(By S Ramu)
రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల బాగా ఆసక్తి ఉన్నవాళ్లకు మంచి అనాలిసిస్ వినాలని లేదా చూడాలని మనసు పీకుతుంది. సమగ్ర సమాచారం ఇచ్చే వారి విశ్లేషణ విని తాము ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాలని చూస్తారు. నిష్పాక్షిక సమగ్ర సమాచారం అనేది ఈ రోజుల్లో అసాధ్యమైన అంశం కాబట్టి వివిధ కోణాలకు సంబంధించిన వివిధ విశ్లేషణలను విని, చదివి, జనాలతో మాట్లాడి, కొద్దిగా బుర్ర పెట్టి డాట్స్ కనెక్ట్ చేసి మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం బెటర్.
మంచికో, చేసుకో గానీ సోషల్ మీడియా పుణ్యాన చాలా ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. అయితే ఇదొక పెద్ద సముద్రం. మనం మంచి విశ్లేషణలే వింటున్నామా? లేక ఏమైనా మిస్ అవుతున్నామా? అన్న ఆలోచన చేసే టైం కూడా ఉండదు.
సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించి నేను ఫాలో అయ్యే విశ్లేషకుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. మీరు అదనంగా ఇంకా మంచి విశ్లేషకుల పేర్లు సూచిస్తే... మనందరికీ ఉపకరిస్తుంది.
1) ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు (సమగ్ర సమాచారం, డాటా కోసం)
2) రాకా సుధాకర్ గారు (రైట్ పర్స్పెక్టివ్)
3) సీ వనజ గారు (లెఫ్ట్ పర్స్పెక్టివ్, మహిళల అంశాలు)
4) కందుల రమేష్ గారు (వార్తలు, విశ్లేషణలు)
5) వీక్షణం వేణుగోపాల్ గారు (లోతైన విశ్లేషణ, హిస్టారిక్ పర్స్పెక్టివ్, మీడియా అనాలిసిస్ కోసం)
6) డా కే. శ్రీనివాస్ గారు (భాష, సమగ్ర విశ్లేషణ కోసం)
7) తులసి చందు గారు (ప్రజా సమస్యల ప్యాకేజ్ ల కోసం)
8) రఘు గారు (ఇంటర్వ్యూ ల కోసం)
9) డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు (సమగ్ర సమాచారం, బ్యూరోక్రాటిక్ కోణం కోసం)
10) బర్ఖా దత్ గారు (క్రిటికల్ అనాలిసిస్)
11) రాజ్దీప్ సర్ దేశాయ్ గారు (స్ట్రెయిట్ బ్యాట్)
12) ధృవ్ రాతీ గారు (టాపిక్ బట్టి)
13) జాఫర్ గారు (ఇంటర్వ్యూ ల కోసం)
14) కరణ్ థాపర్ గారు (క్రిటికల్ ఇంటర్వ్యూ ల కోసం)
15) ప్రొఫెసర్ బాబీ వర్ధన్ గారు (సినిమా, మీడియా సమీక్ష ల కోసం)
16) పమిడికాల్వ మధుసూదన్ గారు (తెలుగు పద్యాల కోసం)
ప్రధానంగా వీరిని కవర్ చేయడానికి నా తల ప్రాణం తోకకి వస్తోంది. రోజూ ఇవి చూడాలంటే అస్సలు టైం సరిపోదు. అపుడపుడు నాకు ఆసక్తి లేని టాపిక్ ల మీద వీరి వర్క్ ఉంటే నేను స్కిప్ చేస్తాను. ఈ లిస్ట్ లో ఉండాల్సిన కొన్ని పేర్లు మర్చిపోయానేమో, తెలియదు.
జకీర్ గారి లాంటి తెలంగాణ జర్నలిస్టులను అపుడపుడూ ఫాలో అవుతా. ఈ మధ్య తెలంగాణ జర్నలిస్టుల భాషలో, ధోరణి లో వచ్చిన మార్పు వల్ల చూడడం లేదు. జర్నలిస్టిక్ మర్యాద లేకుండా నోటికొచ్చిన మాట (బూతులు కూడా) మాట్లాడి... తెలంగాణ కడుపు మంటండీ అంటారు.
పై లిస్టులో ఉన్న వారి విశ్లేషణలు చూడడానికే టైం సరిపోదంటే, టీవీ డిబేట్లు చూడడం దాదాపు దుర్లభం. అన్ని టీవీ ఛానెళ్లు ప్రమాణాలు లేకుండా రాజకీయ కుంపట్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్థాన విద్వాంసులతో నీళ్ల బోరింగ్ దగ్గర పంచాయితీ ల్లాగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఒక కోణం కోసం TV 5 మూర్తి గారి, ఇంకో యాంగిల్ కోసం YNR గారి, సాయి గారి వీడియోలు అపుడపుడూ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూ లు నా వాల్ మీద దొరికినా, వాళ్ళు నాకు పంపినా తప్పక చూస్తాను.
నేను చూడకపోతే... నా విషయ పరిజ్ఞానానికి నష్టం జరిగే అవకాశం ఉన్న ఇంకా ఎవరినైనా మిస్ అవుతుంటే నన్ను అలెర్ట్ చేయండి.
