Monday, June 14, 2010

నేతల విగ్రహాల ధ్వంసంపై మీడియా ఇంత హడావుడి చేయాలా?

ఈ రోజు 'ఈనాడు' పేపర్ లో ఐదో పేజీలో...'ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం' అన్న శీర్షికతో ఒక వార్త వచ్చింది. ఆరు లైన్లతో ఉన్న రెండు కాలమ్స్ వార్త అది. దాదాపు ఆరు సెంటీమీటర్ల పొడవైన ఫోటో కూడా వాడారు. ఎన్టీఅర్ విగ్రహం చేతి వేళ్ళు మూడు తొలగించిన దృశ్యాన్ని ఎర్రటి సర్కిల్ లో చూపారు. 

"దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఅర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం మాచారంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పోచయ్య, రామకిష్టయ్య, శేకయ్య విగ్రహం ధ్వంసం చేసి పారిపోయారని గ్రామస్థులు చెప్పారు. ఆదివారం రాత్రి నిందితులను ముగ్గురినీ అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు." --ఇందండీ వార్త. 

మొన్నీ మధ్య అదేదో ఊళ్ళో గాంధీ గారి మెడలో ఎవడో చెప్పుల దండ వేశాడట. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి ఎవడో నల్ల రంగు పూసినట్లు వచ్చిన వార్త కూడా చదివాను. ఈ మధ్య కాలంలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు చాలాచోట్ల ఇలాంటి దాడికి గురయ్యాయి. అసలు ఇలాంటి సంఘటనలకు ...ఏదో కొంపలు మునిగినట్లు పేపర్లు, ఛానెల్స్ ప్రాముఖ్యం ఇవ్వాలా?
గాంధీ గారి విషయంలో అయితే ఛానెల్స్ పిచ్చెక్కినట్లు రోజంతా చూపి...నానా హడావుడి చేస్తాయి. ఇలాంటి విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు ఏమి జరుగుతుందో చూడండి.

ఎవడో...తాగుబోతో, ఉన్మాదో, తిక్కలోడో...కావాలని కసితోనో, మత్తు మీదనో ఇలా కనిపించిన విగ్రహాన్ని 'ధ్వంసం' చేస్తాడు. విగ్రహంలో ఒకటి రెండు వేళ్ళు తొలగిస్తేనో, ముక్కు చెక్కేస్తోనో మన లోకల్ విలేకరి మిత్రులు వెంటనే...రంగంలోకి దిగుతారు. ఫోటోలు తీస్తారు. అది పొట్టి శ్రీరాములు గారిదైతే....కుల ప్రాతిపదికన...లోకల్ వ్యాపారులు కొందరు కుల సంఘం తరఫున రంగప్రవేశం చేయడం చాలా చోట్ల నేను చూశాను. గాంధీ గారిదైతే....కాంగ్రెస్ వాళ్ళు, సమర యోధులు అక్కడ చేరుకుంటారు. 


బతికున్న జనం మీద (ముఖ్యంగా ఒంటరిగా తిరిగే ఆడ పిల్లల మీద) దాడులు జరుగుతుంటే...పెద్దగా మాట్లాడని జనం....ప్రాణంలేని రాతి విగ్రహాలు 'ధ్వంసం' అయ్యేసరికి పొలో మంటూ అక్కడికి చేరుకుంటారు. నిరసన తెలిపి, ఒక ఇరవై లీటర్ల పాలు తెప్పించి...పాలాభిషేకం చేస్తారు, ఆ విగ్రహాన్ని పూల దండలతో ముఖం కూడా కనిపించనంతగా ముంచేస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహం మొహం ఒక్కడైనా చూడడు. 

మొత్తం మీద మన విలేకరి మిత్రులకు మూడు వార్తలు దొరికాయి--ఇలాంటి ఒక ఘటనతో. మొదటి రోజు--విగ్రహం ధ్వంసం. రెండో రోజు--నిరసన. మూడో రోజు--అభిషేకం, దండలు. నా మీద దయతలిచి పోనీలే...అని ఎవరైనా ప్రధాన మంత్రి పదవి ఇస్తే....ఈ విగ్రహాల విషయంలో నా ప్రోగ్రాం ఇలా వుంటుంది.


1) ఇక మీదట ఎక్కడా ఎవరి విగ్రహాలూ ఆవిష్కరించకూడదు. ఈ రూల్ ఉల్లంఘిస్తే....ఐదేళ్ళు జైలుకు పోతారు.
2) ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే....వారు కొన్ని నిబంధనలు పాటించాలి. ఆ వూళ్ళో ఒక వెయ్యి వేప చెట్లు ఉండడం...వేస్ట్ మానేజ్మెంట్ వ్యవస్థ ఉండడం...వంటి పర్యావరణ సంబంధ నిబంధనలవి.
3) ఊరికి రెండు విగ్రహాలకు మించి ఉండకూడదు. ప్రస్తుతం ఊళ్ళో...ఒక పది  విగ్రహాలు వుంటే...అందులో రెండింటిని ఎంచుకోవడానికి స్థానికంగా రిఫరండం నిర్వహించి....మిగిలిన విగ్రహాలను రాత్రికి రాత్రి పొక్లైన్ తో కూల్చిపారేస్తాం.
4) సారా తాగని ఊళ్ళో మాత్రమే గాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఊళ్ళో పది వైన్ షాప్స్, మరొక నలభై బెల్టు షాప్స్ వుంటే...అక్కడ ఉన్న గాంధీ విగ్రహాన్ని వెంటనే కూల్చిపారేయడమే. గాంధీ విగ్రహం కావాలా? మందు కావాలా? గ్రామస్థులే తేల్చుకోవాలి.
5) అంటరానితనం, రెండు గ్లాసుల పధ్ధతి, దళితుల దేవాలయ ప్రవేశ నిషిద్ధం అమల్లో ఉన్న గ్రామాలలో గాంధీ, వై.ఎస్. సహా అన్ని విగ్రహాలను కూల్చేయడమే. ఈ మహానుభావులు చెప్పినది పాటించకుండా విగ్రహాలు ఎందుకండీ?

6) కార్పోరేటర్స్, ఎం.ఎల్.ఏ.ల విగ్రహాలు తీసిపారేయ్యడమే.
7) ఏదో విగ్రహాన్ని ఎవడో తలమాసినోడు 'ధ్వంసం' చేస్తే...అది పత్రికలు/ఛానెల్స్ వార్తగా వేయకూడదు. ఈ అనవసరమైన సమాచారం చేరవేసి...ఇతర ప్రాంతాల వారిలో అపోహలు కలిగించినందుకు గానూ ఆ వార్త రాసిన సారును, వేసిన సారును అరెస్టు చేస్తారు.
8) నేతల జయంతులు, వర్ధంతుల నాడు...నివాళి అర్పించి, దండ వేసి...ప్రెస్ కోసం నేతలు ఫోటోలు దిగాలి కాబట్టి జిల్లా కేంద్రం లో మాత్రం కొన్ని విగ్రహాలు ఉంచుతాం. అన్ని ఊళ్లలో, గల్లీలలో ఈ సభలు వుండవు, నివాళి అర్పించాలి...అనుకున్న వాళ్ళు ఒక్క చోట చేరి నివాళి అర్పించాలి.

అదీ సంగతి. నిజమైన నేతలు....జన హృదయాలలో ఉంటారు. ఇలా నచ్చినోడి విగ్రహమల్లా పెడుతూ పోవడం దండగ. ఎంతమంది....నిజంగా ఈ విగ్రహాలను చూసి స్ఫూర్తి పొందుతున్నారు? 


నన్నడిగితే---"మీరు బస్టాండ్ బైటికి రండి. లెఫ్ట్ లో డైరెక్ట్ గా వస్తే....రాజీవ్ విగ్రం వస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నేరుగా వస్తే....ఎన్టీఆర్ విగ్రహం దాటాక గాంధీ విగ్రహం వస్తుంది..." అని లాండ్ మార్క్స్ గా చెప్పుకోవడానికి తప్ప ఈ విగ్రహాలతో నయా పైసా ఉపయోగం ఉందా? అన్నది అంతు చిక్కని ప్రశ్న.

15 comments:

VENKATA SUBA RAO KAVURI said...

నాకు బాగా తెలుసు, పుచ్చలపల్లి సుందరయ్య చనిపోయినప్పుడు విగ్రహం పెడతామంటూ సీపీయంకు వేలాది విగ్నప్తులు అందాయి. అయితే మూడింటికే అనుమతి ఇచ్చి, అనుమతి లేకుండా యెక్కడా విగ్రహాలు పెట్ట వద్దని ఆ పార్టీ విగ్నప్తి చేసింది. నెల్లూరు, విజయవాడ, గన్నవరంలో మాత్రమే ఆయన విగ్రహాలు వున్నాయి. హైదరాబాదు సుందరయ్య పార్కులో మాత్రం ప్రభుత్యం ఏర్పాటు చేసింది. ఇతరుల విగ్రహాల యేర్పాటుకు ప్రభుత్యం ఇలాగే నిర్ణయం తీసుకోవచ్చు.
వెంకట సుబ్బారావు కావూరి

చిలమకూరు విజయమోహన్ said...

విగ్రహాలతో నయా పైసా ఉపయోగం ఉందా?
ఉందండి పట్టణాలలో ఎలాగూ చెట్లుండవు కాబట్టి పక్షులకు కూర్చునేటందుకైనా పనికివస్తాయికదా!

Sudhakar said...

ఈ మధ్యనే మా వూర్లో ఏడు రోడ్లు కలిసే చోట వున్న సిగ్నల్స్ అన్నీ తీసేసి ఆ స్థానం లో వై యస్ ఆర్ విగ్రహాన్ని ముసుగేసి నిల్చోపెట్టారు. ఆ విగ్రహపు పుత్రులుంగారు వచ్చి ఆవిష్కరించటానికి.ఒళ్ళు మండుతుంది. కానీ ఎం చేస్తాం. వేళ్ళు, కాళ్ళు టైం దొరికినప్పుడు విరిచెయ్యటం తప్ప. ఈ వోదార్పు ముసుగులో ఒక ఏభై విగ్రహాలు జమేసుకోవచ్చు.

Saahitya Abhimaani said...

".........గ్రామాలలో గాంధీ, వై.ఎస్. సహా అన్ని విగ్రహాలను కూల్చేయడమే. ఈ మహానుభావులు చెప్పినది పాటించకుండా విగ్రహాలు ఎందుకండీ....." వై ఎస్, గాంధీకి సమానమైన మహానుభావుడా!!???

ఇక విషయానికి వస్తే, విగ్రహాలు ఎందుకు పెట్టాలి. ఒక మనిషి మరణించినాక, ఆ మనిషిని, ఆ మనిషి చేసిన మంచి పనులు గుర్తుఉంచుకోవటానికి విగ్రాహాలే పెట్టాలా? ఇంక అంతకంటే మరొక మార్గం లేదా. వేలంవెర్రిగా రోడ్లనిండా విగ్రహాలు పెట్టటం ఈ మధ్య మరీ ఎక్కువయ్యింది.వీటిల్లో చాలా భాగం, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇష్టాఅయిష్టాలను పట్టించుకోకుండా పెట్టినవే! ఈ విగ్రహాలు పెట్టటం తప్పనిసరిగా నియంత్రించాలి, ఎంతటి గొప్ప నాయకుడైనా చావకుండా ఉండడు. ఇలా చచ్చిన నాయకుడికల్లా విగ్రహాలు పెట్టుకుంటూ పోతే కొన్నాళ్ళకు ఈ సిమెంటు, రాతి, లోహ విగ్రహాల మధ్య దారి చూసుకుని నడవాల్సిన పరిస్థితి వస్తుంది.

మీరు వ్రాసిన సూచనలు బాగున్నాయి. కాని, ఆచరించేది ఎవ్వరు? మన కంఠశోష తప్ప!

Vinay Datta said...

When you have staues, you also have sentiments. We should respect the respect of people towards their leaders.

But not only statues...the concept of samadhis has also been bothering me for a long time. Hundreds of acres of open land is allocated for samadhis. There were, are, will be many great people.If the government and individuals continue burying them in places other than public crematoriums, the entire country turns into a burial ground very soon.

After thinking toooo much about these two issues, I could take one strong decision.

If,
suppose,
let's presume,
let's hope,
just imagine...

I rise to a stage where people consider me 'great', I'll write a will stating that the last rights to my body should be done in a common burial ground and no statues and big size portraits of mine should be placed anywhere.

After all, I can decise only about myself.


Vijayamohan garu ...great perception.

WitReal said...

You put it very nicely.

I liked it this time, when you spared bosses & said "మన లోకల్ విలేకరి మిత్రులు వెంటనే...రంగంలోకి దిగుతారు" ;)

On a serious note, along with those 8 points, you could have advised our journalists on what way they shoud address these kind of news items in future.

A K Sastry said...

డియర్ రాము!

నేనైతే, వెంటనే దేశం లోని అందరి నాయకుల విగ్రహాలనీ ధ్వంసం చెయ్యమనేవాడిని!

ఇదివరకే నా బ్లాగులో విజవాడ ఆంధ్ర పత్రిక సెంటర్లో నీలం సంజీవరెడ్డి విగ్రహం ధ్వంసం గురించి కూడా వ్రాసి, మన ప్రభుత్వం ఆ పని చేస్తే బాగుండునని వ్రాశాను.

అంతే కాదు….మీకు చేతనైతే, ‘గ్రాండ్ కేన్యాన్’ లెవెల్లోనో, ‘బమియాన్ బుధ్ధ విగ్రహాల’ లెవల్లోనో యెక్కడో కొండలమీద చెక్కించుకోండి అని కూడా ఓ చట్టం చేస్తే, ఇంకాబాగుండును!

kvramana said...

there are certain rules for setting up of these statues. but, it is the ruling party that decides. for instance, in secunderabad area there is a statue of one cabinet minister's mother. one newspaper tried to question the logic behind setting up of the statue and the minister quickly played the caste card and almost the threatened the newspaper with dire consequences. the minister had also sent a team of caste men to speak to the editor. there is nothing new in the statue politics but it has crossed all the reasonable limits.
ramana

kvramana said...

there are certain rules for setting up of these statues. but, it is the ruling party that decides. for instance, in secunderabad area there is a statue of one cabinet minister's mother. one newspaper tried to question the logic behind setting up of the statue and the minister quickly played the caste card and almost the threatened the newspaper with dire consequences. the minister had also sent a team of caste men to speak to the editor. there is nothing new in the statue politics but it has crossed all the reasonable limits.
ramana

డి.వి.యస్.అబ్బులు said...

అద్భుతమైన విషయం పాఠకుల దృష్టిలోకి తెచ్చారు, రాముగారూ! నాకు ఈ విగ్రహాలంటే పరమరోత. అసలే దేశంలో జనసమ్మర్దం ఎక్కువయ్యి ప్రజానీకం నానా ఇబ్బందీ పడుతూంటే రెండు రోడ్లు కలిసిన ప్రతీచోటా ఏదో ఒక నాయకుడి విగ్రహమే. వాటిలో సగానికి పైగా పనికిమాలిన వెధవలవే. దానికితోడు ఎప్పుడో చచ్చిన ఈ చచ్చువెధవల విగ్రహాలకి ఎవడో ఏదో చేశాడని వాటికి లీటర్లకి లీటర్ల పాలు వృధా చేస్తూ క్షీరాభిషేకాలు. ఈ విగ్రహాలకి ఆమడ దూరంలోనే ఎంతో మంది పసివాళ్ళు సరైన పోషకాహారం లేక అల్లాడుతూ కనిపిస్తారు. నాకైతే ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. ఇలా అభిషేకం చేస్తామని ప్రకటించినప్పుడు, ఆ ఊరిలో బీద పసిపిల్లలందర్నీ పోగుచేసి ఈ విగ్రహం ముందు ధర్నా చేయించాలి. అప్పుడైనా ఏదో ఒక ఛానల్ వాడు ఈ కోణంలో వార్తని చూపించి జనాల కళ్ళు తెరిపించకపోతాడంటారా?

భవదీయుడు,
అబ్బులు

P.S.: నేను చచ్చు వెధవలు అన్నది గాంధీ గారు, లాల్ బహాదూర్ శాస్త్రి గారు, నేతాజీ గారు, అల్లూరి సీతారామరాజు గారి వంటివారిని కాదని గమనించ గలరు. కానీ, వారి విగ్రహాలను సైతం కూడళ్ళలో ప్రతిష్టించడం నేను వ్యతిరేకిస్తాను.

Ramu S said...

శివ గారూ...
వై.ఎస్.గారు గాంధీ గారి కన్నా ఎక్కువ గొప్ప...కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో. ఈ రోజు (మంగళ వారం) సాక్షి చూసారా? 'మరో బుద్ధుడు వై.ఎస్.' అని మరొక ప్రబుద్ధుడు రాసాడు. గాంధీ, సోనియా గాంధీ, వై.ఎస్., జగన్ అంతా...మహానుభావులే మరి.
రాము

Unknown said...

we have the culture of idol worship. As long as it is limited to only the gods its ok. But when and how did the culture of idolizing the humans start. It was prevalent in the british raj. Not the idols, but we worshipped the fairer skinned britishers like gods. Now we want to worship ppl who are dead. Something wrong with our Indian psyche.

Anonymous said...

రాము గారు నాదో ఉచిత సలహా.
ఇలా అన్ని రూల్స్ పెడితే ఎవరూ పాటించరు కాని, ఒకే ఒక్క రూల్ పెట్టవచ్చు.
ఎవరు విగ్రహాలు పెట్టుకోవాలన్నా, వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసుల్లోనో, ఇళ్ళలోనో, ఇంకేదైనా ప్రైవేట్ స్థలంలోనో పెట్టుకోవచ్చు.
కాని పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం పెట్టకూడదు.
ఇలా అయితే వాటిని ఎవరూ ధ్వంసం చేయలేరు.
(అలాగే జెండా స్థంభాలు కూడా)


అలాగే గాంధీగారి విగ్రహాలు కూడా స్కూళ్ళలోనో, ప్రభుత్వ కార్యాలయ ఆవరణలోనో మాత్రమే ఉండాలి.
రోడ్లమీద ఉన్న విగ్రహాలన్ని ఎవరివైనా సరే తొలగించాలి.

Anonymous said...

u came up wid a very gud issue sir!! I wonder why these party ppl waste so much milk for lifeless statues...instead they can feed the poor ppl...babies who r starving to death...

"చెప్పేటందుకే నీతులు" అని ఊరికే చెప్పలేదు కదా మన పెద్దలు!! ఆ విగ్రహాల మీద శ్రద్ధ కేవలం ఏదయినా వివాదం వచ్చినప్పుడు లేకపోతే ఏ వెధవో వాటిని విరగ్గోట్టినప్పుడే...మాములుగా అయితే వాటిని ఒక్క పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు...!! మహాత్మా సినిమా చూసారు గ...ఆ సినిమాలో గాంధిగారి విగ్రహాన్ని మన రాజకీయాలు ఎలా వాడుకున్తాయో చక్కగా చూపించారు...!! అంతే ఎక్కడయినా...!! విగ్రహం పాడు అయితే రచ్చ చేస్తారు...మరి నాసి రకం కట్టడాల వల్ల ఎంత మంది నష్టపోతున్నారు?? పురాతన దేవాలయాలు కళ్ళ ముందే నాశనం అవుతున్న ఏ మహానుభావుడు పట్టించుకున్తున్నాడు???


గాంధి గారి విగ్రహం అయినా అంబేద్కర్ విగ్రహం అయినా...రాజకీయాలకు...కుల మత వర్గ రాజకీయాలకు తప్ప...పది మందికి స్ఫూర్తి ఇచ్చేటందుకు పనికి రావు సర్!! ఇది నిజం!!

పానీపూరి123 said...

http://epaper.sakshi.com/Details.aspx?id=490674&boxid=28728360

may be for that reason?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి