శ్రీరాం చంద్ర విజయంతో తెలుగు జాతి పులకించింది. టీ వీ ఛానెల్స్ చాలా కోణాలలో దీనిపై కార్యక్రమాలు చేస్తున్నాయి. మా వల్ల ఎక్కువ ఎస్.ఎం.ఎస్.లు వచ్చాయంటే...మా వల్ల వచ్చాయి అని ఛానెల్స్ ఊదర కొడుతున్నాయి. కిందటి పోస్టులో మా ఛానల్ చేసిన కృషి గురించి ఎందుకు రాయలేదు? ఆ పోస్టు చూస్తే నాకు ఒళ్ళు మండింది..... అని ఒక ప్రముఖ ఛానల్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్న ఒక మిత్రుడు గట్టి క్లాస్ పీకాడు. ఇక పోతే...ఇలాంటి ప్రోగ్రామ్స్ పై మరొక కోణాన్ని వివరిస్తూ...శ్రీనివాస రెడ్డి అనే మరొక మిత్రుడు ఒక కామెంట్ పంపారు. అది చర్చ కోసం ఇక్కడ ఇస్తున్నాను----రాము
------------------------------------------------------------------------------
ఈ లైవ్ షోల గోలలో పడి మనం ప్రజలకు జరుగుతున్న ఒక తీవ్ర అన్యాయాన్ని గుర్తించడంలేదు. అవి (ఈ ప్రోగ్రామ్స్)పార్టిసిపెంట్స్ లో వుండే ప్రత్యేక ప్రతిభలను బయటికి తెస్తున్నాయి - సంతోషమే. కానీ మెల్ల మెల్లగా మనను వీటికి అడిక్ట్ & ఇన్వాల్వ్ అయ్యేలా చేసి, SMS ల పేరుతో మన జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది మాత్రం సరికాదు. దీనిని మనమందరం ఖండించాలి. వీలైతే కోర్టుల ద్వారా ఆపించాలి.
నిజంగా పార్టిసిపెంట్స్ ప్రతిభను ప్రేక్షకులే జడ్జ్ చేసేట్లయితే మంచిదే. కానీ, పెద్ద పెద్ద పోటుగాళ్ళయిన జడ్జ్ లను అక్కడపెట్టుకొని మనలను SMS లు అడగడం అంటే ఖచ్చితంగా ఆ పేరుతో దోచుకోవడమే. లేదంటే నిజమైన ప్రతిభను గుర్తించడం ఆ జడ్జ్ లకు చేతగాని పనిగా భావించాలా? పైగా ఒక్కొక్కరు ఒక ఎస్.ఎం.ఎస్. కన్నా ఎక్కువ చేయవచ్చట. అంటే... మన ఎలెక్షన్లలో ఒక్కొక్కడు పదేసి దొంగ ఓట్లు గుద్దినట్లు. అప్పుడు ఆ వోటు విలువ ఎంత? ఒక 5 లక్షల ఎస్.ఎం.ఎస్.లు ఒక ఐదు వేలో, 10 వేలో సిం కార్డులతో ఒక్కొక్కటి 3 రూ.చొప్పున అంటే రూ.15 లక్షలతో విజేత అయిపోవచ్చా? దీనికి నిర్వాహకులు ఠక్కున చెప్పే సమాధానం-SMS లు ఒక్కటే కాదుగదా జడ్జ్ ల నిర్ణయాలతో కలిపి విజేతను నిర్ణయిస్తాం గదా అని. అంటే ప్రశ్న మళ్ళీ మొదటికి వస్తుంది. జడ్జ్ కరక్ట్ అయితే SMS ఉండకూడదు, SMS (వీక్షకుని ఓటు) కరక్ట్ అయితే జడ్జ్ అక్కరలేదు+ఒక్కొక్క వీక్షకుడికి (మొబైల్ కు) ఒక్క వోటే వుండాలి. అలా లేదు కనుక ఇది కచ్చితంగా దోపిడీయే.
పోనీ, ఒక్క 3రూ.లతో SMS పంపినంతమాత్రాన మన సొమ్ము లూటీ ఎందుకనుకోవాలనుకుంటే - అపరిచితుడు సినిమాలో చెప్పినట్లు పైసా పైసా కలిస్తేనే రూపాయ అవుతుంది. నిర్వాహకునికి రేటింగ్స్ రూపంలో, యాడ్స్, స్పాన్సర్స్ ఇన్నిరూపాల్లో వచ్చే డబ్బులు చాలక సగటు ప్రేక్షకుడి జేబుకు డిరెక్ట్ గా బొక్కపెట్టడం ఏం న్యాయం? మనకు నచ్చిన పోటీదారు గెలిచేందుకు (ఉదాహరణకు నిన్న మన శ్రీరాం) ఒక్కొక్కరం పదేసి SMS లు ఇచ్చిన వారుకూడా మనలో వున్నారు కదా. పైగా మన మీడియాకూడా విపరీతంగా ఊదర కొట్టిందాయె.
పద్ధతి అలా ఏడిచింది కనుక శ్రీరాం కోసం మనం అలా చేయవలసిరావడం ఇక్కడ తప్పలేదు. దానికెవరం బాధపడనవసరం లేదు. కానీ, ఈ పద్ధతే తప్పు. పైగా ఇవ్వాళ, రేపు లెఖ్ఖకు మిక్కిలిగా వచ్చిన మన న్యూస్ చానళ్ళవారు వారు చెప్పాల్సిందంతా చెప్పేసి.... యస్సా? నో నా? అనేది SMS చెయ్యగలరు అంటూ అదో రకం బాదుడు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఫ్రీగా చెత్తా చెదారం ప్రోగ్రాం లన్నీ చూసిపెట్టి ఈ దరిద్రపుగొట్టు చానళ్ళను పోషించడమే మనం చేస్తున్న అతి పెద్ద మెహర్భానీ అని గుర్తించకుండా ఏకంగా మన జేబులకే బొక్కలు పెట్టే ఈ SMS ల నీచ పద్ధతి పోవాలని ఆశిద్దాం. చివరగా, ఇదంతా వ్రాసి మన శ్రీరాం ప్రతిభను తగ్గించి చూపే వుద్దేశ్యం లేదు గానీ రియాలిటీ షో ల వెనుక మరో కోణాన్ని ఎక్స్పోజ్ చెయ్యడమే నా ఉద్దేశ్యం.
Tuesday, August 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
21 comments:
true. well said
I totally Agree with you
dabbuku lokam dasoham .. mastaroooo .. media no exception
ఇది ఇప్పుడు కొత్తేమి కాదు సర్, కే బి సి టైం నుంచి కూడా ఇదే బాదుడు.
అతను చాలా బాగా చెప్పారు. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
ఒక వేళ ఈ విషయాన్ని మీడియా వాళ్ళ దగ్గర ఎత్తితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట.
" అది paid SMS అని జనాలకి తెలిసి కూడా దురద పుట్టి SMS లు పంపిస్తున్నారు, దానికి మేము ఏమిచేయగలం అని"
Every one agress with Srinivas Reddy garu.Infact most of the channels are duping the viewers about the SMS to the channelsv and the channels and net work are sharing the SMS charges paid by the people and the viewers are the victims of this procedure.I donot know whether most of the viewers know this sectert of sharing the SMA amount.
But the case of Indian Idol competion is entirely different as our two Telugu singers lost the competition in the finals just because of SMS messages inspite of their best performance which made every one including the media in particular to comeforward and help Sreeram to win and the peole responded tremendously.
But sending SMS to the channels is just a waste of money and I appeal to asll my friends of this blog to educate the people how the channels and net work are sharing the amount of SMS charge and advice them to stop sending SMS to the channels except in a rare case of competitions involving our people who are loosing just because of poor SMS rare even though they are talented.
JP.
జె.పి గారు చెప్పినదాంతో నేను విభేదిస్తున్నాను. ఎందుకంటే, అందరికీ ఒక రూలు మనదాకా వస్తే మరో రూలూ అవసరం లేదు. నిజంగా అలా ఎస్.ఎం.ఎస్ లు పంపక పోవడం వల్ల కారుణ్య, హేమ చంద్ర ల లాగే శ్రీరాం కు కూడా అన్యాయం జరిగిఉన్నా, అతను గొప్ప సింగర్ కాకుండా ఏం పోడు. కారుణ్య, హేమ చంద్ర ల విషయంలోనూ అది ప్రూవ్ అయ్యింది. ఒక సిస్టం ను మనం వ్యతిరేకించదలచుకున్నపుడు దానివల్ల నేనే నష్టపోవలసి వచ్చినా వ్యతిరేకించాలి. కారుణ్య, హేమ చంద్ర లు గతంలో నష్టపోయారు అన్నప్పుడు మన మీడియా బాసులు అప్పుడే ఎస్.ఎం.ఎస్ ల పద్ధతిని వ్యతిరేకించి ఇప్పటివరకు అదిలేకుండా చెయ్యవలసింది. ఆ విధంగా శ్రీరాం కు అన్యాయం జరగకుండా చెయ్యవలసింది. అలా కాదని, అప్పటి నస్టాన్ని చూపి ఇప్పుడు మనందర్నీ ఎస్.ఎం.ఎస్ లు పంపండహో అని ఎగదోసేదిలేకుండే.
I agree with S.Reddy garu...
but other side there is another angle...a program like indian idol is related with money matters...anchors, stage maintanance, program judges, indian wide selections or candidates, like so many things involves...in my case i send overall 15 sms that means 45rs..instead what i got? pure entertainment...flawless innocent music, emotional experiances old memories what not? if there is no judges...how can we think a singer singing correctly? if we dont pay a penny for anything, we may not enjoy the free show..even if we compare with movies, instead of paying hundereds of rupees for stupid movies, in my view, this is best buy...
శ్రీనివాస రెడ్డి గారు రాసింది అక్షర సత్యం.
చెత్త చెత్త ప్రోగ్రాములు పెట్టి మీ అభిప్రాయం ఎస్ ఎం ఎస్ చెయ్యండి అనడం పిచ్చివాళ్ళు పుంఖానుపుంఖాలుగా పంపించి సొంత సొమ్ములు దుబారా చేసుకోవడం,సెల్ఫోన్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా దండుకోవడం చూస్తూనే వున్నాంగా.
ఎస్ ఎం ఎస్ ఇమ్మనగానే ఎందుకిచ్చేస్తారో నాలాంటి అజ్ఞానులకు అర్ధం కాని ప్రశ్న.
సత్యవతి కొండవీటి
అందరు అసలు విషయాన్నీ మర్చి పోయారు .
ఎవరెవరికి ఎన్ని ఎస్ ఏం ఎస్ లు వచ్చాయో ?ఎక్కడా ప్రకటించలేదు .
ఫైనల్స్ కి రెండు రోజుల ముందు వొక చాన్నాళ్ వాళ్ళు శ్రీరాం లక్ష ముప్పైనాలుగు వేలు
భూమికి (అమ్మాయి)లక్ష అరవై వెలతో ముందుందని మన వాణ్ణి
గెలిపించుకోవాలంటే తెలుగు వాళ్ళంతా
ఎస్ ఏం ఎస్ లు విరివి గా పంపాలని కోరింది .
నేగ్గాక కూడా ఎవరికి ఎన్ని వచ్చాయో తేలినప్పుడు
యిలా మద్యలో పేపర్ లీక్ అయినట్లు తెలియడం ఎలా సాద్యం?
యస్సెమ్ముసులు అన్నది పూర్తిగా వ్యాపారమే,కానీ వీక్షకులందరికీ ఆ సంగతి తెలిసుండాలన్న నియమం కూడా యేమీలేదు కదా?అలాగే జనాలకు తెలీనంతమాత్రాన అదిమోసమో.మరొహటో కాకుండా పోదుకదా!
ఈ సంగతి కాసేపలా ఉంచి,యస్సెమ్ముసులు ఎందాకా తీసుకెళ్లచ్చో అది చూద్దాం కాసేపు.1994నాటికి లేక అప్పటి ముందు మనదేశంలో జరిగిన సౌందర్యపు వ్యాపారం ఎంతో,అప్పటి నుంచి 2000వరకూ అంటే ఐశ్వర్యారాయ్ తో మొదలుపెట్టి ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ అయ్యేవరకూ.. అయ్యాక అప్పటి నుంచి ఇవ్వాళ్టి దాకా జరుగుతున్న సదరు వ్యాపారానికి యేమన్నా పోలికలున్నాయా అసలు?
మరో వైపు ఈ యఫ్.యం రేడియోలు కూడా ఇదే వరుస కదా.యస్సెమ్మెసుల పిచ్చి ఎంతత్వరగా వదిలితే అంత మంచిది మనజేబులకూ,సెల్లులకూ..
http://www.24gantalu.co.cc/2010/08/blog-post_4242.html ఈ టపాలో సదరు బ్లాగరు ఒకసరికొత్త మోసం కనిపెట్టారు అదీదవండి.
ramugaaru,chala bhaga chepparu
ఒక్క మీడియాని మాత్రమే ఆడిపోసుకుని ఉపయోగం లేదు. నిత్య ధారావాహికలకు మత్తు మందులకు బానిసలు అయ్యినట్టుగా చాలామంది అయిపోబట్టికదా, వీళ్ళ ఆటలు సాగుతున్నాయి.ప్రేక్షకులలో చైతన్యం రానంతవరకూ నష్టపోతూనే ఉంటారు, అంతా మన చేతిలో ఉన్నది, అది తెలియకుండా మనం ఒక్కళ్ళమే ఏమి చేస్తాం అన్న నిర్లిప్తత నుండి బయటపడితే కాని ఏ విషయమూ మనకు అనుకూలం కాదు. వినియోగదారులు అందరూ ఒక్క వారం రోజులు మాకు కేబుల్ వద్దు అని కనెక్షన్ పీకి పారేస్తే ఈ చానెళ్ళ గతి ఏమిటి? అటువంటి ఐక్యత వినియోగదారుల్లో రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకు కాదూ క్రికెట్ సంవత్సరం పొడుగునా ఆడేది! అందుకు కాదూ ధారావాహికలను సాగతీసేది, చివరకు దాసరి నారాయనారాయణ రావు, ఇప్పుడు జగపతి బాబు లాంటి వాళ్ళను కూడా ప్రలోభ పెట్టి వాళ్ళ చేత ధారావాహికలను తీయించేది. అదే సమస్య. వినియోగదారుల్లో, డైలీ సీరియల్ బానిసలు, క్రికెట్ ప్రత్యక్ష ప్రసార బానిసలు, ఎక్కువమంది ఉండటం వల్ల వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అదేవిధంగా ఇండియన్ ఐడల్ వంటి కార్యక్రమాలు. ప్రతిభను జడ్జీలు నిర్ణయిస్తారు, ఆయా పోటీదార్ల పాపులారిటీ ఎస్ ఎం ఎస్ లు నిర్ణయిస్తాయిట. అది థియరీ. నిజానికి ఏమి జరుగుతున్నదో తెలియదు. ఈ సెల్ కంపెనీలు, టివి చానెళ్ళు ఎస్ ఎం ఎస్ ల ఆదాయాన్ని పంచుకుంటూ ఉండవచ్చు. అందుకే ఈ ఆర్భాటమంతా.
@శీను. టి వి చానెళ్ళు ఒక్క ఎస్ ఎం ఎస్ ల మీద బతకటంలేదు. మనకు తెలియకుండా వందల రూపాయలు మన జేబుల్లోంచి తీసుకుంటున్నారు (కేబుల్ లేదా డి టి హెచ్ కట్టే డబ్బులు కాకుండా). మనం కొనే ప్రతి వస్తువులోనూ, ఆ యా కంపెనీలు ఈ చానెళ్ళల్లో వేసే వెర్రి మొర్రి ప్రకటనల ఖర్చు కలిసి ఉన్నది. మనం ఏదో నెలకు రెండొందలో/మూడొందలేకదా కట్టేది, సినిమాలకెళ్ళేదానికంటే తక్కువ అని మురిసిపోతున్నం కాని అసలు విషయం, యాడ్ ఏజన్సీలు, చానెళ్ళు కలిసి మనచేత అనవసరపు ఖర్చు ఎంతగానో చేయించి లాభపడుతున్నాయి. వాళ్ళవల్ల జరిగే అనుత్పాదక ఖర్చు ప్రభావం గురించి ఎకనామిస్టులు చెప్పగలగాలి.
ఈ SMS లు నిషేధించాలి ! ఇది పూర్తిగా వ్యాపారం తప్ప ఇంకేమి కాదు. సంగీతం లో ఓనమాలు రానివాళ్ళు కూడా న్యాయనిర్నేతలే. SMS లతో విజేతని నిర్ణయించడం ఎంతమేరకు సబబో నాకు అర్ధం కావట్లేదు. ఇంతకంటే దారుణం ఏమిటి అంటే ప్రతి చిన్న విషయానికి SMS polls నిర్వహించడం. ఫలానా వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలపండి... ఫలానా సెలెబ్రిటి పెళ్లి నిర్ణయాన్ని మీరు సమర్ధిస్తారా.. ఫలానా యన ఈ కార్యక్రమం లో నిజాలే చెప్తున్నాడా... ఇలాంటి పనికిమాలిన SMS లతో ప్రజల సమయాన్ని, ధనాన్ని వృధా చేయడం "మెరుగైన సమాజం కోసం" అవసరమా?
కాస్తంత నిగ్రహం పాటిస్తే ఇలాంటి SMS లు పంపించడం, భక్తి మెయిల్స్ forward చెయడం మానేయవచ్చు.
బ్లాగర్స్ అందరూ అద్భుతంగా స్పందిస్తున్నారు, మరియు దాదపుగా అందరూ ఎస్.ఎం.ఎస్ లను నిషేధించాలనే కోరుతున్నారు. శివ గారు చెప్పినట్లు ఒక్క మీడియాని మాత్రమే ఆడిపోసుకుని ఉపయోగం లేదు, మనం ఒక్కళ్ళమే ఏమి చేస్తాం అన్న నిర్లిప్తత నుండి బయటపడితే కాని ఏ విషయమూ మనకు అనుకూలం కాదు. వినియోగదారులు అందరూ ఒక్క వారం రోజులు మాకు కేబుల్ వద్దు అని కనెక్షన్ పీకి పారేస్తే ఈ చానెళ్ళ గతి ఏమిటి?
వాళ్ళవల్ల జరిగే అనుత్పాదక ఖర్చు ప్రభావం గురించి ఎకనామిస్టులు చెప్పగలగాలి. అన్నారు.
వాస్తవమే. అయితే, మీడియానే ఆడిపోసుకోవడం ఎందుకంటే మనకంటే సామాజిక భాద్యత అనేది మనకంటే మీడియా వారిమీదే యెక్కువ ఉంటుంది. పైగా మేం అవతరించిందే అందుకు అని వారు పదే పదె (మెరుగైన సమాజం కోసం అంటూ ఒకరు, వె రెపొర్త్............... అంటూ ఒకరు ఊదర కొడుతుంటారు గదా).
ఇహ, శివ గారన్నట్లు ఎవరి జేబుకు వారే చిల్లులు పడకుండా చూసుకోవాలనే వాదనను రెండు కోణాల్లో పరిశీలించవచ్చు.
1. వ్యక్తిగత జాగరూకత, ఉత్తేజం లను మించిన పరిష్కారం ఏ సమస్యకైనా ఎవరూ చూపలేరు. ఇది ఒక్క ఎస్.ఎం.ఎస్ ల విషయంలోనే కాదు. ఒకప్పుడు మిత్రులతో మాట్లాడడనికి (కాల్ చార్జీలు ఎక్కువగా వుండడం వల్లనూ+అప్పటికింకా ప్రజల్లో పొదుపు లక్షణాలు అంతరించక పోవడం వల్లనూ) ఒకటి రెండు నిముషాలకు మించకుండా సూటిగా విషయం మాట్లాడి పెట్టేసేవాళ్ళం. కానీ, ఇప్పుడు నిమిషాలకు నిమిషాలు అలా మాట్లడుతూనే వున్నాం. విషయం ఏమీ లేకపోయినా ఇంకేంటి విశేషాలు లాంటి ప్రశ్నలతో, ఊ, ఆ లాంటి ఉబుసుపోని కబుర్లతో ఎంతో డబ్బులు వృదా చేస్తున్నాం. (కాల్ చార్జీల విషయంలో ఇప్పుడు రివర్స్-బహుశా అలా ఎక్కువ మాట్లాడించడం ద్వారా ఎక్కువపిండుకోవచ్చు+ఎక్కువ మందిని బుట్టలో వేసుకోవచ్చనే సెల్ కంపనీలు అంత చీప్ చేసాయేమో?). అంతేకాక జనంలో ఎంతోకొంత సంపాదన పెరిగినా స్తోమతను మరిచి ఖర్చు పెట్టే లక్షనం+పొదుపు గురించిన ఆలోచన చాలా వరకు అంతరించాయి. ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి ఫాల్స్ ప్రెస్టజ్ తో వాడెవడో చేసాడని గొప్పకోసం వీడూ చెయ్యడం జరుగుతున్నాయి.
ఇక ఒక్క వారం రోజులు మాకు కేబుల్ వద్దు అని కనెక్షన్ పీకి పారేస్తే ఈ చానెళ్ళ గతి ఏమిటి? అంటేకూడా సాధ్యం కాదు. ఎందుకంటే, మారుతున్న సామాజిక పరిస్థితుల మేరకు వినోదం లైఫ్ లో ఒక భాగమైనందున కొన్ని పరిమితులమేరకు వారు మనపైన ఆధారపడి (లేదా మనల్ని ఎడిక్ట్ చేసి అయినా) కార్యక్రమాలు చేయడం, మనం వాటిని విరగబడి చూడటం జరగకుండా ఆపలేము.
2. అయితే, మన సామాజిక పరిస్థితుల దృష్ట్యా, తక్కువ ఎవేర్నెస్ ఉన్న ప్రజలు ఎక్కువ వున్న వాస్తవం దృష్ట్యా మనలాంటి వారిపైన, ముఖ్యంగా మీడియా వారిపైనా వారిని ప్రొటెక్ట్ చేయవలసిన భాద్యత వుంటుంది. అనగా చిల్లర కొట్టు సీరియళ్ళ చానళ్ళు చెత్త రియాలిటీ షో ల పేరుతో చేసే దోపిడీ ని ఖండించాల్సిన న్యూస్ చానళ్ళ వారే అడ్డమైన వాటికల్లా ఎస్.ఎం.ఎస్/ పోల్స్ పెట్టడం తప్పు. మీడీయాకు ఆంక్షలు పీట్టొద్దు అనే వాళ్ళందరూ అంతే స్వరంతో వారి అతిని కూడా ఖండిస్తే, లేదా స్వయం నియంత్రణ పాటించేలా వత్తిడి తెస్తే వారు తప్పక తీరు మార్చుకుంటారు. మీడియాలో న్యూట్రల్ గా ఉన్న కొందరు పెద్ద మనష్యులతో ఆంబుడ్స్మన్ లాంటి వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు మేలు జరగవచ్చు.
"......సామాజిక భాద్యత అనేది మనకంటే మీడియా వారిమీదే యెక్కువ ఉంటుంది........
ఎవరికున్నది సామాజిక బాధ్యత? మీడియాకా??!! ఊరికే చెప్పుకోవటానికే. "సామాజిక బాధ్యత" అన్న మాట గంభీరంగా ఉంటుందని వాడటమే. మనకు లెప్టిస్టులు అలవాటుచేసిన కొన్ని పడికట్టు మాటలలో ఇదొక ముఖ్యమైనది. సామాజిక బాధ్యత ఉంటే బ్లూ ఫిల్ములను తలదన్నే కార్యక్రమాలను రాత్రి పొద్దుపోయాక చూపిస్తారా, చిన్న చిన్న పిల్లల్తో రియాలిటీ షోల పేరిట జుగుప్సాకరమైన పాటలను పాడించి ఆడిస్తారా! అంతకంటే ప్రమాదం డబ్బులు తీసుకుని ఆయా పార్టీల తరఫున వార్తల పేరుతో ప్రచారం చేస్తారా (అదే పైడ్ న్యూస్ ట!), పార్టీ కరపత్రాలుగా పంచాల్సిన కాయితాలను, వార్తా పత్రికలుగా చలామణీ చేస్తారా? పార్టీ అఫీసుకు మైకు తగిలించి చేసుకోవాల్సిన ప్రచారాన్ని చానెల్ రూపాన మీడియా పేరుతో చేస్తారా? పైగా వీటిల్లో ప్రకటనలు వేసి మనం కొనే వస్తువుల ధరలను పెంచటంలో వాళ్ళ పాల్గొంటారా? డబ్బులు సంపాయించుకోవటానికి ఏవో కొన్ని మాటలు మాట్లాడటమే తప్ప వాటిల్లో నిజాయితీ అనేది లేదు. సమాజానికి ప్రస్తుత మైన్ లైన్ మీడియా చెయ్యగలిగేది ఏమీ లేదు పైగా చెత్త వ్యాపార ప్రకటనల ద్వారా డబ్బు సంపాయిస్తూ సమాజ పతనానికి దృఢమైన సోపానలను చాలా విశృంఖలంగా (గొప్ప సేవ చేస్తున్నమన్న భావన వ్యక్తపరుస్తూ), వేస్తున్నారు.
ఒక్క విషయం వినియోగదారులం మనం అలోచించాలి. మనం ఎన్ని వస్తువులు వీళ్ళు చూపించే లేకి, నేలబారు వ్యాపార ప్రకటనలు చూసి కొంటున్నాం. ఉన్న వాటిలో ఏది కొన్న పరవాలేని, షాంపూలు, పేస్టులు, పానీయపు పొళ్ళు (వివా లాంటివి), షేవింగు బ్లేడ్లు, షేవింగు క్రీములు, సెల్ ఫోన్ మొదలైన ఉత్పాదనలకే ఎక్కువ వ్యాపార ప్రకటనలు. వాళ్ళ వస్తువులు అమ్ముకోవటానికి వాళ్ళు వ్యాపార ప్రకటనల ఖర్చును, తమ లాభం లోంచి ఖర్చు పెడుతున్నారా ఈ వ్యాపారులు? లేదు. మనం చూసే ధారావాహిక, క్రికెట్/టెన్నిస్/ఫుట్బాల్ ఆటల ప్రత్యక్ష ప్రసారం అన్నిటిలోనూ ఈ వ్యాపార ప్రకటన ఖర్చు మన నెత్తినే పడుతున్నది. ఏ ఒక్క ప్రొడక్టు పాక్ మీదనన్నా, ఈ వస్తువు అమ్మకపు ధరలో, ప్రకటనల ఖర్చు ఇంత శాతం, తయారీదారు లాభం ఇంత, మధ్య వ్యాపారి లాభం ఇంత, చివరకు మీరు చెల్లించాల్సిన ధర ఇంత అని వేస్తున్నారా. లేనేలేదు చేతికొచ్చిన ఎం ఆర్ పి వెయ్యనూ, ఏదో తగ్గించినట్టుగా అందులో ఒక అర్ధో, పావలానో తగ్గించి మనకేదో మేలుచేస్తున్నట్టుగా ఫోజుకొడుతూ మన్ని మోసం చెయ్యటం. ఇదంతా ప్రస్తుతం "సామాజిక బాధ్యత" కిద చలామణి అవుతున్నది.
ప్రస్తుతం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నది "వ్యాపార ప్రకటనా కాలుష్యం" మీడియాలో ప్రస్తుతపు వెర్రి ధోరణులన్నిటికీ మూలం ఈ వ్యాపార ప్రకటనదార్లు అమలు పరిచే వక్రపు వ్యాపార పధ్ధతులే. వ్యాపార ప్రకటనలు ఒక కాలుష్యం కింద పరిగణించి, ప్రజలు, ప్రబుత్వం, వాటిని నియంత్రించటానికి తగిన చర్యలు చేపట్టకపోతే, మీడియా తీరు రోజు రోజుకీ మరింత దిగజారిపోవటం ఖాయం.
I dont think its loss for any one.You are covered by your own discretion right.If anybody doesnt want spending money of 3/- they can simply stay idle.Moreover Indian Idol is nothing more than commercial event.Money matters for them as it costs tons of money to organise such programme.Supreme Court dismissed petitions filed on similar premise that its just an commercial event.
@Prashant
i think u r mistaken @'You are covered by your own discretion' - coz, many of Indian illiterate/ semi literate citizen who follows these live shows like us turns crazy about sending SMS but fails to catch the SMS charges displayed by them in small letters in an invisible manner/ at fast speed. Channels ill motive in giving the SMS charges info in small letters in an invisible manner/ at fast speed itself is a cheating and where is the question of all knowing the things like u and me?
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి