Tuesday, June 15, 2010

రాజమహేంద్రి...టేబుల్ టెన్నిస్...భాస్కర్ రామ్....

వేదంలా ఘోషించే గోదావరీ...
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ....
శతాబ్దాల చరితగల సుందరనగరం.....

 'ఆంధ్రకేసరి' సినిమాలోని ఈ పాట...ఎప్పుడు రాజమండ్రి పొలిమేరల్లోకి వెళ్ళినా చెవుల్లో అప్రయత్నంగా మార్మోగుతుంది. శుక్రవారం ఉదయం...రాజమండ్రిలో అడుగుపెట్టగానే...మళ్ళీ అదే భావన కలిగింది. తెలుగు నేల మీద రాజమహేంద్రవరం ప్రాముఖ్యం, ప్రాభవం, గతవైభవ దీప్తులు...గుర్తుకు వచ్చాయి. 

టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొన్న నా పదేళ్ళ పుత్రుడికి తోడుగా వెళ్లి, మూడు రోజులు ఉండి, పలు వీధులు తిరిగాక అనిపించింది...ఈ ఊళ్ళో ఏదో ప్రత్యేకత ఉందని. ముఖ్యంగా అక్కడి ఆటో డ్రైవర్స్ నాకు బాగా నచ్చారు. వారు ఎంతో కలివిడిగా...ప్రేమతో మాట్లాడడం...అడిగిన ప్రతి ప్రశ్నకు విసుగు లేకుండా సమాధానం చెప్పడం గమనించాను. ఇక సొంత ఖర్చులతో ఆ టోర్నమెంట్ నిర్వహించిన క్రీడాప్రియులను చూస్తే ఇంకా ముచ్చటేసింది.

తమ ఎదుగుదలకు తోడ్పడిన రంగం ఋణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకునే వారు అరుదుగా కనిపిస్తారు. రాజమండ్రి ఎందరో టీ.టీ.క్రీడాకారులను తయారుచేసింది. ఈ ఆట వల్లనే అక్కడ చాలా మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. గత ఐదేళ్లుగా జాతీయ ఛాంపియన్ గా ఉన్న ఆచంట శరత్ కమల్ కుటుంబం కూడా ఇక్కడి నుంచి చెన్నై వలస వెళ్ళింది. శరత్ తండ్రి శ్రీనివాసరావు, బాబాయ్ (చిన్నాన్న) మురళి గారు ఈ క్రీడ వల్లనే జీవితంలో స్థిరపడి...తమ అకాడమీ లో అక్కడ ఆణిముత్యాలను తయారు చేస్తున్నారు.

నేను గత ఇరవై ఏళ్ళలో ఎన్నో టోర్నమెంట్లు కవర్ చేశాను, చూశాను....కానీ ఇంత అద్భుతంగా...ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం మొదటి సారి చూశాను రాజమండ్రిలో. అక్కడి టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, క్రీడాభిమానులు దాదాపు వారం పది రోజులు శ్రమించి రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చిన 400 మంది ఆటగాళ్ళు, అంపైర్లకు ఆతిథ్యమిచ్చారు. ఆర్గనైజర్స్ లో ఉన్న టీం స్పిరిట్ చూస్తే...ఆనందం అనిపించింది. టౌన్ హాల్ లో ఆడే ఆటగాళ్ళు, తమ పిల్లలను అక్కడ ఆడిస్తున్న వారు...మన పని అనుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదరించారు. మనకేమి దురద...అనుకోకుండా....ఇంకా పెద్ద స్థాయి పోటీలను నిర్వహించడానికి తాము సిద్ధం అని వారు ప్రకటించారు.

నిర్వాహకులు అందరికీ...మంచి వసతి, భోజన సౌకర్యం కల్పించారు. కొన్ని చోట్ల ఆర్గనైజర్స్ పిల్లలకు మంచి నీళ్ళైనా ఏర్పాటు చేయరు. అలాంటిది...వీరు పిల్లలకు హార్లిక్స్, వేసవి తాపం తట్టుకోవడానికి శీతల పానీయాలు ఉచితంగా అందజేశారు. పేపర్ మిల్ల్స్ లో నిర్వహించిన ఈ పోటీలలో విజేతలకు భారీ స్థాయిలో నగదు బహుమతులు ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన క్రీడాకారులకు కూడా ఒక షీల్డు, క్యాష్ బహుమతి ఇచ్చారు. మెన్స్ విభాగం లో విజేత సోమ నాథ్ ఘోష్ కు....పది వేల రూపాయల ప్రైజ్ ఇవ్వడం విశేషం. సోమ నాథ్ ఘోష్ (రైల్వేస్), కృష్ణకిరీటి (పోస్టల్) మధ్య ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ పోటీ జీవితంలో చాలా రోజులు గుర్తు ఉంటుంది.
క్యాడెట్ బాయెస్ సెమీ ఫైనల్స్ కు చేరిన మా ఫిదెల్ కు ఒక ప్రైజు, ఒక వెయ్యి రూపాయల బహుమతి వచ్చాయి. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు గానీ...ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న నిర్వాహకుల భావన అభినందనీయమైనది. 

బహుమతి ప్రదానం చేసిన స్థానిక ఎం.పీ.ఉండవల్లి అరుణ్ కుమార్ క్లుప్తంగా చేసిన తన ప్రసంగంలో...పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ ఒక రెండు ముక్కలు చెప్పడం విశేషం. దేశం కోసం ఏదో చేయాలన్న తపనతో....పిల్లలను ఇలాంటి ఆటల్లో పెట్టి...ఎలాగైనా బాగా ఆడించాలనుకునే తల్లిదండ్రుల బాధలు, వేదనల గురించి మనం పుంఖానుపుంఖంగా రాసుకోవచ్చు. ఇక...ఈ టోర్నమెంట్ లో ఒక వ్యక్తి గురించి తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఆయనే...వి.భాస్కర్ రామ్ గారు.

బాస్కర్ రామ్ గారు స్థానికంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు. సాధారణంగా టోర్నమెంట్ అంటే...నిర్వాహకులు చీకాకుగా వుండి....హడావుడి పడుతూ...అందుబాటులో లోకువగా ఉన్నవారిని తిట్టి బీ.పీ.పెంచుకుంటూ ఉంటారు. దానికి భిన్నంగా...భాస్కర్ రామ్ గారు ఎప్పుడూ ప్రశాంతంగా...నవ్వుతూ కనిపించారు. అదే స్థాయిలో కూల్ గా ఉండే...టీ.టీ.అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఎం.సుల్తాన్ గారు నాకు రామ్ గారిని పరిచయం చేశారు. అప్పుడు తెలిసింది...లోకల్ గా CCC అనే ఛానల్ ను రామ్ బృందం నిర్వహిస్తున్నదని.

మీడియాలో పరిస్ధితులు, 'ది హిందూ'లో కూడా పడిపోతున్న విలువలు, ఛానెల్స్ మధ్య పోటీ...వంటి అంశాల గురించి రామ్ వివరించారు. తాను ఇప్పటికీ...అభిమానించే పత్రిక 'ది హిందూ' అని ఆయన చెప్పారు. భాస్కర్ రామ్ తన చేతి నుంచి ఈ టోర్నమెంట్ కోసం చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు. లేకపోతే ఇంత ఘనంగా నిర్వహించడం సాధ్యంకాదు. ఇప్పుడు మన క్రీడారంగానికి కావలసింది...ఇలాంటి క్రీడాపోషకులే.
(నోట్: సినీ తారల క్రికెట్ సందడి, ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల వల్ల ఈ టోర్నమెంట్ కు ప్రెస్ లో సరైన ప్రాధాన్యం లభించలేదని భావించి...ఇక్కడ పోస్ట్ గా ఇస్తున్నాను. మీడియా సంబంధం కాని దాని గురించి ఎందుకు రాశావ్....అని అడగవద్దని మనవి.) 

21 comments:

DesiApps said...

chala bagundi

Saahitya Abhimaani said...

భాస్కర్ రాం గారి ఫోటో, ఆటల పోటీకి సంబంధించిన ఒకటి రెండు ఫోటోలు కూడా వ్యాసంలో జతపరిస్తే సంపూర్ణమవుతుంది.

మన మీడియా ఇటువంటి క్రీడా స్పూర్తిని ప్రతిబింబించే ఆటల పోటీలు కాదని, పూర్తిగా వ్యాపార సరళిలో జరిగే పోటీలకే ప్రాధాన్యత ఇవ్వటం శోచనీయం.

Anonymous said...

భాస్కర రాంగారితో, నేను రాజమండ్రీ లో ఉన్నప్పుడు పరిచయం అయ్యింది. త్యాగరాజ సంగీతోత్సవాలు, పది రోజులపాటు నిర్వహించే సమయంలో.ఈ ఉత్సవాలు నిర్వహించే పధ్ధతి చూడాలి మీరు. మా బాల్కనీ లోంచి కని వినిపించేవి. ప్రతీ రోజూ అక్కడ ప్రక్కనే కడుతున్న కమ్యూనిటీ హాల్ పని ప్రోగ్రెస్ చూడ్డానికి ప్రతీ రోజూ వచ్చేవారు. పెద్దలతో మాట్లాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.ఎప్పుడు కనిపించినా నవ్వుతో పలకరించడం ఆయనకే నప్పింది. అటువంటి మంచి వ్యక్తి గురించి పరిచయం చేయడం చాలా బాగుంది.

Ramu S said...

నిజమే శివ గారూ..
ఆ పని చేయాల్సింది. కానీ...నేను కెమెరా తీసుకుపోలేదు. ఇక నుంచి ఆ పని చేయాలి.

హరేఫల గారూ...
నిజమే అండీ...అయన భలే చక్కగా మాట్లాడారు. నాకు బాగా నచ్చారు. టోర్నీ విజయవంతం కావడానికి సహకరించిన వారిని అందరినీ స్టేజ్ మీదకు పిలిచి సభకు పరిచయం చేసారు.
రాము

Thirmal Reddy said...

Ramu,

I've come across these pop-ups several times. I thought, you might be using some third-party ad services. If you are not seeing the pop-ups yourself, then the issue is that you've been using the same browser repeatedly without clearing the cache/cookies/browsing history.
If you can tell the me which browser (Internet explorer/mozilla firefox/Google chrome) you are using, I will give you detailed instructions on how to see those intruding pop-ups. The third-party ad agencies that are serving ads on your website are
cpxinteractive.com
adservplus.com
metanetwork.com
media-servers.net

However, I will not be able to stop tell you how to stop these ads. You might want to check your HTML in your blogger.com account, especially the comments box HTML settings. Or you may contact any webmaster. I remember you saying in one of your post that a friend helped you design this blog. He may be of some help.

Unknown said...

Dear Mr Ramu,

You posted good content in your story which will surely enthuse lot of Organisers in the coming events.

The collective effort of the Organisers and the sense of direction the people at the helm of affairs give is very important for the success of any event let alone the Tournaments.

Thank you very much Sir !!!

nareshnunna said...

Dear Ramu,

Everything is fine.
Small correction:
పుంఖాను పుంఖాలుగా - is wrong.
పుంఖానుపుంకంగా is right.
It is an usual mistake, we generally carried away with-

naresh nunna

Vinay Datta said...

Hearty Congratulations to Bhaskar Ram garu, Sultan garu, Ramu garu (for the post), the entire team and all the parents for their efforts in making the event successfully successful.

I'm happily surprised to know that Bhaskar Ram garu also organises Tyagaraja Utsavam. Usually, sports people look down upon classical music and dance.

Cash awards are very important.Parents put in a lot of money to train their children in different activities.After the initial stages the cost involved increases phenominally. Cash awards help them support their travel expenses, buy some accessories and reinvest in the sport.

sai said...

sir,
illanti media blogs amainaa vunte chepandi plzz.

Ramu S said...

The Sunday Indian,
Nareshji
Thanks for the correction. I've carried the correction. By the way let me know the vyutpatti of this word. I've seen you this morning at ECIL cross road.

Ramu

admin said...

రాజమండ్రి లో ఉంటున్న నాకు కుడా తెలియదు. ఆటలు అయ్యాక తెలిసింది. వేరి బాడ్ అబౌట్ మీ..

Sesha said...

naresh nunna gAru,

>పుంఖాను పుంఖాలుగా - is wrong.
>పుంఖానుపుంకంగా is right.
>It is an usual mistake,
>we generally carried away with-

Dictionaries say "పుంఖానుపుంఖము" is right.
Search for పుంఖము, పుంఖితము at
http://andhrabharati.com/dictionary/index.php

Regards,
Vadapalli SeshatalpaSayee.

ramnarsimha said...

Very nice..

పానీపూరి123 said...

అలాగే ప్రతి సంవత్సరం భీమవరం లో కూడా టెన్నిస్ పోటీలు నిర్వహించేవారు, నేను కాలేజిలో ఉన్న ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని, అవి కాస్మోపాలిటిన్ క్లబ్ లో జరిగేవి. ఇప్పుడు నిర్వహిస్తున్నారో లేదో తెలియదు?

Ramu S said...

సాయి గారు,
ఇలాంటి బ్లాగ్స్ అంటే...మీడియా గురించి మాలాగా పేరు పెట్టుకుని రాసేవి నాకు కనిపించలేదు. గోడచాటున వుండి...రాళ్ళు వేసి...ఆనందించే కసబ్ జాతి బ్లాగ్స్ చాలా వున్నాయి. ఎవడైనా దమ్ము, ధైర్యంతో అడ్రెస్స్ ఇచ్చి విశ్లేషణ లేదా విమర్శ చేసేవాడు దొరుకుతాడా? అని నేను కూడా చూస్తున్నా.
రాము

WitReal said...

పుంఖము అంటే బాణం చివరి/తోక భాగం. ఒక దానివెంట ఒకటి బాణాలు వస్తుంటే అవి పుంఖానుపుంఖము ( పుంఖము + అనుపుంఖము)

something like bumper to bumper ;)

Ramu S said...

నరేష్/శేష/విత్ రియల్
అయ్యా..నా అజ్ఞానాన్ని మన్నించి...నేను 'ముంఖాను పుంఖము' అని రాయాలో..'ముంఖాను పుంకము' అని రాయాలో తేల్చండి. అసలు 'పుంఖాను పుంఖాలు' అనే మాట ఉందా? దయచేసి సమస్య పరిష్కరించగలరు. ఇప్పటికే...నేను నరేష్ గారు చెప్పిన సవరణ చేసి వున్నాను.
రాము

nareshnunna said...

dear Ramu,

I am sorry for misleading u.

>పుంఖాను పుంఖాలుగా - is wrong.
>పుంఖానుపుంకంగా is also wrong.
"పుంఖానుపుంఖంగా" is right.
Naresh

Unknown said...

Ramu,

We should thank Mr Naresh for finally resolving the issue.Thanks Mr Naresh !!!!

Unknown said...

Madhuri garu,

Nice to meet you here We conduct annual Music festival in Sri Thyagaraja Narayanadasa Seva Samithi every year. We had a wonderful festival this year from April 9th to April 24th. Dr Nithyasree Mahadevan, S.Sowmya, Kamakoti Gayathri, Seshachari & Raghavachari, Lalita & Haripriya, Nithya Santhoshini have performed here in RJY. Harikathas by Dr Muppavarapu Simhachala Sastry and Dhulipala Sivaramakrishna Sastry have performed on our stage.

Ramu S said...

Mr.Bhaskar Ram,
Thanks a ton for finding time to visit this blog. If you wish to share your thoughts on any topic, you may use this forum. Here many good people are on board.

Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి