Wednesday, March 28, 2012

సాక్షి, టీ వీ 9 లకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ మొట్టికాయలు

31 న క్షమాపణలు ప్రసారం చేయాలని ఆదేశం
చేతిలో ఛానల్ ఉంది గదాని ఇష్టం వచ్చినట్లు ఆధారాల్లేని కథనాలు ప్రసారం చేసినందుకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అటు 'సాక్షి' ఛానల్ కు ఇటు 'టీ వీ 9' కు మొట్టికాయలు వేసింది. తనపై బురద చల్లుతూ 'సాక్షి' గత ఏడాది అక్టోబర్ 22 న, 23న ప్రసారం చేసిన కార్యక్రమాలను ఎన్.బీ.ఎస్.ఎ.కు టీ వీ 9 సీ ఈ ఓ రవి ప్రకాష్ చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ మంగళవారం నాడు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఆరు పేజీల ఆ ఉత్తర్వు ప్రకారం....
Both the channels have to telecast an apology by running the following text (static) on full screen in large font size with voice over (in slow speed) expressing regret for the said telecasts on their channels Sakshi TV & TV 9 prior to the commencement of the telecast of the 9 p.m. news bulletin on 31.3.2012 stating the following (text to be translated in Telugu): 

సాక్షి ఛానల్ లో రావలసిన క్షమాపణలు
 "Sakshi TV apologizes for the story run several times relating to Shri Ravi Praksh, CEO, TV 9 on October 22, 2011 and October 23, 2011 since the same unverified, although not intentional. Any harm caused to Shri Ravi Prakash & TV 9 is deeply regretted."

 టీ వీ 9 ఛానల్ లో రావలసిన క్షమాపణలు
"TV 9 apologizes for the story run several times relating to Shri Jaganmohan Reddy, President, YSR Congress Party on October 20,2011 and October 21, 2011 to the extent it related to facts not covered by the FIR against him leading to the raids on his premises, since the same was unverified, although not intentional. Any harm caused to Shri Jaganmohan Reddy & Sakshi TV to this extent is deeply regretted."

1995 నాటికి ఒక పత్రికలో మూడు వేల రూపాయల జీతానికి పనిచేస్తున్న రవి ప్రకాష్ అంత డబ్బు ఎలా సంపాదించాడని ప్రశ్నిస్తూ సాక్షి ఆ కథనాన్ని ప్రసారం చేసింది. దాని మీద ఎన్.బి.ఎస్.ఎ.కు పోతే...రవి ప్రకాష్ కూడా ఇరుక్కున్నట్లయింది. నిజంగా రెండు ఛానల్స్ ఈ ఉత్తర్వులను ఎంత మేర అమలుచేస్తాయో వేచి చూడాలి.

2 comments:

Unknown said...

సాక్షి, టీ.వీ. 9 పోతే సగం దరిద్రం వదిలినట్టే. సాక్షి లో ఎలాగూ పనికి వచ్చేవి ఉండవు. కింద పసిడి వాక్యాలో ఏదో తప్పా. ఇక టీ.వీ. 9 అయితే ఉన్నదీ, లేనిదీ ఓవర్ యాక్షన్ చేసి మరీ చూపిస్తాడు. ఉన్న వాటిల్లో ఎన్.టీ.వీ బెటర్ !

buddhamurali said...

వాళ్ళు తెలుగు చానల్స్ ను పరిగణలోకి తీసుకోవడం ఆశ్చర్యం ... ఇది తెలుగు చానల్స్ కు అగౌరవం అని నేను అనుకోవడం లేదు గౌరవమనే అనుకుంటున్నాను

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి