Saturday, May 3, 2014

ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ రోజు రెండు విధాలుగా ఎంతో ముఖ్యమైనది.
ఒకటి) జర్నలిజంలో ఎందరికో అక్షరాభ్యాసం చేసి స్ఫూర్తి నింపిన మహనీయుడు, యదార్థవాది, మా గురువు గారు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి 82 వ జయంతి ఈ రోజు. రెండేళ్ళ కిందటి లాగా ఆయనకు ఘన నివాళి అర్పించాలని ఆరాటపడ్డాను. ఈ సందర్భంగా ఒక సభ ప్లాన్ చేసి, ముఖ్యులు అనుకున్న ఇద్దరు ముగ్గురికి ఫోన్లు చేసి, ప్రెస్ క్లబ్ లో గది-భోజనాలు బుక్ చేసి స్పందన సరిగా లేక నిన్న సాయంత్రం ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. జనం నిజంగానే బిజీగా ఉన్నారు. అది గురువు గారు అర్థం చేసుకుంటారు. ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్. 

రెండు) ఈ రోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, తెలుగులో  ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. దురదృష్టవశాత్తూ... ఇలాంటి రోజులు జరుపుకుని... వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన... ఇబ్బంది పడిన జర్నలిస్టుల గురించి గుర్తు చేసుకునే సంస్కృతి, సంస్కారం మన తెలుగు జర్నలిజం లో లేవు. ఎడిటర్లు...ఆ స్థాయి వ్యక్తులు పెద్దగా విద్యార్హతలు, చిత్తశుద్ధి  లేని పప్పుశుద్ధలు. జర్నలిజం
స్కూళ్ళ ప్రిన్సిపాళ్లు యాజమాన్యాలు గీసే గీత దాటని తాబేదార్లు. యాజమాన్యాలు డబ్బు కక్కుర్తితో అహరహం రగిలే స్వార్థపరులు. 
జర్నలిస్టుల మేలు కోసం పాటు పడాల్సిన జర్నలిస్టు సంఘాల పెద్దలకు అంత తీరికా, ఓపికా లేవు. ఉద్యోగాలు ఊడి వందల కొద్దీ జర్నలిస్టులు వీధిన పడినా... యావత్ జర్నలిజం రాజకీయ రంగు పులుముకుని పత్రికా స్వేఛ్చ యాజమాన్య స్వేచ్ఛగా మారి...వారి వ్యాపార-రాజకీయ-కుల ప్రయోజనాలకు ఒక మంచి సాధనంగా మారినా... ఒక్క గొంతూ ఇక్కడ వినిపించలేదు. 

బ్రదర్స్, సిస్టర్స్... ఇప్పుడు జర్నలిజం మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన పత్రికా స్వేఛ్చ ఇప్పుడు ఎండమావి అయ్యింది. జర్నలిజం ప్రమాదంలో ఉంది. "రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్" వారు 180 దేశాల్లో పత్రికా స్వేఛ్చ ను లెక్క కట్టి భారత్ ది 140 వ స్థానంగా నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
ఈ సందర్భంగా.... వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే కు సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ కోసం.  
World Press Freedom Day is observed annually on 3 May to remind countries and people all around the world, that freedom of the press and freedom of speech and expression are fundamental human rights
This day is often held to remember many journalists who have died or faced jail in order to bring news to the public.
In Observance of the World Press Freedom Day 2014, here are the most important facts that we must take note of. 
1. The World Press Freedom Day was established by the General Assembly of the United Nations in December 1993 as an outgrowth of the 'Windhoek Declaration' adopted in 1991 in Namibia for promoting independent and pluralistic African Press. 
2. The World Press Freedom Day is celebrated on 3 May, the date on which the Windhoek Declaration was adopted which emphasized the need of a free press for developing and maintaining democracy and for economic development. 
3. Article 19 of the 1948 Universal Declaration on Human Rights (considered as an important stepping stone to the freedom of press) states that everyone "has the right to freedom of opinion and expression, this right includes freedom to hold opinions without interference and to see, receive and impart information and ideas through any media and regardless of frontiers."
 4. Every year the UNESCO/Guillermo Cano World Press Freedom Prize is awarded to different journalist or individuals, especially those who have risked their lives in promotion of the freedom of expression. The 2014 winner of the prize was the Turkish instigative journalist Ahmet Sik, who was reportedly arrested in 2011 on charges of being linked to an alleged terrorist organization. 
5. According to the Press Emblem Campaign (PEC), 35 journalists have been killed in 2014 so far. And in 2013 70 journalists were killed, while the year 2012 saw one of the highest numbers of such deaths with 141 journalists reported dead. 
6. According to the Committee to Protect Journalists, the five 'deadliest' countries for journalists are Syria, Iraq, Egypt, Pakistan and Somalia. India is in 6th place. 
7. In 2011-2012, the countries where press was the most free were Finland, Norway and Germany, followed by Estonia, Netherlands, Austria, Iceland, and Luxembourg.
 8. The country with the least degree of press freedom was Eritrea, followed by North Korea, Turkmenistan, Syria, Iran and China
9. According to Reporters Without Borders, more than a third of the world's population live in countries where there is no press freedom or where there is no system of democracy or where there are serious deficiencies in the democratic process. 
10. Regions closed to foreign reporters include Chechnya, Russia; Ogaden, Ethiopia; Jammu & Kashmir, India; Waziristan, Pakistan; Agadez, Niger; North Korea and Syria.
(Courtesy: International Business Times) 

2 comments:

Unknown said...

రామోజీరావు సంస్థ‌లో నేల‌రాలిన మ‌రో అక్ష‌ర సైనికుడు...
ఈటీవీ ఛానెల్‌లో ప‌నిచేస్తూ కుప్ప‌కూలిన‌ ఇందూరు పాత్రికేయుడు భాస్క‌ర్‌...
ఈ వార్త‌ను క‌నీసం స్క్రోలింగ్ రూపంలో కూడా ఇవ్వ‌ని ఈటీవీ యాజ‌మాన్యం...
విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడి వ‌ల్లే చ‌నిపోయాడ‌ని స‌మాచారం..
సెల‌వులు ఇవ్వ‌కుండా ప‌నిచేయించుకోవ‌డం వ‌ల్లే ఒత్తిడి పెరిగిన‌ట్లు స‌మాచారం..
పాపం నెల‌ల వ‌య‌సున్న పిల్ల‌, భార్య‌, త‌ల్లిదండ్రుల‌ను ఆదుకునేవారు ఎవ‌రు?
బాధిత కుటుంబాన్ని ఈటీవీ యాజ‌మాన్యం ఆదుకోవాలి...

ఈటీవీ ఛానెల్ పేరులో తెలంగాణ అన్న ప‌దాన్ని చేర్చిన రోజే(నిన్న ఉద‌యం 7-8 మ‌ధ్య‌లో) ఒక తెలంగాణ పాత్రికేయుడు భాస్క‌ర్‌(30) మ‌ర‌ణించాడు.. విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడి... ఎన్నిక‌లు, విభ‌జ‌న పేరిట సెల‌వులు ఇవ్వ‌కుండా వేధింపుల వ‌ల్ల తెలంగాణ జ‌ర్న‌లిస్టు మిత్రుడు తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాడు... చివ‌ర‌కు గుండెపోటు రూపంలో మృత్యువు అత‌డిని క‌బ‌లించింది.. అయితే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా యాజ‌మాన్యం హుటాహుటిన ఆ పాత్రికేయుడిని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించింది... గుండెపోటు కేసుగా న‌మోదు చేయించి నిజామాబాద్ పంపించింది..
పాపం చ‌నిపోయిన పాత్రికేయుడికి చిన్న పాప ఉంది... భార్య‌, త‌ల్లిదండ్రులు ఆయ‌న‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు.. క‌నీసం ప‌క్క ఛానెల్ విలేక‌రి చ‌నిపోయినా వార్త వేసుకుంటారు.. అలాంటిది సొంత ఛానెల్‌లో ప‌నిచేస్తూ మ‌ర‌ణించిన ఉద్యోగి గురించి స్క్రోలింగ్ కూడా వేయ‌కుండా ఈటీవీ ఛానెల్ యాజ‌మాన్యం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం దారుణం.... అస‌లు బాధిత కుటుంబాన్ని ఆదుకోవ‌డంపైన కూడా స్పష్ట‌మైన హామీ ఇవ్వ‌లేదు...
త‌గిన ప‌రిహారం ఇవ్వ‌లేదు... సెల‌వులు ఇవ్వ‌కుండా ప‌నిచేయించుకోవ‌డం... ఆంధ్రా బ్యూరో చీఫ్‌లు, ఇన్‌ఛార్జిల వేధింపులు.. ఇవ‌న్నీ ఈటీవీలో స‌ర్వ‌సాధార‌ణం అయ్యాయి.. ఇటీవ‌ల కాలం రామోజీ ప‌త్రిక‌, ఛానెల్‌లో ఇలా మ‌ర‌ణించిన‌, అనారోగ్యానికి గురైన పాత్రికేయుల సంఖ్య ప‌దుల సంఖ్య‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం .... తెలంగాణ జ‌ర్న‌లిస్టు సంఘాలు... తెలంగాణ రాష్ట్ర స‌మితి, కార్మిక శాఖ స్పందించి పాత్రికేయుల ఆరోగ్య స్థితుగ‌తులను ప‌ట్టించుకోవాలి....

క‌నీసం వేజ్‌బోర్డు సిఫార్సుల‌ను కూడా అమ‌లు చేయ‌కుండా ఉద్యోగుల‌ను వేధిస్తున్నారు...

పాత్రికేయుడిగా స‌మాజానికి ఎంతో చేయాల‌న్న దృఢ సంక‌ల్పంతో వృత్తిలోకి వ‌స్తున్న యువ‌కులంతా యాజ‌మాన్యం వేధింపుల వ‌ల్ల అర్థంత‌రంగా త‌నువు చాలిస్తున్నారు....

రామోజీరావుగారికి ఒక‌టే విజ్ఞ‌ప్తి....

ఉద్యోగుల‌ను వేధించే బ్యూరో చీఫ్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి... పాపం బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాన్ని ఆదుకోండి... క‌నీసం మాన‌వ‌తా దృక్ప‌థాన్ని
ప్ర‌ద‌ర్శించండి... మీ కుమారుడు చ‌నిపోతే పేజీల‌కు పేజీలు వార్త‌లు వేసుకున్నారు... స్క్రోలింగ్‌లు ఇచ్చారు.. కానీ ఒక తెలంగాణ బిడ్డ‌
మీ కంపెనీలో మీ కంపెనీ ఎదుగుద‌ల కోసం ప‌నిచేస్తూ ప‌ని ఒత్తిడితో చ‌నిపోతే ఆయ‌న గురించి స్క్రోలింగ్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం సిగ్గుచేటు...

పాత్రికేయుడు భాస్క‌ర్ అమ‌ర్‌ర‌హే....

venu madhav said...

very sad

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి