Tuesday, October 4, 2011

స్టూడియో-ఎన్ చానెల్ లో భారీ మార్పులు-దారుణకాండ

ఫక్తు రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్న పసుపు పచ్చ "స్టూడియో-ఎన్" చానెల్ లో జర్నలిస్టుల జీవితాలకు భరోసా లేకుండా పోయింది. చంద్రబాబు గారు ఆస్తులు ప్రకటించేందుకు ముందు దాకా నారా లోకేష్ చక్రం తిప్పిన ఈ ఛానల్ లో యాజమాన్యం మారిందట...అందుకే పెద్ద స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నారట. యాజమాన్యాల ఈ డ్రామాతో పాపం సీనియర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ...దొరికిన ప్రతి వేదిక మీదా...అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు కళ్ళకు ఈ జర్నలిస్టులు కనిపించడం లేదు. స్టూడియో-ఎన్ చానెల్ దాష్టీకాలు కనిపించడం లేదు. 

నాలుగు డబ్బులు ఇస్తున్నారు కదాని...ఇలాంటి తొక్కలో చానల్స్ లో చేరడమే జర్నలిస్టులు చేసే పెద్ద తప్పు. ప్రశాంతంగా Times-Now లో పనిచేసే సునీల్ పాటిల్ పోయి పోయి ఇందులో చేరాడు. టీ.వీ.-నైన్ బెంగళూరు నుంచి వచ్చి నాలుగు ఎక్కువ డబ్బులు వచ్చేసరికి ఇక్కడ జర్నలిజం అంటే ఏమిటో కూడా తెలియని తుక్కు వెధవలతో కలిసి పనిచేసాడు. ఆయనకు ఇచ్చిన పోస్టు...అసైన్మెంట్ ఎడిటర్. ఇప్పుడు 'యాజమాన్యం' మారడంతో ఆయన మరో చానెల్ కోసం చూస్తున్నాడు...పాపం. మంచి సరుకున్న జర్నలిస్టు ఇబ్బంది పడడం బాధాకరం. 

గొర్రె కసాయిని నమ్మినట్లు అనవసరంగా రాజశేఖర్ ను గుడ్డిగా నమ్ముకుని టీ.వీ-నైన్ నుంచి ఐ.-న్యూస్ కు వెళ్ళి, ఆ తర్వాత తప్పు తెలుసుకునీ...ఏమీచేయలేక ఎన్.-టీ.వీ.లో చేరి జీవిత సత్యం బోధపడి ఉన్నపళంగా స్టూడియో-ఎన్ లో చేరిన శ్యాం కూడా ఇబ్బంది పడ్డాడు. తను మళ్ళీ ఐ.-న్యూస్ కు వెళ్ళిపోయాడు. ఐ.న్యూస్ లో  ఇమడలేక స్టూడియో-ఎన్ లో చేరిన కందుల రమేష్ బాబు కూడా చాలా రోజులుగా ఐ-న్యూస్ లో భీకరంగా చర్చలు నిర్వహిస్తున్నారు.

'ఈనాడు'లో ఉండగా కరెంట్ కరీం గా పేరుపొందిన కరీం మొన్నటిదాకా స్టూడియో ఎన్ లోనే ఉన్నారు. 'కొత్త మానేజ్మెంట్' సెగ తగిలిన ఆయన ఏ.బీ.ఎన్.-ఆంధ్రజ్యోతి లో చేరినట్లు సమాచారం. పాపం...కందుల రమేష్ లాంటి వాళ్లకు ప్రతిభ వల్లనో, కులం వల్లనో, ప్రాంతం వల్లనో ఓపెనింగ్స్ చాలా ఉంటాయి కానీ...కరీం గారి లాంటి వాళ్ళే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది..అందులో మధ్య కారణం వల్ల. కందుల రమేష్ లాంటి వాళ్ళను నమ్ముకున్న బుడన్ లాంటి వాళ్లకు సమస్యలు వస్తాయి. టీ.వీ.-ఫైవ్ లో హాయిగా ఉండే బుడన్ కందుల రమేష్ ను నమ్ముకుని రెండు చానెల్స్ మారి ఇబ్బంది పడినట్లు నాకున్న సమాచారం. చెత్త జర్నలిస్టు గాళ్ళతో విసిగిపోయిన బుడన్ సొంతగా వెబ్ సైట్ నడుపుతున్నారు. 

"స్టూడియో- ఎన్ లో ఈ సో కాల్డ్ కొత్త యాజమాన్యం పోయిన నెల జీతమైన ఇవ్వలేదు. దరిద్రులు...చాలా ఇబ్బంది పెడుతున్నారు," అని ఒక జర్నలిస్టు కోపంగా చెప్పారు. జర్నలిజం అంటే....ఎదుటి వాడిని ఇష్టంవచ్చినట్లు అడ్డ దిడ్డమైన ప్రశ్నలు అడగటం అని  ఫిక్స్ అయిపోయిన రామచంద్ర ఇప్పుడు స్టూడియో-ఎన్ లో మంచి పొజిషన్ లో ఉన్నారట. బాబూ...రామచంద్రం గారూ...మీరైనా ఈ యాజమాన్యానికి చెప్పి ఈ జర్నలిస్టులకు జీతాలు ఇప్పించండి. మీకూ ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కదా!

8 comments:

వసంతం.నెట్ said...

@నాలుగు డబ్బులు ఇస్తున్నారు కదాని...ఇలాంటి తొక్కలో చానల్స్ లో చేరడమే జర్నలిస్టులు చేసే పెద్ద తప్పు>>>నేను మీ బ్లాగుని క్రమం తప్పకుండా చదువుతుంటాను. చాలా చక్కగా వ్రాసే మీరు "తొక్కలో చానెల్స్" అని తక్కువ స్థాయి మాటలతో వ్యాఖ్యానించటం మీ లాంటి విజ్ఞులకి ఇంత చదువుకున్న వారికి తగదు. మీ సాటి జర్నలిస్టులకి జరుగుతున్న అన్యాయాల పట్ల కోపంతో అలా వ్రాసి ఉండినా కూడా మీ స్థాయికి తగదు, అని మీ అభిమానిగా నా అభిప్రాయం.
జర్నలిజం మీద ఎమైనా పాఠాలు వ్రాయకూడదు, ఔత్సాహికులకి ఉపయోగకరంగా ఉంటాయి కదా. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ :)

Ramu S said...

కరక్టేనండీ...
అప్పుడే ఒకరిద్దరు ఆ ఛానెల్ ఉద్యోగులతో మాట్లాడాను. వారిచ్చిన సమాచారం నాకు చాలా ఆవేదనను, కోపాన్ని కలిగించింది. ఇంతకన్నా పరుషమైన పదాలు రాసి పోస్ట్ చేసే ముందు కొట్టేశాను. దాన్ని కూడా తొలగిస్తే బాగుండేది. తొక్కలో ఛానెల్ బదులు....ఇలాంటి 'రాజకీయ ఛానెల్స్' అని చదువుకోండి.
మీ అభిమానానికి, సవరణకు థాంక్స్
రాము

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మీ ఆవేదన తెలియ జేయడానికి ఆ మాత్రం పరుషమైన పదజాలం ఉండాలి లెండి .

no said...

meeku studionlo emi jarigina bale telustayi kaani meeru panichese yajamanyamloni channello emi jarigina emi teliyavu endukante meeku dabbulu istunnaruga anduke.... inta kopamga rayadaniki meere nannu purigolparu....okappudu aa channello 100 mandini okesari tesesina meeru noru medaparu....kaani pakka channel vallu okkarin9 teesesina edo kompalu antukunnatlu matladataru..... tokkalodi laksha vastondante vunna channel losugulu cheppe hifi people gurinchi rayakandi.... papam appudu 10000 jeetamto batike varini teesesinappudu matram shhhhhhhh....
anduku gurinvinda ginja tana nalupu erugadata.....

Ramu S said...

Dear Mr.No,
Your observation is wrong, though its true that I have constraints in writing derogatorily or ferociously about HM-TV, my sister concern. In fact, I did a post on the ouster of people in HM-TV too. But I had to delete it after two days as my co-editor suggested me that those who are axed may find it difficult to get jobs in other channels. If you observe keenly, you can find out that I am mentioning the names of those who got jobs in another channels after being axed. వాళ్ల ఉద్యోగాలు పోయాయని తెలిసినా నేను కావాలని రాయడం లేదు. ఎందుకంటే...అలాంటి వారు మార్కెట్లో పలచనకావడం నాకు ఇష్టం లేదు.

Since my posts are followed by editors too, I am bit cautious. I take objection to axing journalists in every available forum and I don't mind attracting the wrath of people at the helm.
If it is HM-TV or Studio-N, sacking people is nothing short of murdering people and I sincerely believe that the bloodthirsty editors or CEOs would pay for this sin. This is my strong opinion and there is no going back from this.
I appreciate your concern and comment.
Cheers
Ramu

evadaite enti said...

ఒక్కో ఛానల్ లో ఎవరు వెధవో..ఎవరు గుడ్డో..discus చేస్తే పొదూ !

evadaite enti said...

new channel ABC is coming soon..be aware of it...

Anonymous said...

Mr. Ramu
I appreciate your opinion, Media should be the role model and watchdog of the society but your post highlights the worst condition of present day electronic media organizations eg. Studio N. I agree with u r statement that popular political leaders talk a lot about society development and welfare or the people but they are least bothered about their own employees welfare. I have straight question to all the people working in media. What the Journalist unions are doing inspire of knowing all this. How much the families of these employees must be suffering. I am a lecture in Journalism and I very often talk to my students about its functioning and ethics in journalism and now what is going on in media is entirely different from what it should be actually. It is so disgusting to know that they didn’t pay the salaries of the employees after utilizing their work which shows their mean mentality. I wonder whether they know or not that for any employee before they decide to terminate them they should actually pay three months salary and then remove them but here they didn’t even pay for the days when they worked. If this is the case with the senior most journalists in media what about fresher ? I am worried about future journalists and future of the journalists? We should ban such channels how play with the life’s and career of journalists………….

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి