Friday, June 4, 2010

బ్లాగ్ లో 'నిజాలు' రాసుకున్నందుకు ...Mahaa-TV నుంచి వెలి

కొమ్మినేని గారు 'ఆంధ్రజ్యోతి' ని వీడాక N-TV లైవ్ షో లో కూర్చొని ఆ పత్రిక  యజమాని, తన మాజీ బాస్ వేమూరి రాధాకృష్ణ పై విమర్శలు చేశారు. గురూ గారు దీంతో N-TV యజమాని నరేంద్ర చౌదరి మెప్పు పొంది ఉంటారు. 

దానికి భిన్నంగా....ఒక టీ.వీ.ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి...తన అభిప్రాయాలను తన బ్లాగ్ లో నిర్మొహమాటంగా రాసుకుంది. ఇది నచ్చని యాజమాన్యం...ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తొలగించింది.

కొమ్మినేని బెటరా? ఆ చిట్టి తల్లి బెటరా? అని వోటింగ్ పెట్టడం కాదు ఇక్కడి ఉద్దేశం. సత్యాన్ని నమ్మిన వారు...పరిస్ధితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా సత్యాన్నే పలకాలి. రెండు లక్షలు ఇచ్చే దగ్గర ఇంకో అరలక్ష ఇస్తారేమో అని ఆలస్యంగా 'నిజాలు' పలకడం...కన్నా...నిర్భయంగా నిజాలు మాట్లాడి ఉజ్జోగం పోగొట్టుకోవడం....ఆత్మస్థైర్యాన్ని (అదే..సమాజం దృష్టిలో...తెలివితక్కువతనాన్ని) తెలియజేస్తుంది. ఈ రెండో పనిని  వెర్రిబాగులతనంగా  మన నవీన స్వేచ్ఛా సమాజం అభివర్ణిస్తుంది.  అలాంటి వారిని మనం దరిచేరనివ్వం. మనం ఆధునికులం కదా! ఇది  బైటకు కనిపించేటంత చిన్న విషయం కాదు. ప్రజాస్వామ్యవాదులు, బ్లాగర్స్ (ముఖ్యంగా మహిళామణులు), జర్నలిస్టులు...స్పందించాల్సిన సమస్య.

తమ ఛానల్ వారు...ఒక సారి జమునను ప్రశ్నలతో ఏడిపించాలని యాంకర్ను పురమాయించారనీ, క్రికెట్ మ్యాచుల సందర్భంగా ఇక్కడి ఒక 'ముసలాయన' టోయ్...టోయ్ అంటూ సెక్సీ ఫోటోలు చూపాలని ఒత్తిడి చేస్తాడని...దీనికి బ్లూ ఫిల్మ్స్ చూపడానికి పెద్ద తేడా లేదన్నది తన అభిప్రాయమని...ఇలా ఒక నాలుగు అంశాల మీద ఆ అమ్మాయి తన అభిప్రాయాలు రాసుకుంది ఒక పోస్టులో...తన బ్లాగ్ లో. 


అది చూసిన ఆ ఛానల్ సార్ ఒకరు...ఆ పోస్ట్ తీసేసి, క్షమాపణ చెప్పాలని కోరారట. అది చేయనందుకు ఆమెను ఉద్యోగానికి రావద్దని అన్నారట. ఇక్కడ తెల్లనివన్నీ పాలు...అనుకోవాలనీ, అదే మాట చెప్పడమో/రాయడమో చేయాలని అనుకోవడం ఈ అమ్మాయి అమాయకత్వమే కానీ...ఏదో తెలియక నిజాలు రాస్తే...ఉద్యోగం తీయడం అభ్యంతరకరం. ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధం.

ఒక జూనియర్...అంత నిర్మొహమాటంగా తన బ్లాగ్ లో ఛానల్ పై అభిప్రాయాలు రాసిందంటే...ఆమెలో నిస్పృహను అర్ధం చేసుకుని, ఆమె అభిప్రాయాలపై విశ్లేషణ చేసి....మంచి వుంటే గ్రహించవచ్చు. 
 "వాళ్ళు నా వ్యాఖ్యలను స్పోర్టివ్ గా తీసుకోలేరా?' అని ఉద్యోగం పోయిన తర్వాత ఆమె మరొక పోస్టులో రాసుకుంది.
ఆ ఛానల్ యాజమాన్యం ఈ కేసును పాజిటివ్ గా తీసుకుని....ఆ జర్నలిస్టుకు న్యాయం చేయాలని బహిరంగంగా అర్థిస్తున్నాం. కావాలంటే...ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము బాధ్యత వహిస్తాం. 

వెంకట్రావు గారూ, శేఖర్ రెడ్డి గారూ....please take back your decision. Be proud of an outspoken employee of yours.

---------------------------------
Note: సయోధ్యకు ద్వారాలు తెరిచి ఉండాలనే...ఈ పోస్టులో ఇంకొన్ని వాస్తవాలు ఇవ్వడం లేదు. ఆ ఉద్యోగిని పేరు రాయడం లేదు. ఎంతో సీనియర్ జర్నలిస్టులు, గౌరవనీయులైన రావు, రెడ్డి గార్లు ఆ అమ్మాయిని మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకుంటారన్న ఆశతో ఆ పోస్టులను ఇక్కడ ఇవ్వడం లేదు. 

ఈ మేరకు శేఖర్ రెడ్డి గారికి స్వయంగా మెయిల్ కూడా పెట్టాను. అది చూసి...
ఈ కేసు పూర్వాపరాలు ఏమిటి? ఇలాంటి కేసును బ్లాగర్లు ఎలా డీల్ చేయాలి?...వంటి అంశంపై ఒక మూడు రోజుల తర్వాత వరసగా పోస్టులు రాయడానికి ఉపక్రమిస్తాను. ఈ లోపు వీరు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుని తమ పెద్ద మనసును చాటుకుంటూ...కొత్త సంప్రదాయానికి తెర ఎత్తుతారని ఆశిస్తాను. 

24 comments:

astrojoyd said...

as par my knowledge bth IVR/SEKAR REDDY Gaaru were very broadminded gentlemens,still i dnt beleive this news appeard in ur blog sir.They r not such a narrowminded people,why bcz..they came up in life wth lot of hurdles,so they know the value of an employee.They will surely take back that woman in to their channel sir--jayadev.challa/chennai-17...

Malakpet Rowdy said...

"ఏంకర్" అని చెప్పకనే ఆవిడెవరో చెప్పేశారుగా. మన మార్తాండ అభిమాన బ్లాగర్లలో ఆమె ఒకరు. కానీ బ్లాగులో ఏదో వ్రాసినంత మాత్రాన ఉద్యోగం లోంచి తీసెయ్యడం విచిత్రంగా ఉంది - Maybe someone's feeling insecure.

ఒక వేళ ఆమె వ్రాతలు నచ్చకపోతే, ఇలా దొంగ దెబ్బ తీసేకన్నా కామెంట్లలోనో (కానీ ఆవిడ బ్లాగులో కామెంట్లు అనుమతించరుగా!) లేక వేరే బ్లాగులోనో ఆమె వ్రాతల్ని ఉతికారేసుంటే సరిపోయేది.

Raja said...

Ramu garu aa ammai kuda job quit chese aalochanalo unnapudu, malli yenduku roa and reddy garlani request cheyyatam.

malakpet rowdy garu pai comment lo echina hint tho aa anchoc blog spot chusanu. she wrote,"as soon as possible quit this shit job.......I can't adjust in this atmosphere atlest wana peace of mind!rest of all in pinkmoods as always im"

Ramu S said...

ఆర్.ఆర్.గారూ...
ఏదో నిస్పృహ లో అలా రాసుకుని వుంటుంది. చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. యాజమాన్యాలు మన పని తీరును బట్టి నిర్ణయాలు తీసుకోవాలి గానీ...కనీసం ఛానల్ పేరైనా రాయకుండా....తన వృత్తి బాధలు/ మనసులో భావాలు రాసుకుంటే...వాటి ఆధారంగా సాగనంపడం భావ్యం కాదు. ఒక వేళ ఆ బ్లాగ్ ఉన్నట్లు జనాలకు తెలీకపోతే లేదా అనానిమస్ పేరుతో రాస్తే పరవాలేదా?
రాము

చదువరి said...

తాను పనిచేస్తున్న కంపెనీ గురించి బ్లాగులో అలా రాయడం ఉచితంగా అనిపించలేదు. ఒక ఉద్యోగే రాసారు కాబట్టి, సహజంగానే మనం నమ్మేస్తాం. ఒకవేళ అది నిజం కాకపోతే కంపెనీకి నష్టమే కదా!

ఆయా చానెళ్ళ గురించి మీరూ రాస్తున్నారు, కానీ మీరు లోపలివ్యక్తి కాదు గాబట్టి, ఉద్యోగి చెప్పేదాని కున్నంత విశ్వసనీయత మీరు చెప్పేదానికుండదు.

సరే నమ్మేసారు, బానేవుంది. కానీ ఆమె దేమీ తప్పులేదు, మీరిద్దరూ అనవసరంగా తీసేసారు, ఆమెను తిరిగి తీసుకోండి అంటూ వాళ్ళిద్దరినీ డిఫెన్సులోకి నెడుతున్నారే.., వాళ్ళు తప్పు చేసేసినట్టే నిర్ణయించేసారా? భలే! :)

నరేష్ నందం (Naresh Nandam) said...

రాము గారూ
ఆ అమ్మాయి ఏ విషయంపైనైనా చాలా నిర్మొహమాటంగా స్పందిస్తుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన మీడియాలో ఉంటూ.. తన అభిప్రాయాలను చెప్పిన ఆమెపై ఇలాంటి చర్య తీసుకోవటం సమర్ధనీయం కాదు. లబ్ధప్రతిష్టుల ప్రవర్తనను ఆమె బయటపెట్టటం, ఒక వార్త జనంలోకి వెళ్లటం కోసం పిసిఆర్‌లో ఎవరేమంటారో చెప్పటం ఆయా వ్యక్తులకు ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. మేనేజ్‌మెంట్‌కు డబ్బు ముఖ్యం కాబట్టి ఛానెళ్లో ఏం చూపిస్తారో ఎలా చూపిస్తారో వాళ్ల ఇష్టం. అదే సమయంలో పబ్లిక్ ఛానెళ్లో వస్తున్న వార్తలకు స్పందించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ సంస్థ ఉద్యోగిగా ఆ కామెంట్ చేయటం పనికి రాదంటారు కదా? కొమ్మినేని గారిలాగా మరో సంస్థలో చేరిన తర్వాత తన బ్లాగులో అదే విషయాన్ని రాస్తే తప్పు ఉండదంటారా? ఇక తన బాధను ఒపీనియన్‌ను ఎప్పుడు చెప్పాలి? అదే తను మీ బ్లాగులో ఎనానిమస్‌గా కామెంట్ చేసి ఉంటే.. లేదా మీరన్నట్లు మరో బ్లాగులో పేరు లేకుండా పోస్ట్ పెడితే ఏంచేస్తారు? ఉద్యోగంలో అసంతృప్తి, తమ బాసులు, సంస్థల మీద అసహనం, కోపం చాలా మందికి ఉంటాయి. అవే మీరు నడుపుతున్న బ్లాగులకు ఎక్కువ ఇన్‌పుట్ ఇస్తాయి. అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా, జీతంలో పిఎఫ్ కట్ చేస్తున్నా.. పిఎఫ్ ఎకౌంట్‍ నెంబర్ ఇవ్వకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. వాటినేం చేస్తారు? ఇక్కడ చర్చ జరగాల్సింది అలాంటి ఉద్యోగులు ఇంకా ఎంత మంది ఉంటారు అని? ఇప్పుడు ఈ అమ్మాయిని టెర్మినేషన్ నోటీస్ ఇవ్వకుండా 'మీరు బులెటిన్ చేయవద్దు' అని అన్నట్లే మన మిత్రులను కూడా 'మీరు రేపట్నుంచి ఆఫీసుకి రావద్దు' అంటే ఏంచేస్తారు?

quimicaindia said...

I am not from Media field but felt bad about it.

I lost respect for that channel.

Ramu S said...

చదువరి గారు,
వారు తప్పు చేసారని నేను చెప్పలేదు. ఈ అమ్మాయి బ్లాగ్ లో రాయడం ఒక్కటే తప్పయితే...ఈ తప్పును క్షమించమని కోరుతున్నాను.
రాము

quimicaindia said...

Dear Ramu garu,

After reading Naresh Nandam's response, I feel that you should allow Anonymous postings /responses on your blog because everyone may not afford to risk their jobs at the same time they would like to express their feelings and your blog is obviously a platform for those.

regards
Krishna

Unknown said...

Ramugaru, After seeing your post I felt very sad and I enquired about the girl through my friends in mahaa tv. I think there is an other side to the story also. I don't know if your decision to bring shekar reddy and IVR's names into this controversy is right, they being very seniors. You should do a bit more of enquiring from your side before levelling such allegations. Regards

శరత్ కాలమ్ said...

"ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము బాధ్యత వహిస్తాం. "

ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని మీ కౌన్సిలింగూ?

Vinay Datta said...

Krishna garu,

Please read the response of Ramu garu for the comment I had posted in the previous post. It answers your query, too.

Ramu S said...

మధు గారు,
I am in touch with the two seniors you are talking about. I've got the management version too. Lets have a discussion on this episode.

శరత్ గారు,
కౌన్సిలింగ్ చేయడమంటే...తప్పు ఒప్పుకొమ్మని చెప్పడానికి చేసే యత్నం కాదు సర్. మరీ మధ్యవర్తిత్వం అంటే బాగుండదని...ఆ పదం వాడాను.
రాము

Raja said...

Ramu garu anamaka coment posting ni malli start chese aalochana yedanna undaa?

Raja

Thirmal Reddy said...

రాము మీరు ప్రస్తావించిన యాంకర్ బ్లాగ్ (అన్ని పోస్టులతో సహా) పూర్తిగా చదివాను. తనను ఔట్ స్పోకెన్ అనేకంటే ఇంట్రోవెర్ట్ అనడం మంచిదేమో. మీరు నమ్ముతారో లేదో తెలియదు గాని బ్లాగ్గింగ్, మైక్రో బ్లాగ్గింగ్ హిట్టైంది ' లోపలి మనషుల ' వల్లే. అలాగని నేను సదరు యాంకర్ని తప్పు పట్టడంలేదు, ' లోపలి మనుషుల్స్ని ' హేళన చేయడం లేదు. నేను కూడా ఆ కోవకే చెందుతాను. చెప్పొచ్చేదేమిటంటే ఔట్ స్పోకెన్గా ఉండదలిస్తే కొంత లౌక్యం అవసరం, లేదా... కనీసం తన బ్లాగ్ లో కామెంట్స్ అనుమతించి ఉంటె బావుండేది. అదే చానేల్లోని మరో యాంకర్ కి మంచికో చెడుకో బెస్ట్ యాంకర్ అనే బిరుదు తగిలించింది కూడా ఈ బ్లాగ్ అని మర్చిపోకూడదు.

Srinivas said...

ఏ కంపెనీకయినా తమకు ఆర్థికంగానయినా, పేరుప్రతిష్టలకయినా నష్టం వాటిల్లజేసే ఉద్యోగుల్ని తొలగించే హక్కు ఉంటుంది. ఆత్మస్థైర్యమంటే బ్లాగుల్లో తన కంపెనీనిని తిట్టుకోవడం కాదు. తప్పనిపిస్తే ఎదురుతిరగడం, నెగ్గకపోతే, వైదొలగడం.

బ్లాగుల్లో తమ కంపెనీ భాగోతాల్ని బయటపెట్టడం ఇంకా కొత్త కనక ఆ ఆమ్మయి ఉద్యోగాన్ని నిలబెట్టబూనడం మీరు చేస్తున్న మంచి పనే కానీ, ఆ చర్యని సమర్థించడం సమర్థనీయం కాదు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే.

ఒక కంపెనీ ఉద్యోగస్తుల పిర్యాదులన్నీ తమ మధ్యనే పరిష్కరించుకోగలిగే వ్యవస్థ రూపొందించుకునే రోజు ఎప్పటికయినా వస్తుందని ఆశ.

Unknown said...

Ramugaru,
I totally agree with what Srinivasgaru mentioned in the above blog. She should have solved her problems with the management by talking to them directly. There are so many people working in thatorganization but why is it that only this girl faced this situation? Having said this I am not supporting the management of Mahaa but just posting my opinion. They both should have resolved this issue amicably.My sympathies are with this girl. Not easy to get a good job these days.Regards

చదువరి said...

ఇంకో సంగతి.. ఇలా తాను పనిచేసే సంస్థ గురించి బ్లాగుల్లో రాసేస్తారని తెలిస్తే మరే సంస్థయినా అటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇస్తుందా అనేది సందేహమే!

తిర్మల్ రెడ్డి గారూ, గతంలో వ్యాఖ్యల అనుమతి ఉండేదండి. ఓ ఏడాదిన్నర కిందట ఒక విషయంలో వ్యాఖ్యాయుద్ధం కావడంతో, వ్యాఖ్యలన్నీ తీసేసి, తరవాత ఆ సౌకర్యమూ తీసేసారు.

saamanyudu said...

can some one give her blog name ?

vasu said...

ఇంతకి ఆ యాంకర్ ఎవరో చెప్పగలరు. ఆ బ్లాగ్ URL ను అందుబాటు లొ ఉంచండి.

Ramu S said...

సామాన్యుడు అండ్ వాసు గారూ....
ఆ లింక్ ఇస్తే...ఆమెకు వేరే ఛానల్ లో వచ్చే వుద్యోగం ఈ బ్లాగ్ మూలంగా పోతుందేమో అని నా భయం. అందుకే ఆమె కు పది పదిహేను రోజుల్లో వుద్యోగం వచ్చాక ఆ సంగతులు చూద్దాం.
అంతవరకూ...క్షమించండి....
రాము

Vinay Datta said...

I support madhu garu and chaduvari garu.

Anonymous said...

రాము గారు మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి కాదు...ఆ అమ్మాయి తన భావప్రకటన స్వేచ్చ మేరకే తన అభిప్రాయన్ని రాసింది..అలా రాయాలికూడ.. అల రాసినందుకు ఒక జర్నలిస్టుగా మీరు ముందు ఆమెను అభినందించండి..వీలైతె అమెతరపున ఒక జర్నలిస్టుగా జర్నలిస్టులందరిని కలుపుకొని పొయి నిలదియండి అంతెకాని ఆమే ఏదొ తప్పు చెసినట్టు కౌన్సిలింగ్ ఇస్తాననడం భాగాలేదు. ఇది జర్నలిస్టుగా మీదు చేయల్సిన పని కాదు.

David said...

రాము గారు మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి కాదు...ఆ అమ్మాయి తన భావప్రకటన స్వేచ్చ మేరకే తన అభిప్రాయన్ని రాసింది..అలా రాయాలికూడ.. అల రాసినందుకు ఒక జర్నలిస్టుగా మీరు ముందు ఆమెను అభినందించండి..వీలైతె అమెతరపున ఒక జర్నలిస్టుగా జర్నలిస్టులందరిని కలుపుకొని పొయి నిలదియండి అంతెకాని ఆమే ఏదొ తప్పు చెసినట్టు కౌన్సిలింగ్ ఇస్తాననడం భాగాలేదు. ఇది జర్నలిస్టుగా మీదు చేయల్సిన పని కాదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి