Friday, February 12, 2010

'ఈనాడు' పేపర్--సీ.ఎం.రోశయ్య--సినీతార బూతుబొమ్మ

మళ్ళీ అదే ఫార్ములా! మొదటి పేజీలో ప్రముఖంగా ముఖ్యమంత్రి రోశయ్య బొమ్మ ప్లస్ వార్త, సినిమా పేజీలో ఒక బూతు బొమ్మ. కొత్త ఆలోచనలు, మంచి వార్తలు కరువైన 'ఈనాడు' పత్రిక గత కొన్ని రోజులుగా ఇదే ఫార్ములా మీద బతుకుతున్నది.

నిన్నా, మొన్నా..రోశయ్య గారు మంత్రులతో జరిపిన సమీక్ష సమావేశాలను బ్యానర్ గా ప్రచురించిన 'ఈనాడు' ఇవ్వాళ ఏకంగా ఆయన ఇంటర్వ్యూ ను ప్రముఖంగా ప్రచురించింది. అదేదో బ్రహ్మాండం బద్దలయ్యే ఇంటర్వ్యూ కాదు...."పరిస్ధితులు సర్దుకుంటాయి" అని ఆయన గారు భరోసా ఇచ్చిన ఇంటర్వ్యూ. మళ్ళీ ప్రాధాన్యతల సమస్య!


"అన్నం పెట్టే వాడికే కన్నం" అన్న శీర్షికన రైతులకు సంబంధించిన వార్త ఐదో పేజీకి పరిమితం అయ్యింది. ఒక మంత్రి సన్నిహితుడు అదేదో మోసానికి పాల్పడుతున్నట్లు ఉన్న వార్తకు మొదటి పేజీకి కావాల్సిన గుణాలు ఉన్నాయి. అలాగే...లోపలి పేజీలలో మొత్తం రోశయ్య ఫోటోలు నాలుగు వాడారు...కావాలనో, ముఖ్యమంత్రి కాబట్టో!

కామపిశాచులను మార్చలేంగదా. సహజశైలికి అనుగుణంగానే...సినిమా పేజీలో "నేను సర్దుకుపోలేను" అనే శీర్షిక కింద మమతా మోహన్ దాస్ ఇంటర్వ్యూ ప్రముఖంగా వేసింది 'ఈనాడు.' దానికోసం వాడిన ఫోటో అభ్యంతరకరంగా ఉంది. ఆ అమ్మాయిని సెక్సీ గా చూపే వెర్రి ప్రయత్నం. అందులో విలేకరి వేసిన చివరి ప్రశ్న, జవాబు ఇలా ఉన్నాయి.

ప్రశ్న: ప్రత్యేక గీతాలకీ, బికినీల విషయంలో మీ పద్ధతేమిటి? 
జవాబు: కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమైతే ప్రత్యేక గీతాలకు ఆలోచిస్తాను. బికిని వేసుకోను. బికినీ వేసుకుని అంగాంగ ప్రదర్శనలిస్తేనే గ్లామర్ గా కనిపించినట్లు....అని ఏ శాస్త్రంలోనూ రాయలేదు. చీర కట్టుకున్న వారిని కూడా కెమెరా కన్ను అందంగా చూపుతుందని గ్రహించాలి.


ఈ ప్రశ్న వాక్య నిర్మాణంలో తప్పు ఉందన్న విషయం పక్కన పెడితే..."ప్రత్యేక గీతాలు" అంటే ఏమిటో? ఆమె కోటి అడిగింది కాబట్టి...అది బూతు తరహా ఆల్బం కావచ్చు. ఆ అమ్మాయి బికిని గురించి అంత బాగా చెప్పినా...ఆమె సెంటిమెంట్ ను గౌరవించకుండా....బూతు ఫోటో వాడడం ఏం మర్యాద?

17 comments:

రవిచంద్ర said...

ఆమె ఎంత మర్యాదగా చెప్పినా.. ఆ బూతు ఫోటోకు ఫోజిచ్చింది కూడా ఆమే కదా!.. అలా అని ఆ ఫోటో వేయడాన్ని సమర్థించడం లేదు. కామ పిశాచాలైన నిర్మాతలున్న ఈ పరిశ్రమలో వారి కోరిక మేరకు తమ మనుగడ కోసం నాయికలు ఇలాంటి ఫోటోలకు ఫోజులుస్తుంటారన్నది కాదనలేని నిజం.

Anonymous said...

i found your blog 2 days back in Jalleda, from then Im reading continuously.
Reading eenadu is my first priority job every morning.when I was reading news today morning I had the same feel what u wrote here.

Anonymous said...

నేననుకోవడం - ప్రత్యేక గీతాలంటే ఐటెమ్ సాంగ్స్. కథతో సంబంధం లేని వ్యాంప్ నృత్యపాటలు.

Anonymous said...

I agree with Mr. Ravi Chandra.

Anonymous said...

I completely agree with you.
Now a days, AJ is better than Eenadu.

-Venkat

JP said...

Andariki SivaRatri Subhakamshalu.

Always i repeat all problems in this world will solve by spritual education.

There is no other alternative.

this is what great sage ramana maharshi requests us to follow "self-enquiry" method in each and every action we do

1)
What will that heroine gets when someone gives her 1 croe for behaving irresponsibly and exposing her body which is made of flesh and bones?

Ans: She thinks that she gets happiness when she has all luxuries in the world with more money which is again acting with ignorance due to lack of knowledge(spiritual)

2) what will that newspaper get when they try to print these interviews showing those horrible photos?

Ans: more circulation which means more money and which means again doing the same mistake as the above heroine is doing.

Common Solution: Read sacred scriptures like Bg Gita and live a peaceful life.

Anonymous said...

హహహా....

"ఆమె సెంటిమెంట్ ను గౌరవించకుండా....బూతు ఫోటో వాడడం ఏం మర్యాద? " ఆమె సె౦టిమె౦ట్ ని గౌరవి౦చాడు కాబట్టే ఆమె చీరకట్టును చూపి౦చాడు. మీరు "రామా" అ౦టే బూతు అనేట్టున్నారు, పాప౦ అతనే౦ చేస్తాడు.

మీరు చివరి సమాధానాన్ని సరిగ్గా అర్థ౦ చేసుకోలేదు.

బికినీ వేసుకుని అంగాంగ ప్రదర్శనలిస్తేనే గ్లామర్ గా కనిపించినట్లు....అని ఏ శాస్త్రంలోనూ రాయలేదు. చీర కట్టుకుని కూడా అ౦తే అ౦గా౦గ ప్రదర్సనలివ్వచ్చు అని చదువుకోవాలి.

అనవసర౦గా నిర్మాతలనె౦దుకు ఆడి పోసుకు౦టారు. అదీ కోటి రూపాయలిస్తే సిద్దమ౦టో౦దిగా...చూసేవారికి,చూపి౦చేవారికీ లేనప్పుడు...నిర్మాతనె౦దుకు ఆడిపోసుకు౦టారయ్యా!!

రవిచంద్ర said...

నాలుగో అనామకులుగారూ! నిర్మాతలు కోరకపోతే.. ఒకప్పుడు నిండు చీరకట్టుతో దర్శనమిచ్చే హీరోయిన్లు ఇప్పుడు అంత కురచ బట్టలేసుకుని మీలాంటి రసికుల్ని ఎందుకు రంజింపజేస్తున్నారు?

Anonymous said...

రవిచ౦ద్ర గారూ,

ఆవేశపడక౦డి. మీరు ప్రశ్న సరిగ్గా అడగలేదు. మీ ప్రశ్నకు నా సమాధాన౦ అప్పుడే చెప్పాను...ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను.

కోటి రూపాయలు తీసుకుని తమ కళా సేవ చేసే వారున్నారు, ఆ కళా సేవతో తరి౦చే నా లా౦టి రసికులున్నారు కాబట్టి నిర్మాతలు ఖరీదైనా గిట్టుబాటవుతు౦ది కాబట్టి తమ వ౦తు కళా పోషణ చేస్తున్నారు.

నాకొక ప్రశ్నకు సమాధాన౦ చెప్ప౦డి. గత౦లో సావిత్రికి ఏ ఐదు/పది లక్షలో ఇచ్చి(అప్పటికి అదెక్కువ అనుకు౦టాను) ఇలా నటి౦చమ౦టే నటి౦చేదా? నటి౦చినా జన౦ చూసేవాళ్ళా?

ఇప్పుడు మన౦ అభివృద్ది చె౦దా౦...ఎ౦తవరకూ అ౦టే, మన బ౦ధు వర్గ౦( తల్లి, చెల్లి, పెళ్ళా౦)తప్ప అ౦దరినీ కసిగా(సారీ సెక్శీగా) చూడొచ్చు. ఇ౦కొన్ని రోజులు పోతే మరి౦త అభివృద్ది... :(


- నాలుగో అనామకుడిని :)

శరత్ కాలమ్ said...

దినపత్రికలు చూసేవారిలో నాలాంటివారూ ఉంటారు. మాలాంటి మెజారిటీ వారికోసం సెక్సీ చిత్రాలు వేస్తారు కానీ ఇక దాని గురించి ఆడిపోసుకోవడం మాని నీతి చంద్రికలు చదువుకోండి.

Ajay said...

శరత్ గారండీ, మరేమో మీరు ఏ వ్యాత్సాయన కామసూత్రాలో చదువుకొక ఇలా నీతిసూత్రలు వల్లించే బ్లాగును సదవడమెందుకో.... :-)

శరత్ కాలమ్ said...

అజయ్ గారండీ. ఇది నీతి బ్లాగు కాదు - మీడియా బ్లాగు. నిజమయిన నీతి బ్లాగుల ముఖమే చూడను. అవన్నీ చెప్పడానికి, వినడానికి మీలాంటోల్లకి బాగానే వుంటాయి.

Anonymous said...

earlier i wrote that, kama pisachi is not the producer or journo, but the readers. i gave reasons for that. it is vindicated by 4th anonymous & sarath in their comments.

i strongly protest against rejecting my comment.

you are refusing to understand the reality.

i decide NOT to come back to this blog, if you resort to such irrational censoring.

5th Anonymous.

Ramu S said...

Hey dear 5th ano..
Generally I don't censor any comment since I value your comments a lot. It seems I didn't receive it at all. If you had already decided not to visit my blog, I am helpless.
Cheers
Ramu

రవిచంద్ర said...

@నాకు సమాధానం ఇచ్చిన వ్యాఖ్యాతకు
సారీ అండీ! మీ వ్యాఖ్యను నేను సరిగా అర్థం చేసుకోలేదు. నా మొదటి వ్యాఖ్యలో నా ఉద్దేశ్యం రానురాను నైతిక విలువల్ని కోల్పోతున్న సినీ పరిశ్రమకు హీరోయిన్లు, నిర్మాతలు కూడా కారణ మన్నది నా ఉద్దేశ్యం.మీరు నిర్మాతలనెందుకు ఆడిపోసుకుంటారు? అనేసరికి కొంచెం ఆవేశంలో అలా అనేశాను. మీపై వ్యక్తిగత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను.
మరోసారి సారీ :-)

Ramu S said...

రవిచంద్ర గారు, అనానిమస్ గారు...
మీ స్ఫూర్తికి థాంక్స్. ఈ విషయం ఇంతటితో ముగిసినట్లే భావిద్దాం. ఇక మీద కూడా మీ భావాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు మనస్ఫూర్తిగా రాయండి. మనమంతా చర్చించుకుందాం. నా పోస్టుకు స్పందనగా కాకపోయినా...ఏ అంశంపైనైనా మీ పరిశీలనను రాసినా మంచి చర్చ జరపవచ్చు. అనానిమస్ గారు...మీరు మీ నిర్ణయం మార్చుకుని...మళ్ళీ ఈ పోస్టులు చదివి స్పందించాలని...కోరుకుంటూ....మీ రాము

Anonymous said...

Ramu gari prayatnamloo nijaayitini vadileesi charcha eto pootondi. evadi gola vaadidi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి