Wednesday, March 3, 2010

తిరిగి N-TV గూటికి చేరుతున్న 'సాక్షి' సీనియర్లు

N-TV నుంచి వివిధ కారణాల వల్ల 'సాక్షి' ఛానల్ లో చేరిన కనీసం నలుగురు సీనియర్లు తిరిగి సొంత గూటికి చేరుకోబోతున్నారు. వారిలో 'సాక్షి' ఇన్ పుట్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఒకప్పుడు చౌదరి గారి ఛానల్ లో తారలా వెలిగిన రెహానా, క్రైం రిపోర్టర్ రమేష్ వైట్ల, సెక్రటేరియట్ విలేకరి శ్రీకాంత్ ఉన్నారు.

వీరిలో రమేష్ బుధవారం నాడు అప్పాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారని సమాచారం. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో 'సాక్షి' లో చేరిన నేమాని భాస్కర్ N-TV లో బ్యూరో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. వై.ఎస్.పోవడం, స్వప్న బలం పెరగడం తో నేమానితో పాటు మరికొందరు తట్టుకోలేక పోతున్నారని తెలుస్తోంది.

ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ లో ఉన్న మూర్తి కూడా సొంత గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఛానల్ మంచిగా ఎదుగుతున్న తరుణంలో మంచి టీం ను పోగొట్టుకున్న నరేంద్ర చౌదరి ఇప్పటి ఛానల్ దుస్థితికి కారణాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. రాజశేఖర్ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము కావడంతో తన పాత టీం ను తెచ్చుకోవడం బెటర్ అని చౌదరి భావిస్తున్నారని అంటున్నారు. 

ఇప్పటికే కొమ్మినేని, శాస్త్రి, శ్రీ రామ్, రాజశేఖర్, రఘు బాబు వంటి మహామహులు ఈ ఛానల్ లో కీలక భూమిక పోషిస్తున్నారు. మూర్తి లాంటి వాళ్ళు ఈ టీంలో ఇమడడం కష్టం. ఈ ప్రముఖులను అందర్నీ అంతేసి డబ్బు పెట్టి చౌదరి ఉంచుకుంటారా? లేక కొదరికి పొగబెట్టి పంపుతారా? అన్న దానిపై  ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతున్నది.  ఎలాంటి వారినైనా...అవసరానికి హడావుడిగా తీసుకుని...అర్ధంతరంగా పంపడం మంచిది కాదని...సీనియర్లకు పొగపెట్టడం ఘోర తప్పిదమని చౌదరి బృందం తెలుసుకుంటే మంచిది.

'సాక్షి'లో చేరిన బలరాం

HM-TV కి కొత్త ఢిల్లీ ప్రతినిధిగా ఉన్న బలరాం 'సాక్షి' వార్తాపత్రికలో చేరారని దేశ రాజధాని నుంచి అందిన సమాచారం. అప్పట్లో 'ది హిందూ' నుంచి 'సాక్షి' పత్రిక లో చేరిన చంద్రకాంత్ దగ్గర బలరాం పనిచేస్తారట. 

3 comments:

Anonymous said...

It looks the journalists of news channels and news papers have forgotten an old proverb of their school and college days A ROLLING STONE GATHERS NO MASS.As it is an undisputed fact that the journalists of today's media have totally lost the track of proffessional,ethical,moral and human values and are after status,zeal to earn more and more money within a short period and think of starting a news channel,tabloid,magazine or newspaper of their own.The journalists are derailed resulting in abrupt stop to their journey and ultimately going back to parent organisation and institution which made them to learn ABCD of the journalism.To be frank by leaving the parent organisation for more bank balance,properties they had injured the hand which fed them food during their early period of their proffession.It is true one has to go higher up for more knowledge,experience,more earnings with promotions but there is a dignified and ethical way to it which is not in the minds of our jpournalist friends.

JP.

Anonymous said...

For Rajasekhar, who was in TV9 earlier, politics are better than anything else. He is not fit to be a journalist because he is zero in ethics.

Anonymous said...

Swapna is very talented. She is one of the best moderator and presenter even during a crisis. Inspite of learning to grow up, people give way to jealousy and leave.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి