Friday, October 14, 2011

తెలుగు మీడియా----సంకుల సమరం

ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే, భారతీయ సమాజంలో పోషించే పాత్రనే తెలుగు మీడియాలో కూడా కులం పోషిస్తున్నది. తమ కులానికి చెందిన వారిని దగ్గరకు తీయడం, కులాలవారీగా గ్రూపులు కట్టడం, కుల రాజకీయాలు చేయడం మీడియాలో విపరీతమైపోయింది. సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన జర్నలిస్టులు చాలా వరకు సొంత కులం వాళ్లతో కలివిడిగా ఉండటం, ఇతర కులస్థులను పనికిరానివారిగా చిత్రీకరించడం పెరిగిపోయింది. 
"ఈనాడు" గ్రూపులో కమ్మ కులస్థులకు ప్రాముఖ్యం ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. బుర్రలో గుజ్జుతో నిమిత్తం లేకుండానే యూనిట్ల మేనేజర్లుగా కమ్మవారినే నియమిస్తారని నిరూపించే ఒక డాక్యుమెంటు గతంలో నా దగ్గరకు వచ్చింది. అది చూస్తే...ఒక పద్ధతి ప్రకారం కులాన్ని పోషించే కార్యక్రమం అవగతమయింది. నిజం చెప్పాలంటే...అంతా ఆంధ్రా కమ్మలే.
పెద్దగా ప్రావీణ్యంలేనివారికి కూడా ఆ కులానికి చెందితే పెద్ద పదవులే కట్టబెడతారన్న ఆరోపణను నేను ఖండించలేను. ఎందుకంటే...అలాంటి వారిని నేను హైదరాబాద్ ఆఫీసులో దగ్గరి నుంచి చూశాను. పదవి వచ్చాక మీడియాలో మెయిన్ టైన్ చేయడం పెద్ద కష్టం కాదు. 

"సీహెచ్" అని ఇంటిపేరున్న ఒక బ్రాహ్మణ జర్నలిస్టు...తనింటిపేరు చెరుకూరి (రామోజీరావుగారి ఇంటిపేరు) అని చెప్పుకుని ఆ పేపర్లో చాలా రోజులు సకల మర్యాదలు పొందాడని చెబుతారు. "మీరు ఎన్.రామ్ కు చుట్టాలంట గదా...అందుకె మీకు 'ది హిందూ'లో ఉజ్జోగం వచ్చిందంట గదా..." అని ముందు 'ఈనాడు'లో పనిచేసి ఆ తర్వాత 'ది హిందూ'లో చేరి పనిచేస్తున్న ఒక చలాకీ పిల్ల అడగడం నాకు గుర్తుకువస్తున్నది. మా ఇంటి దగ్గర తొమ్మిదేళ్ల పిల్ల ఒకతి...టేబుల్ టెన్నిస్ ఆడటానికి వచ్చి...."అంకుల్...మీదేమి క్యాస్టు?" అని అమాయకంగా అడిగింది. తురకోళ్లం అని చెబితే నమ్మలేదు. "రాం నారాయణ చౌదరి...పెద్దగా ఉందని రాము అంటారు..." అని చెబితే..."నేనప్పుడే అనుకున్నా..." అని ఎంతో ఆనందంగా చెప్పిందీ మధ్యన. 

రామ్ సింగ్ అని పేరు ఉంటే ఎంతబాగుండని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. నా పుత్రుడి పేరు...ఫిదెల్ రఫీక్ స్నేహిత్ అని పెట్టడం, కులం పేరు చెప్పకుండా పెంచడం గర్వంగా అనిపిస్తుంది...కానీ ఈ కులాల పెంట వల్ల భావితరం ఎంత ఇబ్బంది పడుతుందో...అని భయమేస్తుంది. 

నా ప్రియ మిత్రుడు రఫీ (సన్ నేమ్ లో మధ్య పేరు వీడిదే) గత వారం ఫోన్ చేశాడు. "అరే...అన్నా...మనం  కులానికి అతీతంగా ఫ్రెండ్ షిప్ చేస్తున్నాం...ఏ ఆఫీసు చూసినా కులాల కంపేరా...నాయనా...నువ్వు ఎలా బతుకుతున్నావ్...." అని అడిగాడు. వాడు, నేను, రమేష్ డిగ్రీలో ఒక కంచం, ఒక మంచం టైపుగా బతికాం. హ్యూమనిజం తప్ప మాకింకేమీ తెలియదు. ఒక ఇరవై ఏళ్ల కిందటితో పోలిస్తే సమాజంలో కులాల వారీ డివిజన్ స్పష్టంగా కనిపిస్తూ ప్రమాదకర స్థితికి చేరింది. పాపం...మా రఫీకి మతంతో అవస్థ వచ్చి పడింది. నా దృష్టిలో మా వాడంత సెక్యులర్ వాది లేడు. అయినా...వాడికి రీసెర్చ్ లో గైడ్ దొరకడం లేదట. బాధేసింది. 

ఇప్పుడు ఒక కమ్మ యజమాని ఛానెల్ లో పనిచేస్తున్న వివాదాస్పద జర్నలిస్టు ...తన కులం పేరు పొరపాట్న  అయినా చెప్పడు. తాను క్షురకుడిననీ...ఎవరైనా తన ముందు తల వంచాల్సిందే అని వెకిలి నవ్వు నవ్వుతూ చెబుతాడు. ఏదిఏమైనా కులం పేరు చెప్పుకుని చాలా మంది కమ్మగా బతికేస్తున్నారు...నిస్సిగ్గుగా ఈ మీడియాలో.
మనం మనం బరంపురం అని అంటకాగలేని ఏ కులస్థులైనా మీడియాలో అవస్థలు పడతారనేది అక్షర సత్యం.

అలాగే సాక్షి పేపర్, ఛానల్ పెట్టగానే రెడ్డి కులస్థులకు రెక్కలు వచ్చాయి. ఏ పేపర్లో ఉన్న రెడ్డి జర్నలిస్టులు అయినా సాక్షి ఆఫీసువైపు చూడడం ఆరంభించారు. యజమాని కులానికి చెందినవారికి ఆ మీడియా హౌజులో ప్రాముఖ్యత పెరగడం ఈ మధ్యన విపరీతమైంది. బీసీ లు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు గానీ ఈ క్రమంలో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ లు ముందుకు దూసుకుపోలేకపోతున్నారు. 

ఈ నేపథ్యంలో...మీడియాలో పెరిగిపోతున్న కమ్మ ప్రాబల్యాన్ని నిరూపించే ఒక మెయిల్ నాకు వచ్చింది. ఇందులో అన్నీ నిజాలే అని చెప్పలేం. అది ఇక్కడ ఇస్తున్నాను. ముసుగులో గుద్దులాట ఎందుకు? మీ మీ సంస్థల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు చేసే వారి జాబితాలు పంపితే వాటిని పరిశీలించి ప్రచురిస్తాం. 

38 comments:

Anonymous said...

ఒకోసారి అలా అనిపిస్తుంది కానీ, అది భ్రమ సార్ .. స్నేహం గౌరవం అణుకువ తర్వాతే కులం మతం ప్రాంతం అని నా నమ్మకం ..

మన కేసిఆర్ గారు కులం కార్డ్ , ప్రాంతం కార్డ్ గా మార్చారు. కానీ కులం కార్డ్ తో కేసిఆర్ ను ఎటాక్ చేస్తుంటే భలే నవ్వోస్తుంది ..

’యముడు’ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఎదో వుంది. గుర్తుకు రావడం లేదు.. something like "అడ్డంగా సంపాదించుకొవడానికే ఈ కార్డులు వాడుకునేది" అని ..

అది నిజం. నిజాయితీగా బ్రతకాలనుకునే వాడికి అవి కనిపించవు వినిపించవు .. నిజాయితీ పరులు ఇంకా చాలా మంది వున్నారు (more than 70%)

పానీపూరి123 said...

i NEWS: MNR valladi kAdA?
www.mnrindia.org

అయితగాని జనార్ధన్ said...

వాస్తవం చెప్పడానికైనా.. నిజాన్ని ఒప్పుకోడానికైనా సాహసం కావాలి.. అది మీకుందేమో అందుకే ఖమ్మం వారైనా.. కమ్మగా చెప్పారు.

Sasidhar said...

రామూ గారు,
మీరు పోస్ట్ చేసిన ఈమైయిల్ లింక్ మీద క్లిక్ చేస్తే సరిగ్గా ఓపన్ అవ్వడం లేదు. ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి, "Open in New Tab" లేదా, "Open in New Window" మీద క్లిక్ చెయ్యమని ఒక నోట్ పెట్టండి. బ్లాగ్ రీడర్స్ కు కాస్త సౌలభ్యంగా ఉంటుంది.
As usual, మీ పోస్ట్ బాగుంది.

~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com

Sasidhar said...

రామూ గారు,

అలాగే,టైటిల్ ను సం"కుల" సమరంగా మార్చండి.

బాగుంటుంది. మరీ అతి చేస్తున్నాననుకోకండి. ఇంతకు ముందుకూడా మీ శీర్షికను సరిచేసినట్లు గుర్తు.(బహుశా, బూదరాజు గారి ఐటమ్ అనుకుంటా)

~శశిధర్ సంగరాజు.

aks said...

ఎందుకో ఈ పోస్ట్ ఒక కులాన్నే టార్గెట్ చేసినట్టు ఉంది,మీకా ఉద్దేశం లేకపోవచ్చు కానీ చదువరులకు ఆ భావన కలుగుతుంది.ఈనాడు లో కమ్మవారి గురించే చెప్పారు, మేనేజ్ మెంట్ లో కమ్మవారి ప్రభావం ఉంటే ఇతరాల్లో బ్రాహ్మణులు అంత కంటే బలం గా ఉంటారు మరి.
>>>"యూనిట్ల మేనేజర్లుగా కమ్మవారినే నియమిస్తారని నిరూపించే ఒక డాక్యుమెంటు గతంలో నా దగ్గరకు వచ్చింది. అది చూస్తే...ఒక పద్ధతి ప్రకారం కులాన్ని పోషించే కార్యక్రమం అవగతమయింది. "
కులాన్ని పోషించటానికి ఎవడు వ్యాపారాలు చేయడు.ఏ వ్యాపారం అయినా తీసుకోండి తెలిసిన వారిని(రెఫెరెన్సు కూడా కావచ్చు),నమ్మకస్తులను పెట్టుకుని మేనేజ్ మెంట్ బాధ్యతలు అప్ప చెబుతారు.కులం ప్రభావం కూడా కొంత వరకు ఉండొచ్చు ,'మన' అన్న భావన లో అయిన విశ్వాసంగా పని చేస్తారని.దీనికి ఏ రంగం,ఏ వ్యాపారవేత్త అతీతులు కారు.ఊరూరా బ్రాంచీలు ఉండే బట్టల దుకాణాల మొదలు రెడ్డి లాబ్స్, సత్యం(రామలింగ రాజు ఆధ్వర్యం లో ఉన్నప్పుడు ) ,అమరరాజా లాంటి బడా కంపెనీ లు కూడా అదే పద్ధతి లో ఉన్నాయి మన రాష్ట్రం లో.

చానల్స్ అన్ని కమ్మ వారి అధీనం లో ఉన్నాయి అని ఒక లిస్టు పెట్టారు. ఇతర కులాల వారిని చానల్స్ పెట్టుకోవదు అని ఎవరు అన్నారు? కమ్మవారికి మాత్రమే తెలుగు లో చానల్స్ పెట్టుకోటానికి లైసెన్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా ఏమి ?

Anonymous said...

*మేనేజ్ మెంట్ లో కమ్మవారి ప్రభావం ఉంటే ఇతరాల్లో బ్రాహ్మణులు అంత కంటే బలం గా ఉంటారు*
అయ్యా,

కమ్మవారికి బ్రాహ్మణుల మీద ఒక ప్రత్యెకమైన అసూయ ఎందుకో ఒకసారి సెలవిస్తే ఆంధ్రేతర ప్రాంతాల వారికి (రాయలసీమ,తెలంగాణ) అర్థమౌతుంది. స్వాతంత్ర పోరాట సమయం ను0డి మీకు బ్రాహ్మణుల మీద ఈ ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తున్నది. రాజకీయలలో చేరి బ్రాహ్మణుల పోగొట్టుకోవడం తప్పించి ఎమీలేదు. మిగతా వర్గాల వారు సంపాదించుకొని,వ్యాపారాలు చేసుకొంట్టూ,ఎలా కొట్టుకుంట్టున్నారో అందరికి తెలిసిందే. ఇంకా "ఇతరాల్లో బ్రాహ్మణులు అంత కంటే బలం గా ఉంటారు అనటంలో అర్థమేమిటి?" మేము ఉద్యోగం చేసుకొని బతకటం కూడా ఇష్ట్టం లేదా?

Anonymous said...

కులగజ్జి అన్నికులాల్లోనూ ఉంది. కేవలం కమ్మవారిలోనే కాదు. అయితే కమ్మల్లో అది కాస్త above average. అంతే. అందుకు వారు జాలి చూపదగినవారే తప్ప తప్పుపట్టదగినవారు కారు. ఎందుకంటే ఒక కులానికి ఎంత social insecurity ఏర్పడితే అంతగా కులగజ్జి పెరుగుతుంది.

కమ్మకులంలో ఈ social insecurity ఎందుకొచ్చింది ? అది వారి స్వయంకృతాపరాధం. వారు అకారణంగా అందరినీ శత్రువులుగా మార్చుకోవడమే నని నా అభిప్రాయం. కమ్మవారు గతంలో తమ మాటలతో చేష్టలతో, ప్రవర్తనతో అనేక ఇతరకులాల్ని దూరం చేసుకున్నారు. వారు ఈ విధమైన సామాజిక దుష్ప్రవర్తనని ముందు బ్రాహ్మణులతో మొదలుపెట్టారు. బ్రాహ్మణులు ఎప్పుడూ తమ జోలికి రాకపోయినా వారిని అసహ్యంగా దూషిస్తూ, విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ పెద్దపెద్ద పుస్తకాలు వ్రాశారు. తరవాత సినిమాలు తీసి మరీ బ్రాహ్మణుల్ని అపహాస్యం చేశారు.

(Remember the particularly offensive scenes in the flopped flick అప్పుల అప్పారావు of the 90's fame where the noted Kamma actor Rajendra Prasad repeatedly bends and kicks a respectable Hindu priest ఐరన్ లెగ్ శాస్త్రి in the ass) అంతకుముందు కమ్మవారు ప్రతిసినిమాలోనూ తప్పనిసరిగా ఒక బ్రాహ్మణ విలన్ని ప్రవేశపెట్టేవారు. అంతెందుకు, As recent as 1997 లో కూడా అన్నమయ్య అంతటివాడి బ్రాహ్మణ స్నేహితుల్ని కూడా బఫూన్లుగా, జోకర్లుగా చూపించాడు కమ్మ రాఘవేంద్రరావు.

బ్రాహ్మణ సంఘాలు పెద్దమనసుతో ఇలాంటి తప్పులన్నీ క్షమించి, కేవలం ఎన్.టి,ఆర్. మీద అభిమానంతో 1983 ఎన్నికలప్పుడు కమ్మ TDP కి మద్దతు ప్రకటిస్తే ఆ తరవాత ఏం చేశారు ఎన్.టి.ఆర్. ? ఆయన కసిగా బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడల్లా వారిని వెతికి వేటాడిన ఉదంతాలు అందరికీ తెలుసు. ఫలితం - శాంతమూర్తులైన, క్షమాగుణం గలిగిన బ్రాహ్మణకులాన్నంతా అనవసరంగా శత్రువులుగా మార్చుకున్నారు.

తరవాత కమ్మవారి సామాజిక దుష్ప్రవర్తన ఇతర కులాల పట్ల కూడా విస్తరించడం మొదలైంది. దళితుల మీద దాడులకి పాల్పడి వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఏదో ఆశ్రయమిస్తారని ఆశపడి కాపులూ, రెడ్లూ, బీసీలూ, తెలుగుదేశంలో చేరితే వాళ్ళందరికీ నిర్మొహమాటంగా మొండిచేయి చూపించి కమ్మకులాన్ని మాత్రమే బాగుచేసుకున్నారు. తెలుగుభాష, తెలుగువాళ్ళందరి పేరూ చెప్పుకుని తామొక్కరు బాగుపడ్దారు. ఫలితంగా ఈరోజు రాష్ట్రమంతా వెతికి చూసినా మీకు కమ్మకులంలో పేదవాళ్ళంటూ ఎవరూ కనిపించరు. అలా రాష్ట్రంలో అందరూ కమ్మకులం పేరు చెబితేనే భగ్గుమని మండిపోయే పరిస్థితి అతితక్కువకాలంలో తెచ్చుకున్నారు. ఈ అన్నీ ఈనాటి తెలుగుదేశం పార్టీ పతనానికి కారణం. ఇప్పుడు కోట్లాదిమంది జగనో జగనో అని ఒక రెడ్డినామజపం చేయడానికి, నాయుడు పేరే తల్చుకోకపోవడానికీ కమ్మవారి దుష్ప్రవర్తనే కారణం. చిత్రమేంటంటే - కమ్మకులం ఆర్థికంగా పైకొస్తున్నకొద్దీ ఈ దుష్ప్రవర్తన మరీమరీ ఎక్కువైందే తప్ప తగ్గుముఖం పట్టలేదు.

ఈనాడు తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని ముక్కలు చేసే దిశగా విస్తరించడానికి గల బలమైన కారణాల్లో ఒకటి - ఈ రకమైన ఎగతాళిభావాలతో తెలంగాణవారిని కించపరిచే సన్నివేశాలతో కమ్మవారు/ లేదా కమ్మవారితో తీసిన సినిమాలు. Remember the scene in Siva of 1990 how Kamma Nagarjuna makes fun with a Telangana worker by having him narrate Ramayana in Telangana dialect. ఇలా ధనమదంతో అందరి హృదయాల్నీ కమ్మవాళ్ళు ఉద్దేశపూర్వకంగా గాయపరిచారు.

ఇదొకటే కాదు, కమ్మవారు ఏదైనా ఒక స్వచ్ఛంద సేవాసంస్థ పెట్టినా అందులో అందరినీ చేర్చుకున్నాక మళ్లీ కొద్దిమంది కమ్మవాళ్ళు ఒక గదిలో దూరి రహస్యంగా గూడుపుఠాణీ చేస్తూంటారు. అందుకనే వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. అమెరికా పోయినా వాళ్ళ బుద్ధి మారదు. TANA ముక్కలుచెక్కలు కావడానికి కారణం - కమ్మనాయకుల సామాజిక దుష్ప్రవర్తనని, లేకి సంకుచితత్వాన్నీ ఇతరులు అసహ్యించుకుని వెళ్ళిపోవడమే,

చారిత్రికంగా వెనక్కి తిరిగి చూస్తే కమ్మవారు ఒక గొప్పకులమే. అదొక Royal Caste. వారు జమీందార్లుగానే కాక దేశభక్తులుగా కూడా ఉండేవారు. దేశం కోసం ప్రాణాలర్పించారు. ధనాన్నీ అర్పించారు. కాదనడానికి లేదు. అయితే ఆ గొప్పతనానికి తగ్గట్లుగా వారి వర్తమాన ప్రవర్తన లేకపోవడం శోచనీయం.

aks said...

>>"మేము ఉద్యోగం చేసుకొని బతకటం కూడా ఇష్ట్టం లేదా?"
అయ్యా ఎంత మాట ? కేవలం కమ్మవారికే ఈనాడు లో అవకాశాలు అన్నట్టుగా రాముగారి వ్యాఖ్య ఉంది కాబట్టి బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారు కదా ఆ వ్యాఖ్య కరెక్ట్ కాదు అని చెప్పడమే నా ఉద్దేశం.మరోలా భావించకండి.కమ్మవారు,బ్రాహ్మణులే కాదు ఏ కులం వారయినా ఉద్యోగాలు,వ్యాపారాలు చేసుకోవచ్చు.అందరూ బ్రతకాలి,బాగుండాలి.
>>"కమ్మవారికి బ్రాహ్మణుల మీద ఒక ప్రత్యెకమైన అసూయ ఎందుకో ఒకసారి సెలవిస్తే ఆంధ్రేతర ప్రాంతాల వారికి (రాయలసీమ,తెలంగాణ) అర్థమౌతుంది. స్వాతంత్ర పోరాట సమయం ను0డి మీకు బ్రాహ్మణుల మీద ఈ ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తున్నది"
స్వాతంత్రోద్యమ సమయం లోనే బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి,కొందరు కమ్మవారు వాటిలో ప్రముఖ పాత్ర వహించిన మాట నిజమే కానీ అవి బ్రాహ్మణ కుల వ్యతిరేక ఉద్యమాలు కాదు అవి కేవలం అప్పటి సమాజం లో ఉన్న కొన్ని పద్ధతులకు మాత్రమే అనేది గమనించాలి.
అసూయ అనేది పెద్ద మాట గురువుగారు,అలాంటి అసూయాద్వేషాలు వ్యక్రిగతం గా ఎవరికి వారికి ఉంటాయేమో కానీ ఒక కులం మొత్తానికి గంపగుత్తుగా మరో కులం పైన ఉండదు.
ఈ చర్చ ఇక్కడ అసందర్భం కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం అసలు విషయం పక్కదారి పట్టకుండా.

y.v.ramana said...

రాము గారు..
మీ ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాను. మన సమాజంలో కులప్రస్తావన ఒక బూతు మాటగా భావిస్తుంటారు. కానీ.. ఈ కులం చాప కింద నీరులా ఉంటూనే ఉంటుంది. మన సమాజంలో కులం ఈ రోజుకీ ఎందుకింత బలంగా ఉంది అని ఆలోచించటం అవసరం అనుకుంటున్నాను. సమాజంలో వ్యక్తుల సమూహానికి ఒక సబ్ ఐడెంటిటీ ఉంటుంది. దాన్ని కులమనో, ఇంకేదనో అనొచ్చు. ఆహారపు అలవాట్ల లాగే ఆలోచనా విధానాలు కూడా ఈ సమూహానికి (ఇక్కడ కులం) సారూప్యత ఉంటుంది. అందుకే చాలా వ్యాపారాల్లో (పత్రికా రంగంతో సహా) పైనుండి కిందకి ఒకే కులం ఉంటుంది. ఇందు మూలంగా .. ఆ పనివాడు యజమానికి విశ్వాస పాత్రుడిగా.. కావలి కుక్కగా కూడా పనికొస్తాడు. అందువల్ల ఇందులో వ్యాపార సూత్రం కూడా ఇమిడి ఉందని అనుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో సహజంగానే బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతుంది. 'కులం' భావన లేకపోతె.. మీకు ఎంత జీతమిచ్చినా ఈ సంస్థ 'నాది, మనది' అన్న భావన రాకపోవచ్చు. ఇంత బలంగా వేళ్ళూనుకుపోయిన ఈ కులం గూర్చి చర్చింటానికి మేధావులకి విముఖత! కానీ.. ఈ కులాభిమానం చాలా గోప్పదిలా ఉంది. ఈ యుగంలో కూడా ఇంతగా మనని ప్రభావితం చేస్తుందంటే (చదువుకున్న వారిలో.. ముఖ్యంగా డాక్టర్లలో ఈ కులాభిమానం చాలా ఎక్కువ!).. దీని గూర్చి మనకి సరైన అంచనా లేదా? అయ్యుండొచ్చు. వైద్యశాస్త్రంలో రోగనిర్ధారణ, అవగాహన గూర్చి చాలా ఎక్కువ చర్చిస్తారు. ఆ తరవాత చికిత్స చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పటికే ఎక్కువ రాశాను. మంచి పోస్ట్ ధైర్యంగా రాసినందుకు మరోసారి అభినందిస్తున్నాను.

Mee Abhimani said...

surfizen

Too much ga generalize chesavu. Kamma ante brahmins ki kontha negativity pre independence days nundi undi. Tripuraneni lanti vallu dravid udyamanni andhra lo thalaketthukuni, brahmala cultural superiority ni challenge cheyyadam, oka karanam. NTR, karaneekalu peekeyyadam inko karanam. NTR munasabu lani kooda peekesadu. Adi marchipoyi, brahmana dwesham ani easy ga mislead cheyyabaddaru.

Telugu desam party ni edurkovadaniki, Congress leaders kulam ni addam pettukunnaru. Coastal lo ardhikam ga manchi position lo unna Kamma la meeda dwesham easy ga perigindi.

Anonymous said...

నా బొంద ! ఇదొక అనవసరమైన చర్చ. కమ్మవారి గురించి మనమిప్పుడు కొత్తగా డిస్కవర్ చేసేదేముంది ? వట్టి Time waste తప్ప ! అది బాగా డబ్బున్న mannerless, cultureless barbarians డౌరీ గుంపు అని అందరికీ తెలుసు.

Anonymous said...

కమ్మవారి గురించి మనమిప్పుడు కొత్తగా డిస్కవర్ చేసేదేముంది ? Time waste తప్ప ! అది బాగా డబ్బున్న mannerless, cultureless అనాగరికుల గుంపు.

Ramu S said...

TRZ...
Please don't make such harsh objectionable comments. If you want to make a specific point, you are welcome but such words are in bad taste.
I believe that no community carries same traits. Upbringing, education and jobs and other factors would work to give a shape to a person's character.
Ramu

Anonymous said...

The views expressed by the non-Kamma public is a grim pointer to the degree of the state-wide ill-will that the K community has managed to generate about itself in the past few decades. To brush aside this ill-will as something out of jealousy etc is plain foolish and amounts to ignoring the writing on the wall.

Yes, at times, people are prone to generalizing too much. But that alone fails to justify the massive loot and plunder of the State resources resorted to by the K community (at least the numerous bigwigs and sharks among them) during the long TDP rule. The question as to why there is not a single poor person left in that community today is growing curious and it is open to anyone's investigation. Somehow, it defies economic logic to brand all this as a result of their hard work.

What the K community thinks is of itself is utterly inconsequential. But what other castes think about them really matters most.

Unknown said...

రాము గారూ మీ పూర్తి పేరు తెలుసుకుని కులాలగురించి మాట్లాడే అర్హత వున్న కులంలోనే మీరు ఉన్నారా? అన్న అనుమానం వేసింది నాకు. వాస్తవానికి ఇంత గజ్జి వ్యాప్తి కారకమైంది తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గం. రవిప్రకాష్ తానా సభలకెళ్లి మీ తెలుగు సంఘానికి ఓ దళితుడు అధ్యక్షుడైతే చూడాలని అన్నట్టు మా గొప్పగా కులనిరోధక వాఖ్యానం చేస్తున్నారండీ మీరు. మీరు నడుపుతున్న బ్లాగు అభిమానినే నేను. కానీ కులం ఇంత పెద్ద కుంపటిలా మారడానికి కారణమం ఎవరో మీకు బాగానే తెలిసి వుంటుంది. కుల గజ్జి వుండటం వేరు. దాంతో అరాచకాలు చేయడం వేరు. అలా చేయగల అరుదైన కాస్టండీ బాబూ మీది. మీరు ఇంత మంచి ప్రసంగం చేయడం నిజంగా విడ్డూరంగా వుంది నాకు.

Sitaram said...

Telugushala,
When I Joined in journalism, I gave up my caste and I am above this. I vote for universal brotherhood and i can not be blamed for the history or past. Those who failed to respect others and who denied opportunities of others are traitors and anti-national.

Dear, I can't buy the argument that a particular caste shouldn't do a particular thing. Let me use my right and freedom of expression.
Another point is, i don't find bad if you stick on to the tradition and culture passed on to you by your caste and family without belittling others.
if you can meet me personally, i'll give you some work i did against the caste and religion.
please don't come to quick conclusions.
Cheers
Ramu

sri said...

I dont watch many movies but even among those i have seen,in atleast 5 or 6 movies in the last few years reddys are insulted. In few movies reddys are villains and kamma characters are heroes,in the movie ready dharmavarapu subramanyam character's name is'happy reddy' and he is badly insulted. In the movie maryada ramanna the landlord's name is ramineedu(implying he is a kamma) while one of his servants is named some reddy.

Anonymous said...

తెలుగుశాలగారూ ! బాగా చెప్పారు. అవును. నిజమే. కులగజ్జి ఉండడం వేరు. కులం పేరుతో అరాచకాలు సృష్టించడం వేరు. ఈ రెండో కోవలోకి కమ్మవాళ్ళొస్తారు. తమ కులాన్ని తాము అభిమానించుకోవడంతో సరిపెట్టకుండా ఇతరకులాలమీద భౌతికదాడులకీ, వాగ్ దాడులకీ పాల్పడుతున్నది ఎవరో బాగా గుర్తుచేసుకోండి. మరి ఇదే కులం పేరుతో అరాచకం సృష్టించడమంటే. ఇలాంటి లజ్జాకరమైన చరిత్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఏ కులానికీ లేదు. అసలు ఒక ప్రశ్న : తమరు ఇతర కులాల్ని దూషించే ముందు రాష్ట్రంలో ఏ ఒక్క నాన్-కమ్మ చేతనైనా సరే, కమ్మవాళ్ళ సంస్కారం గురించి కనీసం ఒక్క మంచిమాట చెప్పించండి. వింటాను. మీ వల్లకాదు. ఎందుకంటే అందరూ వాళ్ళ చేతుల్లో ఏదో ఒక రకంగా బాధితులే. Everyone feels deeply hurt by them.

Anonymous said...

వీరిని వీరు చాలా అభ్యుదయ వాదూలైనట్లు ఊహించుకొంట్టూ ఉంటారు. కారణం కమ్యునిస్ట్ పార్టిలోను, హేతు వాద ఉద్యమం లోను, స్రీవాద రచయితల లో వీరు ఎక్కువ కనుక. ఇప్పుడు లోక్ సత్తా జే.పి.గారు. మరి ఇంతమంది ఇంటెల్ క్ట్యూల్స్ ఉన్నాము అని చెప్పుకునే ఈ వర్గం లో కుల పిచ్చి ఏ ఇతరవర్గం కన్నా ఎక్కువగా ఎందుకుందో? వరకట్నాల రేట్లు అంత ఎక్కువో? నిజంగా వారి కులలోని అంతమంది గొప్ప మానవాదులు /ఇంటెల్ క్ట్యూల్స్ ప్రభావమే వారి పై వుండిఉంటే, కనీసం వరకట్న ప్రభావాన్ని వారి వర్గం లో ఎందుకు రూపు మాపలేక పోయారు? వీరు చెప్పుకోవటమేకాని వారి మేధావులు పెద్ద ప్రభావం చూపలేకపోయారు. ఇక్కడ ప్రత్యేకంగా వరకట్న గురించి ప్రస్థావించటానికి కారణం, వేరే రాష్ట్రాలలో ఉన్నపుడు మేము పెద్ద చదువులు చదువుకొనేది ,ఎక్కువ కట్నాం వస్తుందనే ఉద్దేశంతో అని పరభాష వారి దగ్గర నిస్సంకోచం గా చెపుతారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొన్నవారు, తన పెళ్ళి కోసం ఇంత పెద్ద మొత్తంలో కట్నం తీసుకోవటం అవమానంగా కాక హోదా గా చెప్పుకొనే వారిలో మన తెలుగువారే ఎక్కువ. అందులో ఈ వర్గం వారికి ప్రచారం ఎక్కువ కనుక, చాలామందికి ఈ విషయం తెలిసి, మీకెందుకు ఉద్యోగాలు కటనం వస్తూంటే అనే పాట మొదలు పెడతారు. వీరిది అమాయకత్వమో, అహంకారమో అర్థంకాదు.
___________________________________
రాముగారు, మేధావులు అనుకొనే వారికన్నా మీరు ఎంతో ఉత్తములు గా ఉన్నట్లున్నారు. రెగులర్ గా బ్లాగులు రాసే, మీ వర్గం వారు స్వచ్చందంగా,వారికి వరకు వారు ఎక్కడా బ్లాగులలో ఆత్మ విమర్శ చేసుకొంది చూడలేదు. కాని తెలంగాణా గురించి మాత్రం ఎన్నో టపాలు, ఎన్నో చర్చలు చేస్తూంటారు. ఎక్కడి నుంచో వెతికి వెతికి ప్రభుత్వ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ప్రచూరిస్తూ ఉంటారు. వాటిని చూసి తెలంగాణా వారు మీ ఆంధ్రోళ్ల కి కులపిచ్చి ఎక్కువ, అని వాదించటం మొదలు పెడతారు. ఒకటి మటుకు నిజం, అధికారం లో లేకపోయినా,ఈ వర్గం మీద, సామాన్య ప్రజలలో అటు ఆంధ్రాలోను, ఇటు తెలంగాణా లోను ప్రజలలో అగ్రహం పెరుగు తున్నాది, అంటే, వారికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీలాంటి వారు ముందుకు రావటం అనేది ఎంతో మంచి విషయం. వారిలో ఒక్కరన్నా గట్స్ ఉన్న వారు, నిజాయితిగా ఆతమ విమర్శ చేసుకొనే వారు ఉన్నారని మిగతా వారికి తెలుస్తుంది.

Kathi Mahesh Kumar said...

శతాబ్దాల బ్రాహ్మణాధిక్యతన ప్రశ్నించి, ఆత్మగౌరవ ప్రకటన చేసిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సారధులు గుంటూరు, కృష్ణ (అప్పటి కృష్ణ మాత్రమే) కమ్మవారు. జీవితాన్నే ప్రతిఘటనోద్యమంగా మార్చుకున్న పునరుజ్జీవనోద్యమకారుడు త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారి త్యాగాల ఫలితమే వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదాని కట్టబెట్టింది. ఎన్.టి. రామారావు రాకతో అది పతాస్థాయిని చేరింది.


ఈ పరిణామక్రమంలో కమ్మవారు మరో ఆధిపత్య వర్గంగా మారడం దురదృష్టకరమైన పరిణామం. ఈ ఉత్థాన చరిత్రలో వారూ ఒక దాష్టిక వర్గమైనారు.

paapam andhra said...

Dear sir ,
I am deeply pained to see this spewing of venom by sigling out a community by the commentors. I fear the very purpose of your openness and introspection is defeated. In any community (Kamma, Reddy, Kapu etc) the rich people are minority and ordinary people are the majority. On a relative basis, by the virtue of being located in fertile districts, Kammas might be richer. But they were so even before the advent of TDP. After TDP some of the rich and connected among Kammas might have prospered by taking advantage. But what about the rest. Even today if you visit the villages of any Kamma dominant district you can find lots of poor and ordinary Kammas. People sit in HYd and assume something.
With open heart you started a discussion. Hw many of the commentors showed same introspection and openness about their castes. All of them spew venom against a particular caste..andhra jews.
I feel that caste is not eviler than any other caste.
Following is my analysis of the traits of that caste:
1.Insecurity: It's the most insecure caste. The origin lies in it's feeble numreical strength. The massacre after Ranga's murder strengthened their insecurity.
2. Telangana: This caste will lose most because of bifurcation of the state. Not reddies who are there all over the state.
3.Wealth: There are pitiably poor people here too. The rich in the caste do not do anything help them. But largely they have origins in central coastal districts. So, they are better off than other castes.
4. Culture: Each and every caste loves their culture. Dominance: Any caste that gains power becomes arrogant. This is the most negative trait that I do not like in Kammas.. Because of the emboldenment due to dominance, they became insensitive to other castes sensitivities..witnessed through movies, some political murders.
But, under similar circumstances (some intermediary caste aquiring dominance) any caste may behave in a similar manner...Good and bad guys are in all castes. If some blogger protests, kammas are dominating in introspection and openness..then what will you (ramu garu)do?? :-)
5.The poor and ordinary people in a caste benefit if government takes some policy decision in favor of a caste. Have the goverments taken any such decision in favor of Kammas? Some Kamma companies might have shown preference to their ilk. But, which caste does not do that? The same bloggers who criticise showing favor "support favors by their own caste companies"
6. Abour Brahmions being targeted by Kammas..In the early 20th century some personalitie in Kammas were against Brahminism (Another name to the caste system then). That does not make Kammas against Brahmins. The Kammas in this generation hardly know tha names of those like raamaswaami choudary and his thoughts.
TDP govt has not targeted Brahmins to the extent it was propagated. NTR has done away with Karanams as well as munasabs(Majority of munasabs in some districts are from his own caste). Simiolarly his 2rs a kg rice scheme mostly deprived his caste farmers of cheap labor.

paapam andhra said...

1. High dowries among Kammas are now a thing of past. It's hard to find a girl to marry in that community. Commentators..just upgrade your DB.
2. Kammas forming subgroups: all castes do that. Some castes may be more subtle (no prize for guessing which caste), some are more open due to their pride, some are secret due to their inferiority complex.
Any caste which is in lime light is bound to have have lot of enemies and haters. If a caste is out of limelight and in the margins then it does not attract the envy of others and thereby hatred.

Anonymous said...

If people allege that Kammas are cultureless, there is some sound reason I feel. I personally know many of that community. Their first commitment is money. Their second commitment is money. Their last commitment is again money. They have devotion, but only to money. They have a religion, But again its name is ,money. Nothing except money is important in the viewpoint of an average Kamma, All else, country, religion, language, tradition, humanity are all junk and trash in their opinion. Whatever comes in its way is just unbearable for them.

That's why you find a very high percentage of anti-traditionists among Kammas who attack everything that does not serve their immediate purpose. Thus you can find among them anti-Hindus, anti-vaastu, anti-jyothishyam, anti-graandhikam, anti-this, anti-that and all such destructive ideas but hardly anything constructive or contributory. The Kammas' preference for this brutal way of living in the immediate present is being marketed as progressivism by their thinktanks.

abhimaani said...

అందరూ కమ్మవారిని గురించి ఏవేవొ రాసారు..kaani okato nijam..chadalavaada vumeshchandra laanti daring/dashings puttini community

Unknown said...

In my view, singling out one caste and accuse it for all evils is a bigger evil. If certain bad behaviors are found among Kamma community, they are also present in almost all other communities, though the magnitude may change to some extent.

Instead of condemning the caste following certain behaviour, it is more sensible to condemn the behavior itself.

The people who are spitting venom against a single caste are no way upholding the spirit of blog writer who volunteered to discuss the evils he has witnessed in his own caste. It would have been more sensible, if these commentators volunteered to discuss similar evils they have found in their respective castes.

Anonymous said...

కుమర్ దత్త గారు బాగా చెప్పారు. వీరు అన్నింటిని వ్యతిరేకించటమేకాని, ప్రత్యామ్న్యాం చూపలేక పోయారు. త్రిపురనేని రామస్వామి చౌదరిగారి రాసిన పుస్తకాలు సామాన్య ప్రజలు ఎవరికి పెద్దగా తెలీయదు అని అన్నా, అటువంటి పంధాను అనుసరిస్తూ కొంతమంది రచయితలు, మీడీయా వర్గాలు తయారయ్యారు. ఇప్పుడు వారికి ఇదే జీవనం, వ్యాపారం . సత్యసాయిబాబా ఆసుపత్రిలో చేరిన మొదలుకొని ఎన్ని కల్పిత కథలు రాశారో చెప్పలేము. ట్రస్ట్ సభ్యుల మీద పుంఖాను పుంఖాల, కథనాలు రాసి, చివరికి తేల్చిందేమిటంటే వారి ప్రవర్తన వలన, పుట్టపర్తి లో రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి ఆశాజనకంగా లేదట, వారు స్థానిక ప్రజలను వాలాంటిర్ లు గా తీసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సెలవిచ్చారు. చేతిలో మీడీయా ఉంది కదా అని, ముందు వెనుక చూడకుండా వ్యవహరించటం వీరికే సాధ్యం. మంచి స్వాములను చెడుగా చూపించే వారు, రక్షణ కవచాలు, తాయోత్తులు, జాతకాలు చూపే ప్రోగ్రాములైతే డబ్బులు వస్తాయని ప్రసారం చేస్తూంటారు.
___________________________________
ఇక్కడ ఒక్కరు సానుభూతి కొరకు, ధనవంతులు,పేద వారి గా విడగొట్టి రాసిన మీ వ్యాఖ్యలను చూసి, ఖండిస్తూ రాయగలను కాకపొతే అది అనవసరం. పేద వారు ప్రతి కులం లో ఉంటారు. ఏ కులమైన వారి కథ ఒక్కటే. కాకపొతే మీ వర్గం లో పేదవారిని, స్వయం గా మీవర్గప్రజలే డబ్బులు లేకపోతే ఎలా దూరంగా పెడతారో చూసాను. అంత వివక్షత మిగతా వర్గాలలో ఉంట్టుందనుకోను.

ఇప్పుడు కట్నాలు తీసుకోవటంలేదు అని మీరు అనుకొన్నా, ఈ రోజులలో దాని అవసరం కూడాలేదు. కారణం అందరికి ఒకరు లేక ఇద్దరు తల్లిదండృలు ఆస్థులను సగ భగం ఇస్తారు, అది ఆడైనా మొగ వారైనా. మొత్తం ఆస్థిలో సగ భాగం వస్తుంటే కట్నం అని పేరు పెట్టి మళ్లి డబ్బులు తీసుకోవాలా?
మీరు చాలా అభివృద్ది సాధించారు కనుక ఇతరులు మిమ్మల్ని చూసి కుళ్లు కుంట్టున్నారనే భావంలో ఉన్నారు. అది అవాస్తవం. మీరు అడుగిపెట్టిన ప్రతి రంగంలోను విద్యా, వైద్య మొద|| సేవల రేట్లు పెరిగిపోయాయి. దీని ప్రభావం సమాజం లో ఇతర వర్గాల సామాన్య ప్రజల మీద బాగా పడింది.

Padma said...

chadalavada umesh chandra ki antha scene ledu annayya. Y.S.ni pulivendulalo odinchadaniki chandraautho kummakkai enno plans vesadu kani chivaraku chethulu ethesadu. Eado naxals chethilo chachadu kaatti hero ayyadu. Daniki thodu sanuhuthi ekkuvaindi.

buddhamurali said...

రాము గారు కులాలు వద్దనే మీ అభిప్రాయం మంచిదే కానీ మీ అబ్భ్యిపేరు అలా పెట్టడం పై ఒక సారి ఆలోచించుకోండి. ఒక ఎడిటర్ తన కుమారుడి పేరు జర్నలిస్ట్ అని పెట్టుకున్నాడు . మరో ప్రముఖ జర్నలిస్ట్ తన కుమారుడి పేరు చె అని పెట్టుకున్నాడు. మనకు ఆయా సిద్ధాంతాలు, వ్యక్తులు, వృత్తులు నచ్చవచ్చు . వాటిని పిల్లల పేర్లలో చూపవద్దు. వారిని స్కూల్ లో చేర్చినప్పుడు , తరువాతకూడ ఇబ్బంది పడతారు. మతం, కులం పై మీ అభిప్రాయాలను పిల్లలకు చెప్పండి , వారిని ఆలోచించుకోనివ్వండి . కానీ అలా పేరు పెట్టి వారిపై మీ భావాలూ రుద్ది వారిని ఇబ్బంది పెట్టడం సరైనదేనా మీరే ఆలోచించుకోండి

Pavani said...

ఎప్పటినించో ఆ ముక్కే రాద్దామనుకున్నా, కాని ఆగిపోయా. మా బంధువొకాయన కొడుక్కి 'మా పా రే సలీం అలి" అని విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు.ఆయనకు సంగీతమన్నా, సలీం అలి (ornithologist)అన్నాఇష్టం. స్క్కూల్లో చేర్చేటప్పుడు వాళ్ళమ్మ గొడవ చేస్తే కళ్యాణ రాం అని ఎంటర్ చేశారు. తను మాత్రం మా పా రే అని పిల్చుకుంటాడు. నిజంగానే అలాంటి పేర్లతో విదేశాల్లో, port of entry ల దగ్గర ఇబ్బందినెదుర్కోవాల్సి వస్తుంది. మన ఆదర్శాలు పిల్లల మీద ప్రయోగించటం కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం.

Padma said...

ఔను సర్ కరెక్ట్ గా చెప్పారు. పిల్లలకు అలాంటి పేర్లు పెట్టడం, ఇతరుల మెప్పుకోసం సొంత కులాన్ని, మతాన్ని తిట్టే జర్నలిస్ట్ లను నేను చాలా మందిని చూసాను. మెప్పుకోసం అనే స్ప్రుహ ఆ సమయంలో వుండకపోవచ్చు కానీ చాలామంది ఇతరుల కోసమే అలా చేస్తారని నా నమ్మకం.

Padma said...

ఔను సర్ కరెక్ట్ గా చెప్పారు. పిల్లలకు అలాంటి పేర్లు పెట్టడం, ఇతరుల మెప్పుకోసం సొంత కులాన్ని, మతాన్ని తిట్టే జర్నలిస్ట్ లను నేను చాలా మందిని చూసాను. మెప్పుకోసం అనే స్ప్రుహ ఆ సమయంలో వుండకపోవచ్చు కానీ చాలామంది ఇతరుల కోసమే అలా చేస్తారని నా నమ్మకం.

Ramu S said...

నాకు ఫిదెల్ క్యాస్ట్రో అంటే చాలా ఇష్టం కాబట్టి...నా కొడుక్కి ఆ పేరు కలిసి వచ్చేట్టు పెట్టుకున్నాను...నా భార్య అనుమతితో. ఈ భూమి మీద నేను ఒక్కడ్నే వాణ్ని ఫిదెల్ అని పిలుస్తాను. మిగిలిన అంతా స్నేహిత్ అంటారు. అయినా నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించదు. నేను ఎవరి మెప్పు కోసమో ఆ పేరు పెట్టలేదని, నా ఇష్టమున్న పని మాత్రమే చేస్తానని గమనించాలి.
అయితే నిజంగానే...వాడికి పేరు వల్ల సమస్య వస్తుందేమో అని నేను కూడా ఈ మధ్య నుంచి అనుకుంటున్నాను. పెద్ద సమస్య ఏముంటుంది లెండి. అమెరికా వాళ్లు రానివ్వరేమో. అది పెద్ద ఇబ్బందిపడాల్సిన సమస్య కాదు. ఫ్రెంచి గడ్డం ఉన్నందుకే నన్ను ఒక విమానాశ్రయంలో ఆపి చాలా టెన్షన్ కు గురిచేశారు.
నా కెందుకు ఆ పేరు పెట్టావ్? అని మా వాడు అడిగేదాకా బెంగలేకుండా ఉంటాను. వాడు నిలదీస్తే చూద్దాం. మరీ పేరు బాగోలేదని ఫిదెల్ మారాం చేస్తే...లీగల్ ప్రొసీజర్లను పాటించి మారుస్తా. ప్రస్తుతానికి అంతకు మించి మనమేమీ చేయలేం.
చీర్స్
రాము

sooraj said...

"ప్రతి వారికీ తమ ప్రాంతం,మతం,కులం మీద ఎంతో కొంత అభిమానం ఉంటుంది, దీనిని తప్పు పట్టల్సిన పని లేదు" ఇది కొన్నాల్ల క్రితం వరకూ నాకున్న నిశ్చితాభిప్రాయం. కాని ఓ సారి కమ్మ కులానికి చెందిన ఓ మిత్రుడు హైదరాబాద్ అమీర్ పేట్లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏదో పాటకచేరికి వెల్తుంటే నేను కూడా వెల్లాను. అప్పుడే నాకు తెలిసింది 'కులపిచ్చి ' అంటే ఏంటో.. అప్పుడే తెలిసింది తెలుగు హీరోల్లో ఎవరెవరు కమ్మ కులానికి చెందినవారో, ఎవరు కాదో. అక్కడ పాడింది అన్నీ వీల్ల పాటలే.. ఆ హీరోల పేర్లు చెప్పగానే కింద కూర్చున్నోల్లు హిస్టీరియా పేషంట్లలాగా ఒకటే అరుపులు. చివరికి తారక్ కి కూడా విపరీత మైన అభిమానులు. మిగతా వర్గాలు కూడా ఇలాగే ఉంటాయో లేదో తెలీదు కానీ, వీరు మాత్రం కొంచెం 'తేడా ' అని అప్పుడే అర్థం ఐంది.

abhimaani said...

avunu..stste anthaa "kammas" domination ayyindi..For Example
Sports:Koneru Hampi,Dronavalli Harika,Ambati rayudu,pullela gopichan,P.harikrishna...

Cinema:andaru Kammas..okka megastar family thappa...

Politics:vhandra babu,BV raghavalu,K.narayana(CPI),JayaPrakash narayana,venkaiah naidu...

Constructions:Madhukon,Soma,Lanco,SEW,...

Industries:Sujana,Divis Labs,Natco pharma,andhra sugars,..

Education:Srichaithanay,NRI,vignan,vikas,GiTAMs,KL Univ..

srinucpd said...

మీరు కులం గురించే మాట్లాడుతున్నారు.
అసలు ఒకట్రెండు చానల్స్, పత్రికలూ తప్ప మొత్తం మీడియా అంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గుప్పిట్లోనే ఉంది. దీనికేమంటారు.
ఈ కుల గజ్జి మీ ఆంధ్రలోనే ఎక్కువ.

krishna said...

caste is a fact. everybody loves his family,village, taluk, district, country. we all love caste after family.jealousy against phenomenal growth of kammas is visible in our society. all castes have right and duty to love their caste. after all blood is thicker than water. what is wrong is caste hatred.jealousy for sportive competition is required but not caste hatred. love your caste but don't hate any other. this is only way to have peaceful society.don't do illegal favours to your caste. it is equal to corruption.there is no proof to show the caste hatred until British encouraging caste hared. they encouraged Brahmin hatred through Justice party. they encouraged everything that was respected before. moslems did not do that. we have to show respect on every skill, values, culture of all castes, be it a brahmin or kamma, dalit, reddy, vysya. we all deserve better living in the present and we have duty to give the best to our children . calling some body as kapodu,kammodu komatodu, baapanodu , dattha putrudu, potash, yedava jaathi, etc. when we will leave his type of treating other castes, from our mind and clean our ideas. I heard all types of pet names in derogatory manner on all. let us stop it further. we all are most successful species on earth with millions of years of connectivity. we die and mix back in the same earth and air. until then I hope we unite.

Praveen Mandangi said...

కులంలో నిజమెంత కృష్ణా? విజయవాడలో రంగా & నెహ్రూలు ఎన్నికలలో టికెట్‌ల విషయంలో గొడవ వచ్చి రౌడీయిజం చేస్తే దాన్ని కులం గొడవగా చిత్రీకరించాయి మన సంకుచిత పత్రికలు. సమాజం గురించి ఆలోచించని స్వార్థపరుడు కులం గురించి మాత్రం ఆలోచిస్తాడా? స్వార్థం అనేది కేవలం వ్యక్తికేంద్రకంగానే ఉంటుంది కానీ కులకేంద్రకంగానో, మతకేంద్రకంగానో ఎన్నడూ ఉండదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి