Sunday, December 5, 2010

గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరనేల?:: Sunday Special

జర్నలిజం కాలేజీలలో సీటుకోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయిలను...'తల్లీ...నీ రోల్ మోడల్ ఎవరు?' అని అడిగితే...తొభై శాతం మంది బర్ఖాదత్ పేరు చెబుతారు. అలాగే ఆమె పేరు చెప్పి..."ఇండియన్ జర్నలిజం స్కూల్"లో సీటు పొందిన ఒక ఉత్సాహవంతురాలైన విద్యార్థిని నిన్న నాతో మాట్లాడుతూ..."సార్...మీరు అడిగినప్పుడు బర్ఖా దత్ పేరు చెప్పాను. ఈ టేపుల గొడవ చూశాక నా గుండె పగిలిపోయింది సార్...." అని  అమాయకంగా చెప్పింది. 
ఇప్పుడంతా బర్ఖా మీద పడి ఏడుస్తున్నారు కానీ...నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఇలాంటి లాబీ వ్యవహారాలు చేస్తూ...తాము పనిచేసే సంస్థకో, తమకో లాభం కలిగేలా చూసుకుంటారు. గాస్ సిలిండర్ సైతం పైరవీతో కాకుండా...క్యూలో నిల్చుని తెచ్చుకోవాలని అనుకునే నాలాంటి వాళ్ళను ఇదే జర్నలిస్టులు....పిచ్చి నాయాళ్ళుగా, పనికిరాని వెధవలుగా చూస్తారు. 

అంతదాకా ఎందుకు? మీకు అందుబాటులో వున్న 'ఈనాడు' లేదా 'ఆంధ్రజ్యోతి' విలేకరులతో మాట్లాడండి. వారితో వారి యాజమాన్యాలు ఎలా పనులు చేయిన్చుకున్నాయో చెబుతారు. అన్ని పత్రికలు నేతలను, పోలీసులను, అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ఛీప్ రేటుకు పెద్ద మొత్తంలో స్థలాలు కొన్నాయి. ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా? ఆగస్టు సంక్షోభం ఒక పెద్ద మీడియా-పొలిటికల్ లాబీయింగ్ లో భాగం కాదా? పుష్కరాల కవరేజ్ కు కూడా మీడియా లాబీయింగ్ చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఎన్.డీ.-టీ.వీ.యాజమాన్యానికి, ప్రనోయ్ రాయ్ కు తెలీకుండా ఇదంతా జరిగిందని అనుకోవడం ఒక పిచ్చితనం. ఇక్కడ దొరికినోడు మాత్రమే దొంగ సార్. 

నాకు తెలిసి...ప్రతి విలేకరి తమ సంస్థ కోసం పైరవి చేస్తాడు. నేను....అలా చేసే వాడిని కాదు...అన్న పిచ్చి మారాజులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అలాంటి వాడికి చెత్త బీట్ దొరుకుతుంది. పనికిరానివాడన్న ముద్ర బోనస్ గా లభిస్తుంది. విలేకరులు అంతా....వ్యాపార ప్రకటనల కోసం గడ్డి కరుస్తూ...లాబీ చక్రవలయంలో చిక్కుకుంటున్నారు. రాజకీయ తీట వున్న తాను ఇచ్చే ప్రకటన, ఫోటో పత్రికలో వేసి మర్నాడు...ఒక పచ్చ గాంధీ (ఐదొందలు) కోసం తన దగ్గరకు వచ్చే విలేకరుల గురించి ఒక న్యాయవాది చెబితే మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. యాజమాన్యాలు సరిగా డబ్బులివ్వవు, మన లాయర్ లాంటి వాళ్ళు వ్యవస్థను కరప్ట్ చేస్తారు, ఈ కక్కుర్తిగాళ్ళు (విలేకరులు) గడ్డి తింటారు. ఇక్కడ మేత బాగుందని గ్రహించి...వేరే పనిచేసుకునే దొంగ వెధవలు కూడా విలేకరులు, విశ్లేషకులు, మేథావుల అవతారాలు ఎత్తి జర్నలిజాన్ని మరీ పలచన చేస్తారు.    

నిజానికి జిల్లాల్లో విలేకరులు చాలా మంది ఏదో ఒక రాజకీయవేత్తకు బంటుగా పనిచేస్తారు. ఆ దన్నుతో అధికారులను బెదిరించి దండుకుంటారు. అయినా...పత్రికలు, ఛానెల్స్ పార్టీల వారీగా చీలిపోయినప్పుడు, ప్రకటనల కోసం విలేకరులకు టార్గెట్ లు ఉన్నప్పుడు....ఇంకా జర్నలిజంలో విలువలు ఉంటాయని అనుకోవడం ఒక భ్రమ, దురాశ. దురదృష్టవశాత్తూ మన దగ్గర జర్నలిస్టు యూనియన్ నేతలు కూడా మాంచి లాబీయిస్టులు. వారిని నమ్ముకోకపోతే....తర్వాత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వంటి పదవులకు లాబీయింగ్ కష్టమవుతుందని మన ఎడిటర్లు భావించాల్సిన పరిస్థితి. కాబట్టి....గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం దేనికి? కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను బాగుచేయడానికి దివి నుంచి భువికేగిన వ్యవస్థ...ఈ మీడియా అనుకోవడం దేనికి? 

15 comments:

Anil Kumar Puranam said...

చాలా నిర్వేదనగా వుంది. నీతిని,మంచిని పెంచగలవనుకున్న మీడియా, చివరకు దేనిని ఎండగట్టటానికి మెదలు అయిందొ దానిలొనే మమేకం అవటం చుస్తే .

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూ గారూ,
మీ ఆవేదన, ఆవేశం అర్థం చేసుకోదగినవి. ఈ కాలంలో మనకెదురైన ప్రతి క్షణం, ప్రతి సందర్భం, ప్రతి మనిషీ మన విలువలపై మనకున్న నమ్మకాన్నిప్రత్యక్షంగానో, పరోక్షంగా ప్రశ్నిస్తూనే, పరీక్షకు గురిచేస్తూంటారు. ఫలితం ఏదైనా మనం నమ్మిన ధర్మం మంచిదని దాన్ని ఆచరించగలగడం అందరికీ, అన్ని సందర్భాలలో సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడే వ్యక్తుల శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. అన్ని వృత్తులలోనూ, వర్గాలలోనూ వ్యక్తుల స్థాయి దిగజారుతోంది. అలాగే పాత్రికేయులలోనూ విలువలు అంతరిస్తున్నాయి. విలువలును నిర్ణయించుకొని ఆచరించేవారు అన్ని రంగాల్లోనూ చాలా తక్కువగా కనబడుతున్నారు. మరో వైపు వృత్తికీ,ఉద్యోగానికీ, వ్యాపారానికీ తేడాలేకుండా పోతోంది. ఆఖరికి మానవసంబంధాలే వ్యాపారాత్మకం అయిపోతున్నాయి. వానాకాలంలో బురద, శీతాకాలంలో చలి, వేసవిలో ఉక్కలాగా సమాజంలో నైతికస్థాయి దిగజారడం ఒక అనివార్యసహజ పరిణామం. దానికి చికాకుపడితే, నిరాశపడితే, నిస్పృహకుగురైతే .... లొంగిపోవడం మొదలైనట్లే. పెద్దలు, అనుభవజ్ఞులైన తమకు ఇవన్నీ తెలియవని కాదు. కానీ ఒక్కోసందర్భంలో తోచవు కనుక నేను చెబుతున్నాను. మరేం పర్వాలేదు. మీరు నమ్ముకున్న విశ్వాసానికి కట్టుబడి మీరు మంచిపనే చేశారు. అది మీకు దీర్ఘకాలిక ఆత్మసంతృప్తినీ, మనశ్శాంతినీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను.

Srikanth said...

సర్ ఇక్కడ ఏమి చెప్పాలో తెలీకుండా ఉంది. ఇప్పుడు బయటపడ్డ ఈ భాగోతం వల్ల మంచే జరుగుతుంది అని నమ్ముతున్న. గత కొన్ని నెలలుగా అన్ని రకాల కుంభకోణాలు బయటపడడం చూసి ఆనందపడాలో లేక ఇంతటి దౌర్భాగ్య స్థితిలో దేశం ఉందని బాధపడాలో అర్ధం కాకుండా ఉంది.

I have very high regards for you and the values that you believe in. I am pretty sure others will agree with me. Soldiers like you are an inspiration for younger generation like me to not to give into despair.

Anonymous said...

డియర్ రాము!
సమాజం చెడిపోతున్నందుకు బాధ పడుతూనే నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా మనం నమ్మిన విలువలను మనపాటికి మనం పాటిస్తూ పోవడం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాకపోతే వెనక సీట్లో కూర్చోబెట్టడాలూ, తిక్క శంకరయ్య లాంటి బిరుదాంకితాలూ స్వీకరించడానికి మనసుని రాయిని చేసుకోవడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే వ్యక్తిత్వంలేని మరో వ్యక్తి యాజమాన్యంలో పనిచేయనవసరంలేని ఉచ్ఛ స్థితిలో మనం లేమాయే, అలాగని పూర్తి స్వయంకృషితో ఏ బజ్జీల బండో పెట్టుకుని బ్రతకలేముకూడాను కదా?

Anonymous said...

NDTV-ICICI loan chicanery saved Roys
NDTV Limited and associate companies in which Prannoy Roy and Radhika Roy have a majority stake have indulged in financial misdemeanours and malpractices in connivance with ICICI Bank, and raised funds by misdeclaration of the value of shares in NDTV. These shares were held by a company called RRPR Holding Private Limited. The deal took place between July and October 2008 during a "buyback" of shares from the stock market announced by NDTV Limited at the price of Rs 439 per share

http://www.sunday-guardian.com/a/1082
NDTV juggles funds, shares abroad, avoids tax
http://www.sunday-guardian.com/a/1088

http://www.sunday-guardian.com/a/1083

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మంచితనం నేడు చేతకానితనం అనిపించుకొంటూంది. లాబీయింగ్ చేయగలిగే అసమర్ధులు సమాజంలో నేడు బడాబాబులుగా చలామణి అవుతున్నారు.

Anonymous said...

రాము గారు,
మీరలా నిరాశ పడకుడదు. 2జి ఎపిసోడ్ నే తీసుకోండి పయోనిర్ పేపర్ గురించి ఎంత మందికి తెలుసు, మరి వారి వలననే కదా ఈ రోజు ఇంత మంది పెద్ద మనుషుల జీవితాలు బయటపడ్డాయి. అలాగే సుబ్రమణ్య స్వామి నే చూడండి, హార్వర్డ్ 24 సం|| లకే ఎకనామిక్స్ లో పి.హెచ్.డి. ని పూర్తి చేసి రికార్డ్ నెల కొల్పాడు. అతను సెంట్రల్ మినిస్టర్ గా పని చేసి ఇప్పుడు అతని పేరు చాలా మంది మరచి పోయినా తను చేయవలసిన పనిని ఆయన నిరుత్సాహ పడాకుండా చేయబట్టే కదా సుప్రీం కోర్ట్ కొరడా జులి పించింది. కొన్ని రోజుల క్రితం వరకు ఆయనను నేను తప్పు గా అర్థం చేసుకోవటం జరిగింది. ఎందుకంటే అతను కొన్ని పార్టిలను కలపడం తరువాత వాటికే వ్యతిరేకం గా ఆయన ప్రచారం చేయటం జరిగింది. ఆయనని ఒక చెపల చిత్త మేధావి గా అనుకొనంటూ ఉండేవాడిని. కాని ఆయన వేబ్సైట్ లో దానికి వారు ఇచ్చిన వివరణ చదివినప్పుడు ఆయన మీద ఉన్న సందేహాలు నివృత్తి అవ్వడమేకాకుండా ఆయన మొరార్జీ దేశాయ్ గారి నుంచి విజయాలను అపజయాలను సమానం గా ఎలా స్వీకరించాలో నేరుకొన్నది, మొరార్జి దేశాయ్ గారు రాసిన భగవద్గీత వ్యాఖ్యానం నిజజీవితం లో ఆయనకి ఎలా ఉపయోగ పడిందో మనసుకు హత్తుకొనేలా రాశారు.

http://www.janataparty.org/articles.asp

premade jayam said...

రచయిత తాను రాసిన పుస్తకాల్లో గొప్ప ఆదర్శాలను పాటిస్తారని ఎవరూ అనుకోరు.

నాయకుని గురించి అసలే ఆశ పడరు.

జర్నలిస్టులకు ఎందుకు మడి.

జర్నలిజం వృత్తి ఎంతో ఒత్తిడితో కుడుకొనినది. గానుగెద్దుల్లాంటి వాళ్ళు కూడా జీవితకాలం ఇక్కడ నిలబడలేరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పు కాదు. బాసులు వేల కోట్లు మింగితే ఉద్యోగులు లక్షలు మింగోచ్చు. సత్తెకాలపు(ఎస్) జర్నలిస్టులు అందర్నీ తనలాగా ఉండమని కోరడం భావ్యం కాదు. సాధ్యం కాదు. దొరికేంత వరకు దొరలుగా ఉండనివ్వండి.

Vinay Datta said...

Agree with Ramu garu and RS Reddy garu.

knmurthy said...

gongatlo thimtu article bagumdi.

Sasidhar said...

భారతదేశము నా మాతృభూమి...భారతీయులందరూ నా సహోదరులు...వగైరా..వగైరా...

రండి, అందరం కలసి పంచుకుతిందాం. ఉస్కో....


~ శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

Srikalahasthi said...

Dear Ramu,
I expected a lot better and thought provoking entry from you on this issue, but you let me down. As you usual you have included your anti eenadu and ABN comments instead of concentrating on the main issue. For some reason the main objective of this blog is not seen in your writings. As I mentioned in my earlier entry you are more focused on daily political bits than journalistic aspects. I was expecting you to bring better things like ombudsman or even discuss about the national editors guild meeting held in New Delhi about reporters and ethics. Sorry to say this, your articles are becoming more of politically motivated than journalistic. also you just can't blame eenadu and ABN for everything, I'm getting a sense that you have a preconcieved notion about two papers and letting your anger in the form of this blog.

That too being a person in PhD program the content should be more objective than these postings. Pretty soon you may lose a visitor to your blog. It's no that you care about it though.

Sorry if I hurt you with my comments.

vinod said...

Srikalahasthi garu naadi same feeling,
malla manam aa vishayam chebithe nenu TV9 and migatha vati meeda kuda rasan u antaru...
kani blog owner garu anti eenadu and andhrajyothi way lo rasthannaru blogs..
nenu enduku denni raise chesthanna ante 1) Andhrajyothi is not compareble with eenadu
2) Presnt unna news channels or papers lo Eenade koncham sensible ga undi....

Ramu S said...

అయ్యా...
ప్రస్తుత పరిస్థితిలో నేను ఇంతకు మించి పెద్దగా ఏమీ రాయలేను. మీ పరిశీలన కరెక్టే, మీరు ఈ బ్లాగ్ కోసం సమయం వెచ్చించడం నిజంగానే అనవసరం.
ప్రేమతో
రాము

katta jayaprakash said...

The proffession of journalism is full of Bharka Dutts and Vir Sanghvis and there is nothing new about it.Dorikithe donga otherwise Dora!Our Telugu doras are enjoying the proffession of journailsm with all Ws.We are just ONLOOKERS only just inefficient to do anything against this culture other than publishing our outbursts in the blogs.Even in the letters to the editorcolumns no newspaper publishes anything against the journalists and this is the solidarity of the proffession.

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి