Monday, May 27, 2013

సీనియర్ బిజినెస్ ఎడిటర్ KV Ramanaకు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్  గర్వించదగిన అరుదైన జర్నలిస్టులలో ఒకరు, సీనియర్ బిజినెస్ ఎడిటర్, నాకు ఆప్త మిత్రుడు అయిన కే వీ రమణ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వారం రోజులుగా ఉన్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. బ్రెయిన్ హేమరేజ్ అని వైద్యులు నిర్ధరించిన రమణ ఎలాగైనా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. 

వరంగల్ జిల్లాకు చెందిన రమణ 'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో బూదరాజు రాధాకృష్ణ గారి శిష్యరికంలో జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాడు.  మెడిసిన్ లో జాయిన్ అయి అవాంఛనీయ పరిస్థితుల నడుమ చదువు మొదలు పెట్టక ముందే కాలేజి విడవాల్సి వచ్చిన రమణ జర్నలిజం ప్రస్థానం ఆదర్శప్రాయం. ఈనాడు, డెక్కన్ క్రానికల్, చార్మినార్, టైమ్స్ ఆఫ్ ఇండియా లలో పనిచేసిన రమణ ప్రస్తుతం డీ ఎన్ ఏ పత్రిక కు రాష్ట్ర ప్రతినిధి గా అసిస్టంట్ ఎడిటర్ హోదాలో పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఏడేళ్ళు బిజినెస్ ఎడిటర్ గా పనిచేసిన తర్వాత ఆయన డీ ఎన్ ఏ లో జాయిన్ అయ్యారు. బిజినెస్ విశ్లేషణ లో రమణ కు మంచి పేరు ఉంది. పలు దేశాల్లో పర్యటించారు. 

నా ఆహ్వానాన్ని మన్నించి గత నాలుగేళ్ళుగా సెంట్రల్ యూనివెర్సిటీ విద్యార్థుల కు బిజినెస్ జర్నలిజం బోధించడానికి రమణ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11 న కూడా వచ్చి ఒక క్లాస్ తెసుకున్నారు. ప్రతి సారీ రమణ క్లాసులకు మంచి స్పందన వస్తుంది. తను కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు తలపొగరు 'ఈనాడు' స్టాఫ్ రిపోర్టర్ ఒకరు పీ ఆర్ ఓ పై ఒత్తిడి తెచ్చి రాత్రి పూట తనను బస్సులో నుంచి దింపిన విషయాన్ని రమణ గుర్తుకు తెచ్చుకున్నాడు. "ఎలాగైనా స్టాఫ్ రిపోర్టర్ కావాలని అప్పటి నుంచి అనుకున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్ లో గురువు గారి దయ వల్ల అక్షరం ముక్కలు నేర్చుకున్నాను. ఆత్మ స్థైర్యం పెంచుకున్నాను," అని మాట వరసకు చెప్పాడు. ఈ నెల 20 న ప్రముఖ జర్నలిస్టు రామ్ కరణ్ గారి ఫోన్ నంబర్ తీసుకునేందుకు నేను రమణకు ఫోన్ చేశాను. నంబర్ ఎస్ ఎం ఎస్ చేశాడు. 

దాసరి నారాయణ రావు గారి ఆధ్వర్యం లో వస్తుందనుకున్న చార్మినార్ లో చేరి దెబ్బ తిన్న రమణ చాలా ఇబ్బందులు అనుభవించాడు. "ఉద్యోగం లేక ప్రెస్ నోట్లు రాసిచ్చి పొట్ట పోషించుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది," అని రమణ నేను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు చెప్పాడు. వృద్ధులైన తల్లి దండ్రుల గురించి మాట్లాడేవాడు.  

"గత మంగళ వారం రాత్రి పది గంటల ప్రాంతంలో బైటి నుంచి వచ్చాడు. టీ వీ ఆన్ చేసి తల తిరిగి మంచం మీద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమా లో ఉన్నాడు," అని టైమ్స్ లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టు మిత్రుడు ఒకరు చెప్పారు. ఎల్ బీ నగర్ లోని కామినేని ఆసుపత్రి లోని ఐ సీ యూ లో రమణ చికిత్స పొందుతున్నారు. నేను ఈ రోజు అక్కడికి వెళుతున్నాను. మేము గత ఏడాది మే లో బూదరాజు గారి ఎనభయ్యో జయంతి జరిపాం. ఆ ప్రోగ్రాం జరిగిన రోజే రమణ ఫేస్ బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి ఈ క్రింది కామెంట్ పెట్టాడు. బూదరాజు గారి పట్ల, నిర్భయమైన జర్నలిజం పట్ల రమణ నిబద్ధతకు ఈ వ్యాఖ్య నిదర్శనం. 
    
"It was a great day...thanks to Ramu and Madhu. Many people turned up at the Press Club to pay respects to our great Guru Boodaraju Radha Krishna. This group is yet another attempt to create a platform for all the Sishyas of the Guru to take his ideology, philosophy and fearless journalism forward." 

డియర్ రమణా....we all wish a speedy recovery. Come on, you can make it. 

2 comments:

Anonymous said...

రమణగారు కోలుకోవాలి! మళ్ళీ పెన్ను కేప్ విప్పి నిప్పులు చెరగాలి!!ఎన్నీ అద్భుతాలు జరగటం లేదు మెడికల్ హిస్టరీ లో!

Unknown said...


గెట్ వెల్ సూన్ రమణ గారూ.. వి ఆర్ మిస్సింగ్ యూ..

అంత సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ నా లాంటి జూనియర్స్ అడిగే పిచ్చి ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు చెబ్తారు. ఏ టైంలో ఫోన్ చేసి ఏ సందేహం అడిగినా చిరునవ్వుతో ఆన్సర్ గా రెడీ ఉంటుంది రమణ గారి దగ్గర. ఆయన లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ఊహించలేం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ల నుంచి సమాధానం రాబట్టడంలో ఆయనకు పోటీ లేదు.
ప్లీజ్ రమణ గారూ కమ్ బ్యాక్ సూన్..

- - నాగేంద్ర సాయి

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి