Wednesday, October 5, 2011

కోలుకుంటున్న పెసింగి భాస్కర్

భాస్కర్ పెసింగి ఎవరో...నేనెవరో. ఇద్దరం కలిసి కూడా పనిచేయలేదు. ఎందుకో ఆయనంటే...నాకు ప్రత్యేకమైన అభిమానం. డెక్కన్ క్రానికల్ రిపోర్టర్ గా విజయవాడలో పనిచేస్తూ ఏదో పనిమీద చెన్నై వెళ్లిన ఆయనను పెరాలసిస్ స్ట్రోక్ దారుణంగా దెబ్బతీసింది..రెండేళ్ల కిందట. అప్పటి నుంచీ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. జర్నలిస్టు కమ్యూనిటీ ఆయనకు ఏమీచేయలేకపోయింది. రెండేళ్ల కిందట నేను రాసిన పోస్టు "గౌస్, భాస్కర్ లకు అనారోగ్యం" ఇక్కడ చదవండి. ఈ ఏడాది సెప్టెంబర్ లో గౌస్ గారు మరణించారు...చాలా రోజులు ఆసుపత్రిలో ఉండి. ఈ రోజు భాస్కర్ గారికి సంబంధించి నాకు చేరిన ఒక తప్పుడువార్త నన్ను ఎంతగానో కుంగతీసింది. ఒక రెండు గంటల పాటు సతమతమయ్యాను. ఫోన్లమీద ఫోన్లు చేసి భాస్కర్ గారి ఫోన్ నంబర్ పట్టుకుని ఆయనతో మాట్లాడేదాకా నేను మనిషిని కాలేకపోయాను. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి చాలా ఆనందించాను. థాంక్ గాడ్.

చాలా మంది జర్నలిస్టులను చిన్నచూపు చూస్తారు గానీ, వారి జీవితాల్లోకి తొంగిచూస్తే విచారం, విషాదం, అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తాయి. రిపోర్టర్లు పొద్దున్నపోయి...తిరిగితిరిగి సాయంత్రం ఆఫీసుకు వెళ్లి తెచ్చిన వార్తలు పంపిస్తారు. రేపటికి మేత ఏమిటని వెతుక్కుంటారు. రోజుకో స్టోరీ, ఒకటి రెండు ప్రెస్ మీట్లు కవర్ చేసుకుని వచ్చేసరికి ప్రాణం పోతుంది...నిజంగా రాసే రిపోర్టర్లకు. తమకు కేటాయించిన బీట్లలో ఏదీ మిస్ కాకుండా ఉండటానికి వీళ్లు పడేపాట్లు అన్నీఇన్నీ కాదు. ఏదైనా వార్త మిస్ అయితే బ్యూరో చీఫ్ తిడతాడు, మొడతాడు. 

ఇక సబ్ ఎడిటర్ల సంగతి ఇంకా దారుణం. పిల్లలు స్కూలు నుంచి వచ్చే సమయానికో, వారు ఆడుకునే టైంకో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పేజీలకు సరిపడ వార్తలు సిద్ధంచేసుకోవడం, వార్తలు దిద్దుకోవడం, పేజీలు పెట్టించడం, తప్పులు లేకుండా చూడడం, ముఖ్యమైన వార్తలు మిస్ కాకుండా జాగ్రత్తపడడం...చేసేసరికి డెడ్ లైన్ ముంచుకొస్తుంది. అర్ధరాత్రి పేజీలు మరొకసారి సరిచూసుకుని ఇంటికి వెళ్లాక...పేజీలో ఏదో తప్పు గుర్తుకు వస్తే...అక్కడి నుంచి అనుమాననివృతి కోసమో, పొరపాటు సవరించడానికో ఫోన్ చేయాల్సి వస్తుంది. 

ఇలా అర్ధరాత్రి ఇళ్లకు చేరి...వీలుంటే భార్యతో కాసేపు మాట్టాడి పడుకుంటారు. వేధించే తుక్కు వెధవ ఇన్ ఛార్జిగా ఉన్నాడా...ఇక నిద్ర కూడా రాదు. నిజానికి చాలా మంచి ఇన్ ఛార్జిలు వేయించుకుతినే బాపతేనట. దొంగ డబ్బో, దొర డబ్బో...ఈ సాక్షి సంస్థ రాకపోతే...ఈనాడు సాక్షిగా జర్నలిస్టు సోదరులు మాడిమసైపోయి ఉండేవారనేది వేరే విషయం. అలా పొద్దున ఈ జర్నలిస్టులు నిద్రలేచే సమయానికి బిడ్డలు స్కూలుకు వెళతారు. నిద్రలేచి...రాత్రి పెట్టిన పేజీ ఎలా వచ్చిందో ఆందోళనగా లేచి చూసుకుని  టిఫిన్ చేసే సమయానికి లంచ్ టైం తన్నుకు వస్తుంది. తిన్నాక మరో కునుకు తీసేసరికి డ్యూటీ టైం ముంచుకువస్తుంది. లేటుగా వెళితే...అర దినం కోత పడుతుంది.
ఇలా కుటుంబ జీవితాన్ని దారుణంగా కోల్పోతున్నారు...జర్నలిస్టులు. మీరు అనవచ్చు....ఓస్...ఇందులో ఏముంది..ఏ ఉద్యోగికి అయినా ఇలాంటి సమస్యలు ఉండవా? అని. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. 

నేను "ఈనాడు" లో ఇరగదీసి పనిచేస్తూ...ఉద్యోగాన్ని రక్షించుకుంటూ....ఇలానే సాయంత్రాలు మిస్ అవుతుంటే...నా నాలుగేళ్ల కూతురు...హేమను అడిగింది..."మమ్మీ...సాయంత్రం ఆడుకోవడానికి నాకు ఇంకో  డాడీ కావాలని." ఇది భరించలేని, వర్ణనాతీతమైన వ్యవహారం.

భాస్కర్ గారు కూడా కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పట్టో ఆయన నాతో చాలా విషయాలు పంచుకునేవారు. తను క్షేమంగా ఉన్నారని తెలియడానికి పట్టిన రెండు గంటలు నేను దు:ఖాన్ని దిగమింగుకున్నాను. జర్నలిస్టుల భద్రత, కుటుంబాలు, కీలక పదవుల్లో ఉన్నవారి ధోరణిలో వచ్చే ప్రమాదకర మార్పులు పంచుకునేవారు నాతో.  తనకు ఆరోగ్యం బాగుంటే....ఒక మంచి పత్రికలో హైదరాబాద్ రిపోర్టర్ గా వచ్చేవారు. అందుకోసం మేమిద్దరం వేసిన కొన్ని పథకాలు ఆయన అనారోగ్యం వల్ల దెబ్బతిన్నాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలను...తనకు ఆ పరిస్థితి రావడానికి డెక్కన్ క్రానికల్ లో ఇంగ్లిషు రాకపోయినా వార్తలు రాస్తూ కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్న ఒక దుర్మార్గుడు. భాస్కర్ కు పూర్తిగా అన్నీ గుర్తుకు రావడం లేదు. అవన్నీ ఆయన రీ కలక్ట్ చేసుకుని జరిగిందేమిటో నాతో పంచుకుంటే బాగు. ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. 

సారీ...భాస్కర్...ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను తరచూ కలుస్తాను. మీకు, మీకు మనోధైర్యమిస్తూ బతుకు నావను నడుపుతున్న మేడమ్ కు, మీ పిల్లలకు నా విజయ దశమి శుభాకాంక్షలు.


భాస్కర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ...తాను 2008 డిసెంబర్ 26 న ఆయన నాకు మెయిల్ చేసిన ఒక వార్తను ఇక్కడ ఇస్తున్నాను.  ఇది డీ.సీ.లో ప్రచురితమయింది.
Mr Ramu,
 I filed this story yesterday, trouble started on the next day!
VIJAYAWADA
Dec. 25: Is city in for group rivalries which rocked two decades ago and devowed number of lives and crippled the families of many?

With the one-up-manship-game now going on between Congress Kankipadu MLA Mr Devineni Rajasekhar (Nehru) and Mr Vangaveeti Radhakrishna who switched over his loyalties recently to Praja Rajyam from Congress, is any indication that denizens apprehend revival of old rivalries in the city?

The families of Nehru and Vangaveeti Radha were at loggerheads for many years, loosing their kith and kin in the process. After the killing of Mr Vangaveeti Ranga, the gap still widened between the two families.

The gang rivalry took a toll of dozens of people on both sides. Rowdies ruled the roost during those 10 years, while Devineni brothers operated from Gunadala as headquarters, Ranga held sway over the Raghavaiah park and Gandhinagar.

The clashes which began between Mr Nehru and Mr Ranga from college elections led to the death of Nehru's brothers-Gandhi and Murali, and finally led to the killing of Ranga.

After prolonged legal battle, both the groups  settled the issue out of court. After Ranga's death, his wife Ratna Kumari, came to the politics as his inheritor.

Mr Nehru, who was in Telugu Desam Party till 1998, switched over to Congress, Ms Ratna Kumari immediately joined TD from Congress. Though, Ms Ratna and Mr Nehru were in politics, the city did not witness group clashes.

When Ms Ratna Kumari failed to get TD ticket in 1999, she kept away from active politics from the same time. Later, she met AICC president Ms Sonia Gandhi and rejoined Congress.

During the 2004 elections, differences broke out between Ms Ratna Kumari and
her son Mr Radhakrishna over the party ticket. Finally, Mr Radha had the last laugh, as the party choose him as candidate in Vijayawada East.
With the two main groups- Vangaveeti and Devineni- came on to single platform, the group rivalries also have come down. Suddenly, there is a change in Mr Radha's attitude for the last one year. The cold war between the two families again
surfaced.
At one stage, Mr Radha went to the extent of resigning from MLA post over the alleged allotment of costly land to Mr Nehru. Recently, after he joined PRP, he made sweeping remarks against Mr Nehru, bringing to the fore his father's murder.

Now corporators owing allegiance to Mr Nehru, started mounting counter attack on Mr Radha. The supporters of MP Mr  Lagadapati Rajagopal are also chipping in countering the PRP return.

If all the leaders failed to follow restraint, the present peaceful atmosphere may get vitiated.
.......
eom//

4 comments:

jeevani said...

భాస్కర్ గారితో కలిసి రెండు సంవత్సరాలు హైదరాబాద్ చెన్నైలో పనిచేశాను. ప్రతి క్షణం ఆనందంగా ఉండేది. నిజంగా ప్రతి క్షణం... అంత లైవ్లీగా ఉండేవారు. vsnl కు క్యాసెట్లు పంపి వార్తలు ప్లే చేసే కాలమది. చచ్చేంత టెన్షన్. ఆ టెన్షన్ వాతావరణాన్ని తేలిక చేసిన మొదటి వ్యక్తి భాస్కర్.
ప్రస్తుతం బాగానే కోలుకున్నారు. నేను ఆర్నెళ్ళ కిందట కలిశాను. చాలా త్వరగా రికవర్ అయ్యారు. స్ట్రోక్ వచ్చిన మొదటి నాళ్ళలో ఫోన్ చేసినపుడు భొరున ఏడ్చేవారు.
వీలైనంత త్వరలో ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

A.B.I said...

wish him recover soon... gopi

Ravi kumar reddy said...

సాతి జర్నలిస్ట్ గా మీ స్పందనకు ధన్యవాదాలు

Vinay Datta said...

I wish him speedy recovery. Also please collect information ( and publish ) about the boy, a reporter's son, who went to Kerala for treatment.

madhuri.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి