చిన్న సమస్య వేస్తే...నానా ఏడుపులు ఏడుస్తాం మనం. Why me? అని తల్లడిల్లిపోతాం. అలాంటిది.. కక్ష కట్టినట్టు అడుగడుగునా సమస్యలు వెంటబడితే తట్టుకోవడం అంత తేలిక కాదు.
చిన్నప్పుడు దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడ్డాడు.
కష్టాల కడలి మధ్య పెరిగాడు.
భార్యపై కన్నేసిన ఒక దగుల్బాజీ హత్య కేసులో చిక్కున్నాడు.
వ్యవస్థపై నమ్మకంతో లొంగిపోయాడు.
జైలు పాలయ్యాడు.
మొర ఆలకించని, నిజాన్ని పట్టించుకోని వ్యవస్థ ప్రతినిధి గా జడ్జి పై చెప్పు విసిరాడు.
ఉరిశిక్ష ఖరారయ్యింది.
భార్య జీవితం ఖరాబు కాకూడదని ఆమె వేరే పెళ్ళికి ఒప్పుకున్నాడు.
జైల్లో పేరుమోసిన అన్నలను కలిసి సమాజ పాఠాలు నేర్చుకున్నాడు.
మంచి జైలర్ వల్ల ఉరి శిక్ష తప్పించుకున్నాడు.
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుణ్యాన డిగ్రీ సాధించాడు.
జర్నలిజం వైపు మొగ్గుచూపాడు.
విడుదలయ్యాక జీవిత సమరం చేశాడు.
భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం సాగిస్తున్నాడు.
ఇదీ సంక్షిప్తంగా రాజన్న జీవిత చరిత్ర. ఆయన స్వీయ కథ హిందీలో వచ్చింది. ఇప్పుడు తెలుగులో వస్తున్నది.
నాకు ఒక మూడేళ్లుగా ఆయనతో పైపైన పరిచయం. ఆయన గురించి "నిర్దేశం" అనే చిన్న పత్రికలో వచ్చిన సీరియల్ చదివి నా గుండె అల్లకల్లోలం అయ్యింది. ఆ పత్రికకి నా అభిప్రాయం రాసి పంపాను.
నిన్న రాత్రి "World Public Relations Day" సందర్భంగా ఆయన్ని హైదరాబాద్ లో కలిశాను. ఇట్లా చిరు సత్కారం చేశాను.
వ్యవస్థలో లోటుపాట్లకి, కొందరి దౌర్జన్యానికి బలైన రాజన్ గారిని అదే వ్యవస్థలోని కొన్ని అంగాలు, కొందరు వ్యక్తులు ఆదరించి అక్కున చేర్చుకోవడం ఊరట నిచ్చే అంశం. ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన జీవితం ఒక సినిమా రూపంలో వస్తేనే మంచిది.
2 comments:
మీ మనులులో ఇంత మంచి చోటు దక్కినందుకు నా జీవితం ధన్యం అయిందనుకుంటాను.
సమాజాన్ని ప్రశ్నించడం నుంచి మొదలైంది ఆయన జీవితం, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం సడలని యోధుడు, నీతి తప్పని గొప్ప వ్యక్తి రాజన్న వారి జీవితం ఈ సమాజానికి, భావితరాలకు స్పూర్తి వంతం అవుతుంది డా. కారం శంకర్ కవి రచయిత కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి