Saturday, January 3, 2015

"ది హిందూ" ఓప్- ఎడ్ పేజ్ ఎడిటర్ రాజీనామా

చెన్నై కేంద్రంగా నిడిచే "ది హిందూ" పత్రికలో సీనియర్ ఎడిటర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్,స్ట్రాటజిక్ అఫైర్స్ ఎడిటర్ ప్రవీణ్ స్వామి వెళ్ళిపోవడం సృష్టించిన కలకలం సద్దుమణగక ముందే ఓప్- ఎడ్ పేజ్ ఎడిటర్ రాహుల్ పండిత రాజీనామా చేసారు. ప్రస్తుత ఎడిటర్ మాలినీ పార్థసారధి వ్యవహార శైలి నచ్చకపోవడం, ఎడిటర్ కు ఉండాల్సిన స్వేచ్ఛను ఆమె హరించడం కారణమని రాహుల్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. "స్వేఛ్చ లేదు... మీ మూడ్ ను బట్టి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తప్ప. రచయితలు కవరింగ్ లెటర్ మీద మిమ్మల్ని 'మాలినీ'... అని సంబోధించారా... లేక 'మేడం' అని సంబోధించారా? అన్న దాన్ని బట్టి మీ నిర్ణయాలు ఉంటాయి..." అని ఆయన అందులో స్పష్టం చేసాడు. 
రాజీనామా చేశాక మాలినీ పార్థసారథి కి డిసెంబర్ 18 న రాహుల్ పంపిన లేఖ పూర్తి పాఠం. 

I think I made my point quite clear in my email to the editor-in-chief. In the current situation what the Op-ed page really needs is a bunch of interns who can seek instructions from you on an hourly basis and then get in touch with the authors on your behalf.
An Op-ed editor, the way I see it, has to be given some broad guidelines in the beginning and then left free to run the page.
But there is absolutely no freedom for the current editors to do so. Every article that comes to us or has to be commissioned has to go through your approval. And it really depends on what you think at that point.To tell you the truth, it is just a waste of talent, as far as I am concerned.I came to The Hindu to steer some top-notch reportage and to strengthen the edit pages - by making it more accessible and more nuanced. But I am bogged down with this hourly need to consult you, and with the practice of selecting articles on the basis of whether you've been addressed as "Malini" or "Ma'am" in the covering letters.I am also sick of this constant play of yours: to pitch one person against another for one week, and then reverse it in the next. One is also tired of your changing goalposts.
The Sunday Anchor has to be reportage-driven, and then suddenly it becomes policy-driven, and then suddenly, depending on what you hear or get impressed with, it has to be made reportage-driven again.I am a hardcore journalist and I came to journalism with a certain anger, with a certain cockiness. I have seen people dying in front of my eyes, their entrails in their hands. I have had guns pointed to my temple. Getting my blood pressure high in a conflict zone is a part of my life. But I do not like to get my blood pressure high while sitting in a cabin, waiting for a phone call from yours, of which I'll not understand a word.I have resigned with immediate effect. And that is what I have conveyed to the editor-in-chief.
Warmly,
r
'ది హిందూ' ఎడిటర్ గా సమూల మార్పులు తెచ్చిన సిద్దార్థ్ వరద రాజన్, అరుణ్ అనంత్ వెళ్ళిపోయాక..... విభిన్న పరిణామాల నేపథ్యంలో సాయినాథ్, ప్రవీణ్ నిష్క్రమించారు. ఆ తర్వాత సీనియర్ డిప్యూటి ఎడిటర్ డాక్టర్ శ్రీవత్సన్ ఇటీవలనే 'ది హిందూ' వీడారు. 

3 comments:

Saahitya Abhimaani said...

ది హిందూ గా పిలవబడుతున్న ప్రచురణ ఒక పెద్ద చెంచా ప్రచురణ. బ్రిటిష్ వారు ఉండగా వారి పాట పాడేది, ఆ తరువాత కాంగ్రెస్ పరిపాలన సంప్రాప్తించినాక మారిన గాలివాటం చూసుకుని, వారి చెంచాగా పేరు తెచ్చుకున్నది. తెలుగులో ప్రముఖ సంపాదకులు నీలంరాజు వెంకట శేషయ్య గారి జీవిత చరిత్రలో హిందూ పేపరు గురించి ఈ కింది విధంగా ఉన్నది:

"హిందూ పత్రిక పాలకులకు వ్యతిరిక్తంగా వ్రాయాల్సివచ్చినా, మితవాద ధోరణిలో చాలా జాగ్రత్తగా వ్రాసేది. గట్టిగా విమర్శించాల్సిన విషయం ఏదైనా దేశంలో సంభవిస్తే 'డెన్మార్క్ లో పాల పరిశ్రమ గురించి వ్రాసి ఊరుకునేది' అని చేమత్కరిస్తుండేవారు"

మన దేశంలో పత్రికా స్వేచ్చ అనేది అతి తక్కువ. ఉంటే గింటే ఆయా పత్రికల "యజమానుల" కు స్వేచ్చ ఉన్నది. వారి వ్యాపార అవసరాలను బట్టి పత్రికలు నడుపుతున్నారు కాని స్వేచ్చగా కానే కాదు అన్న విషయం ప్రస్తుతం హిందూ లో జరుగుతున్నా ప్రహసనం ఒక చిన్న ఉదాహరణ మాత్రమె. ఇదే పద్ధతి టి వి చానెళ్లలో కూడా కొనసాగింపు జరుగుతున్నది.

Saahitya Abhimaani said...

It appears she herself was compelled to announce her own departure from The Hindu.

Whatever it is The Hindu can never get the credibility as a News Paper.

ది ఆంధ్రా హ్యూమనిస్ట్ said...

I used to be a regular reader of The Hindu for a greater period in my life. As far as I observed, తత్కాల ప్రభుత్వాల విధానాల గుఱించి వ్రాయాల్సిన సందర్భాల్లో చాలా అస్తిగోపనం (కన్జర్వేటివ్) గా డిప్లోమ్యాటిగ్గా వ్యవహరించే ది హిందూ పత్రిక తన సైద్ధాంతిక భావజాలాల విషయంలో మాత్రం పరమ మూర్ఖమైన, రాజీ లేని, పట్టూ విడుపూ ఎఱగని ఛాందసాన్ని ప్రదర్శిస్తూంటుంది. స్థూలంగా అన్ని వ్యాసాల్లోనూ, వార్తల్లోనూ దాని మొండిధోరణి ఇలా ఉంటుంది. Pro-Tamil and anti-Telugu. Pro-minority, and pro-atheistic exclusively to be anti-Hindu. Pro-SC/ST, and anti-FC. Out out pro-feministic and thoroughly anti-male. Pro-Western, pro-Congress and anti-BJP. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆయా వర్గాలకి/ భావజాలాలకి చెందిన ఉద్యోగులకి ది హిందూలో చాలా విశృంఖలమైన ఫ్రీహ్యాండ్ ఇవ్వబడింది. అక్కడ సింపుల్ ఓపెన్ మైండ్ గలవాళ్ళు వాళ్ళ ధాష్టీకాన్నీ రౌడీయిజాన్ని భరించలేని పరిస్థితి తలెత్తింది. మాలినీ పార్థసారథి సంపాదకత్వంలో నడుస్తున్న ఈ ప్రహసనాలు చాలా సహజం. ఎందుకంటే ఆమె కఱుడుగట్టిన ఫెమినిస్ట్, లెఫ్టిస్టు కూడా. పైపెచ్చు ఒక పెట్టుబడిదారుగా ఆమెకి ఆ సంస్థలో వాటాలు కూడా ఉన్నాయి. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆమే ఒకఱు. She is not simply a journalist.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి