Monday, June 13, 2016

సాక్షి టీవీ చానెల్ లో కొమ్మినేని గారి లైవ్ షో

వృత్తి రీత్యా పని ఒత్తిళ్ళ వల్ల మీమీ మధ్యన తరచూ పోస్టులు పెట్టలేక పోతున్నాం. అదీ కాక-ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రతివాడికీ కోపం, కక్షా. అయితే, ఉదయం కాస్త కాఫీ తాగుతూ ఎన్ టీవీ లో మేము చూసి ఎంజాయ్ చేసే/ నవ్వుకునే 'కే ఎస్ ఆర్ లైవ్ షో'  రావడం లేదేమిటి? కొమ్మినేని శ్రీనివాస రావు గారికి ఏమయ్యింది? అని పలువురు మాకు రాసారు. ఆయనకు సంబంధించిన సమాచారం ఇవ్వడం కోసం ఈ పోస్టు. 

'ఈనాడు' లో 1978 లో జర్నలిజం ఓనమాలు నేర్చుకుని.... రామోజీ రావు గారి దీవెనలతో తెలుగు దేశం పార్టీ ఉన్నతి కోసం ఎన్నో వార్తలు రాసి,  తర్వాత 2006 లో టీవీ జర్నలిజం లోకి అడుగుపెట్టి ఆనతికాలం లోనే వినుతి కెక్కిన కొమ్మినేని గారు 2009 నుంచి నరేంద్రనాథ్ చౌదరి గారి ఎన్-టీవీ లో చేరారు-చీఫ్ ఎడిటర్ గా. అక్కడ పొద్దున్నే ఆయన చేసే లైవ్ షో  కు మంచి ప్రజాదరణ వచ్చింది. ఈ క్రమంలో ఎక్కడ బెడిసిందో కానీ తెలుగు దేశం వాళ్ళతో ఆయనకు పడలేదు. జగన్ కు అనుకూలంగా ఆయనవ్యవహరించారని ఒక ప్రచారం. అసలే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ బాబు లు  దీన్ని సహించలేక నరేంద్రనాథ్ తో చెప్పి చానల్ ప్రసారాలు బంద్ చేస్తామని బెదిరించి కొమ్మినేని గారి లైవ్ షో మూసేయించారు. పరిస్థితి సద్దుమణగక పోతుందా అని ఆయన కాలక్షేపానికి కెనడా కూడా వెళ్లివచ్చారు. అయినా బాబు గార్లు పట్టు వీడలేదు. 

ఇక లాభం లేదని కొమ్మినేని గారు సాక్షి ఛానెల్ లో చేరారు... తన వార్తల సైట్  మొట్ట మొదటి సారిగా ఆయన సాక్షి ఛానెల్ లో ఈ ఉదయం ఏడున్నర కు 'కె ఎస్ ఆర్ లైవ్ షో' లో పాల్గొన్నారు. ఆయన తనదైన తరహాలో చర్చను రక్తి కట్టించారు. మంచి జర్నలిస్టుగా పేరున్న ఆయన తనను ఏడిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ను, తనపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ను ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి. 

కొమ్మినాని గారి లైవ్ షో ఫోటోలు (టీవీ నుంచి సెల్ ఫోన్ లో సంగ్రహించినవి) ఇక్కడ పోస్టు చేసాము.   

కొమ్మినేని గారి గురించి....
ఈనాడు 1978 - 2002
ఆంధ్రజ్యోతి 2002 -2006
ఎన్‌టివి..2007 -2007 సెప్టెంబరు
టివి 5..2007 సెప్టెంబరు - 2009ఆగస్టు
ఎన్‌టివి..2009 ఆగస్టు -2016 ఏప్రిల్

రాసిన గ్రంథాలు... 
రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా
తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004
తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా)
తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి)
శాసన సభ చర్చల సరళి..1956 - 1960.
శాసన సభ చర్చల సరళి..1960 - 1971.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి