Saturday, January 9, 2010

TV-5 ఎడిటర్ల అరెస్టు...ఏ రకంగా తప్పు?

మన వ్యవస్థలను నాలుగు కాలాల పాటు రక్షించుకునేందుకు రూల్స్ పెద్దగా లేవు. ఒకవేళ ఉన్నా...అందరం వాటిని తుంగలో తొక్కేందుకు ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా 3 Ps (Politicians, Police, Press) లో ఉన్న వారు తాము ఈ రూల్స్ కు అతీతులమని విశ్వసిస్తూ పదే పదే వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల నమ్మకం కోల్పోయి సిస్టమ్స్ బ్రష్టుపట్టిపోవడమో, నీరుకావడమో జరుగుతున్నది.

TV-5 లో ఎడిటర్ స్థాయిలో ఉన్న ఇద్దర్ని ఒక ప్రమాదకరమైన గాలివార్త విషయంలో పోలీసులు అరెస్టు చేయగానే జర్నలిస్టు లోకం గగ్గోలు పెడుతున్నది. సంచలనాలే ఊపిరిగా బతికే ఒక రష్యన్ వెబ్ సైట్ లోని నాలుగు నెలల కిందటి వార్తకు తాజాదన్న కలర్ ఇచ్చి అగ్గి రాజేసి...చోటామోటా నాయకుల అభిప్రాయలు స్వీకరించి ఆజ్యం పోసి రాష్ట్రంలో భుగభుగలు సృష్టించిన ఛానల్ ను...పత్రికా స్వేచ్ఛ పేరిట వదిలేయాల? ఆ ఛానల్ ను శిక్షించకపోతే అది పోలీసుల తప్పు కాదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

"ఈ విచక్షణను మరిచి జర్నలిస్టులు నిరసన ర్యాలీలు జరపడమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ ఛానల్ కచ్చితంగా శిక్షార్హురాలే," అని ఒక సీనియర్ మిత్రుడు వ్యాఖ్యానించాడు. నాకు ఈ అభిప్రాయంలో తప్పు ఉన్నట్లు కనిపించడంలేదు.

కాకపోతే...ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ ఎక్జిక్యుటివ్ ఎడిటర్ లతో పోలీసులు వ్యవహరించిన ధోరణితో పాటు మరొక్క అంశంలో నాకు అభిప్రాయబేధం ఉంది. సాధారణంగా...పత్రికలలో ఇలాంటి తప్పులు దొర్లితే..ఎడిటర్ మరియు పబ్లిషర్ ల మీద కేసులు నమోదు అవుతాయి. ప్రస్తుత కేసులో TV-5 యజమానిని, అతని కొడుకును అరెస్టు చేయాలి తప్ప జర్నలిస్టులను బుక్ చేయడం ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తున్నది. 

ఇప్పుడు ఛానెల్స్ ను జర్నలిస్టులు నడపడం లేదు. యజమాని, వాడి తాబేదారు కార్యాలయాలలో తిష్టవేసి ఏ వార్త ఎలా ట్విస్ట్ చెయ్యాలో చెబుతున్నారు. యజమాని ప్రతి దాంట్లో వేలుపెట్టి ఆదేశించడం పూర్వంలో లాగా సీనియర్ జర్నలిస్టుల బృందాలకు ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే...ఇది...రేపు దావూద్ ఇబ్రహీం వచ్చి ఎక్కువ డబ్బులిస్తే...తనతో కలిసి నిర్మొహమాటంగా ఛానల్ లాంచ్ చేసే పరమ తుక్కు బ్యాచ్. 

వీళ్ళకు నీతీనిజాయితీ, దేశభక్తి ఉన్న దాఖలాలు లేవు. "ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక," "మీడియా ద్వారా...ప్రజలు సమాచారం గ్రహిస్తారు. దాని ఆధారంగా ఒక అభిప్రాయానికి వస్తారు. వారి అభిప్రాయం ప్రజాస్వామ్య సమాజానికి వెనుదన్ను," అన్న సత్తెకాలపు స్పృహ వీరికి లేదు. డబ్బు కోసం ఏ పనైనా చేసే జర్నలిస్టులు ఎక్కువయ్యారు. విలాసాల మోజులో పడి పర స్త్రీలు, సహచరుల సంసారాలు నాశనం చేస్తున్నారు. యజమాని వేసే ఎంగిలి మెతుకుల కోసం వాడికి మీడియాను అడ్డం పెట్టుకుని ఒక ఎస్.ఈ.జడ్. సంపాదించేందుకు కృషిచేస్తున్నారు. ఇది వారికి తప్పు అనిపించడం లేదు.

 

కొన్ని చోట్ల జర్నలిస్టులు నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పటికీ...వారు బూతు అయస్కాంతానికి అతుక్కుపోయి మెరుగైన సమాజం పేరిట సిక్ సమాజాన్ని నిర్మిస్తున్నారు. ముందు ఈ బ్యాచ్ దూకుడుకు ముకుతాడు వేస్తే...ఒక 24 గంటలలో మెరుగైన సమాజం మనకు కనిపిస్తుంది. ఈ ఛానల్ లో బూతును వ్యవస్థీకృతం చేసి...అదే టీ.ఆర్.పీ.రేటింగ్ పెరగడానికి తారకమాత్రం అని వివిధ ఛానెల్స్ యాజమాన్యాలకు నిరూపిస్తున్న...ఒక దుర్మార్గపు జర్నలిస్టును దావూద్ ఇబ్రహీం దగ్గరకు పంపినా సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది.

ఇప్పుడు తెలుగు గడ్డపై డజనుకు పైగా ఛానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీరిలో ఎందరికి సమాజహితం పరమావధి? కొన్ని వినోదాత్మక ఛానెల్స్ సినిమా బిట్లు, బూతు పాటలు, రియాలిటీ షోలు...తదిరాలతో సాగుతుండగా...మెజారిటీ ఛానెల్స్ కు  సంచలనం చేయడం (sensationalize), మరీ చిల్లరగా వ్యవహరించడం (trivialize) నిత్యకృత్యం అయ్యింది. పవిత్రమైన ఎడిటింగ్ తో సంబంధం లేకుండా...లైవ్ టెలికాస్ట్ లు చేస్తూ...వీలైనంతగా మంటల్లో కిరోసిన్ పోసి...పిచ్చి చర్చలు జరుపుతూ...కుర్ర జర్నలిస్టులతో కాలక్షేపం చేస్తున్నారు ఈ ఛానెల్స్ వారు.

విలేకరులకు శిక్షణ, కాలానుగుణంగా పునఃశిక్షణ (reorientation) ఉండడం లేదు. తప్పులు చేయడం..."పత్రికా స్వేచ్ఛ" పేరుతో తప్పించుకోవడం యథేచ్ఛగా జరుగుతున్నది. తప్పులకు శిక్ష ఉండాలి. తప్పులను, శిక్షలను అంతా గౌరవించాలి.దీనికి అమెరికా వంటి దేశాలలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మనం మాత్రం...శిక్ష పడితే..ధర్నాలు చేస్తాం. యాజమాన్యాలు నిర్దయగా జర్నలిస్టులను ఉజ్జోగాల నుంచి చెప్పాపెట్టకుండా తీసేస్తే...వేల మంది వీధిన పడితే జరగని ధర్నాలు...ఇప్పుడు ఒక ఛానల్ కోసం జరుగుతున్నాయి. 


అన్ని ఛానెల్స్ డీ.డీ., ఏ.ఐ.ఆర్.లలో మాదిరిగా తప్పులు పట్టుకునే "డ్యూటీ ఆఫీసర్" లేదా వృత్తిలో తలపండిన నీతిమంతులైన జర్నలిస్టులతో "అంబుడ్స్మన్" వంటి వ్యవస్థలను నిర్మించుకోవాలి. 

అసలు జర్నలిస్టు సంఘాలు గట్టిగా ఉంటే..ఈ సమస్య రాదు. నీతికి కట్టుబడి జర్నలిజం చేసే జర్నలిస్టులు లేక పోలేదు కానీ...యజమానుల నుంచి వారిని ఆదుకునే జర్నలిస్టు సంఘాలు లేవు. తరతరాలుగా జర్నలిస్టుల నేతలుగా చెలామణి అవుతున్న వారు...స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుని...సదాలోచన పరులైన...నీతిమంతులైన జర్నలిస్టులకు పట్టం కట్టడం తక్షణావసరం. 

యజమానుల అఘాయిత్యాలకు చెక్ పెట్టి...నీతికి కట్టుబడే జర్నలిస్టులకు అందదండా అందించే ఒక నూతన వ్యవస్థ ఆవిష్కృతం కాకపోతే...మీడియాలో నీతే బతకదు. ఆదుకునే నాథుడు లేకపోవడంతో....బతుకు తెరవు కోసం...జర్నలిస్టులు యజమానుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ క్రమంలో వృత్తిలోకి తాలు సరుకు వచ్చి చేరుతున్నది. ఈ అరెస్టులను అందరూ ఒక గుణపాఠం గా భావించాలి. ఈ రూల్స్, అరెస్టుల  బూచిని చూపి జర్నలిస్టులు యాజమాన్యాల కక్కుర్తి, ఛీప్ ట్రిక్ లు నిలువరించవచ్చు. పరమ పవిత్రమైన ఈ వృత్తిని కాపాడుకోవడానికి, ఇందులో నైతిక విలువలు పునరుద్ధరించడానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు. 

12 comments:

చదువరి said...

"పరమ పవిత్రమైన ఈ వృత్తిని కాపాడుకోవడానికి, ఇందులో నైతిక విలువలు పునరుద్ధరించడానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు." -ఔన్నిజం! మీ అభిప్రాయం విస్పష్టంగా చెప్పారు. ఈ టపా చూడక, మీ గతా టపాలో మీ అభిప్రాయం గురించి అడిగాను. తరవాత చూసానిది.

Saahitya Abhimaani said...

Ramu gaaroo,

I just wonder is it possible in the present mileu. Is there any good journalists left now among the lot? Like the Cinema world degenerated with pure commercialisation, News papers and TV channels are also polluted with people selling news as a product. The ill effects of commercialising news we are seeing.

There is very necessity for an Ombudsman system to contain the media. Otherwise, they would ultimately incite people to a level where even brothers would fight.

If government does something about this Ombudsman system, the so called champions of free press shoult "foul" and the same people do not have any capacity or inclination to cleanse the so called media.

General public have to use their discretion in whatching channels and discard useless channels. That is the only control.

విశ్వామిత్ర said...

బాగా చెప్పారు. మీ కులంవాళ్ళెవరైనా (మీడియా కులం) ఈ టపా చూస్తే మిమ్మల్ని వెలివేస్తారు జాగ్రత్త :)

Anonymous said...

mr ramu bhai
u r right
i agree with u

thimmappa

kvsv said...

ఒక్కటి మాత్రం నిజం సార్ య్ర్ది కరెక్ట్ యేది రాంగ్ అన్నది తేల్చుకోలేకపోతున్నాం రేపు మరి యేక్కడినా మాటర్ దొరికితే టివి5 కి దొరికినట్టు ప్రసారం చేయ్యోచ్చ లేదా లేకుంటే..చెయ్యకుంటే నిజాలు బూస్టాపితం అయ్యే అవకాశం లేదంటారా ?యేది నిజం?యేది అబద్దం?దేనిని ప్రసారం చేయకూడదు?చేయకపోవడం వల్ల యన్ని సత్యాలు మరుగున పడిపోతయ్యో?

taTi maTTa said...

రామోజీ గారు తన మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినపుడు ఈనాడు మొదటి పేజీ రైట్ టాప్ కార్నర్ లో తన వివరణ వేసుకొనే వారు. శుక్రవారం ఈనాడు మొదటి పేజీ రైట్ టాప్ కార్నర్ లో రిలయన్స్ వివరణ/ఖండన వేశారు. 26 శాతం వాటా కారణం అంటే నమ్మొద్దు.

శనివారం ఈనాడు మొదటి పేజీలో ప్రభుత్వం చర్య తీసుకోవాలనే డిమాండ్ తో రిలయన్స్ యాడ్, పక్కనే ఈనాడు ఎడిటోరియల్ ఇండికేటర్ "రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?" వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదని బాబులాగా ఈనాడుకు గురువారం రాత్రి నుంచే తెలిసింది.

Saahitya Abhimaani said...

KVSV JEE

మీడియాలో పని చేస్తున్న ఒకాయన పార్కుకి వెళ్ళాడు. ఊసుపోక శనక్కాయలు కొన్నాడు. అవి తిని ఆ కాయితం పారేద్దామనుకున్నాడు. కాని ఆ కాయితంలో ఉన్న విషయం అతనిలోని జర్నలిస్టును(!?) నిద్రలేపింది. వెంటనే ఆ కాయితాన్ని అల్లాగే పట్టుకుని స్టుడియోకి పరుగు పరుగున వెళ్ళాడు. బ్రేకింగు న్యూస్ అని. ఆ కాయితాన్ని జూం చేసి హై లైటు చేసి చూపిస్తూ, మాటలు తడబడుతూ గోల గోలగా మాట్లాడాడు. ఆ పల్లి అమ్మిన వాణ్ణి లాక్కోచ్చి ఆ కాయితం ఎక్కడిది అని వాణ్ణి లైవ్ లో ఆరా తీశారు. ఆ కాయితంలో ఉన్న విశేషాలు రక రకాలుగా విశ్లేషించి చర్చలు పెట్టారు. చివరికి చూస్తే, ఆ కాయితం పిచ్చాసుపత్రిలో ఉన్న పేషంట్ల కోసం కొద్ది కొద్దిగా అప్పుడే తగ్గుతున్న వాళ్ళు తయారు చేస్తున్న గోడ పత్రిక తాలూకుది అని తేలిందిట. ఇదంతా చూసి ఎప్పటిమట్టో షాపులు లూటీ చేద్దామనుకునే వాళ్ళు దొరికిందే సందని వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేరు.

"ఒక్కటి మాత్రం నిజం సార్ ఏది కరెక్ట్ యేది రాంగ్ అన్నది తేల్చుకోలేకపోతున్నాం రేపు మరి యేక్కడినా మాటర్ దొరికితే టివి5 కి దొరికినట్టు ప్రసారం చేయ్యోచ్చ" అని మీరు బాధపడుతున్నారు, సంశయం వ్యక్తపరుస్తున్నారు. మెటీరియల్ దొరికినప్పుడు, అదేమిటి, ఎక్కడిది, మనకు వచ్చిన మూలం సరైనదేనా, అన్నిటికి మించి, ఇటువంటిది చూపిస్తే ప్రజల్లో ఎటువంటి ఆవేశాలు వస్తాయి అన్నవి చూసుకోవాలి. ఏదో మటీరియల్ దొరికిందికదాని, గోల మొదలుపెడ్తే ఎలా ఒక్కోసారి దొరికిన మటీరియల్ను ప్రసారం చెయ్యకుండా పోలీసులకు పోలీసులకి ఇవ్వాల్సి రావచ్చు.

ఇప్పుడున్న పత్రికలను వినోదానికి మాత్రమే మార్చిన ఘనత దక్కించుకుని, ప్రాసల గోల హెడ్లైన్లలో మొదలు పెట్టిన పత్రిక ఒకటి 1979లో అనుకుంటా స్కై లాబ్ గురించి చేసిన గోల వల్ల అనేకమంది అమాయక జనం ఎంత తల్లడిల్లిపోయారు. అదే ప్రధమం, మీడియాలో సంచలనాలకి. అప్పుడే కట్టడి చేసుంటే బాగుండేది.

Ravi said...

నిరాధారమైన వార్తలతో... సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించే వారికి... అందుకోసం అమాయకులైన, నిఖార్సైన జర్నలిస్టులను వాడుకునే వారికి ఇదో చెంపదెబ్బ కావాలి. టీవీ 5 ముసలి జర్నలిస్టుల అరెస్ట్ ను చూసైనా మిగతా ఛానల్స్ వారి స్టాండ్ మార్చుకుంటే బావుంటుంది. యాజమాన్యాలు ఇప్పటికైనా తమ పద్దతులు మార్చుకోవాలి. యాజమాన్య వైఖరికి సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్న వారు తొత్తులుగా వ్యహరించడం మానుకుంటే జర్నలిజం విలువలు నశించకుండా ఉంటాయి. అసలు ఛానల్ ప్రారంభించే ముందు పెట్టుకున్న ఎజెండా మానేసి... పనికి మాలిన, సిగ్గుమాలిన విషయాలపై ఫోకస్ చేయడం గర్హించాల్సిందే. ఇప్పటికైనా ఈ అరెస్ట్ ల ద్వారా అసలు విషయాలను తెలుసుకుంటారని ఆశిద్దాం...

Ravi said...

నిరాధారమైన వార్తలతో... సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించే వారికి... అందుకోసం అమాయకులైన, నిఖార్సైన జర్నలిస్టులను వాడుకునే వారికి ఇదో చెంపదెబ్బ కావాలి. టీవీ 5 ముసలి జర్నలిస్టుల అరెస్ట్ ను చూసైనా మిగతా ఛానల్స్ వారి స్టాండ్ మార్చుకుంటే బావుంటుంది. యాజమాన్యాలు ఇప్పటికైనా తమ పద్దతులు మార్చుకోవాలి. యాజమాన్య వైఖరికి సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్న వారు తొత్తులుగా వ్యహరించడం మానుకుంటే జర్నలిజం విలువలు నశించకుండా ఉంటాయి. అసలు ఛానల్ ప్రారంభించే ముందు పెట్టుకున్న ఎజెండా మానేసి... పనికి మాలిన, సిగ్గుమాలిన విషయాలపై ఫోకస్ చేయడం గర్హించాల్సిందే. ఇప్పటికైనా ఈ అరెస్ట్ ల ద్వారా అసలు విషయాలను తెలుసుకుంటారని ఆశిద్దాం...

Anonymous said...

At the surface this event seems related to Journalism and free press, but I think if we connect dots, this is a step to create media wars to scuttle Telangana news coverage by some media houses.

Telagana agitation has three core elements

- KCR
- Media coverage especially TV9
- Students

KCR fasting coverage is popularized by TV9 and which made other channels to follow. 24/7 coverage has given enough oxygen to the Telagana movement. Students agitation added necessary fuel to spread the movement. After famous Dec 9th announcement by Govt. of India, AP state is divided over regional basis. Competing agitatons happend over regional basis. The longer the state was fighting over regional divisions, better were chances for Telagana state.

However, someone is performing surgical seperation of three core elements of Telangana movement.

First, students agitation was accused of infilitrated with anti-social elements. Soon number of students were arrested. Attempts made to seperate students from Telangana political parties (esp KCR). When students organized Gharjana, political parties were not allowed.

Second, KCR is marginalized by bringing him to Delhi in context of consultations. Without KCR, all other Telangana leaders (cong/TDP) are direction less.


Third, an attempt is made to create media wars to target TV9 and divert attention away from Telangana. Interestingly, tactics used by TV9 to fuel telangana movement are used against them. It is TV9 which popularized political drama in context of News Analysis and discussion and provided 24/7 coverage of news of THEIR CHOICE.
Now similar tactic is used to create media wave out of YSR death, when finally govt stepped in arrested 3 channels, Govt excluded TV9. The incident is enough to fuel media wars. It also brings media coverage into question.

So the three core elements of Telangana movement are weakened through different tactics. One wonders who is behind this power politics. Any guess?

At the end of the day, any movement has ultimate goal to realize political power. Telangana movement is no different. But I am truly sorry for lives lost our agitation.

Anonymous said...

రాము గారు...
మీడియా లక్షణ రేఖ గురించి పదే పదే ఆందోళన వ్య క్తం చేసే మీరు.. రేఖ గీయడానికి ఇదే మంచి తరుణమని భావించడంలో, ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీ ఆశ ఆడియాశగానే మిగిలిపోతుందని నా భావన. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీడియా మెడలో గంట కట్టే ప్రయత్నాలు చాలా జరిగాయి. కానీ ఎవరి ప్రయత్నం కూడా సఫలం కాలేదు. ఇప్పడు అదే జరుగుతుంది. ఎందుకంటే మీడియా రెండు వర్గాలగా చీలిపోయింది.. సీమాంధ్ర, తెలంగాణలానే ఇక్కడ కూడా వెర్టికల్ డివిజన్.. కాబట్టి మీరనుకునే రేఖ అందరికి ఆమోదయోగ్యమవుతుందని నేను అనుకోను. .

ఇక ఐదులు, తొమ్మిదుల గొడవల దగ్గరకొద్దాం. రిలయన్స్ ఆస్తులు ధ్వంసమైతే అయ్యాయి గాని.. కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభించింది. మీడియా పార్టీల రెండు వర్గాలగా చీలిపో్యిందన్న విషయం ప్రజలకు తెలుసు. సాక్షి అంటే కాంగ్రెస్ .. ఆ రెండు పత్రికలంటే తెలుగుదేశం.... ఇలా..
అయితే ఇప్పడు తెలిసిన కొత్త కోణమేంటంటే... ఛానల్స్ లాయల్టీస్ టువార్డ్స్ కార్పొరేట్ కంపెనీస్. ఇది నిజంగానే కొత్త విషయం. ఇన్నాళ్లు కార్పొరేట్ యవ్వారాలు హోటల్ కారిడార్లలోనో .. పార్టీ కార్యాలయాల్లోనో... మంత్రుల ఆఫీసుల్లోనో గుప్ చుప్ గా జరిగిపో్యేవి. . ఇక ఛానళ్లు సాక్షిగా కార్పొరేట్ రంకు కూడ బహిరంగంగా జరగనుంది. ఇది చివరకు ప్రజలకే మేలు చేస్తుందనేది నా భావన. ఏమంటారు.

keshav said...

www.apmediawarzone.blogspot.com loo january 6 th na oka item raasaaru. anduloo ys jagan NTV TV5 loo investment chesi tanu cheppinatte media grip loo pettukoovadaaniki praytnaalu chestunnatlu rasaaru. next day ade jarigindhi. TV5 modalu pettadam sakshi, ntv continue cheyadam...
cinema modalu kaaka munde battabayalayyindi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి