Saturday, June 26, 2010

పశు సంతతి కోసం రైతన్నల 'ఏరొక్క పండగ'...నేడు

పల్లెలో పుట్టి...పల్లెల్లో కూడా పెరిగి...పల్లె మీద ప్రేమతో ప్రతి మూల మూలా తనవితీరా  రిపోర్టింగ్ చేసానని తృప్తిపడే నాకు...ఈ ఉదయం మెదక్ జిల్లాలో రైతులకు సంబంధించి నేను కనీవినీ ఎరుగని ఒక కొత్త పండగ ఎదురయ్యింది. ఒక అంతర్జాతీయ సర్వే టీం సభ్యుడిగా ఒక సీనియర్ ప్రొఫెసర్, ఒక డాటా అలనిస్ట్ తో కలిసి.... అక్కడ "డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ" నిర్వహిస్తున్న 'సంగం రేడియో' పల్లె జనంలో తెచ్చిన సాధికారికత భావనను అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది.

మణయ్య అనే ఒక రైతు...రిన్ సబ్బు తీసుకుని ఒక తెల్లని ఎద్దును పెద్ద నీటి తొట్టి దగ్గర శ్రద్ధతో స్నానం చేయిస్తుండగా...ఒక వేప చెట్టు కింద ఉన్న నల్ల ఎద్దు...నా వంతు ఎప్పుడు? అన్నట్లు ఎదురు చూస్తున్నది. మణయ్య చుట్టూచేరిన పిల్లమూక పరాచకాలు ఆడుతుండగా...నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాను. 
మణయ్య చెప్పిన దాని ప్రకారం---దీన్ని 'ఏరొక్క పండగ' (ఏరువాక పున్నమి) అంటారు. ఈ రోజు ప్రతి రైతు ఎద్దులను, ఆవులను బాగా నీటితో కడిగి...రంగులతో తీర్చి దిద్దుతాడు. కడిగిన ఎద్దులను, కోడెలను, ఆవులను మువ్వలు, మెడ గంటలతో అలంకరించడమే కాకుండా...కొమ్ములు మెరిసేలా వార్నిష్ వేసి ముస్తాబు చేస్తారు.  బండ్లను కూడా కడగడం పండగలో ఒక భాగం. విచిత్రంగా....బర్రెలు/గేదెలు ఈ పండగలో భాగం కాదు.

అప్పుడు అర్థమయ్యింది...రేడియో స్టేషన్లో పనిచేసే...అలుగొలు నరసమ్మ గారు పండగ వుంది...సోమారం రండి..అని చెప్పడానికి కారణమేమిటో. "సాయంత్రం తోర్నం కడ్తం. పసూలు దాటుతున్నప్పుడు...ఆ తోర్నం తెంపి అన్మాన్ చుట్టూ తిప్పుతం," అని మణయ్య బాబాయ్ నాకు చెప్పాడు. ఆ రెండు గిత్తలను కడుగుతున్నప్పుడు ఈ నాలుగెకరాల ఆసామిలో శ్రద్ధాసక్తులు దగ్గరి నుంచి చూడాల్సిందే. అన్మాన్ చుట్టూ తిప్పడమంటే...ఆ ఊర్లోని హనుమంతుడి ఆలయం దగ్గరకు తీసుకువెళ్ళి ప్రదక్షిణం చేయించడం. 

తొలకరి పడ్డాక...పశు సంతతి కోసం అంటూ...ఒక పండగ ఉండడం...విచిత్రంగా అనిపించింది. "వీటికి సొమ్ములతో సోకులు చేసి...బొబ్బట్లు, ఉల్లి వంటి ఇష్టమైన పదార్ధాలు పెడతారు. ఈ ఏరువాక పండగతో...ఉగాది తర్వాత ముగిసిన పండగల సీజన్ మొదలవుతుంది," అని నరసమ్మ గారు ఆ తర్వాత వివరించారు. ఈ పండగ సందర్భంగా...డప్పులు, మేళాలతో పిల్లా పాపా రైతులు సాయంత్రం పశువులను ఆడిస్తారట. అదొక కోలాహలం, వేడుక. ఈ పండగపై ఆమె ఒక ప్రోగ్రాం చేసి ప్రసారం కూడా  చేసారట. నన్ను నమ్మండి....మన టింగ్లిష్ యాంకర్స్ కన్నా చాలా స్వచ్ఛమైన తెలుగు తడుముకోకుండా మాట్లాడుతున్నది...పదో తరగతి మాత్రమే చదివిన నరసమ్మ. 

ఇంత మంచి ప్రత్యేకమైన పండగ...మన వైపు ఎందుకు లేదని...వచ్చాక మా నాన్నకు ఫోన్ చేసి అడిగాను. 'ఇలాంటి పండగ మహారాష్ట్ర వైపు జరుపుకుంటారని విన్నాను. మన దగ్గర ప్రభలు కడతారు, తిర్నాళ్ళకు ఎడ్లను అలంకరిస్తారు కానీ...ఇలా పండగ చేయరు,' అని ఆయన చెప్పారు. పశు సంపద బాగా ఉన్న రైతులు...తమ ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ పండగ చేస్తారని ప్రకాశం జిల్లా ఒంగోలు లో వ్యవసాయం చేయించే బంధువుల అబ్బాయి శంకర్ చెప్పాడు. సరే...మనకిది కొత్త అయినా...ఈ పండగ లగాయితూ రైతన్నలకు పాడిపంటలు సమృద్ధిగా కలగాలని ఆశిద్దాం. మీడియా మహా ప్రభువులు ఇలాంటి ప్రాక్టికల్ పండగలకు మంచి కవరేజ్ ఇచ్చి...ఈ సంస్కృతిని పది కాల పాటు బతికించాలని మనవి చేసుకుందాం. 

12 comments:

Vinay Datta said...

People will surely ridicule if media mitrulu broadcast programmes on festivals like this.I'm sure you will see such comments in your own blog.

katta jayaprakash said...

There are many such celebrations in our rural area which are being performed by our innocent and humanitarian rural brothers and sisters but unfortunately these are being branded as MOODHA NAMMAKALAU by so called intellegentia of Jana Vignana Vedika people who are in minority but get major coverage in the media.They never understand,digest and assimilate the historical Indian culture but give adverse comments hurting the people but nothing will change in the culture of the people by the cries of these so called scientific minded people as the Indian culture will be alive as long sun rises in the east.
JP.

Saahitya Abhimaani said...

I fully agree with Shri J P. Unfortunately, our media is riddled with leftists. Ownership notwithstanding, media is poisoned by leftists, who ridicule anything that is Indian heritage and strive to bring in their Chinese and Russian ideas into India.

This is quite evident from the angled reporting of political news, (to suit their political leanings) not reporting major festivals and giving undue importance and focus to minuscule of people who brand themselves as saviours of the so called innocent masses.

Only when the media is rid of this kid of political leanings, it could be called free media.

satyam said...

రాము గారూ,
చాలా కాలంగా మీ బ్లాగు చూస్తున్నాను.
మానవీయ విలువల పట్ల, ప్రజా ప్రయోజానాల పట్లా, పల్లెసీమల పట్ల, అక్షర లక్ష్యాల పట్లా మీకున్న అభిమానం, తపనా, తత్పరతా నాకు ఆనందాన్నీ, మీ పట్ల అభిమానాన్నీ పెంచుతున్నాయి. మీడియా పై వచ్చిన అన్ని బ్లాగుల కన్నా (నేను చూసినంతవరకూ) ఇది చాలా ప్రయోజనాత్మకంగా ఉంది . ఇలాగే కొనసాగించండి , మంచిని మరింతగా పెంచటానికి , చెడుపై పోరాడే చైతన్యం ఇనుమడించటానికీ .
- సత్యం , ప్రజాశక్తి.

Saahitya Abhimaani said...

"........మన టింగ్లిష్ యాంకర్స్ కన్నా చాలా స్వచ్ఛమైన తెలుగు తడుముకోకుండా మాట్లాడుతున్నది...పదో తరగతి మాత్రమే చదివిన నరసమ్మ....."

నరసమ్మ గారిని ఆ టింగ్లీషు భామలతో పోల్చకండి. ఆవిడ చక్కటి తెలుగు మాట్లాడటానికీను, లేని పోనీ షోకులతో తెలుగు ఆంగ్లము కలగలిపి మరో భాషలాంటిది చేస్తున్నవారిని పోల్చాల్సిన అవసరం లేదు. ఆ తరువాత పదో తరగతి మాత్రమె చదివిన అంటే ఏమిటి? అంతకంటే ఎక్కువ చదివితే అద్భుతంగా మాట్లాడగలరనా!!!

Vinay Datta said...

What JP garu said is right. Infact our fathers and fore fathers' generation live a wholesome life, respecting other religions, taking care of animals, birds, crops and trees as a part of their family.

With tears in her eyes, my mother feeds cows straying on the roads of Hyderabad with rice and water, remembering the cows they had at home in their village about 40 years back. They grew up with the calves.

It would be good if the news channels focus on human relations and the bond animals and 'humans' together share. I can assure high TRPs.

Now both the government and people want all the area in India 'urbanized', 'disciplined, 'clean with concrete'. One way, people in TN, including Chennai, are much better.

cbrao said...

హైదరాబాదులో దీపావళి తరువాత రోజులలో ఒక రోజు యాదవులు గేదెలను ముస్తాబు చేసి ఊరేగిస్తారు ఒక పండగలా. నారాయణగూడాలో ఈ ఊరేగింపు ప్రారంభం అవుతుందని గుర్తు. ఖైరతాబాదు కూడా ఈ ఊరేగింపు వచ్చేది. ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్ లో ఈ ఊరేగింపులు సాధ్యమా? మరింత సమాచారం స్థానిక పాత్రికేయులు మీకు అందించగలరు.
cbrao
Mountain View (CA)

harinder said...

Mitrama....Medaklo Deccan Development society ila cheyadam gata 15 elluga jarugutoone undi...medialo cover chesi, chesi visigipoyam...journalistlaki varu edaina oka vishayam chooste...adi appativaraku prapanchaniki teliyadanukontaaru...adi enta patadaina sare..DDS Satish di oka rakamaina publicity stunt....deeni gurunch antaga poosukonavasaram ledanukunta......Harinder

Ramu S said...

హరిందర్ గారు
నేను ఈ స్టొరీ మిస్ అయి వుంటాను. పాపం డి.డి.ఎస్.వాళ్ళు ఎరేంజ్ చేసిన ప్రోగ్రాం కాదు అది. సతీష్ గారు అక్కడ లేరు. ఊళ్ళో చూసినది నేను రాసాను.
రాము

ramnarsimha said...

Thanks..for your information..

Thirmal Reddy said...

@cbrao

యాదవ సమాజం వారు నిర్వహించే ఆ ఉత్సవం పేరు 'సదర్'. ఇప్పటికీ వైభవంగా జరుగుతోంది. ఇందులో గేదెలు కాకుండా పోతులను ప్రదర్శిస్తారు. దీపావళి తర్వాత నిర్వహించే ఈ ఉత్సవం ఒక్క నారాయన్గుడాకే కాదు, చార్మినార్, శాలిబండ, గొల్ల కిడికి, గౌలిపుర తదితర పాతబస్తీ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. కాకపోతే ఇప్పుడది సంప్రదాయంతో పాటు, వ్యక్తిగత హోదాకు చిహ్నంగా మారింది.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

katta jayaprakash said...

ABN Andhra Jyothi channel has today has given a story exposing twelve journalists of Kurnool who got involved in a land scam of a assigned given to a dalit and interestingly The Hindu and ABN reporters were among the twelve and ABN reporter is suspended.
JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి