Friday, March 26, 2010

'ఆంధ్రజ్యోతి'ది ఎల్లో జర్నలిజమా...కాదా?

'మీడియాను కొట్టి...మొగసాల కెక్కిన మెగాస్టార్' అనే శీర్షిక...'రివర్స్ రాజ్యం' అనే డెక్ తో... ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు మొదటి పేజీలో ప్రచురించిన వార్త ఒక పరువు తక్కువ ఛీప్ జర్నలిజం. ప్రజలకు పత్రికలు, విలేకరుల మీద గౌరవం, నమ్మకం పోవడానికి ఇలాంటి బాధ్యతారహిత కథనాలే కారణం. మనం ఏది రాసినా...భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద కొట్టుకుపోతుదన్న దుర్భ్రమతో ఈ పత్రిక సాగించిన పచ్చి ఎల్లో జర్నలిజం ఇది.  వేమూరి రాధాకృష్ణ గారిని తక్కువ చేయడం...చిరంజీవి గారిని ఎక్కువ చేయడం ఉద్దేశ్యం కాదు కానీ...ఈ కథనం లోపాల చిట్టా..అని చెప్పక తప్పదు.
 
1) ఈ శీర్షిక పూర్తి మిస్ లీడింగ్. మెగాస్టార్ మీడియాను కొట్టాడా? పీ.ఆర్.పీ.నాయకులు దాడి చేసింది 'ABN-AJ' ఆఫీసు మీద తప్ప మీడియా మీద కాదు. ఈ ఛానల్, పేపర్ మీడియాలో ఒక భాగం తప్ప ఇవే మీడియా కాదు. రాధాకృష్ణ గారి జర్నలిజం చాలా మంది జర్నలిస్టులకు అభ్యంతరకరం. చిరంజీవి పై ఆ చానెల్ కథనం, మాటలు జర్నలిజం సూత్రాలకు లోబడని ఒక పరమ అభ్యంతరకరమైన కసరత్తు. తప్పు తెలుసుకోకుండా...పేపర్, ఛానల్ ను అడ్డం పెట్టుకుని...ఒక పార్టీ పై విషం చిమ్మడం...కచ్చితంగా ఎల్లో జర్నలిజమే అవుతుంది.

2) ఈ కథనానికి, దానికి వాడిన చిరంజీవి ఫోటోకు సంబంధం లేదనేది పక్కనపెడితే...అది ఒక దారుణమైన లీడ్. "కేంద్రం ఉద్వాసన చెబితే కిమ్మనకుండా..తిరుగు టపా కట్టిన తివారీ!.."అంటూ వున్న ఒక వాక్యం బాధ్యతారాహిత రాతలకు నిదర్శనం. వీళ్ళ బాధ కేంద్రం ఉద్వాసన చెబితే...తివారీ కిమ్మనకుండా వెళ్లినందుకా? ఏమిటీ అర్థం పర్థం లేని రాతలు?

3) ఈ కథనం అంతా...వ్యాఖ్యల మాయం. దీని బదులు...వేమూరి గారు స్వసంతకంతో ఒక సంపాదకీయం రాస్తే బాగుండేది. ఆదిత్య పేరుతో...విషం చిమ్మినా...అర్థం చేసుకోవచ్చు కానీ...ఇదేమి మాటల దాడి? ఇందులో ఆద్యంతం చిరంజీవిపై విషం చిమ్మారు. "కట్లు కట్టుకుని...కట్టు కథనాలు వినిపించారు," "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.." అని ఏదేదో రాసారు. ఇది ప్రాస వికారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు. చిరంజీవి ఈ రాతల మీద కోర్టుకు వెళితే...ఆ పత్రిక మీద కోలుకోలేని అద్భుతమైన పరువు నష్టం దావా వేయవచ్చు.

4) పీ.ఆర్.పీ. ఎంఎల్యేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించడాన్ని అడుగడుగునా ఎద్దేవా చేసారీ కథనంలో. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు...తమ నేత మీద ఒక మీడియా హౌజ్ దాడిని సీ.ఎం.దృష్టికి తీసుకు వెళితే...దాన్ని హుందాగా స్వీకరించకుండా...ఇలా దాడి చేయడం దారుణం. పీ.ఆర్.పీ.గుండాలు రాళ్ళతో దాడి చేస్తే...మన వేమూరి బృందం...అక్షరాలతో దాడి చేసింది. ఇది రాసిన, ప్రచురించిన జర్నలిస్టులకు సిగ్గుచేటు. షేం.

5) తివారీ విషయంలో ఈ ఛానల్ "కత్తిమొన మీద నిలబడి" ఆపరేషన్ చేసిందని రాసుకున్నారు. ఇది నిజమా?

6) ఒకప్పుడు సాధారణ పాత్రికేయునిగా ఉన్న ఛానల్ ఎం.డీ. స్వల్ప వ్యవధిలోనే కోటీశ్వరునిగా ఎదిగారని....పీ.ఆర్.పీ. నేతలు ఆరోపించారు. ఈ అనుమానం మీడియాలో, మీడియా బైట చాలా మందికి ఉన్నాయి. దానికి దమ్ముంటే...వివరణ ఇవ్వాలి గానీ...అలా అడగడం తప్పు అన్నట్లు రాస్తే ఎలా?

7) నిజానికి ఎం.ఎల్.ఏ.లు చేసిన డిమాండ్లలో తప్పేమీ లేదు. 20 నుంచి 23 వరకు జరిగిన సంఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలి. దాడులు ఆగాలనే...ప్రభుత్వం నిజంగానే ఆ పని చెయ్యాలి. ఎల్లో జర్నలిజాన్ని నిరోధించాలి. 


8) చివరకు...ఒక ఐదు పంక్తుల ఎర్ర పేరాతో కథనాన్ని ముగించింది. "ఒక రాజకీయ పార్టీ మీడియా మీద దాడి చేసి..అంతటితో ఆగకుండా తగుదునమ్మా అంటూ...మళ్ళీ తానే ప్రభుత్వం దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చెయ్యడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు!" అన్న పచ్చి అబద్ధాన్ని రాసుకున్నారు. 


రాధాకృష్ణ గారూ...మీరు జర్నలిజంలో నైతిక విలువలు లేని కథనాన్ని ప్రసారం చేశారు....చట్టంతో సంబంధంలేకుండా పీ.ఆర్.పీ.వాళ్ళు దాడులు చేశారు. దొందూ దొందే. ఇది ఇద్దరి తరఫునా జరిగిన బాధ్యతారహితమైన పని. వై.ఎస్. బతికి ఉండగా....చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసే వరకూ....ఆయనకు అనుకూలంగా కథనాలు రాసిన మీరు....వై.ఎస్.మరణం తర్వాత ప్రసారం చేస్తున్న కథనాలు మీకేదో...రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా  చెబుతున్నాయి. జనంలో ఉన్న అనుమానాలు నివృతి చేయకుండా....ఇలాంటి విద్వేషపూరిత రాతలతో తెలుగు జర్నలిజాన్ని మరింతగా అథఃపాతాళంలోకి తొక్కకండి.

30 comments:

Anonymous said...

Radha krishan ni chusi chala mandi sampadinchadam modalu pettaru journalistlu. Asalu Radha krishna nu marketlo lekunda cheyyali. Ika Ravi Prakash ni chusi entha mandi start chestharo chudali. Prathi journalist oka paper, oka channel pettadaniki try chestharu... atleast 1% success aina chalu media pani govinda... Aina medialo pani chese vallu enduku thamanu thamu goppaga vuhinchukovadam? Anni rangallo manchi vallu, chedda vallu vunnatte medialo kuda vuntaru. Ravi Prakash paper success avuthundi, athanu oka Hero avuthadu... kani evariki prayojanam? Paper success kavadaniki cheyyalsina sanchalanalu Ravi daggara fullga vuntayi... kastha differentga chupinchi, koncham chorava chupithe chalu easyga success avochu. Peddaga peekalsina avasaram ledu kani danike pedda greatga feel avuthadu Ravi Prakash. Radha krishna ku antha seen ledu ani thelisina konnallu opika pattali thappadu. Rawmoji, Radha krishna, Ravi Prakash, Jagan veellalo evaru marketlo lekunda povali...

Anonymous said...

ఈ నియో క్షేత్రియులు అన్ని వ్యవస్థలని తమ స్వార్ధ ప్రయోజనాలకొరకు/డబ్బు పిచ్చి /వర్గ పిచ్చి కొరకు దారుణం గా, అన్ని విలువలను పణంగా పెట్టి దేశం కోలుకోలేని విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు.రానున్న రోజులలో వీరి వలననే నక్సలైట్ల వైపుకి జనం మొగ్గు చూపుతారు. ఎందుకంటె ప్రజాస్వమ్యం బలహీనతే మావోయిస్టుల బలం కనుక. మనకుందిలే మంచి కాలం ముందు ముందునా ...

Anonymous said...

Thikka channels ki, kampu pathrikalaku HMTV check pettali.

Unknown said...

మనకి సమస్య తెలిసింది, కాని దానికి పరిష్కారం కనుగొనలెకపొతున్నాము.

Anonymous said...

I appreciate your impartial views.

Anonymous said...

Shame on Radha krishna. In a way he is helping chiru. More and more are symphathizing with chiru now. Its a matter of time now for ABN and AJ to face the music.

God save media in Andhra Pradesh.

Anonymous said...

ఆంద్రజ్యోతి పేపర్ + చానెళ్ ను త్వరలో మూతపడనుంది. బాబు వద్ద డబ్బు గుంజడం కోసం ప్రయత్నాలు అనుకుంటున్నరు తెదేపా అభిమనులు. ఆంద్రజ్యోతి తెలంగాణా వైఖరి తీసుకోవడంతో సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ఆంద్రజ్యోతి చానెల్ ను దాదాపుగా కేబుల్ లో కనిపించడం లేదు ఇక్కడ. ఆంద్రజ్యోతిది బ్లాక్ జర్నలిజం. చిరంజీవి ఇదివరకలా మెత్తగా ఊరుకుండటం లేదు. అతి త్వరలో చిరు వార్తాపత్రిక , చానెళ్ళు రాబోతున్నయి. అందువల్ల కడుపుమండి ఆంద్రజ్యోతి ఇలా బురద జల్లుతుందని అందరికీ తెలిసిందే. దాడి పై విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయి అని ఆంద్రజ్యోతి బయపడుతుంది. ఎందరో ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టి పనిలోచి తీసేసిన ఆంద్రజ్యోతి ని జర్నలిస్ట్స్ పాలిట అసలయిన విలన్ .

Anonymous said...

మీరూ ఈ వ్యాసం చాలా బాగారాసారు. keep it up

Anonymous said...

Yellow journalism is ruling and dominating the Telugu media and no newspaper and channel are exceptional to it.Only the English newspapers are not so much perverted of yellow journalism.Without this type of journalism, it looks no media house survives as the things stand today as every one wants to cash on this.I donot know about the media of the rest of the languages in the country and Ramu has to analyse and throw light on this aspect so that we can have more knowledge on the media of other languages with better comparison.
I am sure as long as sun rises in the east our media never changes nor it transforms with moral,ethical,proffessional and human values with dignity and decorum in the proffession of journalism and it is only for our satisfaction to write about how the media is behaving these days and no media house or CEO changes their attitude and behaviour as they never to give any importance to the criticism by any one and moreover no body goes through these blogs at any time.
I feel Ramu must convey the feelings of the blog to the concerned media houses through a seperate mail otherwise the views and comments will be confined to this blog only without any stimulus to the media houses and CEOs.
JP.

lakshman said...

I have put some comments for your previous blogs and appreciated your articles.

Once again this is one more good article.

Intentionally ABN trying to cash by telecasting some news about Megastar.

First up that news is required. In the present situation we have so many issues and we need some good solutions.

Chandra babu esacaping from present telengana issue. That is more important than chiru party.

Why ABN is not focusing on Chiru. This is too bad and once again proved media is corrupted and poluted corporate system.

No need to seek morals or values from the media!

Alapati Ramesh Babu said...

సార్ అసలు శ్రీరాధాక్రిష్ణ గారికి జర్నలిజం అంటెనె విలువ లెదు మరి వారు వారి అంధ్రజ్యొతి కూడా ఈనాడు లా అన్ని నైతిక సూత్రాలు ప్రజలకె గని వారికి ఆవసరములెదు.శ్రీ రాధక్రిష్ణ గారి బాడి లాంగ్వెజి ఎదుటి వారిని వెక్కిరించినటులు గ వుంటుంది. వారు వారి పేపర్ మీద ఇంకా ఘాటుగా స్పందిద్దాము అంటె సభ్యత ఆడ్దుగా వున్నది .

Anonymous said...

శ్రీ రాధక్రిష్ణ గారి బాడి లాంగ్వెజి ఎదుటి వారిని వెక్కిరించినటులు గ వుంటుంది......this is true.I have seen one of his show with ROJA...he asked questions like a stupid.

Anonymous said...

Good Article Sir. I completely agree with you.

Anonymous said...

Ramu garu...! Motthaniki ABN-AJ ni baga uthikesharu. Mee aavedana mee post lo kanipinchindi. Meelanti vallu vunnarane bhayamthonaina AJ management vollu daggara pettukuni vaarthalu rastundi.

Vinay Datta said...

AJ definitely did a good job in case of Tiwari. Heleft without saying anything to the centre but as per a newspaper report, he said that it is the conspiracy of TRS against him for not giving them time and ear to their version of Telangana issue. This is not pardonable. TRS should have agitated against this and made him apologise. They kept quite, maybe, because they wanted a person of that cadre to leave with certain dignity.

Suresh said...

నిజానికి ఈ లోకల్ ఛానెళ్ళెవరికీ ప్రొఫెషనలిజం లేదు. ఏదైనా స్టోరీ టెలీకాస్ట్ అవుతుంటే, అదంతా వళ్ళ గొప్పే అని చెప్పుకోవాలన్న లేకి తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొన్న తివారీ కధనం దగ్గరనించి, అన్ని ఛానెళ్ళూ ఇదే వరస. ఒక్క ఈనాడుకు ఈ యావ కాస్త తక్కువ. యేది చూపించినా మా ఛానెల్లోనే మొదటిసారి అంతూ లేకి బుద్ధి ప్రదర్శించటం అసహ్యం పుట్టిస్తోంది. ఓ పక్క వేరే ఛానెల్లో చూపించేసే వుంటారు. జనం పిచ్చొళ్ళనుకుంటారేమో మరి. ఇక వారి బాడీ లాంగ్వేజి కామెంట్ తో నెను ఏకీభవిస్తాను.

Anonymous said...

"vemuri radha krishna garini thakkuva cheyyadam... chiranjeevi garini ekkuva cheyyadam vuddesham kadu..." Alanti explanations, comparisons avasaram ledu boss... meeru rasindi correct... explanation avasaram ledu...

Anonymous said...

Ravi Prakash ki congress high command daggara influence undi... CC Reddy, YS prothasaham tho paiki vachina vadu Jagan ne debba kottalani chusthunnadu... athi viswasam paniki radu... Ravi futurelo baga debba thintadu...

Chaitu said...

great post. :-)

As a regular reader of ur blog, may I suggest that you (and people like you) can actually start an online newspaper...

We really need a news source which stands neutral..

Anonymous said...

ముందు ఇది చెప్పండి.
మీకు తెలంగాణ ఉద్యమంపై ద్వేషమా?
లేక
చిరంజీవి అంటె అభిమానమా?
ఏ మీడియాపై దాడి జరిగిన మద్దతికచ్చె మీరు, గబుక్కునా ఆంద్రజ్యోతిపై అసహ్యంమేంటి బాసు!

శీను

Anonymous said...

చాలా బాగా రాశారు. అభినందనలు! నిష్పాక్షికమైన మీ
తీరు ఇలాగే కొనసాగించండి!

WitReal said...

I read the said story. Your observations are perfect.

Anonymous said...

This is completely rediculous...what press academy and other bodys doing....Media ...is showing its arrogance..just because of being media....4th estate can not over rule all the pther bosies of a Democracy country. Its our pathetic condition to see these kind of articles by a meadia office head.

1. How can he comment on chirus achievements in a derogatory wat when writing an article about a different incident.

2. Supporting his office in shame less manner.......He himself saying he has own agenda's like supporting TRS, PRP YSR CBN...based on time........this is otter shame on him....he is saying as people did it we did it.......Doesnt he know what the guid book say about journalism....

3. Contracdictory...statements.....

as people wanted a third party into political eraa we supported him......but people are intelligent and rejected him.....is there any meaning in these statements......

4. He showed complete arrogance by saying.....people kept chiranjeevi in deserved place......

" A.P: Here Mafia is far better than media "

VARA said...

Andhra Pradesh: Here Mafia is far better than media"

Anonymous said...

చాలా చక్కని వ్యాసం. slap in the face for radhakrishna and his blind casteist supporters.
చిరంజీవిని ఇలా నిస్సిగ్గుగా కులపిచ్చితో ద్వేషించటం దారుణం.

పుల్లాయన said...

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Anonymous said...

Sir,

eenadu senior most journalist Gouse gaari aarogya, ardhika paristhithi emee bagaaledu. abhimanam unnavadaina Gouse evarinee paisa adige vaadu kaadu. mana boti mitrulam talo cheyi vesi, aayannu aadukundaam. Ramu gaaru..meeru kuudaa indukosam sahakarimchandi.. Gouse gaari number: 9177004900

Anonymous said...

ఆంద్రజ్యోతి పక్కా 420 లా ఉంది .ఆంద్రజ్యోతి ముగ్గురు విలేకర్లు హైదరాబాద్ లో ఇద్దరు టూరిస్టులను రేప్ చేసి డబ్బులు దోచుకున్నరు.పోలీసు కేసు నమోదు అయ్యింది. TV 5 news here :

http://www.youtube.com/watch?v=UnhJ3ZukxTw

Ramu S said...

నా స్పందన...
1) ఒక మిత్రుడు తెలంగాణ ఉద్యమంపై ద్వేషమా? లేక చిరంజీవిపై అభిమానమా? అని అడిగారు. ఈ పోస్టుకు, ఈ రెండు విషయాలకు సంబంధం లేదు. నాకు ఎవ్వరి మీద రాగద్వేషాలు లేవు. 'నువ్వు అటో ఇటో తేల్చుకో' అనే బాపతు వాదన నాకు నచ్చదు
2) WitReal గారికి ప్రత్యేక థాంక్స్.
3) గౌస్ గారి విషయం తెలుసుకుని బాధ పడ్డాను. మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ తో ఆదివారం రాత్రి ట్రై చేసాను. ఫోన్ ఎత్తలేదు. మరొకసారి ట్రై చేస్తాను. ఆయనను ఆ సంస్థే ఆదుకుంటే బాగు.
4) TV-5 క్లిప్ పంపిన మిత్రమా...ఇలాంటి క్లిప్స్ తరచూ పంపండి. ఇలాంటివి సంపాదించే మార్గం చెప్పండి.

రాము

Anonymous said...

sir eey vishayam lo ABN ni neenu support chesthaanu..endukantey ivaala epu andaru dongaley - pedda donga chinna donga ani ledu , antaa dongaley .. .
ikkada emainaa gaani PRP daadi cheyadam tappunnara tappu . vacchi goondalatho daadi cheyadam manchidi kaadu ..

ikka ABN ARTICLE gurinchi cheppalantey , adi PRP VAARI SWAYAMKRUTAAPARAADHAMEY . endukantey aa party puttinappu venolla poguduthu cover chesina newspapers ey nedu thiduthunnayi...

manchi chestham ani vacchi naalugu mandi manchi vallanu party base gaa petti vaallu chesina pani emi ....
kula raajakeeyanni penchadam
dabbu theesukoni seat lu ammukovadam.
goondas ni corrupted people ni teesukovadam .
maarpu maarpu ani mosam cheyatam.
fans ni coolie lu laaga vaadukovadam.
inkaa cheppalantey pedda pustakaaley avutaayi ....

veetini tattukoleka aa naluguru paarty vadili velli poyaaru .
okaru dummu ettil posthe marokaru silent gaa velli poyaaru..

inka party spokesmen secretary inkaa vaalla affairs choosthe evadikainaa navvu aagadu ..( shobha rani maatalu , chirajeevi , pavan kalyan maatalu , inkaa konta mandi MLAs and leaders)

inka telangaana vishayam lo aa party vaalla pillatanam ento arthamainadi..
saamajika telangaana ani annaadaaa , raathriki raathrey dilouge maarchesaadu..... veetini choosi janam thu ani annaru,, telangaana vallainaa andhraa seema vallainaa annaru . maata meeda nilabadaleni vaadu ani.. andaru navvukunnaru....( naaku telisi andhra vaadam ettukovadam kuda edo balapadutaamaney )

ivvanni choosina tharutha iitlanti vaarta nu raaayatam tappemi kaadu anipistundi..

kcr ni kudaa enta tittaru press vaallu vaadu chesina tingara chetalaki ...
congress vaallani titta ledaa.
tdp vaallni kuda tittaru 2004 elections ki mundu . ysr ni ela pogidaaro choodandi...

lokksatta vaallani thittaru..

migataa vaallantha raallu ruvvi daadi cheyalede mari...

pichholla laaga raalu vesi , ayya CM mammalni kaapadu antey navvukoka emanamantaaru sir..

ABN vaallu dongale kaani eey time lo PRP vvaalladey tappu ...kaavalantey court lo paruvu natam daava vesthamani bedirinchalsi unde kaani raalla daadi kkaadu .

aa pichhi pani chesi vaallu inko dongani gelikaaru ..falitham enti.. inkaa burada challicchukunnaru PRP vaallu ..
AREY ABN VAALLU KUDA DONGALEY ANI GURTUNCHUKOVADDAA PRP VAALLU ..

PRP KI TAGINA SHASTHI JARIGINDI ....
KODDIGAA KUDAA LOUKYAM LEKUNDAA MAATLAADINA AA PARTY LEADER ( ABN THONE MAATLADADU) NI CHOOSTHE ANININCHINDI .... EMMANNADO THELUSAA - OKA VELA DAADI CHESTE MEMU 5000 MANDI TO CHESTAAMU KAANI 200 MANDI THO KAADU ANI------- EEY MAATALU CHAALU VAALLA PILLA CHESTALAKI ........

APPATI-ippati sangathi anniti kalapotha , anthe kaani prastutaanidey theesukuntey manaki ABN valle tappu chesaruanipistadi


ETLAA UNDI SIR NAA ANALYSIS ....
PLEASE COMMENT AT....

RAMAKANTHUDU

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి