Saturday, June 19, 2010

నాన్న జీవితం ఓ అద్భుత పాఠం.. సందేశం (ఫాదర్స్ డే ప్రత్యేకం)

పెద్ద పేద కుటుంబంలో పుట్టి...బాల్యంలో అష్టకష్టాలు పడి పదేళ్ళ లోపు వయసులో తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా విద్యార్జన కోసం పట్నానికి పయనమైన బాలుడు. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవన సమరం ఎలా చేయాలో నాకు నేర్పాడు.
*     *     *     *     *     *     *     *     *     *
ఆ పట్నంలో ఆర్థిక ఇబ్బందులతో..ఆ ఇంట్లో ఈ ఇంట్లో వారాలు చేసుకుని తింటూ...సంస్కృతం నేర్చుకుని, ఈ చదువుతో భవిష్యత్తులో లాభం లేదని ఎవరో చెబితే...ఒక పంతులు గారికి శుశ్రూష చేసి ABCD లు నేర్చుకుని, ఆ మరుసటి సంవత్సరమే...మెట్రిక్యులేషన్ పరీక్ష రాసిన విద్యార్థి. అతనంటే నాకిష్టం. ఎందుకంటే...ఏ పనైనా చిత్తశుద్ధితో చేస్తే సాధించ వచ్చని నాకు అమూల్యమైన పాఠం నేర్పాడు.
*     *     *     *     *      *     *     *     *     *
వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో...మూగ జీవాలకు సేవ చేసుకుంటూ...ఎంతో సంతృప్తి పొందిన ఉద్యోగి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విధినిర్వహణలో బద్ధకం పనికిరాదని, చిత్తశుద్ధితో విధి నిర్వర్తించాలని నేర్పారాయన. 
*     *     *     *     *      *     *     *     *     *
వృత్తికి దగ్గరి వ్యాపారం కదా అని...కోళ్ళఫారం పెట్టి లక్షల్లో చేతులు కాల్చుకుని ఆర్థికంగా బాగా నలిగిపోయిన వ్యక్తి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...జీవితంలో ఓటమిని ఎలా స్వీకరించాలో చెప్పకనే చెప్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
వూర్లో ఆరో తరగతిలో ఉన్న కొడుకు ఒక స్నేహితుడితో కలిసి బీడీలు, సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి...కొట్టకుండా, తిట్టకుండా...వేరే ఊరికి తీసుకెళ్ళి ఏకాంతంలో రోడ్డు పక్క నడుస్తూ కౌన్సిలింగ్ ఇచ్చిన తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...పిల్లల్లో  పరివర్తనకు మార్గం దండన కాదని రుజువు చేసారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ఇంటర్మీడియేట్ చదువుతున్న కొడుకు ఇంటి ఓనర్ గారి అమ్మాయిని ప్రేమిస్తున్నాని....చెబితే...."ఒకే...ముందు చదువు సంగతి చూడు...తర్వాత పెళ్లి సంగతి...." అని మళ్ళీ కౌన్సిలింగ్, మనోస్థైర్యం ఇచ్చి...కొడుకు స్థిరపడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం...ఎలాంటి కొర్రి పెట్టకుండా, రాద్ధాంతం చేయకుండా, ఆ అమ్మాయితోనే కొడుకు పెళ్లి అయ్యేలా చూసి పెద్దరికం నిలుపుకున్న తండ్రి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....జీవితంలో ఎంతో కీలకమైన విషయాలను ఓపికతో, ప్రాక్టికల్ గా పరిష్కరించడం నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
కట్నం తీసుకోవడం ఇష్టం లేదని కొడుకు స్పష్టం చేస్తే...అప్పుచేసి మరీ...తన సొంత వూర్లో కొడుకు పెళ్లి చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే....ఇతరులు పెట్టుకున్న సిద్ధాంతాన్ని, నిబంధనలను గౌరవించడం ఎలానో ఆచరించి చూపారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
సొంత తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే...తాను కష్టపడి కూడగట్టి...ఆదుకున్న మంచి అన్న. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...అనుబంధం, ఆప్యాయతల ముందు డబ్బు గడ్డిపోచతో సమానమని నేర్పారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
ముగ్గురు కొడుకులను చదివించి....ఇన్నాళ్ళూ...పెద్దగా సంపాదించింది ఏమీ లేకపోయినా...తృప్తిగా ఉద్యోగ విరమణ చేసి ఆరోగ్యం కోసం వ్యవసాయం, ఆత్మానందం కోసం భక్తి పుస్తక రచన చేసిన పెద్ద మనిషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...గడిచిన దాని గురించి వగచకుండా...శేషజీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నేర్పుతున్నారాయన.
*     *     *     *     *      *     *     *     *     *
అరవై ఆరేళ్ళ వయస్సులో...మొన్ననే...'మన వూర్లో ఒక వృద్ధాశ్రమం పెడితే ఎలా వుంటుంది?' అని ప్రశ్నించిన ఆ మనీషి. ఆయనంటే నాకిష్టం. ఎందుకంటే...విపరిణామాలకు బెదరకుండా....సేవా తత్పరత ఎలా కొనసాగించాలో చెబుతున్నారాయన.

---ఆ బాలుడు, ఆ విద్యార్ధి, ఆ ఉద్యోగి, ఆ పెద్ద మనిషి, ఆ తండ్రి, ఆ అన్న, ఆ మనీషి....ఆయనే మా నాన్న..వెంకటేశ్వర్లు గారు. ఆయన నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఏ తండ్రి జీవితం అయినా...కొడుకులు, కూతుళ్ళకు ఒక పెద్ద సందేశం. తల్లి ప్రేమను, ఫుడ్ ను పంచి పెంచితే...నాన్న మౌనంగా జీవన పోరాటం, ఒడిదొడుకులను ఎదుర్కునే...శక్తి సామర్ధ్యం ఇస్తాడు. మా నాన్న కూడా అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువే. అన్యాయం, దారుణంపై నిర్మొహమాటంగా గొంతెత్తడం, నిష్టురమైనా, ఎందరు నొచ్చుకున్నా...నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం...ఆయన నుంచి అబ్బిన లక్షణాలు. ఈ కింది ఫోటోలో ఎడమ వైపున ఉన్నది మా నాన్న, కుడి వైపున ఉన్నది హేమ నాన్న, మధ్యలో ఉన్నది నా పుత్రరత్నం ఫిదెల్.
రెక్కలు వచ్చి గూడు వదిలి రావడానికి ముందు నేను, తమ్ముడు, అన్నయ్య, నాన్న...కొన్నేళ్ళ పాటు ఇంటి ముందో, పక్కనో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఆ రోజులు తడి ఆరని తీపి గుర్తులు. జీవితం లో నాకు ఒక దాని వెంట ఒకటి విజయాలు లభించినప్పుడు...ఆ సమాచారం తెలుసుకునేటప్పుడు మా నాన్న కళ్ళలో వెలుగు, పెదాలపై నవ్వు కోట్ల పెట్టు. అలాగే...వివిధ గ్రంథాల సారాన్ని, తన అనుభవాలను కలిపి తాను రూపొందించిన "ఆత్మ శోధన--యోగ సాధన" పుస్తకాన్ని నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లో పండితుల చేతుల మీదుగా ఆవిష్కరించినప్పుడు కూడా ఆయన పడిన ఆనందం ఎంతో తృప్తినిచ్చేది. నేను, నాన్న, ఫిదెల్, తమ్ముడు కలిసి కూచొని క్రికెట్ లేదా ఫుట్ బాల్ మ్యాచ్ టీ.వీ.లో చూడడం నాకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి.

తల్లులను తక్కువ చేయడం కాదు కానీ...జీవితం లో తండ్రి పంచే వాత్సల్యం, నేర్పే జీవిత పాఠాలు అమూల్యం, అద్భుతం. తల్లి ప్రేమకు గానీ తండ్రి వాత్సల్యానికి గానీ సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఏమీ లేవు. మన తల్లిదండ్రులు నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని, వారికి దగ్గరుండి సేవ చేసుకునే బుద్ధి, శక్తి సామర్ధ్యాలు పుత్రులలో పెరగాలని ఆశిస్తూ..... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

25 comments:

Saahitya Abhimaani said...

అద్భుతంగా వ్రాశారు. మీ నాన్నగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి.

Vinay Datta said...

My hearty greetings to your father and Hema garu's father, yourself and your brothers.

Your son resembles your father very much.

Your post reminded me of my father's hard work and sacrifices. Greetings to him, too.

ramnarsimha said...

Very nice..

Thanq..

తృష్ణ said...

very very inspiring sir...greetings to your father on this occasion.

premade jayam said...

చిన్న చిన్న తెలుగు పదాలతో ఎంత బాగా రాయోచ్చో చేసి చూపించారు.

Sitaram said...

మీ రచనలోని సున్నితత్వం, మంచి విలువల తపనా, మానవ సంబంధాల పట్ల ఆప్యాయతా అన్నీ ఇక్కడ అద్దంలో మాదిరి కనిపిస్తున్నాయి.

ఇలాంటి వ్యక్తుల గురించీ, అనుభవాల గురించీ మరింత రాయండి.

అఫ్సర్

--
Office: Homer Rainey Hall 3:102,
Asian Studies, University of Texas
Austin, Texas 78731.
http://www.utexas.edu/cola/depts/asianstudies/faculty/mam5786

Residence:

Afsar Mohammad
7303 Wood Hollow Dr, #505
Austin, Texas 78731 USA

Phone: 512-535-5895
Blog: afsar2008.wordpress.com

Praveena said...

Beautifully written :)

critic said...

చాలా బాగా రాశారు!

Krishnarjun said...

Thanks for reminding us.
మీ పుత్రరత్నానికి ఆ పేరెందుకు పెట్టారో కాస్త చెబుదురూ ??

మీ
క్రిష్ణ

Ramu S said...

మనం పక్క విశ్వమానవులం, సర్.
తన పేరు ఫిదేల్ రాఫీక్ స్నేహిత్. ఇందులో మూడు మతాల పేర్లు ఉన్నాయి.
ఫిదేల్--ఫిదేల్ కాస్ట్రో (క్యూబా వీరుడు)
రఫీక్--మా సన్నిహిత మిత్రుడు
స్నేహిత్--మిత్రత్వాన్ని సూచించేది. పాప పేరు మైత్రేయి.
అదీ సంగతి
రాము

katta jayaprakash said...

It is good that you have shared your expereinces with your father with the bloggers.Fathrs do bother about their kids but how many children understand and realise the inner feelings of the father whose purpose and aim is for the bright life to his sons and daughters?There ate many fathers after distributing the hard earned propertty among his children become a lonely and helpless father without any care,love and goodwill from his children the sons in particular.Every son of the day is a father tomorrow and every father of today was a son yesterday.so every one must understand and realise the transformation of individual into various forms as age climbing up though the person is same.Let us hope our learned sdns realise this and show love,affection,kindnessv and goodwill with their parents.
JP.

Anonymous said...

i loved d way u've written about ur father sir...please wish him happy father's day on behalf of me....I love my dad!!!

Seetharam said...

కొడుక్కి అంత పెద్ద పేరు, కూతురుకి ఇంత చిన్న పేరు!!, ఎంతైనా తండ్రులు కూతుళ్ళ పక్షపాతి అనిపించారు రాము గారూ!!

కానీ రెండూ బాగున్నాయి

నాన్న ని పొగిడితే అమ్మని తగ్గించినట్టు కాదు. భార్య ఒప్పుదల లేనిదే ఏ వ్యక్తీ కుటుంబ నిర్వహణ లో, వ్యక్తిత్వం లో మార్గ దర్శకులు కాలేరు అని నా భావన. ఈ సందర్భములో మీ వద్ద ఇంత అభిమానాన్ని పొందిన మీ నాన్న గారికి, అటువంటి తండ్రులందరికి, నాకీ జన్మ నిచ్చిన మా నాన్న గారికి, నమశ్శతములు...

సీతారామం

Sandeep P said...

మీ నాన్నగారిపై మీకున్న అభిమానాన్ని ప్రతిబింబించిందండీ మీ వ్యాసం. వారికి నా మనఃపూర్వకమైన శుభాకాంక్షలు.

Ram said...

ramu garu nenu reply lu rasina..okasari kuda reply evvaledu..atlist chudaledu anukunta....?

Ramu S said...

రమేష్ బోర్న్ టు విన్...
సర్..మీరు పంపింది నాకేమీ అందలేదు. మరొకసారి పంపండి.
రాము

Krishnarjun said...

ఫాథర్స్ డే నాడు కోటా శ్రీనివాస రావ్ కుమారుడు కోటా ప్రసాద్ దుర్మరణం తీవ్రం గా కలిచివేసింది. ఎంతో ముచ్చటపడి ఆ స్పోర్ట్స్ బైక్ని ఈ ఏప్రిల్ లో నే కొన్నాడట. అది ఒక 1000 సి.సి హొండా ఇటలి మేక్ స్పోర్ట్స్ బైక్.కుటుంబ సభ్యుల తో భోజనం చేసి వస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదం.కుటుంబ సభ్యులంతా కార్లో వస్తూంటే ప్రసాద్ మాత్రం తన స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణించతం, ఈ ప్రమాదం చోటు చేసుకొవడం విధి బలీయత కు తార్కాణం.

భగవంతుడు అతని ఆత్మకు శాంతిని, ఆ కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాదించుగాక.

katta jayaprakash said...

On the ocassion of Father's day Kota Prasad has given a tragic day to his father by being negligent in driving rashly losing control of his bike worth five lakhs and hitting the van and getting killed.
Let every one START EARLY,DRIVE SLOWLY AND REACH SAFELY.

Unknown said...

రాము గారు,
మీ పేరు నేను ఫణిబాబు గారి బ్లాగ్లో చూడడం జరిగింది. అక్కడినుండి ఇక్కడికొచ్చి, ఒక టపా తరవాత ఇంకొకటి చదవడం మొదలెట్టాను. మీ బ్లాగ్స్పాట్ బాగుంది. ముఖ్యంగా ఈ టపా అద్భుతంగా ఉంది. ఇంత మంచి తండ్రులు అందరికీ ఉండాలని కొరుకుంటున్నాను.
సుభాకాంక్షలు...

DesiApps said...

కట్టా జయ ప్రకాష్ గారు..

మీకు ఎలాతెలుసు సర్,పాపం ప్రసాద్ గారు negligent గా డ్రైవింగ్ చేస్తున్నాడు అని. ప్లీజ్ దయ చేసి మీకు తెలీకుండా అలా కామెంట్స్ చేయ వద్దని మనవి. నేను greatandhra .com వారి సైట్ లో చూసాను. హెల్మెట్ కూడా పది ఉంది accident జరిగిన ప్రదేశం లో . మీకు పూర్తిగా తెలిస్తేనే అట్లాదాని మనవి

అలాగే మీరు ప్రతి పోస్ట్ లో కామెంట్ ౨ సార్లు వస్తున్నది. మీరు ఒక్కసారి నొక్కితే చాలు . రాము గారు గానించండి.

http://www.google.com/transliterate/ మంచి సాధనం తెలుగు కి. ఆటోమాటిక్ గా స్పెల్ చెక్ చేస్తుంది.

katta jayaprakash said...

DesiApps garu,
I was not present at the scene of accident but came to know through media.According to The Hindu Prasad was riding on a steep curve and appled brakes suddenly spotting a van on to the intersection of main road which rsulted in skidding of bike and came under the wheels of the van.
According to Sakshi as Prasad was going on high speed on his bike his relatives in the car which was following Prasad warned him repeatedly .Even though Prasad applied breaks he lost control of his bike worth of lakhs of rupees.Had he been with medium speed he would have controlled his bike easily.
Regarding my repeated item the system says that some error with my pass word even though I click correctly so Ihave to click second or third time for transmission which says ok.
Before commenting on any one or anything try to be dignified with positive nature which help others to rectify any problem which might be accidental and unintentional.

sripada said...

రామూ గారు రియలీ హ్యాట్సాఫ్ సార్. తండ్రిలోని గొప్పతనం కళ్లకు కట్టినట్లు వివరించారు. హ్యాపీ ఫాదర్స్ డే టూ ఎవరీ ఫాదర్ ఇన్ దిజ్ ఎర్త్ సార్.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి