Thursday, August 12, 2010

TV-9: దేశంలో No.1 న్యూస్ నెట్ వర్క్....

దేశంలో అగ్రశ్రేణి న్యూస్ నెట్ వర్క్ గా TV-9 దూసుకుపోతున్నది. గత నలభై ఐదు వారాల టాం గణాంకాలు దీన్ని నిరూపిస్తున్నట్లు ఆ ఛానల్ సీ.ఈ.ఓ. రవి ప్రకాష్ ఒక మెయిల్ లో తెలిపారు. స్టార్, జీ, ఎన్.డి-టీ.వీ. నెట్ వర్క్ లతో పోల్చినా TV-9 అగ్రస్థానంలో ఉన్నట్లు రవి పంపిన గ్రాఫ్ తెలియజేస్తున్నది. ఈ ఘనత సాధించినందుకు రవికి, ఆయన బృందానికి అభినందనలు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ఈ ఛానల్, దాని వైరి ఛానెల్స్ దూసుకుపోవాలని ఆశిద్దాం. 
రవి ప్రకాష్ పంపిన ఆ చార్ట్ ను మీ కోసం దిగువ ఇస్తున్నాం...రాము, హేమ 

17 comments:

Ram said...

ha..quite a good marketing gimmick. And no one will fall for it.

entha TRPs unna...ee audience category lo top anedi important. For example, business class chuse channels lo you get advertisements like Maruthi Suzuki etc. And they are quite expensive, so the channels make good money. Where as channels like TV9 which has audience from a;; categories and more from lower income groups, they get ads like 'Narala balahinata ki Homeo chikitsa'etc.

Finally, though TV9 claims to be No.1 it is not in terms of making money.

Naagarikuda Vinu said...

రాము గారు, ముందుగా సాయి గారి విషయం లో మీరు నాకు ఇచ్చిన వివరణకి ధన్యవాదములు. అక్కడ నా వ్యాఖ్యలు కేవలం విమర్షనాత్మక పదాలుగ గమనించగలరు. ఇక వీలైతే ఈ అంకెలు యే వయస్సు ప్రేక్షకులను ఆధారం చేసుకొని లెక్కించారో తెలుపగలరు. అందుకై నేను కూడ ప్రయత్నిస్తాను. tv 9 అనేది ఒక ఫక్తు వ్యాపారాత్మక వార్తా వాహిని అనే విషయం మనందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్రం లో ప్రతి వార్తా వాహిని కూడాను ఏదో ఒక రాజకీయ గుంపు కరపత్రిక వలెనున్నది. ఆ పైత్యము సరిపోక ఇందులో అసభ్యత అశ్లీలతలకి, హింసకి కొదవే లేదాయె. చాల రోజుల క్రితం జీ తెలుగు లో ఓంకార్ ఆట గురించి మనం చర్చించుకున్నపుడే నేనన్నాను "ప్రజలదేముందండి? (అందరు కాదు) టివి లో నీలి చిత్రాలు ప్రదర్శించినా విరగబడి చూస్తారు, అదే యెక్కువ రేటింగ్స్ సాధిస్తుంది అని" అందువల్ల, ఒక విలేకరి గా మీరు మాకందరికి గురించి తెలియజేసి మీ కర్తవ్యం నిర్వర్తించారు కానీ నేను మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను.
ధన్యవాదాలు.

Unknown said...

No:1 position lo unnamani kaadhu boss!! manam entha nijayitiga news ni prajalaki andistunnama annedhe matter...ravi prakash & co gurinchi teliyani vallu media lo evaruleru. channel modati rojullo internet cafe lo lovers romance scenes ni morning nundi evening varaku chupinchi villages lo unna asalu internet ante teliyani college students ni paduchesina ganatha kuda veeridhe..inka national lo fraud no:1 channel kuda tv9 ke sontham sodhara!! entha acheppina tegani story tv9 di..so vishwa daabi manava tv9 chudakura mama!!!

gajula said...

nijangaa tv9 -tv1 aite santhoshame

Vijay Bhaskar said...

నేను అనుభవ పూర్వకం గా తెలుసుకున్నది : TV9 ఎంత తక్కువ చూస్తే మన ఆరోగ్యాలు అంట బెటర్ గా వుంటాయి. తెలుగు లో న్యూస్ చానల్స్ కి ఒక identity ని TV9 తీసుకొచ్చింది దాంట్లో నాకు ఏ అనుమానం లేదు. కాని ఈ రేటింగ్ ల వెనుక పడి అసలు విషయం మధ్యలో ఎక్కడో మరచిపోయింది TV9. నావరకూ నేను TV9 లో వచ్చే న్యూస్ ని మరో సాధనం ద్వారా confirm చేసుకునే వరకూ నమ్మను.

dhana said...

Congrats Ravi Prakash proud being an Andhraite and successful at National level. Wish you good luck in future

Unknown said...

తొలుత రవిప్రకాష్ ని అబినందిద్దాం..
ఒక తెలుగోడు జాతీయ స్థాయిలో మన జెండా ఎగరేసాడని గర్వపడదాం..
మన మధ్య తిరిగిన ఒక మామూలు జర్నలిస్టు ఈ విజయం సాధించడం గ్రేట్..
పచ్చళ్ల వ్యాపారంతో పైకొచ్చిన రామోజీరావ్ గారు నిజంగా ఉప్పూ కారం తిన్న మనిషైతే ఇకనైనా తన చచ్చు పుచ్చు గ్యాంగ్ ని వదిలించుకుని రవితో పోటీ పడాలి..
తామర తంపరగా పుట్టుకొచ్చిన మిగతా న్యూస్ చానల్స్ పక్కవాడి మీద రాళ్లు వేయడం, పైవాడిని కాపీ కొట్టడం మాని ప్రొఫెషనలిజం చూపిస్తే మంచిది. ఆ సత్తా లేకపోతే జెండాలు పీకేయండి. ఎవడికో అధికారం కట్టబెట్టడానికో, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకోడానికో తెలుగు మీడియాని వాడుకోకండి. ఇప్పటికే కొన్ని చానల్స్ బజారుమనుషూల్లా మారాయి. మొన్న ఏబీయన్-ఎన్.టీవీ కుక్కల్లా కొట్టుకుని తెలుగు మీడియా పరువు తీశాయి. ఇక చాలు. రవిప్రకాష్ లా ప్రొఫెషనలిజంతో పైకి ఎదగండి. దేశంలో మన తెలుగువారి ఘనత చాటండి. తెలుగువారు ఎక్కడున్నా ఇరగదీయాలి..
బెస్ట్ విషెస్ టు ఆల్.
జై తెలంగాణ, జై అంధ్రప్రదేశ్, జైహింద్.

Vinay Datta said...

If you are really on the top for good or bad, Congrats, TV9 !

katta jayaprakash said...

It is most astonishng that the news of top rating to TV9 was conveyed to Ramu by TV9 itself(Ravi Prakash)!It is common for us to get such news from third person not directly from the person who gets the top rank.There is no such news anywhgere either in the print or in the channels.Why this secret news of TV9 by TV9?

JP.

Ramu S said...
This comment has been removed by the author.
Ramu S said...

JP sir,
You can find the same graph in TV-9. They have been tom-toming it. Don't expect other channels and newspapers to cover this.
Ramu

Saahitya Abhimaani said...

If TV 9 is number one or some other channel has become no.1. My question is SO WHAT? Whether their becoming number one has improved the news reporting? Whether the news is telecast dispassionately.

I just wonder what Press Council is doing in all this. Why do not they stop this rat race which is ultimately contributing to these channels resorting to all kinds of cheap tricks to pamper the audience and get some rating.

Anonymous said...

థింకర్ గారు చాలా ఆవేశంగా టీవీ9 తప్ప మిగతా చానళ్ళన్నీ దండగ అనేసారు. రవిప్రకాష్ గారు సాధించిన ఆ 'ఫీట్' కు సాటి తెలుగువాడిగా మీరు గర్వించవచ్చు. కాదనలేం. కానీ, అదేంటండీ మిగతా అన్ని చానళ్ళూ దండగమారివి అని రూలింగ్ ఇచ్చేసారు. ఇది మరీ అన్యాయం సార్. మన పక్కన ఇంకొకడు పరిగెడితేనే కదాసార్ మన స్పీడ్ ఎంతో తెలిసేది. ఇహ ఎబిఎన్, ఎన్ టీవీ ల కంపు గోల సంగతి అటుంచుతే ఈ టీవీ-2, హెచ్ ఎం టీవీ, మహా టీవీ, జీ 24 గంటలు వీటిలలో కూడా ఏవీ నచ్చలేదా? ఏమాటకామాట చెప్పుకుంటే రామోజీరావు గారు వ్యక్తిగతంగా విలువలు పాటించలేదేమో గానీ ఈ టీవీ న్యూస్ ను మాత్రం అన్ని చానళ్ళ కన్నా భిన్నంగా, అతి లేకుండా చూపించడంలో విజయవంతమయ్యాడనే బహుషా అందరూ ఒప్పుకుంటారేమో. 9 గంటల ఈటీవీ న్యూస్ కోసం టీవీ9 తో సహా ఏ చానల్ లో వున్నా నూటికి 95%శాతం మంది ఇప్పటికీ షిఫ్ట్ అవుతున్నరా లేదా? (ఇక్కడ ఒక్క విషయం- నేనేమీ రామోజీ వారి అభిమానిని మాత్రం కాదండోయ్) సో, చెయ్యగూడని అతి అంతా చేసి రే'టింగులు ' సాధించినంతమాత్రాన గొప్ప చానల్ అయిపోదు. తాతలు సంపాదించింది మనం కూర్చుని తింటూ పోతే చూస్తుండగానే తరిగిపోయినట్లు మొదట్లో ఎవెరూలేనప్పుడు ఏదో పొడిచాం గదా అని అదే పేరుతో నెట్టుకొపోవడం ఇంకా ఎన్నో యేళ్ళు చేయలేరు. వాస్తవాలను గమనించి కాస్త కిందికి కూడా చూడగలిగితేనే మనుగడ సాధ్యం - అది రవియైనా, రామోజీయైనా లేక వేమూరివారైనా, ఏమంటారు. ఎనీవే కంగ్రాట్స్ టు రవిప్రకాష్ అండ్ కో.

katta jayaprakash said...

Ramu garu,
Yesterday there was a news item in hmtv about the CMS awards to the Telugu channels.hmtv had covered the names of various channels with clippings who had won the awards and the award giving function was also covered.TV9 too got the award for covering social issues and hmtv for it's Dasha Disha programme on AP state and so on.
JP.

Anonymous said...

మన మిత్రుడు మధ్యలో రామోజీరావును ఎందుకు లాగారొ బహుశా ఆయనకే అర్ధం కాలేదనుకుంటా రవి ప్రకాష్ ఎప్పటికి రామోజీ రావు కాలేడు. ఐనా రామోజీ నేను నంబర్ వన్ అని యేనాడూ చెప్పలేదు . తనకు నచ్చిన పద్దతిలో ఆయన పనిచేసుకు పోతున్నారు. ఇప్పటి సో కాల్డ్ మహ మహా జర్నలిస్టులు, టెక్నిషియన్లు అంతా రామోజీ దగ్గరి నుంచి వచ్చినవారే. ఇప్పటికి రామోజీ దగ్గర పనిచేసినవారికి ఉన్నంత వాల్యు ఇంకొకరికి ఉందా. రవిప్రకాష్ కు, టీవీ నైనుకు రాజకీయ ఇంట్రెస్టులు లేవనుకోవడం మీ జర్నలిస్టు బుద్ధికి తెలియక పోవడం విచిత్రమా?ఆత్మవంచనా?రిలయన్స్ అంబానీలు ప్రపంచ ధనవంతులలో ఒకరు. టాటాలు వారికన్నా తక్కువే. కాని టాటాల కున్నంత మన్నన అంబానీలకుందా..

Saahitya Abhimaani said...

@జయహో భారత్

"....టాటాలు వారికన్నా తక్కువే. కాని టాటాల కున్నంత మన్నన అంబానీలకుందా..."

A very good point indeed.

Anonymous said...

గాసిప్ లు బాగా కవర్ చేసే రెండు నెట్ వర్క్ లు అగ్రస్థానంలో ఉన్నాయంటే మన ప్రేక్షకుల స్థాయి ఏమిటో తెలుస్తోంది.

కాని ఏదైనా సంఘటన జరిగితే ఆ స్థలానికి ముందుగా చేరుకునేవి కూడా ఈ నెట్ వర్క్ లే.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి