Friday, December 3, 2010

శ్రీకాంతా చారికి విగ్రహం ఎంతవరకు సమంజసం?

సరిగ్గా ఏడాది కిందట...తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో....ఇదే రోజు...తమ్ముడు శ్రీకాంతాచారి అందరూ చూస్తుండగా ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో పోలీసు జీప్ లో కూర్చున్న ఆ యువకుడి మొహం నాకు ఎప్పటికీ గుర్తువుండి పోతుంది. తను నమ్మిన ఒక డిమాండ్ సాధనలో జాప్యాన్ని సహించలేక...అతను ఆ అఘాయిత్యానికి పాల్పడి సమిధ అయ్యాడు. తెలంగాణలో పుట్టిన ఎవరైనా అతని గురించి కన్నీరు పెట్టకుండా ఉండలేరు...అతడు అమరుడని అనకుండా ఉండలేరు. ఒక రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ మీద పెట్టిన నిలువెత్తు శ్రీకాంత్ ఫ్లెక్సీ చూసి నాకు దుఃఖం ఆగలేదు.

అయితే...ప్రథమ వర్థంతి సందర్భంగా అతని స్వగ్రామం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఈ రోజు కే.సీ.ఆర్.శ్రీకాంతా చారి విగ్రహాన్ని ఆవిష్కరించారన్న వార్త విని నాకు చాలా బాధ వేసింది. ఈ కార్యక్రమం నాకు నచ్చలేదు. ఆవేశంలో ఆ చర్యకు పాల్పడిన ఆ విద్యావంతుడి కుటుంబానికి చేయూత ఇవ్వడం సముచితం తప్ప ఈ అంశం నుంచి లబ్ది పొందాలని చూడడం మంచిది కాదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక కోసం తెలంగాణా ఎదురుచూస్తున్నది. మంచికో చెడుకో ఇన్ని రోజులు ఆగాం...ఆ నివేదిక న్యాయం చేస్తుందన్న భావనలో ప్రజలున్నారు. విద్యార్థులు ఒక పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నారు. నివేదిక తర్వాత ప్రత్యేక తెలంగాణా ఏర్పడకపోతే...కనీసం ఒక నెలపాటు తెలంగాణా భగ్గుమనబోతున్నది. ఇక్కడ తర్క వితర్కాలతో సంబంధం లేని విషయంగా ఇది మారింది. డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు....ఎందుకొచ్చిన తెలంగాణ లొల్లి, మన బతుకులు మారతాయా...పాడా.. అనుకున్న తెలంగాణా వాసులు సైతం...తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్రం తొండిచేసిందని నమ్ముతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావంతుల గుండెలు రగులుతున్నాయి. 

ఈ పరిస్థితిలో శ్రీకాంతా చారి విగ్రహం ఏర్పాటు ఒక తప్పుగా తోస్తున్నది. ఇప్పటికే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చేతికందిన కుమారులు ప్రాణాలు కోల్పోవడంతో వందల కుటుంబాలు దిక్కు కోల్పోయాయి. పుత్రశోకం వారి తల్లిదండ్రులను దహిస్తున్నది. కేంద్రం కమిటీ ప్రకటించగానే....అంతా మిన్నకుండి పోయారు. దానివల్ల వారి 'త్యాగం' వృథా పోయింది. ఈ పరిస్థితిలో ఈ విగ్రహం ఏర్పాటు వల్ల....మనం ప్రజలకు (ముఖ్యంగా ఉడుకు రక్తపు యువతకు) ఏమని సందేశం ఇస్తున్నట్లు? శ్రీకాంతా చారి బాటలో మీరూ పయనించండని చెప్పినట్లు కాదా? అతనిలా చేస్తే...మీరూ విగ్రహాల రూపంలో చిరస్మరణీయులు అవుతారన్న సందేశం ఇందులో లేదా? ఇది సమంజసమా? ఈ ఉద్యమం కోసం ఎంతమందిని బలి చేయదలిచారు? మీ నేతలు చేసిన తప్పుకు ఈ యువతరం ఎందుకు మూల్యం చెల్లించాలి? 
తెలంగాణా ఉద్యమానికి (ఆ మాటకొస్తే ఏ ఉద్యమానికైనా) కావలసింది ఆత్మహత్యలు కాదు, పోరాట పటిమ. మడమతిప్పని చిత్తశుద్ధి. నిజమైన వీరులు పోరాటంలో మరణిస్తారు తప్ప...ఒట్టిగానే ప్రాణాలు సమర్పించుకోరు. ప్రాణాలు తీసుకోవడం....పోరుబాట నుంచి వైదొలగడం. కాదంటారా?

19 comments:

RAKSINGAR said...

ఊరూరా వై ఎస్ విగ్రహాలు పెట్తడం ఎంత సమంజసమో ఇది కూడా అంతే సమంజసం....

Unknown said...

సార్,

ఈ విషయంలో మీతో నేను ఏకీభవించలేక పోతున్నాను.

పోరాటం రకరకాల రూపాల్లో ఉంటుంది. ప్రభుత్వ అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే, ఈ రూపాలు కూడా అంత భయంకరంగానే మారుతాయి.

కేంద్ర ప్రభుత్వం తొండి చేసిందని మీరే చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత యాభై ఏళ్ళుగా తొండి చేస్తూనే ఉంది. కాని ఎంత మంది స్పందిస్తున్నారు? వారిలో ఎంతమంది రోడ్ల మీదికి వస్తున్నారు?

కేవలం విద్యార్థులు మాత్రమే ముందు వరుసలో ఉంది పోరాడుతున్నారు. వారిని కూడా జైల్లో పెట్టి వందల కేసులు బనాయిస్తున్నారు. ఒక కేసులో బెయిలు తీసుకుని బయటకు రాగానే మరో కేసులో జైలు గేటు ముందే మళ్ళీ అరెస్టు చేసి మూసేస్తున్నారు. ఇలాంటి కుట్రలతో ఉద్యమాలు అణచి వేయాలని ప్రభుత్వం చూస్తుంది.

ఒక శ్రీకాంత చారి మరణం వెయ్యిమంది జడుల్లా ఉన్నవారు ఇళ్ళ నుండి బయటికి వచ్చి నినాదాలు ఇవ్వగలిగేలా చేస్తే, మరో వేణుగోపాల్ మరణం ఒక లక్ష మంది బయటికి వచ్చేలా చేయగలిగితే వారు నిశ్చయంగా గౌరవానికి అర్హులే.

అయితే ఆత్మాహుతులు సమస్యకు పరిష్కారం కాదని నేనూ ఒప్పుకుంటాను. కాని ఆ పేరుతో త్యాగమూర్తులను గౌరవించవద్దు అనడం తప్పంటాను.

వీరికి గౌరవం ఇవ్వడం వలన ఆత్మాహుతులు పెరగడం, తగ్గడం అని ఏమీ ఉండదు. టీవీలు ఎలాగూ రోజూ వార్తల్లో చూపిస్తూనే ఉన్నాయి.

Vinay Datta said...

Infact, there have to be rules for statues of the dead or alive, great people or common people.

రక్తచరిత్ర said...

Mohammad Ali Nalgonda
శ్రీకాంతాచారి గురించి మీకు తెలియకపోవచ్చు . కాని వాడి గురించి తెలిసిన వాడిగా నిజం చెపుతున్నా . ఈ శ్రీకాంతాచారి ఒక పచ్చి తాగుబోతు . తాగుడుమైకంలో తల్లిని కూడా కొట్టిన రోజులు వున్నై. ఈ తాగుబోతు LB nagar లో ఉంటూ TRS నాయకుల వెంట తిరుగుతూ వాళ్ళు పోయించిన మందు తాగుతూ B.pharm చదువు మధ్యలోవదిలేసిండు. అలాంటివాడు KCRని అర్రెస్ట్ చేసిన రోజున అందరిమధ్య తాగిన మైకంలో మీద పెట్రోల్ పోసుకొని pose కొట్టిండు. కాని వాడి దురదృష్టం ఎవరో అగ్గిపుల్ల వెలిగించిండు. ఈ విషయం వాడు ఉస్మానియా హాస్పిటల్ లో పోలీసులకి కూడా చెప్పిండు. ఇక వాడు హాస్పిటల్ కి వచ్చిన ప్రతి ఒక్కరితో ఏడుస్తూ తనని బ్రతికించమని ఎట్లా బ్రతిమాలిండో అందరమూ టీవీలలో చూసినాము, పేపర్లలో కూడా చూసినం.
ఇలాంటి తాగుబోతు, పిరికి సన్నాసి మన అమర వీరుడు . వీడికి విగ్రహం ...హడావిడి ... అవసరమా ?
Posted by Telangana area man in Face book..
Courtesy:-Mohammad Ali Nalgonda
http://www.facebook.com/profile.php?id=100001720792605&v=info

voleti said...

avunaa???

Apparao said...

శ్రీ కాంత్ చనిపోయినప్పుడు లక్ష రూపాయలు ఇస్తాం అన్నాడు KCR విద్యార్ధులని రెచ్చగొట్టడానికి.

ఉద్యమం మాట పక్కన పెట్టండి, మానవత్వం తో ఆలోచించండి. ఉద్యమం కోసం ఆత్మా హత్య చేసుకోవడం పిరికితనం. ఉద్యమం కోసం చనిపోయిన వారి విగ్రహాలు పెట్టడం కూడా డబ్బు ఖర్చు.
విగ్రహాలు పెట్టె డబ్బుతో ఆ తల్లి తండ్రులకు కొంత డబ్బు ఇవ్వడం మంచి పని.
@XXXXX
వై ఎస్ కోసం నిజం గానే ఆత్మా హత్యలు చేసుకున్నార ?

@ శ్రీకాంత్
తెలంగాణా వస్తే ఉద్యోగాలు వస్తే అని స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు కెసిఆర్.
ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి , మనం (ప్రజలం) ప్రజా పతినిదులని ఎన్నుకోన్నాం.
వారిని చొక్కా పట్టుకుని నిలతీయాల్సింది.
"నన్ను బతికంచండి " అని అన్న శ్రీకాంత్ ని త్యాగమూర్తి అని అంటున్నారు ?
@ రక్త చరిత్ర
నిజం చెప్పారు

kvramana said...

@Mohd Ali Nalgonda
I dont think it is fair to post a comment like this. May be what you are saying is true...still...
When the son of a so called leader of the masses is claiming that his father was committed to the welfare of people and he had died for the people, are we not keeping quiet? Did that leader die for the people of this state? He died in an accident. That's it.
Please spare the dead.
K V Ramana

Praveen Mandangi said...

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే డబ్బులు కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు అని నాయకులు అన్నప్పుడు విమర్శించలేదా? ఇప్పుడు తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యల విషయంలోనూ అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. లక్ష రూపాయల కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? పొట్ట కూటి కోసం కిరాయి హత్యలు చేసేవాళ్లు ఉన్నారు. డబ్బుల కోసం తమని తాము ఎలా చంపుకుంటారు? కిరాయి తీసుకునేవాడు బతికుంటేనే ఆ డబ్బులతో బిర్యానీ తినగలడు, మందు తాగగలడు. కిరాయి కోసం చస్తే అతని చెయ్యగలిగేది ఏమీ ఉండదు.

premade jayam said...

ఎద్దుల మైలారం బతకమ్మ సంబరాల్లో వేణుగోపాల్ flexi చూసి నాక్కూడా దుఖం తన్నుకొచ్చింది. ఈ సిండ్రోం కి ఏ పేరు పెడదాం.

Ramu S said...

"దుఖమే జయం"...అని పెడదామా?

Anonymous said...

విగ్రహం పెట్టడం ఖచ్చితంగా తప్పే. ఎవడి రాజకీయ ప్రయోజనాలు వాడివి.
అంతగా కావాలంటే తెలంగాణా వచ్చాక త్యాగులందరి విగ్రహాలూ పెట్టుకున్నా వాటిని చూసి మరికొందరు చనిపోయే పరిస్థితి ఉండదు.
KCR కు ఇంకా ప్రేమ ఉంటే చంద్రబాబు ఎంటీవోడి ది పెట్టుకున్నట్లు శ్రీకాంతాచారి విగ్రహం సి.ఎం సీటుపక్కనే పెట్టుకుని రోజూ మొక్కుకోవచ్చు.

Anonymous said...

@Sreekanth
"వీరికి గౌరవం ఇవ్వడం వలన ఆత్మాహుతులు పెరగడం, తగ్గడం అని ఏమీ ఉండదు"
తప్పు సోదరా. చిన్న పిల్లలు బూతు సినిమాలు చూడనిచ్చినంత మాత్రాన ఏం చెడిపోరు అన్నట్లుంది మీ స్టేట్‌మెంట్.
@Raktacharitra
మీ పేరు భయంకరంగా పెట్టుకున్నట్లే భయంకరమైన విషయాలు (వాస్థవాలో కాదో తెలియదు. ఎవడో వ్రాసింది కోట్ చేసారు) వ్రాసారు. కానీ ఇది అసందర్భమేమో?
అన్నట్లు మీరు మామసం తింటారా? అయితే రోజూ బొక్కలు మెళ్ళో వేసుకుని తిరగండి:)
@Ramu
మీకిష్టం ఉన్నా లేకపోయినా ఇలాంటి సెన్సిటివె విషయాలపై ఇలాంటి ఎడ్వర్స్ కామెంట్స్ పబ్లిష్ చెయ్యకుండా ఉంటే మంచిదేమో?

Anonymous said...

ఇలాంటి సెన్సిటివె విషయాలపై ఇలాంటి ఎడ్వర్స్ కామెంట్స్ పబ్లిష్ చెయ్యకుండా ఉంటే మంచిదేమో?
___________________________

ఎందుకు మంచిది?? అంటే, శ్రీకాంతా చారిని పొగుడుతూ రాస్తే ఒప్పా?

వాస్తవాలనుంచి ఎందుకు దూరంగా పరిగెత్తడం?

ఆ MCA అబ్బాయిది కూడ హత్యే అని నిర్ధారణ జరిగింది కదా?

National Media లో ఇంకా లో తెలంగాణా కోసం చనిపోయిన వారి మీద విష్లేషనాత్మక వ్యాసాలు వచ్చాయి చదివారా?


ఊళ్ళో ఎవరు ఏ కారణం చేత పోయినా, వాళ్ళు తెలంగాణా కోసం ప్రాణత్యాగం చేసారు అని ప్రచారం చేస్తున్నారు అని మీ జర్నలిస్టులే రాశారు గదా?

రక్తచరిత్ర said...

@Rs Reddy gaaru...బొక్కలు మెడలో వేసుకొని తిరగలేదు కాని చుండూరు గొడవల్లో శవాలు బుజాన వేసుకొని తిరిగినా...లింక్ హియర్
http://www.youtube.com/watch?v=loa14cF6DRQ&feature=player_embedded

VIJAY said...

Raktacharitra garu.
గురూజీ!
చుండూరు ధారుణం గురించి తెలియని వాడూ, దాన్ని హర్షించేవాడూ ఎవరూ ఉండరు.
అంతవరకూ సరే గానీ, దీనికీ దానికీ ఏమి సంబంధం?
మీ ప్రొఫైల్ లో 'ఆంధ్రా విత్ హైదెరాబాద్'(!?????) అని వ్రాసుకొనడాన్ని బట్టి చూస్తే మీరు శ్రీకాంతాచారి గురించి సంధర్బోచితం కాకపోయినా ఎవడివో వ్యాఖ్యలు కోట్ చేసారనిపిస్తోంది. విగ్రహం పెట్టడం తప్పని అందరూ ఖండిస్తూనే ఉన్నారుగా. అంతటితో ఆగిపోయుంటే బాగుండేదేమో?

రక్తచరిత్ర said...

Here is another Proof:

http://www.newsofap.com/newsofap-26664-21-mother-warns-k-chandrasekhar-rao.html

Srikanthachari's mother came forward.

Telangana agitation itself is a BIG joke ... and these fake suicides are sub-jokes in it. just laugh and leave...

VIJAY said...

yes I just laughed at 'Jai Andhra with Hyderabad' in your profile and left it. Will u RUN only helicopters/ airplanes for common man also to travel between your other areas of Andhra and Hyderabad? Do you have any mind??
What do you say about Potti Sriramulu's fasting and mistery behind his death?
as per people like you his death should not be a sacrifice. Isn't it?

for telangana said...

చాలా మంది మేం మేధావుల అనుకుని రెచ్చిపోయి కామెంట్లు రాస్తున్నారు. బట్‌ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సాధన అనేది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని ఎగతాలిగా రాసిన రామ్‌ ఏమాత్రం సరైన పనిచేయలేదు. ఎందుకంటే విగ్రహం పెట్టుకోవడం అనేది జ్ఞాపకార్థం. జ్ఞాపకాలకు కూడా తలాతోక లేకుండా అర్టికల్స్‌ పెట్టి... మెదడులోవచ్చిన చిన్నపాటి కుట్రను వెబ్‌లో పెడితే మీకు వంత పాడటానికి చాలా మందే ఉన్నారు. మంచి ఉద్దేశంతో నడుపుతున్నానని చెప్పుకోవడం కాదు రామ్‌జీ... మంచి ఉద్దేశాలను రాయడం మంచిది. సో నెగెటీవ్‌గా మాట్లాడే వారి పరిస్థితి ఎలా ఉందంటే... అమ్మకు మనకు జన్మనిచ్చిందంటే.... ఎలా జన్మనిచ్చిందనే వంకర బుద్ది ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. సో మరోసారి బ్లాగ్‌ అభివృద్ధి కోసం కాంట్రవర్సీ స్టోరీస్‌ పెట్టొద్దు. ఫ్లీజ్‌... మీరంటే మాకు గౌరవం.

Ramu S said...

బాబూ బంటి...
నిజమైన మనోవేదన ఏమిటో, యెగతాళి ఏమిటో అర్థం చేసుకోకపోవడం వల్లనే మనకీ పరిస్థితి వచ్చింది, బ్రదర్. కొద్దిగా మెదడు పెట్టి ఆలోచించు...ఈ విగ్రహాలు ఇతర విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది. ఉస్మానియా విద్యార్థుల మీద పోలీసుల దమనకాండ, విద్యార్థుల ఆవేశం దగ్గరి నుంచి చూసి కుమిలిపోయిన, పోతున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. కాబట్టి లేనిపోనివి ఆపాదించకుండా....సావధానంగా ఆలోచించు. తెలంగాణా విద్యార్థులు పోరాడాలి తప్ప ప్రాణాలు తీసుకోకూదదన్నది నా అభిప్రాయం.
నా బాధ అర్థం కాకపోతే...ఇద్దరం ఖైరతాబాద్ చౌరస్తా లో కలుసుకుని మాట్లాడుకుందాం...
Give me your phone number, I'll contact you.
Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి