Sunday, March 13, 2011

మేధావులారా...ఈ conspiracy of silence ఇంక ఎన్నాళ్లు??

ఈ తెలుగునేల మీద నివసిస్తున్న మేధావులనబడే జనాలను చూస్తే బాధేస్తున్నది, భయమేస్తున్నది. ఎముకలు కుళ్లిన, కండలు-కండరాలు చీకిపోయిన, వెన్నెముక తునకలైన, బుర్రచెడిన ఈ వెర్రి జనం ఇకిలిస్తూ ప్రతిదాన్నీ నిశ్శబ్దంగా చూస్తూ....ఈ రోజుకు తినితొంగుటే చాలనుకున్నట్లు ప్రవర్తించడం ఆవేదన కలిగిస్తున్నది. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా మాట్టాడే జనం మృగ్యమైపోయారు. నోరెత్తితే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని వీరి వెర్రి భయం. మనకెందుకు శ్రమ అనే నిర్లిప్తత. శాస్త్రీయ దృక్పథానికి చోటులేని మాబ్ కల్చర్ లో మునిగితేలుదామన్న ఈజీ గోయింగ్ ధోరణి.

స్పందించి చచ్చే గుణం లేకపోతేమాయె..నువ్వు Either that side or this side అనే దరిద్రపు రోగం పట్టుకుందీ జనాలకు. మీరు పుట్టింది..ఆంధ్రాప్రాంతంలోనా? అయితే తెలంగాణా వాళ్లను తిట్టాలి...సమైక్య ఆంధ్రా నినాదం చేయాలి. అరె..నువ్వు బుట్టింది...తెలంగాణాలోనా? ఆంధ్రోళ్లను దొంగలనాలి...దోపిడీదార్లనాలి. పండక్కుపోతే...రార్ బై అని ధమ్కీ ఇవ్వాలి. ఇక అంతే....ఒక లాజిక్కు లేదు. మర్యాద లేదు. మానవత్వం లేదు. ఎదుటివాడి మీద ఎందుకో చెప్పరాని పగ, ఆవేశం, అధిపత్యభావం. అన్నిప్రాంతాలలో అన్ని అంశాల్లో ఇదే ధోరణి...ఇదే మృగ స్వభావం. ఎవడైనా లాజిక్ తో నోరెత్తితే...వాడి మీద బండలేసి నోరునొక్కి చంపడం. దాన్ని మిగిలిన జనాలు సానుభూతితో చూడడం. ఛీ...వీళ్లు మనుషులా?

ఇతరేతర మార్కెట్ శక్తులు నడిపిస్తే జనం నడుస్తున్నారు. సొంత సుఖం తప్ప సమష్టి తత్వం మృగ్యమైపోయింది. రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఒకపక్క, వాటి అక్రమసంబంధంతో పురుడుపోసుకున్న అవినీతి అష్టావక్రుడు మరొకపక్క, పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు మరొకపక్క జీవితాలను అనుక్షణం ప్రభావితం చేస్తూ ఛిన్నాభిన్నం చేస్తుంటే...మనకెందుకొచ్చిన గొడవని...ఈ చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష అని ఈ జనం నిర్లజ్జగా బతికేస్తున్నారు. ఎదుటి వాడి వాదన కూడా విని చూద్దాం...అనే ధోరణి మచ్చుకైనా కనిపించడంలేదు.

నాలుగు అక్షరం ముక్కలు వచ్చిన వాళ్లు...వసుధైక కుటుంబం అన్న భావనను దరిదాపుల్లోకైనా రానీకుండా నా కుటుంబం...నా బాంకు బాలెన్సు అంటూ వెర్రెక్కిపోతున్నారు. రిక్షా కార్మికుడు స్పందించకపోతే...పర్వాలేదు. సర్కారు సబ్సిడీలతో చదివి...దాని పుణ్యాన ఉజ్జోగం వెలగబెడుతూ...ఈ సమాజం గురించి పట్టించుకోని బాధ్యతారహితజీవులనేమనాలి?
నిరక్షర కుక్షులు చావలేక భారంగా బతుకుతున్నారు. నిర్వచించడం కష్టమైన మేధావులు బాధ్యత విస్మరించి గిరిగీసుకుని స్వభుజతాడనంతో తృప్తిగా బతికేస్తున్నారు. పెద్ద చదువులు చదువుకున్న వారు...విశ్వవిద్యాలయాలలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నవారు...నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారు. ఒకడు తెలబాన్లు అంటాడు, మరొకడు...అసెంబ్లీకి పిండప్రదానం అంటాడు. ఎవ్వడూ ఇందేంటనడు. భయం, చచ్చేంత భయం.
సమాజం చంకనాకిపోతోంది. శాంతి....తెలీకుండా మంటగలుస్తోంది. ఒక్కో దుర్ఘటన  జరిగినప్పుడు, దుష్పరిణామం సంభవించినప్పుడు జనం గుండెలు ముక్కలవుతున్నాయి. హృదయాలు చిట్లిపోతున్నాయి. సామాన్య జనం మనోక్లేశాన్ని కొలిచే మెషిన్ ఎవడైనా కనిపెడితే ఆ బీభత్సం తీవ్రత జపాన్ సునామీకన్నా తక్కువేమీ ఉండదు.


An intellectual is a person who uses intelligence (thought and reason) and critical or analytical in either a professional or at a personal capacity అంటారు. ఈ నిర్వచనాన్ని బట్టిచూస్తే...కాస్తంత బుద్ధిపెట్టి ఆలోచించే ప్రతి ఒక్కరూ మేధావే. మరి ఈ మేధావులకేం రోగం వచ్చింది...ఇంత క్లిష్ట సమయంలో. టీవీల్లో వచ్చింది చూసి కుళ్లికుళ్లి చస్తారు తప్ప...ఏమీ మాట్లాడరేం? వీళ్లకు ఒక రీజనింగ్ అనేది ఏడవదా? కొంపకొల్లేరవుతుంటే...వీళ్లకు నిద్ర ఎట్టాపడుతుంది?

ఇప్పటికప్పుడు చూడండి. టాంక్ బండ్ మీద విగ్రహాలను ఉన్మాదులు వేల మంది పోలీసుల సాక్షిగా ఊడబెరికి మురికి కూపంలో వేస్తే....మేధావులారా మీరు నిద్రపోతున్నారా? దీన్ని నిరసించాల్సిన బాధ్యత మీకు లేదా? మనసులు చంపుకుని దీన్ని కూడా మీ ప్రాంతీయ భూతద్దాల నుంచి చూస్తారా? పోనీ మీకు ఆఫీసు జంఝాటం ఉందనుకుంటే...కనీసం ఆదివారం నాడైనా మీరు అదే టాంక్ బండ్ మీద నిరసనకు ఎందుకు కూర్చోలేదు? భాషణ్ మీద ఉన్న అనురక్తి మీకు చేతలమీద లేదే? తెలంగాణా కోసమంటూ అంతమంది ప్రాణాలు తీసుకుంటున్నా...మీకు పట్టదు. రైతులు ఉరేసుకున్నా, చేనేతలు చచ్చినా, మన ఆడపిల్లలను మృగాళ్లు యాసిడ్ తో చంపుతున్నా...మనకు పట్టదు. మన కళ్ల ముందు స్కాంలలో సంపాదించి, దాన్ని ఎన్నికలప్పుడు పంచి చట్టసభలకు ఎన్నికవుతున్నారు. వారి కబంధ హస్తాలలో రాష్ట్రం విలవిలలాడుతుంటే...కుల రక్కసి కోరల్లో చిక్కి జనం చస్తుంటే మనం చేతగాని చవటల్లా జరిగేది జరగనిస్తున్నాం. ఇప్పుడు మనం పొగలా భావిస్తున్నది...ఈ రాజకీయ నేతలు పెట్టిన మంట నుంచి వచ్చినదే కదా? అయినా...మనం మిన్నకుందామా?

సిలికాన్ వ్యాలీలో సంచలనాలు సృష్టిస్తున్నాం. కుబేరులను మన మేధతో మనం తయారుచేస్తున్నాం. అధ్భుతంగా సంపద సృష్టిస్తున్నాం. కానీ సంకుచిత దృష్టిని మాత్రం వదలలేకపోతున్నాం. మేధావులారా...మీరు మేతావులు కాదు. ఆత్మచచ్చిన మనుషుల్లా బతక్కండి. రాష్ట్రం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎదుటివాడి ఆవేదనను అర్థంచేసుకోండి. ప్రాంతాలు, కులాలు, స్వార్థం వంటి గజ్జిని మీరు కూడా వంటబట్టించుకుంటే మనకు పుట్టగతులుండవు.
దొంగ నిద్ర నటించకండి. ఈ సమాజంలో మీ గళానికి ఎంతో విలువుంది. మీ అభిప్రాయాన్ని గొంతెత్తి సమాజానికి చాటండి. మన సమాజాన్ని మనమే బాగుచేసుకుందాం. ఈ క్రమంలో చస్తే చస్తాం. నీతిమంతమైన, శాంతియుతమైన సమాజం కోసం మనం పోతే పెద్దగా నష్టంలేదు. నిజానికి మీ conspiracy of silence చావుతో సమానమైనది. లేదంటే..దేశద్రోహంతో సమానమైనది. విద్యావంతులు, మేధావులు ఈ దారుణమైన వ్యవస్థకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో ఒక ఉద్యమం నిర్మించలేనంత దద్దమ్మలా?

38 comments:

హరి said...

రాము గారు,

మీరంటే గౌరవం, మీ టపాలు విడవక చదివే వారిలో నేను ఒకడిని. 'రీజనింగ్' తో ఆలోచించాలని మీరు చెప్పడం నాకు నచ్చింది.

'రాష్ట్రం వస్తే వస్తుంది, లేకపోతే లేదు' అనడం ఏరకమైన రీజనింగ్ కిందకి వస్తుందని మీరనుకుంటున్నారు? మీకు చంద్ర బాబుకి తేడా ఏముంది? ఒక్క సారి ఆలోచించండి సార్.

sree n sree said...

ఓడ్దో విగ్రహం పలగ్గొట్టిండ్రని బర్దాష్ చేస్తలేవు కదరామన్నా..
మరి కొమరం భీం, సాకలి ఐలమ్మ, మన దేవుడు కాలోజీ (నా నోటికాడ బుక్క నాణ్యంగా లాక్కున్న (అ)నాగరికుడా... ) బొమ్మలు సుక ట్యాంక్‌బండ్ కాడ పెడితే మేం బీ జర సల్లబడ్తం. మన కాడ కుడ బొమ్మలు పెట్టే మొగోల్లు ఉన్నరే... ఏం రామన్నా... ఇది నిజాం మీద పోరాటం షురు చేసిన జిల్లా నీది. నువ్వేందన్నా.. గిట్ల జేస్తవు..

Ajit Kumar said...

Our Educational system is cause for this problem. It is possible when we got scientific Educational system.

karthik said...

>>సర్కారు సబ్సిడీలతో చదివి...దాని పుణ్యాన ఉజ్జోగం వెలగబెడుతూ...ఈ సమాజం గురించి పట్టించుకోని బాధ్యతారహితజీవులనేమనాలి?

ఈ జాబితాలో నేనూ ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను :(

katta jayaprakash said...

Ramu garu, your cocern at the state of affairs of our society and the conspiracy of silence by the intellectuals is worth appreciating.If you look at the Telangana agitation do you think the doctors,lawyers, proffessors,proffessionals and highly educated MLAs and MPs are not intellectuals?Then why this Talibanism during the agitation?Is KCR not an intellectual?Why his tongue so unparliamentary against Andhras provoking the Telangana agitators for DANCHUDU,KOTTUDU,THARIMIVEYUDU etc?
To be frank there is no value to the intellectuals in these days of politicalisation of every issue as a politician is the godfather of the society these days as the politicians rule and behave with terrorist and violent methodology as they attack physically the officials,police personnel and file SC ST atrocity cases on IAS oficers.Is Dr.Shankar Rao,state minister with medical degree not an intellectual?.What happened to JP Narayana in the state assembly premises.KTR openly asked the people to attack JP as per the visuals.Is KTR who was in abroad for quite sometime is not intellectual?So intellectuals are being overlooked and overshadowed by the political mafia and no bodsy can do anything as long as politcians take upper hand.How intellectuals take upper hand in the present scenario is a thousand dollar question.

JP

శరత్ కాలమ్ said...

హ హా.

నేను నవ్వింది మీ టపా గురించి కాదు - మన మహా మేధావుల గురించి. వీళ్ళు మేల్కోవడం కంటే మత్తుగా మూసుకొని వుండటమే బెటరండీ బాబూ. ఎవరండీ నికార్సయిన మేధావులు? మత, కుల, వర్గ, ప్రాంత, లింగ వగైరా పక్షపాతాలన్ని దాటి మాట్లాడగలిగేవారే నా దృష్టిలో మేధావులు. అలా విశాలహృదయంతో ఆలోచించలేనివారు మేల్కొనడం కంటే మౌనంగా వుడటమే శ్రేయస్కరం.

కావాలంటే మళ్ళీ తెలంగాణా మేధావులు, ఆంధ్రా మేధావులు, సమైక్యాంధ్రా మేధావులుగా వర్గీకరించుకొని ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారిని మేధావులుగా పరిగణించుకోవచ్చును. అలాగే దళిత మేధావులు, మత మేధావులూనూ. ఇంకా చెప్పాలంటే మెధావుల్లో రిజర్వేషన్లు కూడా అవసరం అంటాను. ఏ వర్గం మేధావులు ఎంతమంది వుందవచ్చో అందులో తేలుతుంది.

మిమ్మల్ని తెలంగాణా మేధావుల లిస్టులో వెయ్యవచ్చు.

aks said...

శభాష్ రాము గారు ! మీ గుండెల్లోని మంటకి అద్భుతంగా అక్షరరూపమిచ్చారు.this is one of your finest writings!
టీవీల్లో కుహనా మేధావుల పిల్లి కూతలు భరించలేకున్నాం.నిజమైన మేధావులు ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిస్తాను.సమైఖ్యమో,విడిపోవటమో తర్వాత సంగతి,దాని వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ ఉండదు కాని రోజు ఈ లొల్లి వల్ల సామాన్య ప్రజలకి మనశ్శాంతి కరువైంది.చాలా మందిలో అప్పటి వరకు వారికే తెలియని రెండో కోణం,ద్వేషం,బయటికొచ్చి మత్తెక్కిస్తోంది!ఇది చాలా ప్రమాదకరం,దురదృష్టకరం.

Saahitya Abhimaani said...

1972-73 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం జరిగి దాదాపు 400 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పటికి ఒక్క మూడేళ్ళ క్రితమే (1969) తెలంగాణా ఉద్యమం చెన్నారెడ్డి వెన్నుపోటుతో జావగారిపోయింది. అప్పుడేమైనారు ఇప్పుడు ఇంత గోల చేసేవాళ్ళూ. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంతో పాటుగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేసి ఉంటే అప్పుడే రెండు రాష్ట్రాలు వచ్చేసేవి, ఇప్పుడు ఈ ద్వేషపూరిత ఉద్యమం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికి మాత్రమె ఈ ఉద్యమాలను నడుపుతున్నారని నా అనుమానం. వాళ్ళ స్వార్ధంతో ఇలా విద్వేషాలను నూరిపోస్తే రాబొయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళ బుర్రలకు తట్టదు.

ద్వేషంతో రాష్ట్రాలు విడగొట్టాల్సిన పరిస్థితి ఆంధ్రా తెలంగాణానే అనుకుంటాను. గుజరాత్, మహారాష్ట్ర విడిపోయినప్పుడు కూడా గుజరాతీయుల మీద ద్వేషం తో కాకుండా మరాఠీ భాష మాట్లాడే వాళ్లకు రాష్ట్రం కావాలని పోట్లాడారు.ఇప్పుడు కర్నాటకా రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ మూడు భాషలు మాట్లాడుతుంటారు-కన్నడం, కొంకిణి, తుళు. అయినా కూడ ఒక రాష్ట్రంగానే ఉన్నారు.

నా దృష్టిలో ఇంతటి ద్వేష భావన కలిగినాక కలిసి ఉండటం అనవసరం, కేంద్రానికి ఏ మాత్రమన్నా బుధ్ధి అనేది మిగిలి ఉంటే, వెను వెంటనే తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరిచి చూపించాలి. రాజకీయ లబ్ది కోసం పాకులాడకూడదు. సరే తెలంగాణా రాష్ట్రం వస్తుంది. అప్పుడు వేరే ప్రాతం నుండి ఇక్కడకు ఎవరూ రాకూడదా. కాశ్మీరు తరహాలో ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటు చేసుకుంటారా. అలా ఒక్కో రాష్ట్రం వాళ్ళూ గిరి గీసేసుకుంటే, మన దేశం ఒకటిగా ఉంటుందా అసలు?

మీరు మేధావులు స్పందించటంలేదు అని బాధపడుతున్నారు. మీ దృష్టిలో మేధావులు ఎవరు? వామపక్షాల వాళ్ళనే మేధావులు అనుకోవటంలేదు కదా కొంపతీసి!!

thinker said...

JP maatlaaaadaaadu emaindi

Unknown said...

ఈ విద్వంసానికి నెల్లాళ్ళ నుంచి ప్లాన్ చేసారట .ఉలి , తాళ్ళు , నిచ్చెనలు మొదలైన సామాగ్రి
తో రెక్కి చేసుకుని మిలీనియం మార్చ్ ప్రకటన రాగానే ఆ రోజే ముహూర్తం నిర్ణయించుకుని
విధ్వంసం కోన సాగించారు . వొక్క కెమెరా లో కూడా వీరి దాష్టికం చిత్రించ బడ లేదా ?
లేదా చిత్రించారని తెలుసుకుని ట్యాంక్ బండు లో పడేసారా ?అసలు చాల రోజుల క్రితమే
కే సి ఆర్ తనయుడు కే టీఆర్ ట్యాంక్ బండు లో విగ్రహాల్ని ద్వంసం చేస్తాం అని ప్రెస్ వాళ్ళ తో మాట్లాడుతూ
అన్నప్పుడే అర్రెస్ట్ చేసి ఉండవలసింది .యిప్పుడు అసెంబ్లీ కి పిండ ప్రదానం అన్న ప్రొఫెసర్ ముందు తన ఉద్యోగానికి
దహన సంస్కారాలు గావించి అప్పుడు రణ రంగం లో దూకాలి . విద్యార్ధుల భవిస్యత్తు పణం గా పెట్టి ఉద్యమాలు చెయ్యడం కాదు ,
మీ ఆవేదన అర్ధం చేసుకో తగ్గదే రాము గారు . మీరు యి పోస్ట్ మేధావుల నిరసన జరగక ముందు రాసారేమో?ఈ రోజే ట్యాంక్ బండు మీద అది జరిగింది .
ఉద్యమం లో విధ్వంసం మొదలైతే మొదటికే మోసం వస్తుందని తెలీని మూర్ఖులు నడిపిస్తున్న ఉద్యమం లా వుంది చూస్తుంటే .

Anonymous said...

బ0ధిపోటుదొ0గలు,సముద్రపు దొ0గలు,....ఉద్యమదొ0గలు.తెల0గాణా వస్తే సేఫ్ సైడ్ కోస0 ఉద్యమిస్తున్నట్టు నటిస్తున్నారు గాని,అసలు తెల0గాణా రావాలని హ్రుదయపూర్వక0గా కొరుకొనే నాయకులు ఉన్నారా???

కమీషన్ ఉద్యమాలు నడిపి తాత్కాలిక పబ్బ0 గడుపుకు0టున్నారు.వీళ్ళ బిడ్డలకు కాక పోయినా వ0శానికి ఈ ఉసురు తగలక పోతే చూడ0డి.
కొ:ఎన్ని విమర్శలు చేసినా అభిప్రాయాన్ని విస్పష్ట0గా తెలిపిన0దుకు అభిన0దనలు.

Unknown said...

Some Andhra Idiots are comparing the destruction of Statues at Tankbund to that of the Destruction of Bhudda statues at Bamiyan by the Taliban, that comparsion cant be more Absurd.

The Bhudda statues at Bamiyan were built in the year 501 CE, thats like 2000 years ago, they were built due to the amalgamation of Bhuddist, Hindu influences and due to Cross cultural point of the Silk road, they were Great Monuments declared as world Heritage by United Nations. now coming to Tankbund statues they were built within 30 Days, I dont know the material Used to build them but they were Hollow Inside like cheap POP statues, and some of the faces of Statues were built with the Resemblance of NTR's face just because he asked them to Satisfy his EGO. Telangans did "Beautification" work at the Tankbund by Destroying those Ugly Cheap statues serving the ego's of Andhra domination, think now Tourists both domestic and foreign will thank Telanganites whenever they visit Tankbund, Now Bhudda statue will Get the attention it deserves in middle of Tankbund.

For example Telangana protesters can also claim that they are doing a Nimajanam to Andhra statues Out of Deep respect as they do to Ganesh statues every year, But they are not claiming so because that will be Absurd.

Unknown said...

ys it took extraordinary Courage and Creativity to make Million March a Success , a fake wedding was organized near Tankbund so as to give an Alibi for 500 people gathering there, there were Dozens and dozens of Police Check points posted between Telangana zillas and Hyderabad checking people thorughly at each point so Some Doctors Came in a Ambulance so that no one can stop them, Many protesters at Tankbund wore Face masks of Ambedkar, Kodandaram so that they couldnt be Identified by Police and the Great escape feat by Harish rao was straight from Movies, Jumping from Jeep and escaped by bike and took a small boat to reach tankbund.

Dude I started to Tankband from DSNR at 3.45 reached there in 15 mins, parked in a nice spot and Suprisingly the Police Just Gave up stopping protestors i was almost Taunting them taking their Pics on Their face and others were taunting them with slogans to join protests.

Some local Muslims were Providing water to the Protestors, the Songs were Ultimate dude, Just when i went in they were taking down the statues what i found was that the JAC Co-convenor was just sitting 50 feet away from where the statues were getting Demolished, it was a pretty sight dude.

What was suprising was that I always thought the Statues where some expensive Granite , to my astonishment they were all HOLLOW, like cheap POP ones. SO much for Telugu sorry Andhra pride.

Unknown said...

This is Not Raj News this is BBC

Arrests before Telangana 'million-man' rally

Protesters were prevented from gathering in large numbers
Continue reading the main story
Related Stories


About 50,000 people have defied an unofficial curfew in the Telangana region of south India's Andhra Pradesh state to rally for a separate state.

Police say that 100,000 people have been detained - many in public auditoriums and stadiums - to prevent them attending the rally in Hyderabad.

Those held include the head of the Telangana Joint Action Committee and about 50 members of the state assembly.

The protesters dubbed their gathering as a "million-man" rally.

But in the event few demonstrators were allowed by the authorities to congregate.

Widespread protests
Deep divisions have emerged over the Telangana issue over the past 15 months.

In December 2009, India's Congress Party-led government promised that the new state would be formed, but later said more talks were needed.

The announcement prompted widespread protests in the region.


One of the most under-developed regions in India
Fifty-year campaign for separate
In addition, barricades and police road blocks were set up all over Telangana to prevent people from attending the "million-man rally".

The BBC's Omer Farooq in the city says that there is a tense atmosphere there and elsewhere across Telangana with schools, shops and businesses closed down.

Our correspondent says that the police security operation made it practically impossible for protesters inside and outside Hyderabad to attend the rally - all train and most bus services in Telangana were suspended.

Among those detained was Kodanda Ram, head of the Telangana Joint Action Committee, along with about 50 members of the Andhra Pradesh state assembly who support separate statehood.


The BBC's Soutik Biswas in Delhi says that the latest protests could once again re-ignite the Telangana issue and provoke further mass demonstrations.

The final decision on a new state lies with the Indian parliament. But the state assembly must also pass a resolution approving its creation.

Opponents of the move are unhappy that Hyderabad, home to many major information technology and pharmaceutical companies, could become Telangana's new cap

Unknown said...

The Statues of Lenin and Stalin were the first to be toppled during the fall of communism in Eastern Europe.

Looks like the walls of Andhra Hegemony are Crumbling.

Unknown said...

very freedom movement involves toppling its masters. The masters ruling Telangana now are the Seemandhra politicians, leaders and their institutions, supported by Indian Government in New Delhi. In our revolution, we will also be toppling our masters. How that toppling will happen, will it be passive and peaceful or active and aggressive, is something that only our masters will decide. If they let Telangana form without much resistance it will be a passive revolution. Otherwise, there is a chance it will be an aggressive one. Borrowing the quote from Dileep:

Those who make peaceful revolution impossible will make violent revolution inevitable.
- John F. Kennedy

When the Government of Andhra Pradesh resorted to autocratic and dictatorial methods of completely suppressing all freedoms in this region by arresting more than 100,000 Telangana people merely on suspicion, arresting most of the political leadership right before the march, and setting up hundreds of barricades in the region, the people of this region, especially some of the fiery youth who were arrested again and again in the last one year on whims and fancies of the dictatorial police force of Hyderabad, took matter into their own hands. The choice left to these protestors was no longer a passive and peaceful revolution.

In the last one year, people of Telangana have led hundreds of thousands of peaceful protests, rallies, and assemblies. If passive marches would have given us a state, then we should have got our Telangana State thousand times already. It is clear for people of Telangana that these peaceful marches do not yield any results. So, how would you convince the protestors to keep it peaceful anymore, especially when you lock up entire leadership?

People Vs Government

Government of Andhra Pradesh took it as a challenge against people of Telangana and enforced the clampdown five days before the march by arresting every leader in the districts of Telangana. Almost every protestor coming from the districts of Telangana was stopped outside the Hyderabad city. Police boarded every bus to arrest or stop anyone under 30 from entering Hyderabad. On the last day 43 trains were cancelled in the region. All bus services to the city were suspended. The whole city was barricaded with barbed wires, fencing and armed forces ensuring nobody entered the city. Within the city, barricades and massive army forces were stationed at all major entry points to make sure the Million March becomes a damp squib.

Instead, Million March became a roaring success. Thousands of Telangana supporters broke through the barricades facing the prospect of immediate arrest. It was sheer grit and determination of the Telangana supporters living in Hyderabad. They came to Tank Bund as if they have won a battle. Lawyers, doctors, young and old, showed up on Tank Bund. Some of the leaders had a dramatic entry, like Harish Rao on a boat. The people were elated and celebrated the spirit of common brotherhood. However, some young people were quite angry that Prof Kodandaram was arrested. They gave clear warning on TV that they would go ahead and topple the statues if he was not released. Government of Andhra Pradesh did not budge. It let the young people take up the challenge. And they did.

Breaking the statues

For a very long time now Telanganas were quite peeved that out of 33 statues on Tank Bund only 7 were of people from Telangana. They asked, ‘how come our hero figures don’t feature?’ Clearly it was another case of Seemandhra's marginalization and suppression of Telangana people. Today, these youth took the opportunity to topple these statues of Seemandhra hero figures.

Unknown said...

If a woman is pushed into complete submission and raped repeatedly, if she cries for help and still nobody pays attentions, and if one day she retaliates with vengeance, slaps the perpetrator on his face and then abuses him, will we now find fault with that woman for raising her hand and for swearing abuses, calling it so-un-lady-like? Or do we sympathize with her and understand why she had to resort to hitting the perpetrator and why she had to abuse him?

When the rape victim hits back it is a sign of defiance. When the angry youth destroyed these statues and threw them into Hussain Sagar it is a sign of defiance.

Such expression of defiance is common in almost every freedom movement on the planet. In almost every people’s movement, the symbols of oppression are attacked. When Iraqi people got freedom from Saddam, they toppled his statues. When Egyptians wanted to get rid of Mubarak’s oppressive regime, they went about toppling his statues. When Telanganas wanted to get rid of Seemandhra rule, they went about toppling their statues.

Government of India and Government of Andhra Pradesh has ruthlessly tried to suppress a genuine democratic expression by deploying thousands of forces across the entire region, putting up barricades, making Telangana look like war zone, arresting people on mere suspicion, suppressing human rights, and curtailing free movement. When the fiery youth, who came to Tank Bund fighting through various check posts and escaping from the police, were vandalizing the statues, a respected Telangana activist tried to stop these youth. The youth asked him, ‘so where were you when we were repeatedly arrested by the police?’ He had no answer.

Be proud or be ashamed?

Some of our detractors, which include the national media and our beloved Seemandhra antagonists, are pained by the destruction of these lifeless statues. They think it is a shameful act. They think it is a disgrace to our movement. Some of the Telangana leaders also have been pushed to feel guilty.

Why should Telangana be ashamed of this act? Why should it be a disgrace?

While we in Telangana are pained by the arrest of 100,000 people based on mere suspicion and death of 600 students who have committed suicides, the detractors are pained

Unknown said...

Arrey Andhra Saru, why did you keep silent when Our AP assembly is running as Exclusive "Andhra" assembly for the past few weeks, Didnt you feel Hurt that AP assembly has lost all its sanctity and Meaning. Now you are Crying for a fake "Pinda Pradhanam", Mock funerals are a Popular form of Non-violent protests all over the world. You should appreciate the Creativity of JAC that is coming up with different forms of Non-violent protests. Stop crying like a 12 year old gal.

You are a Living example for Intellectual Dishonesty, think If you lived during Nazi regime you would have been righting Thesis to Support Racial Superiority of Aryans.

Nee Mosalee Kannellu apu anna.

Anonymous said...

మేధావులా వారెవరు, ఎక్కడనుంచి వస్తారు, వారిని ఎలా కనిపెట్టడం, వారు వచ్చి రక్షించలేకపొతే మనం బ్రతకలేమా. మీరు స్పందించండి స్పందింప చేయండి, ఎవరి మీదో అభాండాలు ఎందుకు.

Unknown said...

నిజమే!!! ఎందుకు సరయిన రీతిలో స్పందించలేకపోతున్నాం?
ఎక్కడ స్పందించాలి? మనకి సరయిన ప్లాట్ ఫారం ఏది??? ఎక్కడ?
ప్రతొక్కడీకీ తనదయిన ఒక సొంత టి.వీ చానల్సో.సొంతంగా వార్తాపత్రికలో పెట్టుకుంటాడు.నిజాన్ని దాచేస్తాడు. చట్టాన్ని డబ్బు పోసి మరీ కొనుక్కుంటాడు. మరి మన బోటి వాళ్ళ మధ్యతరగతి ప్రజానీకాల సంగతేంటి? భారత దేశ జనాభా లో మా మధ్య తరగతి కులానిది డెబ్భయి ఐదుశాతం. భారత దేశ తలరాత ని తిరగరాసే సత్తా మనకేఉంది. కాని లేనిది సరయిన నాయకత్వం. చెప్పండి ఎక్కడ విప్పుదాం మన గళం? అసెంబ్లీ లోనా? వీధికొళాయిల దగ్గరే నయం. పోనీ వార్త పత్రికలలోనా? ఎక్కడొ మూడో పేజీ లో మూలన మన గళాన్ని నొక్కేస్తాడు. ఇక టి.విల్లొనా ???? వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది... నాకు తెలిసి మెధావులెవరు తెలుగు టి.వి లు చూడరు. పొద్దున్న ఏడు గంటలకి మీరు గనక చూస్తే కొందరు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు అరచుకొనే, అతి హృద్యమయిన దృశ్యాలు, చర్చ ని వీలయినంత గా .టి.ఆర్.పీ. రేట్లు పెంచేమళ్ళించడం మళ్ళించడం మీరు చూడొచ్చు.

ఇక మధ్యతరగతి ఘోషను బ్లాగుల్లో ఏడవక ఎక్కడ ఏడవమంటారో చెప్పండి. అంతో ఇంతో రాష్త్ర సమస్యల పై చర్చ జరుగుతున్నది ఇ బ్లాగుల్లోనే. ఇది చాతకానితనమే.. నిజమే.ఒప్పుకుంటా... కాని వీటిని క్రమబద్ధీకరింఛే నాయకుడెవరు? కొన్ని బ్లాగులయితే చరిత్రని తవ్వి, తిరగదోడి, శోధించి నిజాల్ని మరీ వెలికి తీశాయి.. అవి ఏ బ్లాగులో అందరికి తెలుసు. మన కున్న చిన్న పరిధి లో ఇంటర్నెట్ సాయం తీసుకుంటూ చేస్తున్న చిన్ని ప్రయత్నాలు మనం విస్మరించలేము.

రాము గారు!
సమస్య ను విప్పి చెప్పి ముందుంచడం వల్ల లాభం లేదండి... ఈ సమస్య కి ఇదిగొ! ఇవి కొన్ని పరిష్కారాలు అని ముందుంచండి. (నేను ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం లేదు.).పళ్ళు ఊడ గొట్టుకోడానికి ఏ రాయి బాగుందో అలోచించి ఎన్నుకుంటాం.

Unknown said...

ఆ టి.విల్లో చర్చా కార్యక్రమం పేరిట జరిగే తంతు చూస్తుంటే, ఎవడికయినా చిరాకెయ్యక మానదు.. కొన్నిసార్లు అడిగే అర్థవంతమయిన ప్రశ్నలకి కన్వీనియెంట్ గా జవాబియ్యక దాటవేస్తారు. కొన్ని సార్లు యాంకర్లు అనబడే వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తుంటారు.. ఎన్.టివి లో జరిగిన ఒక చర్చ.కొమ్మినేని గారు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. (కాస్త లో కాస్త చూడదగ్గ చర్చా కార్యక్రమం ఇదే. రజనీ కాంత్ ని నేను జర్నలిస్ట్ గా పరిగణించడం మానేసి చాలా కాలమయ్యింది.వర్మ తో అతని ప్రోగ్రామ్ చూశాక.. ఉన్న గౌరవం కాస్తా పోయింది. దట్స్ డిఫరెంట్!!).జగన్ పార్టీ జెండా అర్థవంతంగా ఉందా, లేదా అన్నది చర్చ. ఇది ఏ రీతి గా ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగ పడుతుందో మరి సదరు చానెల్ వారే చెప్పాలి మరి. ఎందుకు అనవసర విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు?ఇలా గ్లోరిఫై చెయ్యడం వల్ల ఎమిటి ఉపయోగం. అతడి పార్టీ జెండా ఏ రంగు లో ఉన్నా సామాన్య ప్రజలకి ఒరిగేది ఎమీ లేదు....జనాల్లో అతనికి హీరో వర్షిప్ పెంచి మరింత మాస్ హిస్టీరియా పెంచడం తప్ప మరెందుకు పనికి రాదు.

జర్నలిస్ట్ అంటే ప్రజల గళం/వాణి ని ,యధాతధంగా, తన సొంత ఆలోచనల కల్తీ లేకుండా వినిపించే వాడయి ఉండాలి.... నేను/నాది అన్నది పక్కన పెట్టి ప్రజలగురించి అలోచించేవాడే నిజమయిన జర్నలిస్ట్.

maharshi said...

మీరేం మాట్లాడినా మాది మాగ్గావాలె... ఇదీ ధోరణి. మామూలు పెద్ద మనుషుల్ని వదిలేయండి... శ్రీక్రుష్ణ రిపోర్ట్ పరిస్థితి ఏమయింది? ఇంకేం మాట్లాడతాం. వినే ఓపిక లేదు. జడ్జిమెంట్ వాళ్లే రాసేసి, జడ్జిమెంట్ ఇవ్వమంటే ఏ జడ్జైనా ఏం చెబుతాడు???
-మహర్షి

katta jayaprakash said...

Dear Ramu garu,
apmediakaburlu has gone out of track and got derailed as it has become a platform for airing the personal views on various issues rather than comments on media kaburlu.It is not the media kaburlu but personal kaburlu with personal agendas, critcism , hatred and bitterness among the people.Is it not possible to make this blog go on right track with it's original policy and purpose?

JP.

premade jayam said...

ఆదిత్య కు చోటిచ్చి తప్పు దిద్దుకుంటున్న అన్నయ్య కు వందనాలు. తప్పు తెలుసుకొనే వాడే నిజమైన మనిషి. తెలిసి అంగీకరించని వాడే మేధావి.

eblroagjger said...

We have a terrorist here who enjoys raping,,, with a beautiful name Lalita Aditya,,, can some one do something

Sitaram said...

JP garu,
Your observation is true. I disconnected my TV and net connection due to exams to children. Without following TV, I can't write anything. Now and then I am using the official net to post the burning topics.
Last night, it was decided to revive both cable connections on March 20. Till then...you should bear my off the track stories.
Cheers
Ramu

Unknown said...

Sorry everyone i Got a bit hysterical, But the owner of this Blog put its name "AP Media Kaburlu" and Poses himself as an Critic of AP media and thinks of himself as a Watchdog of our AP media.

Iam no political expert i just finished Btech lastyear, i have lot of free time so i read a lot from International media.

I always thought Raj news as a KCR's private mouthpiece and thought it exaggerates News about Telangana Issues and I didnt believe 100,000 Telangana people were arrested in a Single day as RajNews reported.

But I was Shocked when I read BBC,
it also reported that 50,000 People came to Tankbund. No national and state Media Reported this.

But they devoted Front pages to Vandalism, but I searched the entire length and breadth of Hindu and Enadu, there was no mention of 100,000 telangana people being arrested.

You dont have to be a "Expert" to notice this Clear Cut and willful Distortion of News, It is the duty of the so called experts like this Blogowner to Own up to the Fact that our National and state media are willfully Distorting against Telangana movement, Our Blogger has Clearly Failed in doing that, I hope he will admit to that and Publish a Post to rectify it.

katta jayaprakash said...

An appeal to all the friends of this blog of three regions of AP.
Dear friends,
Please donot express any hatred,intolerance and anger on one another as we have been living together as Telugu for more than six decades wsith mutual understanding,mutual benefit and getting married among the three regions people and we all speak one language.Telangana wants to get seperated and ,live as two different families with keeping alive all connections with one another.Andhra and Rayalseema people want to continue to live together in the integrated state ofcoutrse with concessions to Telangana.
Inview of this sensitive atmosphere let us all think of a solution to this problem without any ill feelings.I feel it is better to give a seperate state to Telangana and leave it's future to the new state whether the new state lands in good,bad or worst consequences as seen in Jharkhand,Utharchanchal etc.Let Andhra and Rayalseema regions build a new capital and continue to progress without depending on Hyderabad as hyderabad willl be developed on all India basis as any one can come and develop it an get returns in turn.
I humbly appeal to all the friends to maintain goodwill and good relations with one another as we have to maintain the thread of our Telugu culture and legacy.Let us not behave like people of Israel and Arabs.

JP.

NEWS ARTICLES said...

హలో రామ్ గారు...

నా కామెంట్ మీ పోస్ట్‌కు సంబంధించింది కాదు. కానీ.. మీ బ్లాగ్ చూశాక... నాకూ నా మనసుకు నచ్చింది.. అందరికీ చెప్పాలనిపించింది.. అందుకే రాస్తున్నాను...

నా మొదటి పోస్ట్ దానం గురించి రాయాలనిపించింది... వయసు పరంగా... జ్ఞానం పరంగా కూడా నేను చిన్న వాణ్నే. తప్పులుంటే క్షమించగలరు. కానీ... ఇది చదివాక ఒక్కసారైనా... నా భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్.


మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత ఖర్చు చేసి ఉంటాం?... బట్టలకు, చెప్పులకు, పుస్తకాలకు.. ఎంకా ఇన్నో పనులకు... ఎన్నో వేలు ఖర్చు పెట్టుంటాం. అయితే రోడ్డు మీద వెళ్తుంటేనో.. లేకుంటే ఆలయాల ముందో.. లేకుంటే సినిమా థియేటర్ ఎదురుగానో... ఎంతమంది బిచ్చగాళ్లు మనకు కన్పించి ఉంటారు. అందులో ఎంతమందికి మనం కనీసం ఒక్క రూపాయి దానం చేసుంటాం. మహా అయితే పది మందికో... లేకుంటే ఇరవై మందికో.
కనిపించే ప్రతి ఒక్కరికి దానం చేయమంటావా అని అనుకుంటున్నారా..?

అవును చేయండి... అందులో తప్పేముంది... ఏమిచ్చామని ఈ భూమి మనల్ని మోస్తోంది. మనం ఏం చేశామని నీరు మన దాహం, అవసరాలు తీరుస్తోంది. మనం ఏం పొడిచామని ఈ ప్రకృతి మనకు ఇన్ని అందిస్తోంది. ఈ ప్రకృతి కోసం ఏం చేయకుండానే ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా.. ఈ బిజీ జీవితంలో పక్కవాళ్ల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా చేసే సమయం అందరికీ ఉండకపోవచ్చు.. కానీ, కనీసం రోడ్డు మీద కనిపించే ముసలాళ్లకు ఒక్క రూపాయి దానం చేస్తే మన అకౌంట్లో నుంచి వేలేం కరిగిపోవు. నాకు తెలిసి హైదరాబాద్ కోఠి, సికింద్రాబాద్‌లో తిరిగిన ప్రతీ ఒక్కరూ కాళ్లు లేకుండా... కనీసం ఒంటిపై చొక్కా లేకుండా నడి ఎండలో పడుకుని అడుక్కునే వారిని చూసే ఉంటారు. వారిని తప్పించుకు వెళ్లేముందు ఒక్కసారి వారి గురించి కూడా ఆలోచించండి. ఇంత చదువుకుని, ఇంత జ్ఞానం సంపాదించి... దానితోపాటు డబ్బు కూడా సంపాదించుకుంటున్న మనం వారికి ఎంతోకొంత ఆర్థికసాయం చేయలేమా. రోడ్డు మీద కనిపించే వృద్ధులకు కనీసం ఒక్క రూపాయి కూడా దానం చేయకుండా విసుక్కునే మనం... గుళ్లలో పూజ కోసం వేలకు వేలు డబ్బులిస్తాం... దేవుడికి కొబ్బరికాయ కొనే 10 రూపాయలు వారికి దానం చేస్తే... కనీసం వారు ఒక్కపూటైనా కడుపు నింపుకుంటారు. మనం ఇచ్చే డబ్బులతో వారేం... బంగ్లాలు కట్టుకుని మనల్ని మించిన ఆస్తిపరులేం కారు.. నాకు ఇవన్నీ చెప్తుంటే ఒక సినిమా డైలాగ్ గుర్తుకు వస్తోంది. ఆరోగ్యం బాగాలేదనో... లేకుంటే ఇంకో కారణమో చెప్పి రోడ్డు మీద అడుక్కునే వారిని విసుక్కుంటాం. వారి చెప్పింది అబద్ధమైతే మనం ఇచ్చిన డబ్బులతో వారేం కార్లు కొనలేరు కదా... అదే వారు చెప్పింది నిజమైతే ఒక మనిషి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసీ... సాయం చేయకుండా అతని మరణానికి మనం కూడా కారణం కావచ్చు.. దయచేసి ఇంకో విషయం... ఎవరైనా బిచ్చగాళ్లు మీకెదురైతే వీలుంటే దానం చేయండి.. మనసుంటే ఆదుకోండి.. లేకుంటే సైలెంట్‌గా వెళ్లిపోండి. అతేకానీ వారిని మాటల్తో హింసించకండి. చాలీచాలని జీతాలు సరిపోక... తెలిసిన వాళ్లనో... సహోద్యోగినో... చేబదులు అడగడానికి మనం పదిసార్లు ఆలోచిస్తాం కదా.. అలాంటిది ఎవరో తెలియని మనల్ని ఒక్క రూపాయి దానం చేయమని అడుగుతున్నారంటే... వారు ఎంత మానసిక వేదన పడతారో ఆలోచించండి. ఉన్నడో... లేడో తెలియని దేవుడి కోసం వేలకు వేలు దానం చేసే మనం... మన ఎదురుగానే ఇంకొకరు ఆకలితో పడుకుంటుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నాం. అలా అని దానం చేయడానికి మన అకౌంట్ల నుంచి వేలకు వేలం డ్రా చేయమనట్లేదు. రోజూ మనం తాగే చాయ్‌లలో ఒక్క చాయ్ తాగకుండా కంట్రోల్ చేసుకున్నా... కనీసం 4 రూపాయలు దానం చేయగలుగుతాం. దీన్ని బట్టి ఆలోచించండి...
ఇట్లు... మనోజ్ కుమార్

www.chaakirevu.blogspot.com

srikanth said...

well said JP garu... Telangana ni valla karma ki vallani vadileyandi.. okappudu pratyeka deshamga aa taravata konnallu pratyeka rashtram ga unnaru vallu... valla chavu vallu chastaaru..

Anonymous said...

ఆహా, ఒక్కసారిగా మాటల యుద్ధంలో నుండి మానవత్వ పరిళింపు లోనికి తెచ్చారు. నా కామెంట్ పొస్టుకి సంభందించినది కాదన్నారు గాని "చాకిరేవు" గారు; ఈ కామెంట్, మాటల యుద్ధంలో పడి మానవత్వం మరచి తోటి వారిని అవహేళన చేస్తున్న అందరికీ మేలు కొలుపు.

Pavani said...

చాకిరేవు గారు,
మీ పద్ధతేదో బావుంది. రోజుకో చాయ్ మానేసి దానం చెయ్యటమనే కాన్సెప్ట్ కూడా బావుంది. మీరు చెప్పిన పధతులన్నీ అమలు చేస్తే నోటి లెక్కే సంవత్సరానికి దేశంలో లక్ష కోట్లు దాటుతుంది. అన్నిటికన్నా భిక్షుక వ్రుత్తే మంచిందని అప్పటికందిరికీ తెలిసొస్తుంది. నాకింకా బతకటానికి కష్టపడాలి, చదువుకోవాలి, చిన్నదో చితకదో ఏదో ఒక పని దొరక్కపోదు, దాన్నే దైవంగా భావించాలీ..ఇలాంటివేవో పిచ్చి ఊహలున్నాయి. వాటిని పటాపంచలు చేసి నిజమేంటో చెప్పారు. ధన్యవాదాలు. నేనిప్పుడె నాకు తెల్సిన వాళ్ళందరికీ రోజుకో చాయ్ మానేసి ఆ డబ్బులు నాకోసం అట్టేపెట్టమని చెబ్తా. ఈ లోపు ఉద్యొగం మానేసి అడుక్కోవటం practice చేస్తా.

Anonymous said...

/ ఈ లోపు ఉద్యొగం మానేసి అడుక్కోవటం practice చేస్తా./

మీది ఏ ప్రాంతం? మా ప్రాంతంలో అడుక్కుంటే తిరగనియ్యం. అడుక్కునేదానికీ 610 జివో అమలు చేయాలని ఉద్యమిస్తం, అసలే మాది ఉద్యమాల గడ్డ, మడమ తిప్పే ప్రశక్తే లేదు. ధర్మప్రభువు నిజాం కాలంలో అడుక్కునే వాళ్ళు బాగా అభివృద్ధి చెందాము, ఇప్పుడు మీరొచ్చి మా అడుక్కుతినే నౌకరీలు దోస్తున్రు. ఆంధ్రా అడుక్కునేవాళ్ళు భాగో, తెలంగాణ అడుక్కునే వాళ్ళు జాగో!
ఇప్పుడేమంటరు? :P :))

Anonymous said...

చాకిరేవు గారు వ్రాసిన దానికి ఎవరి ఊహలు, విజ్ఞత బట్టి వారికి అనిపించింది. వెయ్యాలి అనిపించిన వారికి మనవత్వం కనపడితే; ఇందులో "అనాధ బ్లాగు Pavani" గారికి బ్రతుకు తెరువు కనపడింది. కానీ, వ్యక్తపరచిన తీరు చూస్తే, భాష తెలుగైనప్పటికీ విదేశి అహంకారపు వాసనలు వస్తున్నాయి. ఎన్నో దేశాలు మన దేశం మీద పడి దోచుకొని పొయినా మన దేశం ఇంకా పెట్టే స్థితిలోనే వున్నది. కొందరు మటుకు వున్నది చాలదన్నట్లు విదేశాలకు అడుక్కున్నేందుకు పోయారు. మన దేశంలో ఇంకా జాలి దయ కరగలేదు. మీరు అన్ని లెక్కలు వేసుకొనే దిగుతున్నారు కాబట్టి మీకు విజయం తప్పదు. కాకపోతే మీలాంటి వారి వలన మాలో జాలి దయా తగ్గకుండా చేసుకోండి.

Vinay Datta said...

@Ajith Kumar garu : I totally accept with you.

Pavani said...

హ.హా..ప్రస్తుత భారత దేశంలో కష్టపడె మనస్తత్వమున్న వారికి చిన్నదైనా ఏదో పని దొరక్కపోవటం ఉండదనీ నా అభిప్రాయం. నేను విదేశంలో ఉండే మాట నిజమే.ఇక్కడ అడుక్కునే వాళ్ళకి విలువ లేదు.కష్టపడే వాళ్ళకి, తెలివిగల వాళ్ళకి, జీవితంలో విజయం సాధించిన వాళ్ళకి ఉంది. ఒక్కో సారి అది ఇండియా నించి వచిన నా లాంటి వాళ్ళకి కొంచెం దుర్మార్గంగా అతిగా అనిపిస్తుంది. కానీ పనే దైవంగా భావించే జాతి ఎప్పటికైనా బాగు పడ్తుందనేది నా నిశ్చితాభిప్రాయం. 80 ఏళ్ళ వయసులో ఒంటరిగా ఉంటూ ఒక్క క్షణం ఖాలీగా ఉండని ఎంతో మంది వ్రుద్ధులు ముఖ్యంగా స్త్రీలు ఇక్కడ సర్వ సాధారణం. మీకీ మాత్రం తెలియదని నేననుకోను.
ఇంకో విషయం. పది కి తొమ్మీది మంది ఇక్కడ మధ్య తరగతి లెదా తక్కువ వారే. పన్నెండేళ్ళుగా ఉంటున్నా.. ఇక్కడి మధ్య తరగతి వాళ్ళల్లో చాలామంది కన్నా..అక్కడి(ఇండియా) వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉన్నారని నేను కనిపెట్టిన నిజం. అందుకే ఒక కాలెప్పుడూ మాత్రుదేశం వేపే.

జాలి దయ అంటూ ఏదో చెప్పారు.నాకు తెల్సినంత వరకు..వచే డబ్బులో ఇంతని చారిటీ కింద ఇవ్వని అమెరికన్స్ చాలా తక్కువ. నిజానికది..part of their culture.కానీ..అడుక్కునే వాళ్ళకి ఇవ్వరు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే సంస్థలకిస్తారు. వారైతా నిజంగా అర్హులకే ఇస్తారు..పని దొంగలకు కాదని నమ్మకం.
చివరగా నా సలహా...అపాత్ర దానం చెయ్యకండి and don't make begging attractive. We can understand if a phyically chllenged or old a weak resorts to begging. But no need of sympathy for those who made it a career choice.

Anonymous said...

ఇప్పుడు మీరు చారిటీలు, ఫిజికల్లీ చాలంజెడ్ మరియు ఓల్దు ఏజి అన్నారే అదే పైన "చాకిరేవు" గారు భారతీయ భాషలో చెప్పారు. అక్కడ చారిటీలు అని కొన్ని సంస్థలు వున్నాయి, ఇక్కడ ఇవ్వగల ప్రతీ మనిషి ఒక చారిటీనే. తరవాత, చాకిరేవు గారు కూడా ఎక్కడా అపాత్ర దానం చెయ్యమని చెప్పలేదే... కానీ మీ రెస్పాన్సు ఇంకోలాగా వ్యక్త పరిచారు. ఇప్పుటికైనా అర్ధం చేసుకొని అమెరికన్ భాషలోనైనా సరిగ్గా చెప్పారు.

కమ్యూనిజం, దైవిజం మరే ఇజాల కన్న మానవిజం అదే "మానవత్వం" అనేదే చాలా పవిత్రమైనది అని నమ్ముతాను. దానం చెయ్యండి. అందులో ఎదొ మోసం వుందనీ, మాఫియా వున్నదనీ భయపడి చెయ్యడం మానవద్దు. చేసే ముందర విచక్షణ చూపించాలి గానీ; మనకు నచ్చలేదని వాళ్ళకి పోటీకి వస్తాము అని సరదాకైనా అనవద్దు. అదృష్టవశాత్తు మన భారత దేశంలో బెగ్గింగు అట్రాక్టివ్‌గా వున్నట్లు లేదు. వున్నట్లైతే ఈపాటికే విదేశీ సంస్థలు బోలెడు దిగేవే...

మనము ఇచ్చే స్థితిలో వున్నాము కాబట్టి ఇబ్బందులలో వున్న నలుగురికి వుపయోగపడమనీ మనోజ్ కుమారు గారి ఉద్దేశం, నా ఉద్దేశం. ఇక సోమరిపోతులంటారా వారు కేవలం అడుక్కునే వాళ్ళలోనే కాదు ప్రతీనేలా జీతం పుచ్చుకొనే వాళ్ళలో కూడా ఉన్నారు. మీరన్నట్లు అలాంటి వాళ్ళు పుచ్చుకొనే జీతమే అపాత్రా దానమేమో!!!!!

Satish Suryanarayana said...

sir,namaskaaram.andhrulandaru bagundali.ayyo andhrulante seemakosta pranthale kaadu,telangana praantham kooda.porapatuna a rendenani artham chesukuntaremonani vivarana iccha.kshaminchandi.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి