Thursday, March 4, 2010

నిత్యానంద స్వామి....ఎం.ఎఫ్.హుస్సేన్...మీడియా ...

ఈ మధ్యన మీడియాను ముంచెత్తుతున్న రెండు ప్రధాన వార్తల వల్ల నాలో కొన్ని ధర్మ సందేహాలు మొలకెత్తాయి. ఇవి ఒకదానికి ఒకటి సంబంధం లేకపోయినా...వీటి మీద కొంత చర్చ జరగాలని ఉంది. ఈ రెండూ వేర్వేరు పోస్టులుగా రాసుకోదగ్గవి అయినా సమయాభావం వల్ల ఒకటిగా రాస్తున్నాను. అవి--- ఒకటి) నిత్యానంద స్వామి తమిళ నటితో భౌతిక ఆనందం పొందడం 
రెండు) చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ కతార్ పౌరసత్వం తీసుకోవడం 

నిత్యానంద స్వామి వారి ఎవ్వారం 

తమిళనాడులో తన బెడ్ రూంలో ఈ స్వామి వారు ఒక తమిళ నటి (పేరు 'ఆర్' అనే ఆంగ్ల అక్షరంతో మొదలవుతుందట) తో కులుకుతున్న వైనాన్ని మన ఛానెల్స్ తనవితీరా చూపించాయి. HM-TV తో సహా అన్ని ఛానెల్స్ కనీస మర్యాద మరిచి...ఆ క్లిప్ ను మాటిమాటికీ చూపి అలౌకిక ఆనందం పొందాయి. రెండు రోజుల పాటు పిల్లలతో వార్తలు చూడలేక పోయాం.  మొత్తం మీద ఈ కార్యక్రమం చూసి జనం రెచ్చిపోయి స్వామి గారి ఆశ్రమాలపై పడి విధ్వంసం సృష్టించారు. 

ఒక స్వామి తన ఇంట్లో తనకు నచ్చిన ఒకామెతో, ఆమె ప్రోద్బలంతో శారీరక ఆనందం పొందడం తప్పా? ఇదే తప్పు అయితే...మన సినీ, టీ.వీ. పరిశ్రమలో ఎనభై శాతం మందిని, అధికారులు-రాజకీయ నేతల్లో తొంభై శాతం మందిని కటకటాల వెనక్కు పంపాల్సి వుంటుంది. 
నీతి సూత్రాలు చెప్పే స్వామి ఇలా చేయడం ఏమిటి? అన్నది మన మీడియా ప్రశ్న. నీతి వల్లించడం వేరు, శృంగారం వేరు కాదా? ఈ స్వామి ఎప్పుడైనా...మీరు శృంగారం లో పాల్గొనకండి...అని చెప్పాడా? ఒక వేళ చెప్పినా...యువకుడైన స్వామి ఆ మాటను ఆచరిస్తాడని అనుకోవడం మన బుద్ధితక్కువ తనం కాదా? 

వాడు...ఎవరో భక్తురాలిని మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని, బలాత్కరిస్తే అనుకోవచ్చుగానీ...తమకంతో మీదపడి బీభత్సం సృష్టిస్తున్న నటితో లైట్ బంద్ చేసి గడిపితే తప్పేముంది..అని అబ్రకదబ్ర (మన మీడియా సోర్సు) అడిగాడు. దివ్యబోధ చేసే స్వాములు శారీరక సుఖాలకు దూరంగా ఉండండని మీడియా ఎందుకు చెప్పాలి? ఆ అమ్మాయి అలా సిగ్గూ బిడియం లేకుండా...మీద పడుతుంటే....చూసి సొంగ కార్చుకున్న మగ పుంగవులు ఎందరు లేరు చెప్పండి?
"దొరికితేనే దొంగ. చాల మంది స్వాములు ఆస్తులు కూడాబెట్టారు. ఇదొక మాఫియా. డబ్బు, భోగం ఆకర్షణతో స్వాములను వలలో వేసుకునే వారు కొందరు, డబ్బు మత్తులో అమ్మాయిలను వాడుకునే సాములోరు మరికొందరు. ఇది టీవీ లో చూపాలన్న శునకానందం మన ఛానెల్స్ ది, చాలా మంది జనాలది," అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు.

 కల్కి స్వామి వ్యవహారం ఛానల్స్ లో వస్తున్నప్పుడే...ఈ 'కులుకు'స్వామి గురించి అకస్మాత్తుగా ప్రసారంయ్యింది. దీని వెనుక మర్మమేమిటో?  


హుస్సేన్ గారి కతార్ వాసం 

ఎం.ఎఫ్.హుస్సేన్ గారు మోడరన్ ఆర్ట్ లో దిట్ట అంటారు. అది నాకు అర్థం కాదు కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పని నేను చెప్పలేను. నిజంగానే ఆయన బొమ్మల్లో మజా ఉంటుందని చాల మంది చెబుతారు. ఆయన సరస్వతి తదితరుల హిందూ దేవతల బొమ్మలు నగ్నమైనవి చిత్రీకరించారు. అది వివాదాస్పదమైంది. కాషాయసేన ఆయన ఇంటిపై పడి బీభత్సం సృష్టించింది. దాడులకు దిగడం ముమ్మాటికీ తప్పు. 

హుస్సేన్ గారు మొత్తానికి కతార్ వెళ్ళిపొయ్యారు. ఒక చిత్రకారుడికి భావప్రకటన స్వేచ్ఛ లేదా? ఏమిటీ దారుణం? అని ఎన్.రామ్ వంటి జర్నలిస్టులు, కమ్యూనిస్టులు అంటున్నారు.  ఇక్కడ ఒక చిక్కు వచ్చింది....దేశంలో మెజారిటీ జనం ఆరాధించే దేవతల బొమ్మను నగ్నంగా చిత్రీకరిస్తే జనాలకు కోపం రాదా? ఇక్కడ కులం, మతం కాదు....ఒక హిందూ చిత్రకారుడు ఆ పని చేసినా అదే ప్రతిస్పందన వస్తుంది. అలాంటి చిత్రాలు సాధారణ జనాలను బాధిస్తాయి, అలాంటి అవకాశాల కోసం గోతి కాడి నక్కలా ఎదురు చూసే కాషాయ సేన దాన్ని ఒక వివాదంగా మారుస్తుంది. 

ఇళ్ళ మీద పడి కొట్టడం తప్పు గానీ....సాధారణ ప్రజల మనోభావాలను ఏ కళాకారుడైనా, చిత్రకారుడైనా పరిగణలోకి తీసుకోవాలి, గౌరవించాలి. భారత్ తనను ఆదుకోలేదని అంటున్న హుస్సేన్ గారు ఇప్పుడు కతార్ లోఅధిక సంఖ్యాకుల మనోభావాలను దెబ్బతీసేలా వారి దేవుళ్ళ నగ్న చిత్రాలను గీసి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుంది. ఆ చిత్రాలను కతార్ వాసులు మన్నించి, ఆదరించి, అక్కున చేర్చుకుంటే...వారి నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుని చెంపలు వేసుకునే అవకాశం ఉంటుంది.

హుస్సేన్ గారి వనవాసం, వారి మాటలు హిందూ-ముస్లిం ల మధ్య చిచ్చును  మరింత పెంచకముందే...లౌకిక వాదులు ఈ సమస్యను పరిష్కరించి ఆయన మళ్ళీ భారత్ వచ్చేలా చేయాలి.  ఆయన కూడా మరీ వివాదాస్పద బొమ్మలు వేయకుండా ఉంటే బాగు.

33 comments:

budugu said...

well said. I would like to see MFH drawing some Qatar gods naked..and see how they react..
you should have also mentioned the Dutch cartoon controversy to show otherside of the coin.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I completely agree with you.

Raj said...

ఖతార్ లో ఆపనే చేస్తే హుస్సేన్ని జనాలందరి ముందు నిలబెట్టి శిరచ్చేదం చేస్తారు...అయినా ఆయనకి అంత దమ్ము ఎక్కడిది..మన లౌకిక వాదం మీద నమ్మకంతో అలాంటి బొమ్మలు వేయగల్గాడు..ఆయన గొప్ప పెయింటరే కావచ్చు కాని ఇక్కడి మెజారిటి మనుష్యుల విశ్వాసాల మీద ఆడుకుంటే ఎవరూ సహించరు...వాడిని ఖతార్ తోలటమే మంచిది...

Anonymous said...

A balanced piece of opinion.You have correctly raised the basic points in the issue of Nityananda swami.Sex is a part of life on par with the basic things like air,food,water etc.There is nothing to be ashamed to have legal sex which is better known to majority of staff of TV channels who have been telecasting the video clips continously without any break.I fail to understand why these channels are not telecasting the sexual adventures of VIPs of these channels in India abroad?
It is usual in our society that a Swami,Guru is not supposed to have the bad habits like alcohol,gambling,cheating,criminal activities etc and he is not supposed to enjoy physical pleasures like sex,romance etc and this has been the practice in our country since ages.Inview of this myth or reality most of the people hate the swamis who indulge in extra marital affairs or illegal sexual pleasures.But I am at cross roads whether to approve or disapprove it!
Regarding Hussain saheb he refused to apologise to the Hindus who were hurt by his nude paintings of goddesses thus he insulted his motherland and left her for a foreign land.If he really loves India,his mother land he should have expressed regret and apologised to the country to show his sincerity thus sacrificing his egoism,self respect for the sake of mother India.But he refused all and entered a foreign country of his faith to be called a second class citizen.
As rightly said by you let Hussain ji paint the nude pictures of his religious Gods,the sheikhs and their family members as a contribution to his classical art of painting and see the result for himself and if his nude paintings are accepted by Qatar,Dubai,UAE,Saudi,Kuwait etc we the INDIANS are always ready to apologise to him for his agony in the country.Tolerance is the cuture of Hindus as seen in the past history of India that is akhand Bharath but there is limit to every thing beyond which there would be sunami of the reaction of them and let the Hindus are not provoked for a sunami.MAY GOD BLESS GOOD SENSE TO HUSSAIN SAHAB TO RETURN TO HIS MOTHERLAND BY GETTING BACK HIS CITIZENSHIP BY EXPRESSING REGRET FOR HIS NUDE PAINTINGS OF MOST RESPECTED,WORSHIPED,LOVED DIETIES OF THE PEOPLE OF THEIR RELIGION.

A Citizen.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

హుస్సేన్ విషయం లో మీరు చెప్పేది తప్పు. ఇప్పుడు మీడియా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలా బూతును ఆశ్రయిస్తున్నారో అతడు అంతకు ముందే ఆ పని చేసి .........గాళ్ళకి మార్గదర్శకుడయ్యాడు. అతడు ఇండియా రానవసరం లేదు .ఒక వేళ దీనిగురించి ఇక్కడ హిందూ ముస్లిం లు గొడవలు పడితే వాటికి ఇక్కడి రాజకీయాలు మూల కారణాలు కాని హుస్సైను కాదు.

WitReal said...

i agree with your thots.

it was in bad taste for all the tv channels to stream that footage...

i saw the nakkeeran video. that was even worse. the lady was giving a hand... to the swami

channels have to maintain some decency.

సుజాత వేల్పూరి said...

నేనూ అదే చూస్తున్నాను. కతార్ దేవుళ్ళ నగ్న చిత్రాలు గీసి "నాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా" అని ప్రశ్నించి గెలిచి, బతికి తిరిగొస్తే, భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు నేర్చుకుంటారు. హుసేన్ గారు దీనికేమంటారో!

Anonymous said...

సాములోరు కాషాయం బట్టలు వేసుకోని జజ్జినకరి చేయటం సబబు కాదు. అవి ఇడిసిపెట్టి చేసుకుంటే తప్పులేదు. చానెళ్ళు ఈ దృశ్యాలను తనివితీరా చూపించాయి. నాకు తెలిసి చాలామంది వీక్షకులు కూడా enjoy చేశారు. carnal desire is so powerful.

raju said...

yes ramu garu iam agree witu

చదువరి said...

"ఒక హిందూ చిత్రకారుడు ఆ పని చేసినా అదే ప్రతిస్పందన వస్తుంది." - వచ్చింది కూడా! కొన్నేళ్ళ కిందట మన తెలుగువాడే (ఏ మతస్తుడో తెలీదు - పేరు కృష్ణమోహననుకుంటా) గుజరాతులో ఇలాంటి బొమ్మలే వేసి, అరెస్టు అయ్యాడు.

ఇంతకీ, అతడు క్రీస్తుపైన కూడా బొమ్మలేసాడు. క్రైస్తవులు గోల చేసారు కూడా. మరి క్రైస్తవుల సంస్థలు కూడా గోతికాడ నక్కల్లాగా కాసుక్కూచ్చుంటాయనాలేమో చూడండి.

Indian Minerva said...

హుస్సేన్ గారు ఇదే విధమైన కళానైపుణ్యాన్ని కతార్లోకూడా ప్రదర్శించి ఒక కతారిష్ శైలిని సృష్టించి ఉద్ధరించాలని కోరుకుంటునాను. ఈ విషయంలో అల్లా ఆయనకు సదా తోడుండి కాపాడుగాక.

చిలమకూరు విజయమోహన్ said...

హుస్సేన్ ఖతార్‍లో వాళ్ళ దేవుడి నగ్న చిత్రాలు గీయవలసిన అవసరంలేదు ఇక్కడ భారద్దేశంలో గీసినా వాళ్ళు ఆయన తలకు వెలకడతారు.

WitReal said...

>> సాములోరు కాషాయం బట్టలు వేసుకోని జజ్జినకరి చేయటం సబబు కాదు.

bedaru, knonchem ekkuvayyindemo? one should not be judgemental on others' closed door acts.

on a serious note, there are some schools of thots like tantra, charvaka etc..

Anonymous said...

these channels particularly TV9 don`t dare to telecaste such videos of church fathers, sufi sanyasis..why? If it does then it will have to face the music..poor Hindu swami doesn`t have political clout or money power.

Unknown said...

ramugaru even my situation was also similer to yours , could not watch news channels with kids , i think its high time to impose censor ship on news clippings also

Nrahamthulla said...

స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

శరత్ కాలమ్ said...

ముస్లిం మతంలో దేవుళ్ళ నగ్న చిత్రాల సంగతేమో కానీ అసలు అల్లా మామూలు బొమ్మ గీయడం కూడా నిషేధం అనుకుంటా. ఒక డెన్మార్క్ కార్టూనిస్టు అల్లా బొమ్మతో కార్టూను గీసినందుకే ప్రపంచం మొత్తం మీద రభస అయిపోయింది కదా. ఆ కార్టూనిస్టుని చంపడానికి వెళ్ళిన కొందరు వ్యక్తులు అతని ఇంటి పరిసరాలల్లో పట్టుబడ్డారు కూడానూ.

మంచు said...

Very well said !!!

Anil Dasari said...

ఈ స్వాముల, వాళ్ల లీలల విషయంలో నా అభిప్రాయాలు నాకున్నాయి కానీ వాటిని నేనెప్పుడూ ఎక్కడా వ్యక్తం చెయ్యలేదు. రాము గారు ప్రస్తావించిన 'మీడియా సోర్స్ అబ్రకదబ్ర' నేను కాదని గమనించ ప్రార్ధన.

Ramu S said...

నిజమే అండీ...
పాపం ఈ అబ్రకదబ్ర, నా సోర్సు అబ్రకదబ్ర ఒకరు కాదు. మావాడు ఇన్ సైడ్ సమాచారం ఇచ్చే బాపతు. పాపం బ్లాగర్ అబ్రకదబ్ర గారిని ఏమీ అనకండి.
చీర్స్
రాము

Anonymous said...

Dear Ramu,

My comment has nothing to do with God-man's scandal.
It is on M F Hussain's part:

Here r two issues:
1.Discussing the relation, connection between the (woman's)nudity and the world of art (of any genre in general, painting in particular).
2.Debating on depiction of Hindu Goddess in nude by MFH.
1- There is no point in discussing so, when u (sarcastically) admitted ur (arrogant)ignorance on the modern art.
2- In this aspect, u chorused with Saffron bigots, who have nothing to do with 'Hindu' sentiments and 'Indian' culture.

Pls go through the following verses:
1.స్థిరోగంగా వర్తస్తన ముకుళ రోమావళితా
కళావాలం కుండం కుసుమ శరతేజోహుత భుజ
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరి సుతే
బిలద్వారం సిద్దేర్గిరశ నయనానాం విజయతే

2.నిసర్గ క్షీణ స్యస్తన తలభరేణ క్లమ జుషో
నమన్మూర్తేర్నారీ తిలక శనకైస్త్రుట్యత ఇవ
చిరం తేమధ్య స్యత్రుటిత తటినీ తీర తరుణా
సమావ స్థాస్థే మ్నోభవతు కుశలం శైలతనయే

3.కచౌ సద్య స్స్విద్యత్తట ఘటిత కూర్పాస భిదురౌ
కషంతౌ దోర్మూతే కనక కలశాభౌ కలయతా
తవత్రౌతుం భంగాదల మితి వలగ్నం తనుభువా
త్రి ధానద్దం దేవిత్రి వళిల వలీవల్లి భిరివ

4.గురుత్వం విస్తారం క్షికత ధరపతి పార్వతి నిజా
నితంబా దాచ్ఛిద్య త్వయిహరణ రూపేణ విదధే
అతస్తే విస్తీర్ణో గురురయ మశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్బార స్థగయతి లఘత్వం నయతిచ

5. కరీంద్రాణాం శుండాన్ కనకదళీ కాండ పటలీ
ముభాభ్యా మూరుభ్యాం ఉభయమపి నిర్జిత్యభవతీ
సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విద్దిజ్ఞే జానుభ్యాం విబుధ కరి కుంభ ద్వయమసి
The first SLOKA refers to naval of Goddess. Second and Third Slokas about Her big Breast, lean waist and wrinkles on the waist and midriff. Fourth Sloka is about her Buttocks and fifth sloka is about her Thighs. Adi Sankara charya also referred to Her pubic hair and also vagina.
పరమ భక్త శిఖామణి, సాక్షాత్, శంకర సమానులుగా కీర్తించబడిన ఆది శంకరాచారుల వారు జగల్లీలని నగ్నంగానే దర్శించి, సౌందర్యలహరీ విరచించారు.

రోజూ పఠించే లలితా సహస్రనామాలలొ ఇవి కొన్ని. ..............................
1 ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషికా
2. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
3. నాఖ్యలవాలరోమాల్లి లతా ఫలకుచద్వయీ
4. లక్ష్యరోమలతాధార సమున్నేయమధ్యమా
5.స్తనభారదళన్మధ్య పట్టబంధరళిత్రయా
6. అరుణారుణకౌసుభ వస్త్ర భాస్వత్కాటీతటీ
7. కామేజ్ఞత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా.......

1 is about the naval of Goddess
2 is about Her shoulders
3 is about Her naval and breast
4 is about Her pubic hair and vagina
5 is about the gap between Her breast- cleavage
6 is about Her waist and midriff
7 is about Her Thighs

ఆ మాటకొస్తే రోజూ వినే సుప్రభాతం ఇదిగో ఇలా ఉంటుంది.....
కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో

Oh! Lord!! Whose blue complexion is turned red by the KUMKUMA on the nipples of Lakshmi's breast.

Pls refer to Bhakta Jayadeva's Geeta Govindam. Go through 26 volumes (TTD publications) of Saint- poet Annamayya (I am not referring to erotic descriptions of Srinatha, Peddana etc, as they did not fall under this category).

My intention to tell u is that: Nudity has many connotations.
1. Divine Nudity
2. Distorted Nudity.
3. Infantile Nudity.

U could not say the child's nudity is obscene. Similarly, u could not confuse with the (semi) nudity of film stars and the nudity being portrayed by M F Hussain.

However, pls think a while: Did MFH intend to provoke our sensuality with the nude depiction of Lakshmi, Saraswathi and so on? Is it morphing the face of Lakshmi with Mommath Khan kind of art?

Ramu S said...

Dear sir,
Thanks for the enlightening comment. Let me be frank with you, really I couldn't understand anything in such paintings. Please don't be mistaken it with sarcasm or arrogance.

I don't have any issues with your argument. But, sir, since our country had a serious rift between two communities due to historical factors, writers and artistes on both the sides should take utmost care while producing their works. I know it is unfortunate. In fact no common man is bothered about nude pictures of any god or goddess, but the saffron brigade is there to cash in on it for obvious reasons.
Who cares the meaning of the slokas or subrabhatams? No body understands it but many of them by-hearts it. Logic is not going to work in our country sir. We all should be careful in discharging our duties and we all should scrupulously keep in mind the communal consequences of our works. We are in the dark age, we should follow the dharma of this age. No government can control any religious organisation from flaring up communal frenzy. What could you do when free-thinker Tasleema Nasreen was attacked in Press Club in the heart of the city? Who could stop mobs from attacking journalists in Maharastra? A handful of people are taking the system for a ride. They scare you. since we don't have guts to take on them, the best sutra is...maintain constraint (for the larger interest of the society).
Since there is no government, you should protect your skin by controlling your artistic zeal and emotions. It may sound ridiculous but its a bitter truth. As a journalist, my mission is to bring out truth. Can you provide me protection, if I really present you the naked truth in this rotten system? As a good citizen, you can expect me to give you 'the truth' and you should believe that what I give you is "the truth." Its all about compromise and that's what I except from Mr.Hussain or Ms.Tasleema.


My point is that all this masala cine wallahs are also arguing that they are producing artistic nudity. They wiped out the thin line between artistic nudity and vulgarity.
I am more than happy if Mr.Hussain comes back to India to lead a happy life. I think I've gone haywire.
thanks
Ramu

sat said...

no doubt communist RVR commented here

Saahitya Abhimaani said...

మీ బ్లాగులో అనామికలు ఎక్కువయ్యి పోయారు. ఒక సారి మీరు పోలసీ నిర్ణయం తీసుకోవాలిసిన అవసరం ఉన్నది, ఊరూ పేరూ లేని వ్యాఖ్యలు వెయ్యాలా వద్దా అని.

Anonymous said...

శివ గారి దౌర్జన్యం నశించాలి. అనామికల గొంతు నొక్క రాదు. మేం చెత్త రాస్తే ఎడిట్ చేయడానికి రాము ఉన్నారు. అనామికలను అడ్డుకోవాలనడం రాము గారి విచక్షణ శక్తిని శంకించడమే. ఆయన బ్లాగ్ మీద శివగారు పెత్తనం చేయడమే. మాకు తిక్క లేసిందంటే శివ గారికి వ్యతిరేకంగా జాక్ పెడతాం. కర్ణాటక మానవ హక్కుల సంఘానికి పిటిషన్ ఇస్తాం. (ఏ టీవీ వాళ్ళయినా మేం స్పందించాలని అనుకున్నపుడల్లా బైట్ తీసుకుంటానంటే నామికలుగా మారడానికి అభ్యంతరం లేదు).

అనామకుడు.

Vinay Datta said...

I'm really shocked by the explaination given by the so called anonymous quoting various stotrama and slokams. More shcking is Mr Ramu supporting this Pedda Manishi.

Adi Sankara is the child of the mother, a realised soul. He had described what he had seen through his Tapas. Nobody taught him all that anatomy. And remember that no painter or artist depicted all that in pictures till now because they know very well that it is not for the commons. The Anonymous Pedda Manishi should realise that M F Hussain is not elevated to the kind of art that depicts Divine Nudity. If he had, he'd have humbly apologized and stayed back. How can anybody compare a common mortal's work to that of Adi Sankara's ? People threatened Hussain. If it was a Hindu, they would have thrown slippers on him.

Ramu S said...

నేను సమర్ధించడం కాదండీ బాబూ...
'భావ ప్రకటన స్వేచ్ఛ' అని అందరం రెచ్చిపోకూడదు, కాస్త పరిణామాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకుని బాధ్యతతో ఉండాలని అంటున్నాను అంతే. దీన్ని కొందరు 'జాగ్రత్త పడడం' ఆంటే కొందరు 'రాజీ పడడం' అనుకుంటారు. నాకు ఈ ఆర్ట్లు, ఆదిశంకరులు తెలియవు. మీరు మీరు తేల్చుకోండి. కాస్త లాజిక్ తో ముందుకు పోదాం.
రాము

chakri said...

అది శంకాచార్యులు అప్పుడెప్పుడో తాతల కాలం నాడు రాస్తే రాసాడేమో.. ప్రస్తుత పరిస్తితి వేరు. సమాజం మీద భాద్యత ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. కతార్ లో ఉన్నా అని చెప్పాల్సిన అవసరం కుడా లేదు. ఎక్కడున్నా మాకొచ్చిన ఇబ్బంది ఏమి లేదు..
ఇక నిత్యానందుడు చేసిన తప్పేమీ లేదు. పడకటింట్లో కెమెరాలు పెడితే ఎవడైనా అంతే.
మనం ముందు బాబాలని నమ్మటం మానుకుని, వాళ్ళు మామూలు తుచ్ఛ మానవులని, వాళ్ళకి కామ క్రోదః మద మత్యరాలు ఉంటాయని తెలుసుకుంటే మంచిది.

Nrahamthulla said...

@శరత్ 'కాలమ్'
ఇస్లాంలో సంగీతం,చిత్రలేఖనం,నాట్యం,జూదం,కవిత్వం,వడ్డీ ,దర్గాలు లాంటివన్నీ నిషిద్ధమే.అయినా వీటన్నిటిలో ప్రావీణ్యత పొందిన ముస్లిములున్నారు.అల్లా నిరాకారి కాబట్టి బొమ్మ గీయలేకపోయారు.ముహమ్మదు గారిని అవమానించేలా బొమ్మ గీసినందుకే గొడవలు జరిగాయి.పదిమంది గౌరవించే వ్యక్తిని కించపరిచే హుసేనుకైనా ఎవరికైనా అభిమానులనుండి ప్రతిఘటన సహజం.

WitReal said...

Religion asks you to close your eyes & follow.

philosophy asks you to open your eyes & question.

now, historically there were two problems with this for the mankind

1. when philosophy wide opens the eys ;) instead of slightly opening.

This used to happen in the early history of all religions & thus new schools of thoughts emerged.

ex: In Hindu religion: upanishads, buddism, jainism etc..

This for sure is a good result.

2. The second problem occured when a sect "closes its eyes & follows" its religion.... and at the sametime "ridicules & questions" other sect's practices

This is what lead to zingoistic mideaveal wars.

This is what led the white christians call some others as 'pagans'

This is what MF Hussain did

This is what the annonymous did while citing Shankara above

This is what Nrahamthulla said in his first comment, when he cited hanuman kavach, vignanam & agnanam etc........and preferred NOT to talk abt Hizb, madrasas etc

This 2nd problem is the real problem for the mankind.

It is better to leave each religion to reform itself.


piece.

....a sermon to start the day...yawn.....

Nrahamthulla said...

@ WitReal
I have not preferred NOT to talk abt Hizb, madrasas etc.The more you talk the more reasons come out.

WitReal said...

@ Nrahamthulla

Read my statement in the entirety of my argument.

0. some ppl have superstitions. they follow hanuman kavach & 100 other things
1. you dont believe in that
2. you prposed that such practices be banned.

Now go back & read my second point in my previous comment

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి