Tuesday, January 13, 2015

బోనస్ రాకపాయె... ధోతులూ ఆగిపోయే...

మీడియా ప్రపంచంలో కాస్ట్ కటింగ్ తార స్థాయికి చేరుకుంది. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా మర్యాదగా చూసుకునే 'ది హిందూ' పత్రిక కూడా ఖర్చుల కోత పేరుతో సంస్థలో పద్ధతులకు తిలోదకాలు ఇస్తున్నది. గత సంవత్సరం బోనస్ ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచిన యాజమాన్యం....ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు పంపే దుస్తుల (ఆడ వారికి చీరెలు, మగ వారికి పంచెలు) విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నై లో పేరెన్నికగన్న నాణ్యమైన బట్టలు కొని పండక్కు అల్లుడికి, ఆడబిడ్డకు పంపినట్లు కొరియర్ లో పంపే యాజమాన్యం...  ఈ సారి మీరే కొనుక్కొని బిల్లు పెట్టుకోవాలని ఆదేశించింది.... క్లిష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.  ఇక్కడ రేటు విషయంలో మానేజ్ మెంట్ ఒక పరిమితి విధించింది. 'ఈ సంప్రదాయం కొనసాగించాలని  సెంటిమెంట్ గా ఫీలయ్యే ఉద్యోగులు' పండక్కు బట్టలు కొనుక్కోవచ్చని, పంచెకు 250, చీరెకు 500 ఇస్తామని స్పష్టంచేసింది. పత్రికలో గతంలో మాదిరిగా నోరు మెదిపే పరిస్థితి లేదు కాబట్టి... ఈ సర్క్యులర్ చూసిన ఉద్యోగులు యాజమాన్య ధోరణి పై గొణుక్కుంటున్నారు. ఈ సందర్భంగా 'ది హిందూ' యాజమాన్యం  ఉద్యోగులకు రాసిన లేఖ ఇలా ఉంది:
KASTURI & SONS LTD.
Kasturi Buildings, 859 860, Anna Salai, Chennai - 600002,
January 12, 2015.
NOTICE
We wish all employees a happy and prosperous new year! As you well know, the company is going through a challenging financial position and austerity is the call of the day. However, KSL also has a reputation for benevolence and employee-centricity. From a financial standpoint, we need to take a hard look at our long tradition of issuing pongal dhothies/saree to employees. Equally, we need to keep in mind the sentiments of our employees. In view of both these viewpoints, we would like employees who sentimentally would like to continue the tradition to purchase the Pongal Dholhies/ saree on their own and et it reimbursed, subject to a maximum as per the details below:
Rs.250/- for Male Employees for purchasing dhothies and Rs.500/- for Female Employees for purchasing saree.
The claims need to be submitted to HR department, along with bill on or before 20th January 2015.
We request employees to balance sentiments with KSL's financial position In deciding your actions. We are thankful for your understanding and cooperation.
Vice President —
Human Resources
"'ది హిందూ' లో పరిస్థితులు దారుణంగా మారాయి. జీవితం రెసిడెంట్ ఎడిటర్ల చేతిలో బందీగా మారింది. గతంలో మాదిరిగా ఫ్రీ హాండ్ ఇవ్వకుండా... మాటి మాటికీ ఫోన్ చేసి చంపుతున్నారు. బోనస్, బట్టలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ వేధించకుండా ఉంటే అంతే చాలు..." అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.  పర్మినెంట్ ఉద్యోగులను త్వరలో కాంట్రాక్ట్ సిస్టం లోకి తెచ్చేందుకు 'ది హిందూ' ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది.  
పెద్ద పదవిలోకి.... చెన్నై కి... శ్రీనివాస  రెడ్డి గారు
ఇప్పటి వరకు హైదరాబాద్ లో 'ది హిందూ' కు రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న కె. శ్రీనివాస రెడ్డి గారిని పదోన్నతి మీద (కో-ఆర్డినేటింగ్ ఎడిటర్) చెన్నై పంపారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పత్రిక నియామకాలు, ఇతర వ్యవహారాలను ఆయన చూస్తారట. సుసర్ల నగేష్ కుమార్ అర్థంతరంగా వెళ్ళిపోయాక... బెంగుళూరు నుంచి రెడ్డి గారిని హైదరాబాద్ తెచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ఎడిటర్ మాలినీ పార్థసారథి కున్న అతి తక్కువ మంది నమ్మకస్థుల్లో ఒకరని చెన్నై వర్గాలు తెలిపాయి. కోరుకున్న కొత్త రెసిడెంట్ ఎడిటర్ దొరికే వరకూ రెడ్డి గారే చెన్నై నుంచి తెలంగాణ  వ్యవహారాలు పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి