Monday, September 28, 2009

విజయ దశమి నాడు శుభారంభం

డియర్ విజిటర్స్,
నా పేరు ఎస్.రాము. నేను ఒక ఇరవై సంవత్సరాల పాటు తెలుగు జర్నలిజంలో పని చేశాను. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలోడెస్క్ లో, ఫీల్డ్ లో పనిచేసాను. వృత్తిలో ఒత్తిళ్ళతో పాటుగా ఫీల్డ్ లో గొట్టాలు (వివిధ చానల్స్ లోగో మైక్ లు) ఎక్కువఅయ్యాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెమెరామెన్ బ్యాక్ లు ఎక్కువగా చూడాల్సి వచ్చింది.

అది ఫర్వాలేదు కాని చాలామంది మిడిమిడి జ్ఞానం గాళ్ళు పవిత్రమైన ఫీల్డ్ లో చొరబడ్డారు. వారిదే హవా. విలేకర్ల నేతలూ వారే. రాజకీయ నేతలఏజెంట్లూ వారే. కుల సంఘాలను ప్రోత్సహించేదీ వారే. బతికి వుంటే టీచెర్ గా బతక వచ్చని పారిపోయాను. ఇప్పుడుయువ జర్నలిస్టును తయారుచేసే పనిలో వున్నాను. ఈనాడులో నేను రాసిన ఎడిట్ పేజి వ్యాసాలు, ది హిందూలో రిపోర్టర్ గా చేసిన పని ఆనందాన్ని ఇచ్చేవే. ఈనాడు జర్నలిజం స్కూల్, వుస్మానియా యూనివర్సిటీ, ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లలో చదివిన చదువు, రెండు గోల్డ్ మెడల్స్, అమెరికా పర్యటనకు వచ్చిన ఫెలోషిప్ నాకు తృప్తిని ఇచ్చే అంశాలు. ఇది సొంత సొద కం పరిచయం.

నిజాలను నిర్భయంగా చెప్పే బ్లాగ్ ఒకటి తెలుగులో వుంటే బాగుంటుందని చాలా రోజులుగా అనుకుంటున్నాను. విజయ దశమిరోజు (సెప్టెంబర్ ) బ్లాగ్ ప్రారంభించాను. నా అనుభవాలు మీతో పంచుకోవాలన్నది ప్రాధమిక వుద్దేశం. తెలుగుజర్నలిజంలో చాలా బాగా పనిచేస్తున్న ప్రతిభావంతులకు కొదవే లేదు కానీ వారు మరుగున పడి పోతున్నారన్న బాధ నన్ను వేధిస్తున్నది.
జలగలలాంటి బాస్ పుణ్యాన వేరే వృత్తి లోకి పలాయనం చిత్తగిస్తున్నవారి సంఖ్యా పెద్దదే. యాజమాన్యాల అఘాయిత్యాలు, పవర్ లాబీల దుర్మార్గాలు మన బ్లాగ్ లో దర్శనమిస్తాయి. గలగల లాడే తెలుగు రాసేవారితో పాటు జలగల ఆగడాల గురించి రాయడం కూడా నా అభిమతమే.

అయితే దొంగ రాతలు, పిచ్చి పుకార్లు (మాగురువు గారు బూదరాజు గారి భాషలో 'పునకార్లు') రాసి తీట తీర్చుకోను. ఎందుకు బాధ పెడుతున్నావని జలగనుఅడిగి రాయడం, బాధపడావద్దని బాధితుడిని దార్చడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను. జర్నలిజం పరిణామాలనుకూడా రాయాలని అనుకుంటున్నా ను. మంచి చర్చలు కూడా నిర్వహించాలని వుంది. జర్నలిజం పని నిత్యం సత్యాన్నివెలికితీయడమే కదా! పనే మనం చేద్దాం. నాకు కుల, మత, ప్రాంత లంకెలు అంటకట్టకుండా మీరంతాసహకరించండి. మంచి కోసం పాటు పడండి. బ్లాగ్ ను ఒక వేదికగా చేసుకోండి.
మీకు విజయ దశమి శుభాకాంక్షలు
మీ
రాము

10 comments:

kvramana said...

annayya
I think this is a fantastic effort. We have already seen a couple of blogs on AP media but frankly they had some agenda. Either they were supporting someone or meant to attack someone. Going by your track record and the training you had received (from my and your teacher Budaraju)I sincerely feel that this will be a professional effort and will not hesitate to speak the truth.
Best of luck
K V Ramana

shaileshreddy said...

good luck ramu. Its right forum to vent out the feelings. I believe teaching is a far better job and preaching.
shailesh reddy

vishwa said...

all the best sir...

vishwa said...

and we are all with you sir...

santosh regalla said...

Hi !!!

I completely enjoyed reading your blog. I wish you All the very best and wish for honest , unbiased article from you , which are very rare and precious and truth bearers .

Thank you

Santosh regalla

Anonymous said...

Ramu ,
all the best

Anonymous said...

hai.....blog bagundi....constructiv sugestions kuda ivvandi...keep it up boss

నరేష్ నందం (Naresh Nandam) said...

రాము గారూ..
మీబ్లాగు వచ్చినప్పటినుంచి చూస్తున్నాను.
చాలా బాలెన్స్‌డ్‌గా రాస్తున్నారు. కీప్ గోయింగ్.
నా మితృలకి కూడా మీబ్లాగుని ఫార్వార్డ్ చేస్తున్నాను.

TELUGU TV NEWS బ్లాగు వచ్చిన కొత్తలో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయింది. కానీ, మీబ్లాగు అలా ఆగిపోకూడదని ఆశిస్తున్నాను.
అభినందనలు.

Anonymous said...

neelanti seva thatparulu samajaniki mukhyamga, mediaku entho avasaram. neevu full time blogke ketainchu

Anonymous said...

సర్, మీ లక్ష్యం బాగుంది. ఇంతకీ అన్యాయానికి గురయిన వారికి మీరు ఏమి చేస్తారు? తమకు జరిగిన అన్యాయంపై బాసులతో, మేనేజిమేoటు పోరాడి ఉద్యోగాలు పోగొట్టుకొన్న జర్నలిస్టులకు బతుకు తెరువు చూపిస్తారా? లేకపోతే బ్లాగులో చర్చించి వదిలేస్తార? లేకపోతే అందరికి తెలియజేసి వారు మరింత కున్గిపోఎతట్లు చేస్తారా? బాసులు, మేనేజిమేన్తులతో పోరాడి గెలిచినా జర్నలిస్టులు ఎంతమంది సర్? గెలిచినా, వారు జీవితంలో జీతాలు, పిల్లల క్షేమం, కుటుంబ పరంగా చాల కోల్పోయి వుంటారు. నా దృష్టిలో జర్నలిస్టుల సమస్యలకు కారణం, పరిష్కారం రెండు మేనేజిమేన్తులే. ఈ వ్యవహారం లో జర్నలిస్టులు అవమానాలు ఎదుర్కోక తప్పదు సర్, అది ఇష్టం లేకపోతే ఉద్యాగం వదిలేసి వెళ్ళడానికి సిద్దం కావాలి. ఇలా సిద్ధం కాలేకే , జర్నలిస్టుల జీవితాలు నలిగిపోతునాయి. దీనికి మీరు ఎలా, ఏమి పరిష్కారం చూపిస్తారు సర్?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి