Thursday, February 20, 2014

హమ్మయ్య... ఒక పెద్ద గొడవ తీరింది...

తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన సుదినం. 
వందల మంది వెర్రి ఆవేశంతో జీవితాలు నుదిమేసుకున్న త్యాగానికి నిజమైన నివాళి.
దోపిడీ, అది నిత్యం జరుగుతుందన్న ఫీలింగ్ నిజంగానే అంతం అవుతుందా? అన్న సంశయం.
తెలంగాణా సుసంపన్నం అవుతుందా? అన్న అనుమానమ్.  
తెలుగు జాతి మన కళ్ళ ముందే రెండు గా అయిపోయిందే...అన్న కించిత్ బాధ.
ఇప్పటికే జరగాల్సింది ఈ రోజైనా జరిగిందన్న తృప్తి. 
మా నీళ్ళు మాకు... మా ఉద్యోగాలు మాకు... నిజంగా నిజం కావాలన్న సంకల్పమ్.  

ఇదొక అనిర్వచనీయమైన ఉద్విగ్న క్షణం. 

రాజకీయ నేతల చదరంగంలో ఇన్నాళ్ళూ పావుగా మారి... ప్రజల్లో ఆవేశకావేషాలు పెంచి... వందల మంది యువకులు బలిదానాలు చేసుకోవడానికి కారణమైన తెలంగాణా సమస్య ఒక కొలిక్కి రావడం ఆనందాన్ని ఇచ్చింది. లోక్ సభ బిల్లు ను ఆమోదించిన రోజు అనుకోకుండా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. 

'జై తెలంగాణా' అంటూ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్న అనేక మంది యువకులు గుర్తుకు వచ్చారు. నిత్య అగ్ని గుండంగా మారిన మా ఉస్మానియా క్యాంపస్ స్ఫురణకు వచ్చింది.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భాషా పటిమ... ఉద్యమ స్ఫూర్తి రగిల్చే తత్త్వం, మంత్రాంగం నిర్వహణా సామర్ధ్యం లేకపోతే ఈ ఉద్యమం ఇంత స్థాయికి వచ్చేది కాదు.   
29 వ రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినాక...నిన్నటి దాకా జరిగిన పోరాటాలు, వాదాలు పక్కన పెట్టి... అందరం కలిసుందాం.... అంటూ ఆయన చేసిన ప్రసంగం నాకు నచ్చింది. 

"మీ ఖమ్మం జల్లా వాళ్ళకు మెదడు మోకాల్లో కాదయ్యా.. అరికాల్లో ఉంటుంది," అని పదే పదే అంటూ అవమానించిన అప్పటి ఈనాడు ఎమ్ డీ రమేష్ బాబు, "ఉస్మానియా వాళ్ళు... ఉద్యోగాలు ఇవ్వకూడదు..." అని నాతో ఏకంగా అన్న  నాగయ్య చౌదరి కూడా ఇవ్వాళ గుర్తుకు వచ్చారు. 

మీడియా ఈ ప్రాంతీయ వాదుల చేతిలో ఉండబట్టి... జర్నలిజం లో తెలంగాణా జర్నలిస్టులు ఒక స్థాయి వరకే ఎదిగారు. అలాంటి బాధితుల్లో నా లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి... ప్రాంత గజ్జి గాళ్ళను, కుల గజ్జి గాళ్ళను, బట్టేబాజ్ గాళ్ళను తన్ని నేషనల్ హైవే నంబర్ నైన్ మీదుగా పొలిమేరలు దాటిస్తే తప్పేమిటన్న  కసిని గుండెల్లో అంతం చేసి... ముగిస్తాను. 
జై తెలంగాణా... 
జై తేట తెనుగు జాతి....  

8 comments:

శ్యామలీయం said...

కసిని అంతం చేసారా?
ఎక్కడా?
మీ వ్యాసంలో దాన్ని బాగానే వెలిబుచ్చారే మరి!
సంయమనం‌ పాటించే దింకెప్పుడండీ?
లేదా ఇంక సంయమనం అవసరం ఏమీ అనుకుంటున్నారా> మరి.

Krishna said...

Very well said..first of all Congratulations to Telangana people..wish you good luck on forming new governance for better lifestyle..

Every where you will see these brutal minded people..without them communities won't move..now you got your own state..let's show your strength to provide better governance to telugu people..even semandhra people also will learn some good qualities from you..we wish you very good luck..enjoy great moments..at least stop these fightings now..do some value added work to better india.

Jai Gottimukkala said...

This victory belongs to the people. This proud moment is dedicated to the martyrs.

Unknown said...

అంతా మంచి జరగాలి. అంతా మంచే జరుగుతుంది.

Anonymous said...

anna nadi seemandhra nuvvanadi nijame media mottam seemandhra chetalone vundi kani nuvvu okka vishayam marichipoyavu oka donga oka vuri nunchi vaste aa oorivalanta dongalu kadu anna ante kakunada sontha kodukula kuda vala talitandrulanu vadilesa rojulu ivi vala talitandruluku emani jarigina kani atmahatylu chesukoru kani telangana raledani atmahatya chesukunarante ela namuthav anna okavela vallu chesukuna adi avesham lo rechagottadam valla jariginde kani nijange evaru chesukoru diniki udaharanalu chalane unaayi balamina telangana vadini ani chepukune kcr kani vala koduku kuturu kani chesukunara telangana porata yodhudu jayashankar chesu kunnada
svartha rajakiyala valla valu chanipoyaru kani seemandhra janalu valla kadu nijame seemandhra valle dabbu unnavalu kani endukani eppudaina alochinchara endukante AP lo ne atyanta saravanta maina bhumi seemandhra akkada vachina dabbulatho baga chaduvukuni america ki velli dabbulu sampadinchi tirigi hyderabadlo pettadam valla hyderabad abhivrudichendindi chuttupakkalunde telangana prajal ki upadhi avakashalu labhinchayi inko vishayam anna meeru cheputunaru udyogalo meeku teerani anyayam jarigindi ani oka vishyam anna udyogam prantani batti kadu kani merit batti istaru idi kuda tappe memu meeru kalisi 60 years kattukuna viluvani hyderabad ni mee kokkarike kavalantunaru sare inka seemandra valu dagakorulani ipptikaina tittdam appandi anna neeku anyayam jaragadiniki karanam seemandhra vallu vala kadu nuvu ala anukovadam vala endukante vivekanada chepina oka vishyam cheputanu vinu every man's destiny is in their own hands idi ippatikaina grahinchi telangana prajalu okari meeda adarapadakunda svayam krushi tho paiki ravalni ashistuna kani nuvvu chepina dantlo nijam leka poledu kula pichi,prantha pichi vundani kani viti gurinchi somaripothulu matrame alochistaru nijanga kashtapadevadu andaman lo vunna unnatha stayiki edugutadu.

jai hind.

Prashant said...

Ramu,
You have strong opinions.Whatever the anguish you expressed will not be stamped out even after new state has taken birth.The politics in media keep happening, as they are omnipotent.Exists everywhere.Not just in India.

Unknown said...

భావనారాయణ గారు, మీ లాంటి సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేశారంటే చాలా మంది జూనియర్లకు కొంతైనా విలువైన సమాచారం దొరుకుందని భావిస్తారు. కాని మీ మనసులో పుట్టిందే పక్కా సమాచారం అయినట్లు, కీ బోర్డుపై మీ వేళ్లు కదిలిందే వార్త అయినట్లు రాసేస్తున్నారు. మొత్తం వ్యవస్థ అంతా బురదగుంట అని, మీరే సచ్ఛీలురు లాగా బయటకొచ్చిన తామర పువ్వులాగా ఫీలవుతున్నట్లున్నారు. మీకు మీరు అలాగే భావించినా మాకు అభ్యంతరం లేదు. కనీసం ఇప్పుడైనా న్యూస్ మీడియాపై స్వచ్ఛమైన అనాలసిస్ వస్తుందని భావిస్తాం. కాని మైనార్టీ కార్పోరేషన్ డబ్బులు కొట్టేసి, అవినీతి డబ్బుతో ఛానల్ పెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా సీఐడీకి బుక్కైన తోట భావనారాయణ వేరే ఛానల్స్ ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది

JE said...

నిజమె. అయన లాగు లో ఏది రాయాలన్న రసెస్తరు. అయిన అంతే కదా ఎవరైనా .. rvs గురించి గొప్పగా రాస్తారు ఎందుకంటే అక్కడ ఆయనే కదా ఉన్దెధి. దీనికి తోడ్ ఓ జస్ట్ (అని పేరు ముందు ) అతనికి అతను మాత్రమే చెప్పుకునే వ్యక్తి ని భలే ప్రొమొతె చెస్తరు. తులసి, ap 9 , ఇవన్ని అయ్యగారు జాయిన్ అయి డాష్ డాష్ బీప్ బీప్ నకించినవె

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి