Thursday, August 23, 2012

హాస్యభరితం పరంజోయ్ ప్రసంగం

మీడియా లో ఉన్న వారికి, నిత్యం ఇంగ్లీష్ చానెల్స్ చూసేవారికి , పేపర్స్ చదివే వారికి తెలిసి వుండే పేరు
పరంజోయ్ గుహ  టాకుర్త (Paranjoy Guha Thakurtha). మీడియా-ఎథిక్స్ మీద ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు పలు ఇంగ్లిష్ పత్రికలలో పనిచేసిన ఆయన వివిధ చానెల్స్ లో చర్చలు జరుపుతుంటారు. లోక్ సభ చానెల్ లో పరంజోయ్ తరచూ కనిపిస్తుంటారు.

అంతకన్నా ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడైన ఆయన 'పెయిడ్ న్యూస్' మీదకౌన్సిల్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ లో సభ్యుడు. ఆ నివేదిక ఎంతో  ప్రాచుర్యం పొందింది. ఇలాంటి అనుభవాలు ఉన్న  పరంజోయ్ నిన్న (బుధవారం) యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో డాక్టర్.సి.వి.ఎస్.శర్మ మెమోరియల్ లెక్చర్ ఇచ్చారు. ఒక గంట పాటు జరిగిన ప్రసంగం హాస్యభరితంగా సాగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ జాగరణ్, ఈనాడు వంటి పెద్ద పత్రికలు పైడ్ న్యూస్ పాపం లో ఎలా భాగస్వాములు అయ్యిందీ...ఆయన వివరించారు...ఉదాహరణలతో సహా. హాస్య చతురతతో ప్రసంగాన్ని పండించారాయన. పరంజోయ్ తో నేను దిగిన ఫోటో ఇది.

"అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే...పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఇలాంటి (పెయిడ్ న్యూస్) పాపాలకు పాల్పడుతూ జర్నలిజంలో నైతిక విలువలను దిగజార్చడంలో అగ్రభాగంలో ఉండడం," అని ఆయన చెప్పారు.

"Journalist is no longer a part of the solution. He is no longer a crusader against corruption. Then journalism was a mission and now it is a matter of commission. Now journalism is part of the problem," అని ఆయన స్పష్టం చేసారు. వార్తా సేకరణ, ప్రకటనల సేకరణ పనులు రెండూ కంట్రి బ్యూటర్స్ వ్యవస్థ ఎలా నిర్వహిస్తున్నది తెలిపారు.  

జర్నలిజం లో నీతి  నిజాయితీల గురించి మాట్లాడే వారిని పిచ్చోళ్ళ మాదిరిగా చూస్తున్నారని పరంజోయ్ చక్కగా చెప్పారు. "Such kind of people are considered as a challenge, physically and mentally," అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని మాస్ కాం శాఖ నిర్వహించడం వల్ల  ఆయనతో కలిసి మాట్లాడే, కలిసి లంచ్ చేసే అవకాశం నాకు కలిగింది. ఈ సందర్భంగా ఈనాడు, సాక్షి అజెండాల గురించి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు.

4 comments:

Saahitya Abhimaani said...

This kind of meetings are not hyped up by the media for obvious reasons. If some meeting, normally of left wing Orgn. with hardly about two dozen people attend, section of the media highlights it as its a great event. This kind of selective reporting and angled reporting is more dangerous than paid news also.

If you can get hold of the recording of the tape of the speech, if your can keep it in your blog for listening, it would be a great thing for all those who could not attend the meeting.

చంద్ర said...

చాల ఉపోయోగకరం గా ఉంది. పరంజోయ్ గారి పూర్తి ప్రసంగం వినడానికి లేదా చదవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పగలరు.

Ramu S said...

sir,
I'll try to get the audio clip.
thanks
ramu

MUDALVAN said...

ZEE 24 GANTALU LOCKOUT ANI TELISINDI
ANY UPDATES

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి