Tuesday, June 8, 2010

మీడియా బాసుల స్వరూప స్వభావాలు- పార్ట్ I

Mahaa-TV లో పనిచేసే ఒక యువ యాంకర్....ఉద్యోగంలో రోజు వారీగా తనకు ఎదురయ్యే సమస్యలు, తనకు నచ్చని యాజమాన్య పద్ధతులు, వృత్తిలో లొసుగులు ఏ మాత్రం దాచుకోకుండా...తన బ్లాగ్ లో రాసుకోవడం వివాదాస్పదం అయ్యింది. బాసుల మీద పోస్టులు తొలగించమని యాజమాన్యం కోరినా...భావప్రకటన స్వేచ్ఛకు ఆమె విలువ ఇచ్చి ఆ పని చేయలేదు. దాని బదులు యాజమాన్యం కోరిన వెంటనే 'హాప్పీ'గా జాబ్ వదిలేసి వేరే ఉద్యోగ ప్రయత్నాలలో పడింది. ఆమె స్వేచ్ఛా భావనకు, ఆత్మస్థైర్యానికి హాట్స్ ఆఫ్ అనే వారూ లేకపోలేదు.

ఈ నేపథ్యంలో...మీడియాలో బాసుల స్వరూప స్వభావాలు రీడర్స్ కు తెలియజేయడం చాలా ముఖ్యం. ఒక కార్పోరేట్ సంస్థ లో బాస్ వేరు, మీడియా లో బాస్ వేరు. కార్పోరేట్ బాసు ఒక క్వాలిఫికేషన్, ప్రాజెక్టులలో పూర్వానుభవం వంటి కొన్ని ప్రాతిపదికల (criteria) ద్వారా ఎంపిక అవుతాడు. మీడియా బాసుల విద్యార్హతలు చూస్తే...ఇతర రంగాల వారు ముక్కున వేలేసుకుంటారు. చాలా మందికి కనీస విద్యార్హతలు లేవు. డిగ్రీ మాత్రమే చదివి, ఏదో సంస్థ ఇచ్చే స్వల్ప కాలిక శిక్షణ తర్వాత...తన విజ్ఞాన పరిధి విస్తరించుకోకుండా...రాజకీయాలు చేస్తూ బాసులుగా బతికేస్తున్న మహనీయులకు ఇక్కడ కొదవే లేదు. పైవారిని బోల్తా కొట్టించో, బూట్లు నాకో పబ్బం గడుపుకునే....మానిప్యులేటర్స్ చాలా మంది బాసుల అవతారం ఎత్తి నిజమైన జర్నలిస్టులను చంపుకు తింటున్నారు. సృజనాత్మకతను ధ్వంసం చేస్తున్నారు.

"చదువు రాకపోయినా...జర్నలిజాన్ని బ్రహ్మాండంగా నిర్వహించిన వారు లేరా? దీనికి విద్యార్హతలు దేనికి?," అని ఈ బాసులు మొండిగా వాదిస్తారు. అందుకు కొన్ని నికార్సైన ఇదాహరణలు చెబుతారు. ఈ ధోరణి వల్ల కనిపించని చాలా నష్టం జరుగుతున్నదని కొందరు, లేదు..లేదు...ఆల్ ఈజ్ వెల్ అని కొందరు వాదిస్తారు. అది వేరే వివాదం. 

సహజంగా...Boss are asses  అన్న అభిప్రాయం కింది ఉద్యోగులు చాలా మంది లో ఉండడం కద్దు. మీడియా లో boss are brainless asses అనేది నానుడి. ఇది ఎందుకు వచ్చింది అంటే....బాసుల నియామకం కులాల వారీగా, ప్రాంతాల వారీగా జరుగుతున్నది ముందు నుంచీ. సమాజానికి నిత్యం హితం చెప్పే ఎడిటర్లు తమ సన్నిహితులను, అడుగులకు మడుగుగులొత్తే వారిని, నోటి దురుసుతో ఇతరులతో పనులు చేయించే వారిని వివిధ శాఖల హెడ్స్ గా నియమించారు. 


'ఈనాడు' లో ఆరంభంలో ప్రొఫెషనలిజం ప్రాతిపదికగా బాసుల నియామకాలు  జరిగినా....తర్వాత కులం-ప్రాంతం ఆధారంగా ఎంపిక జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాకు బాగా గుర్తు...'ఈనాడు' జనరల్ డెస్క్ లో యాజమాన్య సామాజిక వర్గానికి చెందిన ఒకడు ఇంచార్జ్ గా ఉండే వాడు. తనకు ఇంగ్లిష్ సరిగా రాదు, అయినా...వార్తా సంస్థల కాపీలు తర్జుమా చేసే సెక్షన్ కు ఇంచార్జ్ చేశారు. అది ఎంత ఘోరం? కొందరు సబ్-ఎడిటర్లు....తనను ఏడిపించడానికి....ఇంగ్లిష్ సందేహాలను అందరూ వినేట్లు పెద్దగా అడిగే వారు. "పెద్దగ అడగమాకయ్యా బాబు. ఇట్రా. నీకు తోచింది రాయి. తర్వాత చూద్దాం," అని ఆయన అనే వాడు. ఆ తర్వాత వాడిని ఏదో విషయంలో డిమోట్ చేయడం....మళ్ళీ ఈ మధ్య ప్రమోట్ చేయడం చేసారట. బుర్ర తక్కువ బాసులు అన్న దానికి ఇదొక క్లాసికల్ కేస్. 

ఒక్క తెలుగు మాత్రమే తెలిసి...తాను రాసిన ఒక్క నవలతో పెద్ద రచయితనని తనకు తాను భావించే మరొక నరరూప త్రాస్టుడు ఒకడు కూడా ఇదే డెస్క్ లో చాలా రోజులు బాసు పాత్ర పోషించాడు. ఇప్పుడు వాడు 'సూర్య'లో వెలుగుతున్నాడు. వీరంతా...బాసులుగా ముమ్మాటికీ అనర్హులు. చాలా మంది జర్నలిస్టుల ఉద్యోగాలు పోవడానికి, వందల మంది మానసిక వేదనకు వీరు కారణం.

మరొక ఉదాహరణ: 'ఈనాడు' సండే మాగజీన్, వసుంధర పేజ్ సెక్షన్ ను ఒక మహానుభావుడికి  అప్పగించారు అప్పట్లో. ఆయన ఇతరులతో పనులు చేయించే వాడు...స్వతహాగా ఆ వర్క్ డీల్ చేసే సత్తా ఉన్న జర్నలిస్టు కాదు కాబట్టి. ఆయన పేరిట రామోజీ రావు ఏవో భూములు కొన్నారు కాబట్టి...ఆయన్ను ఆ సెక్షన్ ఇన్-ఛార్జ్ గా చేసారని అనుకునే వారు. సారు ఒక మహిళామణితో తన చాంబర్లో కాలక్షేపం చేసేవాడు. 

ఇప్పుడు జనరల్ డెస్క్ చూస్తున్న వ్యక్తిది మరొక కథ. సబ్బింగ్, ఎడిటింగ్ వంటి డెస్కు పనులకన్నా ....రిపోర్టింగ్, ఫీచరింగ్ అద్భుతంగా చేయగలిగే జర్నలిస్టు ఆయన. ఇయినా...కొన్ని ఈక్వేషన్స్ ప్రాతిపదికన అతన్ని అక్కడ పెట్టారు. ఫలితం? అందరికీ విదితమే. ఇలా చెబుతూ పోతే...పేపర్స్/ ఛానెల్స్ లో బాసులను కేవలం ప్రతిభ ప్రాతిపదికన ఎంచుకున్నారు అని చెప్పుకునే కేసులు బహు స్వల్పం.

ఇక్కడ ఇంకో ముఖ్య విషయం వుంది. ప్రొఫెషనల్స్ ఇతర మహిళలతో, సాటి ఉద్యోగులతో డీల్ చేసే దానికి, అమాంబాపతు బాస్ లు డీల్ చేసే దానికి...చాలా తేడా  వుంటుంది. ఇప్పుడు మీడియా బాసులు గా ఉండి extra-marital relations 'ఎంజాయ్' చేస్తున్న వారు, కింది ఉద్యోగులను వేయించుకు తినేవారంతా....సరైన శిక్షణ లేకుండా...ఎవడి ఆశీస్సులతోనో పైకి ఎదిగిన వారేకావడం విశేషం. మీ సంస్థలో...హెరాస్మెంట్ తో కింది ఉద్యోగుల కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, ఒకరిద్దరు కీప్ లను ఆఫీసులో తయారు చేసుకుని కులుకుతున్న బాసుల ప్రొఫైల్ చూడండి. వారి గ్రాఫ్ లో చాలా లోపం వుంటుంది. నా ఈ అబ్సర్వేషన్ తప్పయితే...నాకు రాయండి. 

అయితే...ఈ బాసులు ఎలా బండి నడుపుతారు? అనే అంశం ఆశ్చర్యకరమైనది. ఈ బుర్ర తక్కువ బాసులు...రెండు పనులు చేస్తారు. ఒకటి) కింది ఉద్యోగులలో బాగా పనిచేసే వారిని ఎంచుకుని...వారు లాయల్ గా ఉంటే...వారిని ప్రోత్సహిస్తూ....పని చేయించుకుంటారు. రెండు) తనకు నచ్చని వారిని...ఎంత ప్రతిభావంతులైనా...తొక్కి పారేస్తారు. వారిని హింసించి చంపుతారు. సెలవులివ్వరు, యాజమాన్యానికి తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుదోవ పట్టించి కెరీర్ నాశనం చేస్తారు. ఇలా ఎందరో...నిర్భాగులు మీడియాలో సజీవ సమాధి అయ్యారు. 

మీడియా బాసుకు ఒక సౌలభ్యం వుంది. నచ్చని వాడి వర్క్ ను తేలిగ్గా తిరస్కరించవచ్చు. నచ్చిన వాడు రాసింది...'అబ్బో అద్భుతం..." అని ఆకాశానికి ఎత్తవచ్చు, ఆ రాతలకు గానూ ఒక ప్రమోషన్ ఇప్పించవచ్చు. ఎందుకంటే...ఇది సృజనాత్మకతో ముడిపడి వున్న అంశం. ఆ ధోరణి, వ్యవహారం ఎలా ఉంటుందో మరొక పోస్ట్ లో చూద్దాం. 

17 comments:

Kathi Mahesh Kumar said...

నిజమే...నిజాలు కొంచెం కటువుగానే ఉంటాయి. కానీ వీటిని నిజాలని అంగీకరిస్తే మార్చాల్సి వస్తుంది. మార్చాలంటే మనం ముందు మారాలి. అది కుదిరేపనేనా?

Bhanu said...

రాము గారు,

ఇన్నాళ్ళు మీరు వ్రాస్తున్న పోష్టుల కన్న ఇది కొంచం దిగజారి వుంది.

Request you to review and maintain utmost professionalisim in your writings. Then your blog's value will increase more...

Rgds

Raja said...

Ramu garu hope you wont be too diplomatic abt your postings on MInd less asses

Raja said...

Ramu garu ninna mana blog stats chusa, growing gradually. I got an idea and want to share it with you. Why cant we monetize the blog and use that money for helping someone like Gautham(yogeshwara rao garu). you can use some premiere ad providers like google which always delivers quality content.Even though we do what we can, we can have another source to help the needy.


Raja

Ramu S said...

Rajaji...
good idea.
Some of my friends have been suggesting me this. But I feel when financial element is involved in any work, sanctity is at stake. Lets see.
Thanks for your good suggestion
ramu

WitReal said...

>> ఆమె స్వేచ్ఛా భావనలకు, ఆత్మస్థైర్యానికి హాట్స్ ఆఫ్


ఇది చూసిన తర్వాత, ఈ పోస్ట్ కి వ్యాఖ్య వ్రాయటం అనవసం అనిపిస్తొంది.

స్థూలంగా, మీరూ ఆ మహా టివి అమ్మాయి చేసిన పనే చేసారు. తేడా అల్లా, మీరు బయటకి వచ్చి రాస్తున్నారు. ఆమె లోపల వుండి రాసింది.


>> కార్పోరేట్ బాసు ఒక క్వాలిఫికేషన్, ప్రాజెక్టులలో
>> పూర్వానుభవం వంటి కొన్ని ప్రాతిపదికల

పొరబడుతున్నారు. ఇండియా లో ఎదైనా business family లో పని చేశారా? Reliance, Mahindra, Satyam??

Why is Jr Raju is the chairman of Mayatas & Not Mr. XYZ?
(criteria) ద్వారా ఎంపిక అవుతాడు

>> రాజకీయాలు చేస్తూ బాసులుగా బతికేస్తున్న
>> మహనీయులకు ఇక్కడ కొదవే లేదు.

దాన్నే లౌక్యం అంటారు. ఇలాంటివాళ్ళూ ఎక్కడైన బతికేయగలరు

>> సహజంగా...Boss are asses.

ఇలా అనిపించటం ఒక మానసిక వ్యాధి లక్షణం. దీనికి చికిత్స వుంది.


>> కులం-ప్రాంతం ఆధారంగా ఎంపిక జరిగిందన్న
>> ఆరోపణలు ఉన్నాయి

TRS accuses that Satyam Recruited Andhra people more.

"మా కంపెనీ లో అంతా తమిళ్ domination" అని నిన్న ఒక engineer నాతో వాపొయాడు.

nepotism based on caste/region/religion is pervasive.

see the better side of it: if you start a business tomorrow, will you make me the head? or will you select someone whom you know, trust, believe on whatever basis?మీరేమనుకున్నా సరే, ఈ పోస్ట్ కొంచెం బావిలో కూర్చుని రాసినట్టుంది.

Anonymous said...

రాము గారు, ఈ సౌలభ్యాలు మీడియా బాసు లకే కాదు.. ప్రతి బాసు కి ఉన్నాయి.. సాఫ్ట్ వేర్ రంగమలో కూడా నూటికి 99 మంది బాసులు ఈ బాపతే.. వొంగి వొంగి దండం పెట్టేవాళ్ళు ని ..తమకి బాకా వూదేవారిని ...ఎలా పని చేసినా ఏం చేసిన పూల దారిలో నడిపిస్తారు. ఎంత బాగా పని చేసినా ప్రాజెక్ట్ మేనేజర్ ని కాకా పట్టుకోకపోతే జీవితం నరక ప్రాయమే.. ప్రమోషన్స్ ఉండవు.. జీతం పెంచరు... తీసుకెళ్ళి మన కంటే తక్కువైన జూనియర్స్ కింద వేసిన వేస్తారు..

చేసే పనికి సరి అయిన కొలబద్ద లేదు...అందుకే.. బాస్ మాటే.. భగవద్గీత ...వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది..

Vinay Datta said...

Ramu garu,

Even I wanted to suggest the idea of ADs. As far as you are fair, you needn't worry about the sanctity of the blog. But pleas be careful in choosing the ADs. If I were to choose the ADs, I'd never allow the ADs of aerated drinks, fast foods, matters involved with only adults, etc.

Shiva said...

Dear Ramu garu,

When you start writing about media with all the stated objective on your blog header, I expected more quality and professionalism. Day by day it is reducing and గాలి పోగుచేసి రాయడంలా కనిపిస్తుంది. Please check the http://apmedia.blogspot.com. This is the blog written on media, brought out and discussed many issues and some how stopped abruptly. You might be knowing the people behind it.

Thanks,
Shiva.

Thirmal Reddy said...

Ramu,
Now that the issue of monetizing via ads placement is here, it's time for me to shed more of my anonymity. I work for Google (Hyderabad office) in the Global Advertising Operations (US Australia, and South East Asia markets). As per my company guidelines Google Adsense does not support Indian regional languages. If you still go ahead and place the Adsense code, the blog might get blocked. Check this link for the list of languages supported.

https://www.google.com/adsense/support/bin/answer.py?hl=en&answer=9727

However, two things to mention here are that, Google Adsense doesn't fetch you enough money to even think of charity. It is usually helpful for big publishers like 'The Hindu'. Second, you may contact some third-party-agencies who can help you monetize.

@Madhuri
Google Adsense is based on contextual advertising which means, the tool places ads which are relevant to the content of the blog/website. You'll have option of blocking adult ads (like dating sites, Gambling and casinos, weapons etc. which are usually allowed in USA based on publisher preferences/restrictions).

Here's a link on complete information about Google Adsense. Let me know if any of you need help with Google Adsense or Google AdWords.

@ Ramu,
As for the placement of ads, I strongly support the idea. The question of ethics doesn't even arise here. For those who think about ethics, should also think that the ad is not about promoting porn or terrorism and also think about the internet charges, electricity, the efforts put in, or the research done to maintain this blog. Also, I recommend a partial use of funds for any cause deemed fit for support.

However, I would also like to mention that monetizing the blog doesn't give you enough money even to think of any charity.

Thirmal Reddy
AdWords Strategist
Google
thirmal.reddy@gmail.com

Ramu S said...

శివ గారూ..
గాలి పోగు చేసి రాయడం....గురించి.
మీడియాలో బాసుల వ్యవస్థకు నాణ్యతకు ఎంతో సంబంధం వుంది. ఇది పైకి తేలికగా కనిపించే విషయం అయినా...ఇది కీలకమైనది, ప్రమాదకరమైనది.
థాంక్స్
రాము

Thirmal Reddy said...

Ooops... forgot to give the Adsense Support link. Here it is. https://www.google.com/adsense/support/?sourceid=asos&subid=ww-ww-et-u2u_breadcrumb&medium=link

Also, the post about erratic bosses is laudable. In my 4 years of journalistic experience in ETV2, I've come across several such "asses". I'll soon come up with my experiences as a journo in this channel.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Sudhakar said...

It's really immature to put a tag "bhava prakatana swetcha" to everything with out limits. When we are doing certain job, it demands certain etiquette and also provides a channel to vet out our feelings. No where in this world, employees are excused by legal systems when they try to dig holes under employer by tarnishing the image. If they want to voice, they can do it by escalations...if it doesnt work, they can quit the job...

Blog is not a knife to cut any damn vegetable out there. Some times it can get our fingers hurt also...

Request you to stop calling that silly, childish blog act as "bhava prakatana swetcha" etc..

Vinay Datta said...

@Thirumal garu'

Thank you for the info.

Unknown said...

ప్రియమైన రాముగారు!
బ్లొగ్ లొ ఒక వ్యక్తి ఎదొ రాయదంతొ అదీ నిజమని మీరు నమ్మి అందరినీ నమ్మించదమె పరమవధి అన్నత్తుగా ప్రతి సారీ ఆ యొక్క చానెల్ నె ప్రస్తావిస్తూ ఉందదం ఎమంత బాగొలెదని నా అభిప్రయం మీకు ఆ వ్యక్తి మీద అంత అభిమానం,జాలి ఉంతె మీరె ఎదైన మంచి ఉద్యొగం ఇప్పించి ఆ మంచి మనిషిని .? ఆదుకొంది ఆ అంతెకానీ అనవసరంగా ప్రొపకాంద చెసి ఆమెకు ఇంక ఎక్కద ఉద్యొగమీ రాకుదా చెయద్దు నీను ఒక్క విషయం మీకు చెప్ప దలచు కొన్నను థప్పు లెన్ను వారు థప్పు లెరుగరు............................................బహుసా అందరికీ తెలుసు అనీ అనుకొంతున్నను సురెష్.................

Akur said...

Dear ramu garu,
I appreciate your work towards sociaty. But, I think This blog is not mentioned for throwing stones on some perticular peope. and "mana akrosanni vellagakkadaniki kadu." reddy vache modalu annattu malli modatike vaste ela sir?

Kumar B

Kavanoor Dayalan said...

Ramuji why angry on Ramoji? I didnt see a single review or comment on Bhopal Gas tragidy, or auction of liquor in AP. Further, When you start writing about media with all the stated objective on your blog header, I expected more quality and professionalism. Day by day it is reducing and గాలి పోగుచేసి రాయడంలా కనిపిస్తుంది. specially your targetting only few people.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి