Sunday, January 3, 2010

ఈ 'నగ్నా'మృతం--ఒట్టి బరితెగింపు, ఓ విషప్రాయం

బూతు... ఒక వైరస్. బూతు ప్రోగ్రాంల ద్వారా 'మెరుగైన సమాజం కోసం' పాటుపడుతున్న TV-9 లో జనవరి ఫస్టున కొత్త ఊపుతో ప్రారంభమైన ఈ వైరస్ రెండు మూడు రోజుల్లో అన్ని ఛానెల్స్ కు హెచ్.ఐ.వి.కన్నా ఘోరంగా పాకింది. తెలుగు జనం మెదడు తొలచి...స్త్రీ కనిపించగానే నీచ దృష్టితో కసితో చూసేలా చేసే భయంకరమైన వైరస్ ఇది.


కాంగ్రెస్ నేతల శారీరక సుఖాలు  తీర్చే (తార్చే) కళలో ఆరితీరి కోట్లకు పడగలెత్తిన ఒక కళాపోషకుడు పెట్టిన ఛానల్ లో కూడా...క్యాలండర్ తయారీ పేరిట అందమైన భామల వొంపుసొంపులు చూపారు. ఇది చూసి...మన రేటింగ్స్ గతి ఏమి కాను...అని బాధపడిన మరొక విద్యా సంస్థల వారి ఛానల్ ఎక్కడో అందాల పోటీని రస రమ్యంగా అందించింది. అక్కడా...అర్థ, ముప్పావు నగ్న భామలే వారికి స్ఫూర్తినిచ్చారు. 

ఆ తర్వాత కొన్ని ఛానెల్స్...."మేము సైతం...తెలుగు వాడి నాశనానికి...బూతు ప్రోగ్రాం ఒహటి అర్పిస్తాము"...అని తమవంతుగా నీలి కార్యక్రమాలు ప్రసారం చేసాయి. గవర్నర్ తివారీ తాతయ్యపై నానా యాగీ చేసిన సంధ్యక్కా....ఎక్కడున్నావు తల్లీ! (ఈ పోస్టు చదివిన వారు సంధ్య లేదా ఇతర విప్లవ నారీమణుల మెయిల్ అడ్రస్ లు ఉంటే దయచేసి వారికి న్యూస్ చానళ్ళ బూతు న్యూ సెన్స్ పై మన ఆవేదన తెలియజేయ ప్రార్ధితులు. లేదా, వారి మెయిల్ ఐ.డీ.లు మాకు పంపి పుణ్యం కట్టుకోండి.)


బూతు ఛానెల్స్ పై కొందరు సీరియస్ సీనియర్ బ్లాగర్స్ స్పందించిన తీరుతో ఉత్తేజం పొంది...ఈ ఏడాది మనమేదో ఒకటి చేసి...బూతు ప్రకాష్ లకు బుద్ధి చెప్పాలి...అనుకుంటుండగానే....TV-5 "నగ్నా"మృతం అనే పరమ నీలి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి పది గంటలన్నా కాకముందే చూపింది. 


"కాస్త అందం ఉండి 'ఎక్స్పోజ్' చేస్తే చాలు..."అని ఒక ఆడ యాంకర్ చదవగానే....దిమ్మతిరిగే సీన్లు చూపించారు. హిందీ సినిమాలలో ఉన్న బూతు సీన్లు అన్నీ పట్టుకొచ్చి రూపొందించారు ఈ "స్పెషల్ ఎపిసోడ్"ను. జంటలు షవర్ కింద, మంచం మీద, పార్కులో, బీచులో, గడ్డివాములో తమకంతో రెచ్చిపోతున్న దృశ్యాలు దారుణంగా చూపించారు. దేనికైనా బరితెగించే హీరోయిన్స్ వల్ల ఐటం గర్ల్స్ అవసరం లేకుండా పోయిందని ఒక సారి, బికినీ భామల వల్ల నిర్మాతలకు కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గుతున్నదని మరొక సారి చెప్పి...అచ్చం నీలి చిత్రాలను చూపించారు. "ఇలాంటి సీన్ల లో సీనియర్ స్టార్లే ఈజ్ తో నటిస్తుంటే మరి కొత్త వారి పరిస్థితి ఏమిటి?" అని యాంకరమ్మ కొద్దిగా బాధకూడా పడింది. 


ఇలాంటి స్టోరీ లకు ఒక ఫ్రేం ఉండడంలేదు. నాలుగు పచ్చి శృంగారపు సీన్లు సేకరించడం...వాటికి అనుగుణంగా ఏదో ఒకటి రాయడం...దాన్ని సొంగ కార్చుకుంటూ చూసే తెలుగు జనం ఉన్నారుగా...అని వారి మీదకు విడవడం. ఏదో ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ ఈ కక్కుర్తి పడితే..చావనీ...అనుకోవచ్చు. న్యూస్ ఛానెల్స్ లో ఇలాంటివి చూపితే ఎలా? 

పిల్లలతో కలిసి కూర్చుని టీ.వీ.చూడలేని పరిస్థితి దాపురించింది. ఈ బూతు వారి కంటపడకుండా ఉండడానికి...మాటి మాటికీ..ఛానల్ మారుస్తుంటే...పిల్లల్లో లేనిపోని ఉత్సుకత (క్యురియసిటి) పెంచడం అవుతోంది. మరి ప్రజలకు మార్గాంతరం ఏమిటి? మీరే చెప్పండి.

----------------------------------------------------------
నోట్: "ఒరేయ్...సమాజహితం పట్టని దౌర్భాగ్యుల్లరా...మీరు మనుషులా..చిత్తకార్తె  కుక్కలా? మీకు తల్లి, చెల్లి, అక్క, కూతురు లేరా? ఈ బూతు ప్రోగ్రామ్స్ ప్రసారం చేసేటప్పుడు కనీసం 'పెద్దలకు మాత్రమే' అన్న అక్షరాలైనా స్క్రీన్ మీద వేసి చావండ్రా..." అంటూ మిత్రుడు సీతారామ శేష తల్పసాయి సంధించిన ఒక వ్యంగ్య అక్షర బాణం త్వరలో...మీ కోసం...

12 comments:

VENKATA SUBA RAO KAVURI said...

A B C D E to Z pearu yeadayiteaneam?
prakaash, naren, raamoji, raadha
okkokkadu oka mahaa donga
cheppeadamtaa abadham
chuopimcheadantaa asleelam
sreeranga neetulu chebutaaru
dommara gudesallo dooratam
telugu TV chanals yajamanula neecha nikrusta teeruku mahaa vudaaharana.

నిజం said...

నిజమేనండి గత వారం రోజుల నుండి ప్రతి ఛానల్ ఏదో ఒక విదంగా నీలి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తున్నాయ్

చిలమకూరు విజయమోహన్ said...

కులం పేరడిగితే చెప్పుతో కొట్టండి అంటూ నీతులు చెప్తూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్నామంటూ ఫోజులిస్తూ ఇలా బూతును విచ్చలవిడిగా చూపిస్తున్న వీళ్ళను ఏమిటితో కొట్టాలో మరి?

తెలుగు వెబ్ మీడియా said...

జీ తెలుగు చానెల్ లో ఆట కార్యక్రమంలో ఆరేళ్ళ వయసున్న పసిపాపల చేత డబల్ మీనింగ్ పాటలకి డాన్సులు చెయ్యిస్తున్నారు. ఈ ఫామిలీ చానెల్స్ న్యూస్ చానెల్స్ కంటే గొప్పవా? చైల్డ్ న్యూడ్ డాన్సెస్ కంటే అడల్ట్ న్యూడ్ సీన్స్ నయం. అడల్ట్ న్యూడ్ సీన్స్ చూసి పెద్దలు చెడిపోతే చైల్డ్ న్యూడ్ డాన్సెస్ చూసి పిల్లలు కూడా చెడిపోతారు.

kareem said...

ఈ బూతు ప్రకాష్ ని తీసేసిన అండర్ వేర్ తో కొట్టాలి ..

సుజాత వేల్పూరి said...

నిస్సిగ్గుగా ఆ కార్యక్రమానికి వారు పెట్టిన "నగ్నామృతం " పేరు చూసి నిస్సహాయతతో దుఃఖం వచ్చినంత పనైంది!

"నేను సైతం తెలుగువాడి నాశనానికి...."...ఎంతో నిజం! తెలుగుజాతి నైతికంగా నాశనమైపోవడానికి కంకణం కట్టుకున్నాయి ఈ న్యూస్ ఛానెల్స్ అన్నీ!

ఏం చేస్తే ఈ పీడా విరగడవుతుందో మరి!

Anonymous said...

వార్తస్రవంతులు ఉరఫ్ బూతుస్రవంతులు

మైత్రేయి said...

రాజకీయాల్లో రామోజీకి ఎంత లింకులు చెడ్డ పేరు ఉన్నా ఆయన టీవీ కాని పేపరు కాని ఈ విషయం లో దిగజారుడు గా ఉండదు.
జ్యోతి పేపరు కూడా బూతు బొమ్మలకు ప్రసిద్ది ఇక వారు తివారి గారి స్టొరీ వల్లే మేమూ టీవీ పెట్టాం అని జనాలకు తెలిపారంటే వాళ్ళ నుంచి అంతమాత్రం ఊహించవచ్చు.
ప్రకాష్ గారు మన దేశాన్ని అన్ని విధాలుగా అమెరికా చేద్దామని సత్ సకల్పం కలవాడు .. ఆయన్ను ప్రత్యేకం గా చెప్పేదేముంది.
వీళ్ళను ఇలా బ్లాగ్లు లలో తిట్టి మార్చగలమను కోవటం మన పిచ్చి తనం. టీవీ లకు సెన్సారు ఉండాలి. ఒక సారి ఇలాంటి వి ప్రసారం చేసిన వాళ్ళను 'A " చానెల్ గా declare చెయ్యాలి. ఈ చానెల్ పిల్లలకు చూపించకండి అని టీవీ పేరు గుర్తు కిందఎల్లప్పుడూ రాయాలి.

Ravi said...

@ప్రవీణ్! నిజమే.
@సుజాత గా
@మైత్రేయి గారన్నట్లుగా అసలు మన బ్లాగుల్లో జరుగుతున్న ఈ తతంగం టీవీ వాళ్ళకు తెలుస్తుందంటారా? తెలిసినా దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ప్రవర్తిస్తున్నారంటారా?

Anonymous said...

వాళ్లకి సిగ్గేక్కడిది ప్రకటనల కోసరం పక్కలేసే వారికి..

Anonymous said...

tv 5 vadu chintamani ani kotta program start chesadu.

peddalaku matrame ani rasthunnadu.

program at 11:30--tv 5
take ur hesitation on this alos ramu garu.

thse sick and tired xxxx no words to scold them

Anonymous said...

peruke ee mahila sangalu vallu nijanga kanuka poraditee ilantive chanels lo kanpadavu variki tvllo kanapadatame kavali anduke tvllo emi vacchina pattinchukoru

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి