Friday, January 8, 2010

TV-5 జర్నలిస్టులను అరెస్టు చేసిన CID:: 'సంచలన' కథనం పర్యవసానం

ఇది తెలుగు జర్నలిజం చరిత్రలోనే ఒక మలుపుగా చెప్పుకోదగ్గ పరిణామం. 

ఒక సంచలనాత్మక రష్యన్ వెబ్ ఎడిషన్ నాలుగు నెలల కిందట వై.ఎస్.ఆర్. దుర్మరణంపై పోస్ట్ చేసిన ఒక కథనం ఆధారంగా దాదాపు నాలుగు గంటల పాటు చర్చ జరిపి...రిలయన్స్ ఆస్తులపై దాడికి పరోక్షంగా కారణమయినందుకు TV-5 ఛానల్ మూల్యం చెల్లించుకుంది.

ఆ ఛానల్ ఎక్సిక్యుటివ్ ఎడిటర్ బ్రహ్మానంద రెడ్డి, ఇన్-పుట్ ఎడిటర్ వెంకట క్రిష్ణ లను హై డ్రామా నడుమ సీ.ఐ.డి. పోలీసులు రోజంతా TV-5 ఆఫీసులోనే విచారణ జరిపి రాత్రి అరెస్టు చేసారు. ఆఫీసులో కంప్యూటర్ హార్డ్ డిస్క్ లతో పాటు...వారి సెల్ ఫోన్ లను కూడా సీజ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇద్దరినీ కేబుల్ నెట్ వర్క్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి...సీ.ఐ.డి. అధికారులు తరలిస్తుండగా...ఆ సంస్థ ఉద్యోగులు అడ్డుకున్నారు. వారిని కూడా అరెస్టు చేసినట్లు ఆ ఛానల్ ప్రకటించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులు ప్రదర్శనలు నిర్వహించారు. 

TV-5 భూతద్దంలో చూపి ప్రసారం చేసిన కథనం చూసి వై.ఎస్.అభిమానులు ఆగ్రహంతో చేసిన దాడిలో రిలయెన్స్ కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పోలీసులు తమంత తాముగానే కేసు నమోదు చేసిందీ, లేక రిలయన్స్ ఫిర్యాదుపై స్పందించి అరెస్టులు చేసిందీ తెలియరాలేదు.



TV-5 కు దీటుగా రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా వండి వార్చిన సాక్షి, N-TV ఛానెల్స్ పై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆ ఛానెల్స్ లో ఆ కథనం ప్రసారం కావడానికి బాధ్యులైన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. టీ.ఆర్.పీ.రేటింగ్ పిచ్చిలో పడి బాధ్యతారహితంగా వ్యవహరించే ఛానెల్స్ కు ఇది ఒక చెంపపెట్టు లాంటిదని పలువురు సీనియర్ జర్నలిస్టులు, మేథావులు వ్యాఖ్యానించారు. 


విచిత్రంగా...ఈ ఛానెల్స్ కథనాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలు తీవ్రంగా ఖండిస్తూ బ్యానర్ వార్తలు ప్రచురించాయి. తెలుగు టెలివిజన్ లో సంచలనాలు సృష్టిస్తూ బూతు బొమ్మల మీద బతుకుతున్న TV-9 తానేదో ఆరిందయినట్లు ఈ ఛానెల్స్ కు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో జర్నలిస్టు సంఘాల నేతలు శ్రీనివాస రెడ్డి, అమర్ లు కూడా TV-5 చేసిన పనిని హర్షించలేదు. ఈ కేసులో కాకపోయినా...బూతులు ప్రసారం చేసినందుకు....నీలి ఛానెల్స్ పెద్దలను కూడా పనిలో పనిగా బుక్ చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతున్నది.  మరి మీరేమి అంటారు?

13 comments:

Saahitya Abhimaani said...

పోలీసులు చాలా కాలానికి ఒక పని వాళ్ళంతట వాళ్ళే చేస్నట్టున్నారు. పోలీసులకు అభినందనలు. కొంతకాలం క్రితం వరంగల్లులో అనుకుంటా ఏసిడ్ దాడి చేసినవాణ్ణి ఎంకౌంటర్ చేసి పారేస్తే, ప్రజలు ఆనందించి, పోలీసులను అభినందించారు. ఇప్పుడు వీళ్ళను ఎంకౌంటరు చెయ్యమని కాదు కాని, ప్రజలు సంతోసిస్తున్నారు, చానెళ్ళను కట్టడి చెయ్యటానికి పోలీసులు తీసుకున్న చొరవని.

ఇదే చొరవ టి వి చానెళ్ళు బూతులు చూపిస్తున్నప్పుడు కూడ చేసి, దానికి కారణం అయిన వాళ్ళను చొక్కాలు ఊడదీసి రోడ్డుమీద నడిపిస్తూ తీసుకెళ్ళాలి, ఊరందరూ వాళ్ళమీద కుళ్ళు టమేటాలు అవి విసరటానికి వీలుగా.

IF THIS IS FREE MEDIA, WE DO NOT WANT FREE MEDIA.

Anonymous said...

మంచి అవకాశం, ఈ మూడు చానళ్లతోపాటు, టీవీ9ని కూడా మూయించేస్తే మన రాష్ట్రానికి పట్టిన శని విరగడవుతుంది.

సుజాత వేల్పూరి said...

ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమో కాదో నాకు తెలీదు కానీ, రేటింగ్స్ కోసం అడ్డగోలుగా పనులకు పాల్పడితే ఫలితాలిలా ఉంటాయని ఛానెల్స్ గ్రహించవలసిన సమయం ఆసన్నమయిందని మాత్రం చెప్ప వచ్చు! నిన్న పొద్దున కూడా వెంకట కృష్ణ "నిజాలను బయటికి తీయడం" అనే పాయింటాఫ్ వ్యూలోనే మాట్లాడాడు.

రిలయన్స్ వంటి పెద్ద సంస్థలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తెలిసి ఉండాలి వాళ్లకి. వాళ్ళు తల్చుకుంటే వీళ్లకి భవిష్యత్తు లేకుండా చేయగలరు. ఇంత అత్యుత్సాహం పనికి రాదని, ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదని ఇప్పటికైనా గ్రహించాలి వీళ్ళు. పన్లో పనిగా తొమ్మిదో టీవీ మీద కూడా ఏదన్నా కేసు పెట్టి వాళ్ళ నీలి కార్యక్రమాల రూపకర్తల్ని, ప్రెసెంటర్లని మూసెయ్యాలి.

పోలీసులని అభినందించాలి, వాళ్లంతట వాళ్ళు చేసినా , "ఇంకెవరి "ప్రమేయంతో చేసినా సరే!

Anonymous said...

ఈ మాత్రం అన్ రెస్ట్ నే తట్టుకోలేక పోతున్నారు. రేపు అంతర్ యుధ్ధాల పరిస్థితే వస్తే ఏం చేస్తారండీ. మిమ్మల్ని నమ్ముకుంటే భారత్ నంబర్ వన్ అయ్యే దెట్లా?

Anonymous said...

సుమోటో కేసే. టి.వి 9 చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది.

Anonymous said...

exile story is infact very triky and a form of writing style and indirectly letting the cat out technique where the journalist escapes legal cases but tells the truth behind crimes. A technique which can be adopted by truth seeking journos.

Anonymous said...

i strongly differ with siva garu... if we once find solace with police on the other day, the police turns violent towards one and all. Let us insist all media people to maintain ethics. All democratic setups should have a sense of ethics. standards fallen in all spheres of society, media is not an exception.

Anonymous said...

అలానే ఇలాంటి బోగస్ వార్తలను అధారంగా చేసుకుని రెచ్చగొట్టే విధంగా రాసే బ్లాగర్లను ఏంచేస్తే బాగుంటుందో?

చదువరి said...

టీవీ 5 దాన్ని ప్రసారం చెయ్యడం పైనా, ప్రభుత్వం చేసిన అరెస్టు పైనా, ఆ చానెల్ ప్రసారాన్ని విమర్శిస్తున్న ఇతర చానెళ్ళ పైనా మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

Anonymous said...

Ilati charchalu chuste badhaga untundi. Inataki e channel r paper naitikatato vyvaharistu satyalu rastondi? Nachite oka laga nachakapote vakrikarinchi rayadamleda? y blame tv5 alone? arrestlu cheyalsi vaste entamandino cheyali. enni paperla mido caselu veyal. paina evaro relianceto pettukunte emautundo telsindi annattu rasaru. But ilati corporate samshtalu ghatukalaki palpadatayani nijanni dachala? avatala unnadi powerful vyakti ani chusi chudanattu povala? inka alatapudu manaki journalism endukandi? edaina clericalo leka routine udyogalo cheskunte samasya undaduga?

Saahitya Abhimaani said...

My Dear Anonymous,

Thanks for differing "strongly" with me. Police are praised now only because of the media over action and the resultant arson. If police are not allowed to do their duty there would be chaos. We need good Police than the free media. Ultimately, the so called media has madae us think like that.

kvramana said...

Anna
It is a fact that the channel in question did not commit anything other than just showing our viewers the content published in an online magazine. But, what went missing is the presentation skill. I also think the presenters got carried away by the response they were getting from the field. After showing the story for a while, the presenters of the channel too starting thinking that the story is true. Even their emotions too were high. Luckily it is Reliance's assets. Imagine what would have happened if the channel was doing a similar programme on some other sensitive issue like Hindu-Muslims. Hundreds would have died by the time the channel apologised or the police booked a case.
Ramana

Saahitya Abhimaani said...

"....luckily Reliance assets..." ???!!!

To whomsoever the assets belong to, destruction destroys the material. Reliance does not lose anything, they get their insurance and they know how to get more than the value of actual destruction. The point is whether the channel that started this entire uncalled for telecasting was hand in glove with the lumpen elements that started the arson and looting. If such collusion is proved, it would just prove a very grave and macabre situation all these days many of us are apprehensive.

Yes correct if the channel was in the same fashion was playing with the sentiments of those who are ready to be hurt at the drop of a hat? what would have been the position.

Along with the erring channels, all those arrested in arson cases should be severely punished and quickly.

Now TV9 and Sakshi TV are fighting in public shamelessly each other calling names in the their channels. In TV 9 the over smart newscaster was trying egg on Shri Potturi Venkateswara Rao to speak on his behalf and against Sakshi TV, but Sri Potturi is a very old hand and he deftly put the newscaster in his place. I think days are not far off, Reporters would be fighting with mikes bearing their logos as politicians did inside more than one Legislative Assembly.

What JP said is correct. Ban all news channels for a fortnight or a month and let all Editors, Owners, the politicians sponsoring these channels and "sane" Seniors come together and have discussion for self regulation of media and give assurance to the public (not necessarily to Government)that they would henceforth behave.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి