Thursday, May 2, 2013

సినిమాలు, క్రికెట్ తప్ప టీవీ చానెల్స్ లో ఏముంది?

సెమిస్టర్ పూర్తి కావడం, పీహెచ్ డీ భారమూ తొలిగి పోవడంతో... ఎండల వల్ల పరమ బద్ధకమైన జీవితం గడుపుతున్న నాకు ఒక పెద్ద శిక్ష పడింది. ఏమీ తోచక టీవీ ఛానెల్స్ చూస్తూ, పేపర్లు చదువుతూ ఏ సీ లో కాలక్షేపం చేస్తున్న నాకు నా మీద నాకే అపుడప్పుడూ ఛీ... ఛీ అనిపిస్తున్నది. కారణం... ఈ ఛానెల్స్ ను చూడాల్సి రావడం. ఇంగ్లిష్ ఛానెల్స్ వాళ్ళ గొడవ వాళ్ళది. నరేంద్ర మోడీ సాధువులు, సన్యాసులతో మాట్లాడుతున్నా లైవ్ లో చూపించే ఛానెల్ ఒకటి, మోడీ మీద రోజూ ఏడుస్తూ నలుగురిని స్టూడియోకి రప్పించి రచ్చ రచ్చ చేసే ఛానెల్ ఒకటి, మాదే నిజమైన జర్నలిజం అనే బాకా కొట్టుకునే భార్యాభర్తల ఛానెల్ ఒకటి. అందుకే బీ బీ సీ, సీ ఎన్ ఎన్ లలో మంచి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు సెటిల్ అయిపోతున్నా. 

తెలుగు ఛానెల్స్ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. సినిమాలు, క్రికెట్, పొలిటికల్ స్టేట్ మెంట్ తప్ప మరొకటి లేదు. చర్చల్లో జరిగే రచ్చ జుగుప్స కలిగిస్తుంది. అన్ని ఛానెల్స్ కు పర్మినెంట్ ఆర్టిస్టు లు పోగయ్యారు. ప్రత్యామ్నాయం చూపుతాం... అంటూ కొత్తగా వచ్చిన 10  టీవీ కి కూడా ఇక్కడ మినహాయింపు లేదు. ఒక్క ఛానల్ లోనూ జిల్లాల సమగ్ర వార్తల సమాహారం కనిపించడం లేదు. కమ్మ యజమానుల ఛానెల్స్ పడుతూ లేస్తూ సాగిన చంద్రబాబు గారి పాదయాత్ర కు విశేష ప్రాధాన్యం ఇచ్చాయి. ఎవరినైనా చెడుగుడు ఆడే వేమూరి రాధాకృష్ణ (చెగువేరా) నిన్న చంద్రబాబు తో 'మనం మనం బరంపురం' ఇంటర్వ్యూ చేసారు. 2009 వరకూ చంద్రబాబు వేరట... ఇప్పుడు వేరట. సాక్షి వాళ్ళది జగన్ గొడవ. ఐ న్యూస్ వాళ్ళు కిరణ్ కిరణాలను ప్రసారం చేసే పనిలో ఉండగా, ఒకప్పుడు అద్భుతమైన జీ టీవీ సత్తి బాబు గారి స్టేట్ మెంట్స్ ఇస్తున్నది క్రమం తప్పకుండా. 

నిన్న, మే డే రోజున, పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి. ఈ సందర్భంగా ఎవరేమి ఇస్తారా? అని చూశాను. హెచ్ ఎం టీవీ వాళ్ళు పొద్దున్నే ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసారు. 10 టీవీ వాళ్ళు సాయంత్రానికి ప్రసారం చేశారు. పైన ప్రోగ్రాం సాగుతుంటే... కింద ఒక స్క్రోలింగ్ వచ్చింది... 'ఈ ప్రోగ్రాం డీ వీ డీ లు త్వరలో ప్రజాశక్తి బుక్ స్టాల్స్ లో లభిస్తాయి' అని. నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. 

మొన్నా మధ్యన ఏదో ఒక ఛానెల్ లో ఒక యాంకరమ్మ.... ఇప్పుడు YSR Congress నేత అంబటి రాయడు (ముంబాయ్ ఇండియన్స్ క్రికెటర్) గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ లో చూద్దాం... అని సెలవిచ్చింది. నాకు దిమ్మ తిరిగే లోపే... అంబటి రాంబాబు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అని సవరించుకుంది. యాంకరమ్మ మీద కూడా క్రికెట్ ప్రభావం పడిందని నాకు అర్థమయ్యింది.    

6 comments:

JE said...

అల అన్పించినప్పుడు ...ఎదొక ఇష్యూ మిద మీ ఫీలింగ్..ని బ్లాగ్ లో పెట్తోచు కదా ... +మీ ఉహ శక్తీ పదును పెరుగుతున్ది... కాస్త బ్లాగ్ కూడా updated గ ఉంటుంది

krshnrao said...

ఆందుకే టి.వి. ని చూసేవాళ్ళు తగ్గుతున్నారు.చూసినా వారి బాకాల్ని నమ్మే కాలం లో ప్రజలు లేరు.ఇంకో లక్ష మైళ్ళు యాత్ర చేసినా చంద్రన్నని నమ్మే జనాలు లేరు..కొన్ని జాతకాలు అంతే..!జగన్ బాధ అది ఒక అంతులేనికధ..!మళ్ళీ బ్రిటీషు వాళ్ళు వస్తేనే ఇదంతా చక్క బడాలేమో..అయినా విదేశీయులని అనుకోవడం ఎందుకు...వీరి అంతులేని సంపదలన్ని తెల్లవాళ్ళ దేశాల్లోనేగా ఉండేది..అక్కడ ఎలాంటి ఫీలింగులుండవు.

katta jayaprakash said...

BREAKING NEWS:

RK channel has telecast a story about Rudrakshas of Panduranga Rao of Bhakthi TV saying that Rao has been selling cheap rudrakshas for thousands of rupees deceiving the people.It further says a number of people to the channel about the fraud of Rao.But the channel has not given any interviews of people who complained but gave a number to contact them.
I immediately contacted the office of Panduranga Rao as given in Bhakthi TV and asked him about the story of RK channel.Somebody replied from the office that a few reporters of RK channel approached them and demanded money without any purpose but they refused.As a result of non payment of extortion money the RK channel had telecast a dubious story on them.I adviced them to approach Press Council of India and Broadcast Association and fight with them openly if the story is a fiction and for blackmail.

JP.

bhushan said...

some times we can enjoy with tnn channel.

Anonymous said...

ఏ మీడియాలోనైనా ఈ నాలుగే అమ్ముడవుతాయి.

1. సెక్స్
2. క్రికెట్
3. సినిమా
4. రాజకీయం

హిందీలో నంబర్ 1 చానల్ ఆజ్‌తక్. ఒక ఫార్మాట్ అనేదే ఫాలో అవకుండా ప్రజలకి నచ్చే విశేషాలే పదే పదే చూపిస్తుంటారు. తెలుగు చానళ్ళు కూడ అదే దారిలో వెళుతున్నాయి.

tolly boy said...

ramu garu, r u still expecting smthng frm news channels?....?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి