Monday, November 30, 2009

i-news లో మూకుమ్మడి రాజీనామాలు

మనం గత పోస్టులలో అనుకున్నట్లుగానే...i-news కు కర్త, కర్మ, క్రియ అయిన రాజశేఖర్ తమ ఆఫీసు పక్క రెండు మూడు గల్లీల అవతల వున్న N-TV లో పెద్ద పదవిలో జాయిన్ అయ్యాడు. i-news లో ఒక సంక్షోభానికి కారణం అయ్యాడు.

రాజశేఖర్ కు నమ్మిన బంట్ల లాంటి నలుగురు సీనియర్లు కూడా i-news కు గుడ్ బై చెప్పారు. వారు: చీఫ్ కో-ఆర్డినేటర్ కం బ్యూరో చీఫ్ శ్యాం కుమార్, అవుట్ పుట్ ఎడిటర్ విజయ్ కుమార్, క్రైం బ్యూరో ఇన్-ఛార్జ్ సూరజ్, కెమెరా డిపార్టుమెంటు చీఫ్ సుధాకర్.

"ఇది నిజంగా సంక్షోభానికి దారి తీసే అంశమే. ఇప్పుడు ఈ ఛానల్ చుక్కాని లేని నావలా సాగుతుందేమో," అని ఒక ఉద్యోగి అన్నారు. వెళ్లి పోతారేమో అని భావించిన కొందరి జీతాన్ని ఐ-న్యూస్ నిలిపివేసిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత ఇప్పుడు కందుల రమేష్ మీద వుంది.
రమేష్ కు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా i-news యజమాని వాసు సోమవారం ఉద్యోగులకు విందు ఇచ్చారు. 

అదే సమయంలో రాజశేఖర్ N-TV అధినేత నరేంద్రనాథ్ చౌదరి తో సుదీర్ఘ సమావేశం జరిపాడు. ఛానల్ రేటింగ్స్ పరిగెత్తించేందుకు తన వద్ద వున్న ప్లాన్ ను చర్చించాడు. తనను నమ్ముకున్న కొందరికి జాబ్స్ ఇవ్వాలని రాజశేఖర్ అడిగాడు. రాజశేఖర్ టీం ను సర్దుబాటు చేసేందుకు...చౌదరి గారు కొందరు ఉద్యోగులను సాగనంపే ఏర్పాటు చేసారు.

"రాజశేఖర్ టీం కోసం మా ఉద్యోగాలు పీకడం ఏమి న్యాయం? చౌదరి గారికి, ఆయన టీం కు దీని ఉసురు తగలక మానదు," అని ఒక ఎంప్లాయీ అన్నారు. ఇప్పటికే N-టీవీ లో చీఫ్ ఎడిటర్ గా వున్న కొమ్మినేని గారితో రాజశేఖర్ భేటీ అయి..."మీరు నాకన్నా సీనియర్. మీ పని మీది, నా పని నాది," అని చెప్పుకున్నట్లు సమాచారం.
ఇక N-TV నుంచి కొన్ని సీనియర్ హ్యాండ్స్ ఐ-న్యూస్ కు బారులు తీరే అవకాశం వుంది. 

7 comments:

Anonymous said...

papam rajashekhar annaiah eado chydamani tv9 lo nudi i news lo kipoyadu machi progrmas tho vachadu knai thnu anukuna vicotry gain kaledu eaka i news tho tv9 nu rating lo padagotdam kastmu anukunado eamu e bass nami tv9 lo nudi inews lo ki vachi na vali vadchi tanu matarm maro dari chukunadu ok all the best rajashekara me ideas ok kani me earinigs ea kaka me mali namukuna valani kastha patichu kao ............ any alll tbe best kadu kadu best of luck mari rajashekhar prayanam ntv lo eantha varko knasaguthudo vaychi chuudamu

amar said...

Hats up to you.

Anonymous said...

రాము గారు..! చాలా వేగంగా ఈ సమాచారాన్ని అందించారు. అయితే కొంత మిస్సయ్యారు. సూరజ్ ని ఎలాగు తీసేద్దాము అని నిర్ణయించుకున్న సంస్థ ప్రత్యామ్నాయం గురించి కూడా ముందే ఆలోచించింది. ఆ బాధ్యతను కొత్తగా పగ్గాలు అప్పజెప్పిన కందుల రమేష్ కే అప్పగించింది. దీంతో అయన వెంటనే క్రైం బ్యూరో కోసం TV5 లో ఉన్న మహాత్మకి గాలం కూడా వేయడం జరిగింది. ఇదే సమయంలో అవుట్ పుట్ ఎడిటర్ విజయ్ కుమార్ స్థానం భర్తీకి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. శ్యాం స్థానం భర్తీ అలోచనేది లేదు. ఆ బాధ్యతలు అంకం రవి చూసుకుంటాడు అని సంస్థ భావిస్తోంది.

ఇదిలా ఉంటే మరో వైపు... సాక్షి టీవీలో ఇబ్బంది పడుతున్న క్రైం మిత్రులు హసీనా, రమేష్ ఇద్దరూ కూడా i-News వైపే ద్రుష్టి సారించారని తెలుస్తోంది. హసీనా ఇప్పటికే ఈ మేరకు అడుగు ముందుకేసిందని, రమేష్ వైట్ల కందుల రమేష్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని పక్కా సమాచారం. ఏదేమైనా ముందుగా క్రైం బ్యూరో సంగతి ముందుగా తేలనుంది.

ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. బహుశా వారి ఉద్యోగ జీవితానికి ఇబ్బంది కలుగుతుందని మీరు ఈ విషయం చేర్చి ఉండరని నేను అనుకుంటున్నాను.

swapna sundari said...

rajashekhar was shown doors from
tv9 after he literally accepting bribe from a person in his cabin. He earned near about 80 lakhs in the name of event management organisation. As tv9 is top rated channel companies use to hire rajashekhar's company services to see their programme get good coverage. He planned same thing in inews and inews meserably failed to get trps. Rajashekhar is now eying on NTV as they have been getting good trps and I caution Mr. Chowdary to beware of Rajashekhar. Raja not only see increase in ratings and also surge in his personal bank balance.

Swapna

Anonymous said...

good piece of observation swapna.
Mr.Chowdary is totally miscaliculating the game. He wants to see his channel top and he got sastry. Channel lost TRP. He tried Kommineni but not given enough time to prove himself. Now he is getting Rajashekhar. How can he believe this man.Rajashekhar not even surpassed NTV in ratings when he was in I NEWS.
Now three new boss' and already there are three old boss'are ruining the organisations.
It is clear and evident that NTV become messy and may god saves the channel.

Anonymous said...

ఎన్.డి.టి.వి. లాంటి సంస్థే చానళ్ళు ఎయిర్లో ఉంచడం కోసం కేబుల్ ఆపరేటర్లకు, డీటీహెచ్ సంస్థలకు ఏటా 70 కోట్లు ముట్టజెబుతోందట. (సోర్స్ కొత్త బిజినెస్ వరల్డ్) మనలాంటి తర్డ్ గ్రేడ్ చానళ్ళ కర్చు పర్ చానల్ ఎక్కువే వుంటుంది. ఈ మాఫియాకు ముడుపులు చెల్లించుకోలేని చిన్న చానళ్ళను రోజూ చూసి ప్రోత్సహించండి. అవి బ్రేక్ ఈవెన్ సాధిస్తే నిజమైన వార్తలు మనం చూసే వీలుంటుంది.

శ్రీనివాస్

Anonymous said...

మా 8 ఏళ్ళ అమ్మాయి టీవీలో తనకు ఇష్టంలేని న్యూస్ చానల్స్(నేనక్కడే ఉన్నాగా) చూస్తూ మధ్యాహ్నం బళ్ళో వదిలేసిన లంచ్ బాక్స్ ఇంట్లో బలవంతం మీద తింటోంది. దానికో సందేహం.

డాడీ, కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేశారు?

నాకు సందు దొరికింది.

అన్నం తినడం లేదని.

అన్నం తినక పోతే అరెస్ట్ చేస్తారా?(ఆశ్చర్యం)

ఆయన తెలంగాణా ఇచ్చే దాకా అన్నం తినడట. అదే నిరాహార దీక్ష. ఎక్కువ రోజులు తినకుండా ఉంటే నీరసం వచ్చి చచ్చి పోతాడు కదా. అందుకే అరెస్ట్ చేశారు. ఆస్పటల్ కు తీసుకు వెళ్ళారు.

నేను చాలా సార్లు అన్నం తినలేదు. కొట్టి తినిపించారు. ఆయన్ని గట్టిగా పట్టుకొని తినిపించ వచ్చు కదా.

ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు నిరాహార దీక్ష చేయాల్సిందే అని గట్టిగా పట్టుకున్నారు.

వాళ్ళు కూడా అన్నం తినకుండా కూర్చున్నారా?

లేదు. ఆయన ఒక్కడే నిరాహార దీక్ష చేస్తున్నారు.

అంటే వాళ్ళు మంచిగా తింటారు. పాపం ఆయనకి మాత్రం స్టమక్ లో ర్యాట్స్.

ఇంతకీ ఏమంటావ్. కేసీఆర్ అన్నం తినాలా వద్దా.

అన్నం తింటే బలం వస్తదని నువ్వేగా అంటావ్. బలం వస్తే బాగా ఫైటింగ్ చేసి వాళ్ళని వోడించి(ఎవర్ని తెలియదు. ఇంకా అంత డెప్త్ లేదు) తెలంగాణా తేవచ్చు.

నాకు కళ్ళు తెరుచుకున్నై.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి