బూతు లేకుండా అద్భుతమైన సాహిత్యంతో సినిమా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకున్న కులశేఖర్ గారు ఒక అనామకుడిగా గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల కిందట కన్నుమూయడం విచారకరం. ఈనాడులో జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించిన సింహాచలం అబ్బాయి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శిష్యరికంలో రాటుతేలాడు. పాటలను నమ్ముకుని సినిమా లోకంలో 1999 లో అడుగుపెట్టిన ఆయన తేజ, ఆర్పీ పట్నాయక్ లతో కలసి సంచలనం సృష్టించాడు. ఇలాంటి హిట్ కాంబినేషన్ మళ్ళీ రావడం కష్టమేమో!
సినిమాలో సక్సెస్ ఇచ్చిన కిక్కుతో కళ్ళు తలకెక్కి దురహంకారం తో సన్నిహిత మిత్రులను దూరం చేసుకున్నారని కొందరు... తను నిర్మించిన సినిమా తెచ్చిన నష్టాలు, కష్టాలు తట్టుకోలేక మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని కొందరు... సినిమా జాడ్యాలు దిగజార్చయని ఇంకొందరు తమ సమీక్షల్లో చెప్పుకొచ్చారు. బంగారం లాంటి భార్యా పిల్లలకు దూరం కావడం వెనుక కారణాలు ఇవే ఏవో అయి ఉంటాయి. ఇది నిజంగా స్వయంకృతం.
దాదాపు వంద సూపర్ హిట్ సాంగ్స్ అందించి జనాలను ఉర్రూతలూగించిన రచయిత రెండు చిల్లర దొంగతనాల కేసుల్లో ఇరుక్కోవడం బాధాకరం.
ఈనాడు లో నాకు జూనియర్ కలీగ్ కులశేఖర్ గారు. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు అందంగా, కళ కళ లాడుతున్న రోజుల్లో ఒకటి రెండు సార్లు, చితికిపోయాక ఒక సారి నేను వారిని కలిశాను.
తన ఆరోగ్యం సెట్ అయ్యాక కమ్ బ్యాక్ కోసం ఆయన 2019 నుంచి గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ, వర్కవుట్ కాలేదు. మంచి ప్రాజెక్ట్స్ కోసం సిద్ధంగా ఉన్నానని ఆయన కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పారు కూడా.
1) ఎదిగినా ఒదిగి ఉండడం ముఖ్యమని, 2) పొగరు - అహంకారం దరిచేయనీయకూడదని, 3) కుటుంబాన్ని కాదనుకుని ఊరేగకూడదని, మిత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదని, 4) పేరు ప్రతిష్ఠలు ఉన్నప్పుడు మనచుట్టూ మూగే ఈగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, 5) సృజనాత్మక రంగంలో ఉన్నవారు అనారోగ్యాలకు పెద్దగా ప్రచారం లేకుండా చూసుకోవాలని కులశేఖర్ గారి జీవితం నేర్పే పాఠాలు. ఈ ఐదో పాయింట్ ఎందుకంటే, తాను ఎక్కడికి వెళ్ళినా...ఒళ్ళు ఎట్లా ఉందని అడుగుతూ జనం ఆయన్ను మరింత కుంగదీశారని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లను బట్టి అర్థమయ్యింది.
ఆయన పోయాక చాలా మంది నివాళులు అర్పిస్తున్నాను. చాలా గొప్ప రచయితని కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఘన నివాళులు అర్పించే జమాన ఇది.
తను తప్పులు చేసినప్పుడు దూరంగా జరగకుండా, క్షమించి సన్మార్గంలో పెట్టే మంచి మిత్రులు లేకపోవడం కులశేఖర్ గారిని దెబ్బతీస్తుందని నాకు అనిపించింది.
3 comments:
Simple and sweet review on kulashekar anna.
జనానికి పట్టడం ఏమిటి ? ఏమి పట్టాలి ? ఎందుకు పట్టాలి ? అతను స్వయంకృతాపరాధాలు చేసి దారి తప్పితే ' 'జనానికి ' ఏమి సంబంధం ? మరి నువ్వు కూడా అతను పోయిన తరువాత మాత్రమే ఈ పోస్టు రాశావేందుకు మిత్రమా ?
అతను మంచి పాటలు రాసినందుకు జనం గుర్తు చేసుకుని సంతాపం తెలుపుతున్నారు.
ప్రతి విషయంలో జనాన్ని బ్లేం చేయడం ఎందుకు ? నువ్వు కూడా జనం లో భాగమే కదా.
In the Hindi movie Pyaasa a condolence cum tributes meeting is arranged for a poet (played by Gurudutt), falsely assuming he was dead. The irony is the poet was still alive. He was actually among the audience, and no one recognizes him. Such is the hollowness of this world.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి