Thursday, April 5, 2012

Studio N లో మహిళా లీడర్లపై చెత్త స్టోరీ

ఈ మధ్యన బూతు పాటలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న studio N ఛానల్ నిన్న జయప్రద, రోజా, జీవిత ల మీద "ఐరన్ లెగ్' శీర్షికన ఒక అభ్యంతరకరమైన  కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇది మరీ దారుణమైన జర్నలిజం. మహిళలను కించపరచడం, ఒక అశాస్త్రీయమైన వాదనను ప్రచారం చేయడం. 

పుట్టిన రోజు నాడు...తిరుమల కు వెళ్ళిన జయప్రద చంద్రబాబు ను పొగుడుతూ తాను వచ్చే ఎన్నికల నాటికి తెలుగు దేశం లోకి వస్తున్నట్లు ఫీలర్ ఇవ్వడం ఈ ప్రోగ్రాం రూపకల్పనకు కారణం. ఈ మహిళలు కాలు పెట్టిన పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందన్న చెత్త వాదనకు అనుకూలంగా క్లిప్స్ పెట్టి, ఎవరి మీదనైనా అద్భుతంగా అభిప్రాయాలు చెప్పే కొందరు మహిళా నేతలను ఫోన్ లైన్ లోకి తెచ్చి చాలా సేపు ఈ కార్యక్రమం నడిపారు. 

తెలుగు దేశం అధికారం లో ఉన్నప్పుడు పార్టీ పనుల్లో జయప్రద పాత్ర, చంద్రబాబు మంత్రాంగం గుర్తుకు వచ్చి మరో విపత్తు రాకుండా ఉండాలన్న అజెండాతో పచ్చ ఛానెల్ వారు కావాలని ఈ కార్యక్రమం ప్రసారం చేసారేమో అనిపించింది. నిజానిజాలు ఆ పెరుమాళ్ళ కెరుక గానీ...కష్టపడి ఎదుగుతున్న మహిళా నేతల పై మరీ ఇంత దారుణమైన ప్రోగ్రామ్స్ చేస్తూ బురద చల్లడం బాధాకరం. నార్నే గారూ...ఇది మంచి పద్దతి కాదు సార్...  

5 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

స్టూడియో N లో చెత్త ప్రోగ్రామ్ రావడం వింతేమీ కాదు. చెత్తని చూపడమే లక్ష్యంగా పెట్టుకున్న పరమ చెత్త చానల్ అది.

The Brahmin Times said...

మహిళలంటే ఇహ వారిని ఎవరూ ఏమీ అనకూడదా ? వారు రాజకీయాల్లో ఉన్నా కూడా ? మరి మగనాయకులని ఎవరూ ఏమీ అనట్లేదా ?

ఇప్పటి దాకా మీలాంటి జర్నలిస్టులే పనిగట్టుకుని వర్గాల పేరెత్తి వార్తలు రాస్తూ సమాజంలో ప్రతివర్గాన్నీ ఒక పొలిటికల్ వర్గంగా తయరుచేశారు. సామాజిక అశాంతికి కారణమయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళు,,, ఆడవాళ్ళు అని జపిస్తూ మళ్ళీ ఒక తరహా సెక్సిజానికి దారితీస్తున్నారు. ఇహ చాలు బాబూ ఆపండి మీ divisive journalism. ఆడా లేదు. మగా లేదు. అందరిలోనూ మంచీ చెడూ సమానంగా ఉన్నాయి. వ్యక్తుల్ని వ్యక్తులుగా చూసి జడ్జి చేద్దాం. ఒక వర్గంగానో, లింగంగానో కాదు.

Unknown said...

mari studio n lo iron leg yevaru aa chanal paristhiti antha chettaga undadaniki karana mayina iron leg kosam vallu anveshiste baguntundi

prabhu said...

aslau a channela a waste dani chairmen kuda antha, eppudu sex news kosama chustaru, salary ivvalanta edustadu...chala unnai chepplanta thu anipistandi..

Girija said...

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి