said...

Ramu garu,
please write about the exodus from Mahaa Tv to other channels.
I see most of them in NTV these days.

I also heard a rumor about Chandrababu planning to buy Mahaa since Studio N has dumped him and turned Pro NTR.

Waiting for your inputs on this

K V Ramana said...

Your passing remark about CBI JD is not correct. I think he has done a great job. It is normally very difficult for a person (read IPS) dealing with IPC to handle white collar or financial crime. The IPC insists on the prosecution proving the intention and planning of the accused. When they try a crime, it has to be done intentionally with proper planning. In a financial crime, the intention part is difficult to prove. If Jagan has invited investments with an intention to route the bribes, how would that intention be proved? It will be easy for a police officer to prove that in a murder case but not in a white collar offense. That way, the JD has done a great job in joining the dots and collecting the evidence. Still, if one thinks Jagan is going to be the chief minister, that only means no one is trusting the media. Because whether through a leak or otherwise, everything has been written about in newspapers.

Ramu S said...

అన్నా...you may be right.
ramu

sarvi said...

Nice Articul

Unknown said...

meedi which matham???
saibaba na? venkatesha? ramudu na? inkedaina na...

votes kosam YSR family Christianity loki maraledhu.. vaari fore fathers nunchi vallu Christians.. by the way vijayamma gari prayer okasari vinnanu very soulful prayer.. christians lo chala mandi ala prayer cheyaleru..

ika last lo amen annaru oka mathaanni comedy chesetapudu mee manasu prashninchada??

Anonymous said...

మీరు చెప్పిన రెండు మతసిద్ధాంతం YSR, Jagan విషయంలో పని చేస్తుంటే, ఆ వున్న ఒక్క మతంలో కూడా మారేది, రెడ్డి ఖిల్జీ అనో సయ్యద్ రెడ్డి, రెడ్డి ఖాన్ అనే తగిలించుకుంటే వాళ్ళవోట్లూ గంప గుత్తగా పడతాయేమో కదా. :))

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి