Sunday, July 4, 2010

సీ.ఎం.రోశయ్య పై కొమ్మినేని గారి పుస్తకం

జర్నలిజంలో ఉన్న మిత్రులు అనేకులు...తాము ఈ ఉద్యోగం తప్ప ఇంకేమీ చేయలేమన్న దురభిప్రాయంతో కాలంవెళ్ళదీస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారి దగ్గరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. 
'ఈనాడు' లో ఉన్నప్పుడు ఎడిట్ పేజీలో తాను రాసిన మంచి విశ్లేషణాత్మక వ్యాసాల కాలమ్ 'రాష్ట్రంలో రాజకీయం' లోని ఆణిముత్యాలతో ఆయన ఒక పుస్తకం వేసిన గుర్తు. అలా తమ రచనలతో ఒక పుస్తకం వేసుకోవచ్చన్న స్పృహ చాలా మందికి వుండదు. మ్యానేజ్మెంట్లు అందుకు ఒప్పుకుంటాయో, లేదో అని ముందే సంశయపడకుండా...ఒక ప్రయత్నం చేస్తే పుణ్యం, పురుషార్థం లభిస్తాయి. 

ఆ తర్వాత...మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి వరకూ ఎన్నికల గణాంకాలతో కూడిన పుస్తకం తెచ్చారు కొమ్మినేని. అది బోలెడు డాటాతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి పొలిటికల్ రిపోర్టర్ దగ్గర ఉండాల్సిన పుస్తకమది. ఎన్నికల పేజీలకు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు చేయడానికి అది ఉపకరిస్తుంది. జిల్లాల వారీగా కూడా అలాంటి సమాచారంతో ఆయన బుక్ వేసారట. ఆ తర్వాత కూడా ఆయన ఒకటి రెండు వర్క్స్ చేసినట్లు వినికిడి. అయితే...ముందే చెబుతున్నా....జర్నలిస్టులు కుల సంఘాలను, అంతకు ముందు వార్తల్లో తాము పొగుడ్తూ రాసిన పెద్దల ఆర్ధిక సాయంతో పుస్తకాలు అచ్చేసుకోవడం మంచిది కాదు.

ఈ మధ్యన 'ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు,' 'రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్' అనే పుస్తకాలను కూడా కొమ్మినేని గారు ప్రచురించారు. తాజాగా కొమ్మినేని గారు 'సంభాషణా చతురుడు ముఖ్యమంత్రి రోశయ్య' అనే పుస్తకాన్ని రాసారని తెలిసి నేను ఆయనకు మెయిల్ ఇచ్చాను.

గురుతుల్యుడైన కొమ్మినేని గారు...తిరుగు మెయిల్ పంపుతూ...ఆ పుస్తకం ఆవిష్కరణ ఈ ఆదివారం సాయంత్రం గోల్కొండ హోటల్ లో అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. నన్ను కూడా ఆహ్వానించారు ఆయన. కరెక్టే...ఈ రోజు రోశయ్య గారి జన్మదినోత్సవం కదా! రైట్ టైం. 

ఇలా అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాం. అయితే...మీరు కూడా పదవిలో ఉన్న ముఖ్యుల మీద పుస్తకం రాసెయ్యాలని అనుకోకండి. ఇదే రోశయ్య గారి మీద గతంలోనే పుస్తకం రాసిన టి.సురేందర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్ పదవి పొందారు. ఇప్పుడు కొమ్మినేని గారు కూడా రోశయ్య గారి ఉత్తమ లక్షణం మీద పుస్తకంతో వస్తున్నారు.

1978 లో 'ఈనాడు' లో చేరికతో కెరీర్ ఆరంభించిన సురేందర్ గారు రాసిన పుస్తకాలలో 'ప్రజల మనిషి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి,' 'జయహో వై.ఎస్.' వంటివి ఉన్నాయి. 'నిలువెత్తు తెలుగు సంతకం--కొణిజేటి రోశయ్య' అనే  పుస్తకాన్ని కూడా ఆయన రాసారు. "నేను కూడా రాహుల్ గాంధీ మీద ఒకటి, వై.ఎస్.జగన్ మీద ఒకటి పుస్తకం రాయాలి...ఎందుకైనా మంచిది," అని అంటున్నాడు...ఎటకారం అబ్రకదబ్ర. 

పుస్తకం అంటే...గుర్తుకు వచ్చింది. 'నువ్వు ఇక నా మూడో కొడుకువి' అని రామోజీ రావు గారు అన్న దానికి నేను యమా చలించిపోయానని గతంలోనే మీకు చెప్పాను. అందుకే...'ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం' నుంచి పట్టా తీసుకోగానే....రామోజీ గారికి ఒక లేఖ పంపాను. 'నేనిప్పుడు అదనపు జ్ఞానం పొంది వున్నాను. బాగా పనిచేయించుకుని మీరు పదేళ్ళలో ఒక్క ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చినా పనిచేస్తాను....ఎందుకంటే...మీరు నాకు కొడుకు హోదా ఇచ్చారు కాబట్టి. మొదటి అప్లికేషన్ మీకే పంపుతున్నాను," అన్నది దాని సారాంశం. నాకూ వుద్యోగం అవసరం ఉన్నది అప్పట్లో. ఆ ఎమోషనల్ లేఖలో...ఇంకొక మాట కూడా రాసాను. "సార్...మీ బయోగ్రఫీ రాయాలని ఉంది. అవకాశం ఇవ్వండి," అని అందులో ప్రతిపాదించాను. రామోజీ గారు అందుకు స్పందించకపోవడంతో...'ది హిందూ' లో జాయిన్ అయ్యాను. 

నాకు ఇప్పటికీ బాగా అనిపిస్తుంది....రామోజీ గారి జీవిత చరిత్ర వచ్చి తీరాలి. నిజంగానే తెలుగు జర్నలిజం లో ఆయన ఒక సంచలనం. అంతే కాదు...వ్యాపార రంగంలో ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆ పని ఎవరైనా ఒక వర్కింగ్ జర్నలిస్టు నిష్పాక్షికంగా చేస్తే బాగుంటుంది. రామూని ఆయన 'మూడో కొడుకు' అన్నాడని మాత్రం ఆ పుస్తకంలో రాయకండి. ఎందుకంటే...'నువ్వు నా మూడో కొడుకువి' అని ఆయన ఏదో ప్రోత్సాహకంగా చాలా మందిని అన్నారట, అంటూ వుంటారట.     

16 comments:

aks said...

రామోజీ జీవిత చరిత్ర రాయలనుకోవటం మంచి ఆలోచన.తెలుగు లో కొత్తగా పుట్టుకొచ్చిన చానల్స్ ,న్యూస్ పేపర్స్ పిచ్చి వ్యాఖ్యలు,పిచ్చి రాతలు చూశాక కొన్ని విలువలున్న వ్యక్తి గా రామోజీరావు మీద గౌరవం పెరిగింది. మీలాంటి నిఖార్సైన జర్నలిస్ట్ నుంచి అలాంటి పుస్తకం ( అనధికారికం గా అయినా ) వస్తే మరీ సంతోషం గా ఉంటుంది .దయ చేసి ఆ ప్రయత్నం మానకండి .

Saahitya Abhimaani said...

"తెలులో వార్తా పత్రికలు నాడు నేడు" ఒక సమీక్షాత్మక పుస్తకం వ్రాయండి. భవిష్యత్తులో జర్నలిజం కోర్సులో చేరేవాళ్ళకి అది టెక్స్టు బుక్ స్థాయిలో ఉండాలి .

ఈ జీవిత చరిత్రలు అవి వ్రాసి ఎవరికీ ఉపయోగం లేదు.పుబ్బలో వ్రాస్తే మఖలో కనుమరుగు అవుతాయి.

సుజాత వేల్పూరి said...

అజయ్ తో ఏకీభవిస్తున్నాను. రామోజీ జీవిత చరిత్ర తప్పకుండా ఒక మంచి రచయిత రాయాలి. కేవలం పొగడ్తలతో నింపకుండా ఈ స్థాయికి చేరడానికి ఆయన ఎంత కృషి చేశారో చక్కగా వివరించాలి.అలాగే మిగతా ఛానెళ్ళతో ఈ టీవీ 2 ఎంతో క్లీన్ గా ఉండటం చూస్తే ఆయన విలువలు పాటిస్తున్నారనే అనిపిస్తుంది.మీరైతే మంచి "సమతూకం" తో రాస్తారని అనిపిస్తోంది! ఏమంటారు?

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో లేదో కానీ అనుకున్నది సాధిస్తారని మాత్రం రామోజీ నుంచి నేర్చుకోవలసిన పాఠం!

ఒక పక్క అబ్రకదబ్ర మాటల్ని తీసిపారేయడానికి కూడా లేదు. జీవితంలో సెటిలయ్యే మార్గం ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంటూ చెప్పని విధంగా చెప్తూంటే వెటకారం అదీ ఇదీ అంటారేంటి మీరు?

ramnarsimha said...

Sir,

I think that the next Press Academy Chariman will be Mr.Kommineni.

ramuputluri@yahoo.in

katta jayaprakash said...

I do agree wih all those who for a biography of Ramoji Rao.To be frank irrespective of all other things Ramoji Rao is a doyen of Telugu journalism and media including electronic.He has made a great revolution transforming Telugu media into a nationally recognised one and he had made the Telugu people to come out of the four walls of Andhra Prabha,Andhra Patrika,Jyothi, Bhoomi ,Vishalandra ,Prajashakthi etc which have been ruling the Telugu media like Ambassador and Fiat cars with monotonous writings,non committal analysis,reviews and news coverage.For any one to survive in any proffession one requires political will and background as history itself reveal and Ramoji Rao NTR combnination had made both of them successful withthe people getting good crecognition to one another.Inview of these facts let some write Ramoji Rao,s life story from his early of struggle till the success in the media and his wrong steps of involving in Margadarsi getting himself into unimaginable troubles probably rterpenting for his over confidence and rather arrogance for which he had to pay heavily physically,mentally and financially.I am sure Ramoji Rao must have become a totally transformed media proffessional today realising his wrong calculations.In the past ETV never used to telecvast on astrology etc but in these days one find astrology in ETV too which itself indicate the transformation rrealising that some supernatural thing is controlling and driving us.Whatever it may be one expects good,bad and ugly of Ramoji Rao,s life and proffession so that his life and proffession and the way of running the organisation with discipline,dedication,devotion and determination with utmost value to the time sense.Let every media proffessional learn good from him and keep away the bad and ugly aspects of him which made him sleepless with court cases and enemiescamong politicians.
JP.

Vinay Datta said...

The biography of Ramojigaru is an excellent idea. He usually doesn't respond to negative criticism on him. The biography can bring out responses not only to that but also to several unquestined issues.

Sivagaru has given a very good idea.

Anonymous said...

అర్రే ! ఏంటబ్బా రామోజీ చేసిన అంత గొప్ప కృషి ? అతను 1960 ల నుంచి చైనా ఏజంటు. ఆ మార్గంలోనే అతను సంపాదించినదంతా వచ్చింది. ఇప్పటికీ అతను విదేశీ ఏజంటుగానే పనిచేస్తున్నాడు. డబ్బు తీసుకుంటున్నాడు. అతని వ్యాపారాలన్నీ ఆ గూఢచర్యానికి ఫ్రంట్ బిజినెస్సులే.

చదువరి said...

ఓహో, రామోజీరావు చైనాక్కూడా ఏజెంటేనా? ఇన్నాళ్ళూ ఒక్క అమెరికాకేనని చదూతున్నాను.

Ramu S said...

కుమార్ దత్తా & చదువరి...
ఇది మరీ చోద్యం గా ఉందండి. రామోజీ చైనా, అమెరికా ఎజేంటా? విదేశీ ఏజెంట్ అంటే ఏమిచేస్తారు? నాకైతే ఇది వింతగా వుంది.

రాము

ఏక లింగం said...

రాము గారు,

రామోజీ రావు గారు చైనా ఏజంట్ అన్న ఆరోపనలను "రామోజీ...చివరికు మిగిలేది" అన్న పుస్తకంలో చదివాను. ఇది ఈనాడు పత్రికలో 8 సం॥ పనిచేసిన, వరుసకు రామోజీ రావు గారి అన్న కొడుకు అయిన చెరుకూరి చంద్రమౌళి గారు వ్రాసిన పుస్తకం. అందులో ఇలాంటి ఆరోపనలే కాకుండా రామోజీ గారికి సంబంధించిన చాలా వివరాలు ఉన్నాయి. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇంకెవరైనా చెబితే తప్ప అవి ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్ధమో తెలియదు.

akula naresh said...

congrats journos,for concentrating more in doing bhajana to political bosses.Poor rural people thinking that u r credible,,seasoned politicians are much better

sri said...

cm said in that meeting as kommineni will start the book on rosayya since 2007..so he was not looking on press academy and any other post in governament...

Unknown said...

CM ye chepadu, Komineni 2yrs nunchi natho discuss chesthunadu ani...

unnecessary ga Komineni ki bad name vachetatu rayakandi..

Ramoji chrithra lo yemundi , adikarani use chesukoni koni vela kotla govt landa ni kajesi, purathana statues ni smuggle chesi ,kalanjali ko peti...abo okatemiti..

yevaran rasthe adi criminals ki inspiration ga untadi

Unknown said...

ramoji is great he is encyclopedia for every one in journalism field we are start work in ramoji gourp in 1997 now we are good position in other groups we learn more more from that group and that personality it is a good idea of biography of ramoji garu........krishna

srikanth said...

ramoji gurinchi sontha vargaanike chendina hero krishna NTR pai teesina vangya chitrallo enaado prastaavinchaadu. oka broker ga loafer ga dadapu anni cinemallo choopinchaadu..

Anonymous said...

సుజాత గారితో నేను విబేధిస్తున్నాను.
మిగతా ఛానెళ్ళతో పోలిస్తే ఈ టీవీ 2 ఎంతో క్లీన్ గా ఉండటం చూస్తే ఆయన విలువలు పాటిస్తున్నారనే అనిపిస్తుంది! అన్నారు.
కానీ నేననుకుంటాను కేవలం బిజినెస్ ట్రిక్ లో భాగంగానే డిఫరెంట్ గా వుండడానికి ఛూస్తున్నారేమో?
ఎందుకంటే విలువలు అనేవే వుంటే ఇన్ని ఆర్ధిక నేరారోపణలకు గురి కాకూడదు, పైగా అవేవీ నమ్మలేనివిగా లేవు కదా? ఎన్నో సాక్ష్యాలు దొరికాయి కూడా కదా?
ఓన్లీ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో లేదో కానీ అనుకున్నది సాధిస్తారని అనేది మాత్రం రామోజీ రావు గారి విషయం లో నిజం కావఛ్చు. కాని అదికూడా కేవలం నైతికత లేని వ్యాపార విజయం కాదంటారా? ఋషులవడం వేరు అనుకున్నది కావడం వేరు.
ఇహ చంద్రమౌళి గారు వ్రాసిన పుస్తకం "రామోజీ...చివరికు మిగిలేది" లో వున్న చైనా ఏజంట్ లాంటి ఆరోపనలు కేవలం అక్కసు తో వ్రాసినట్లుగా అర్ధం చేసుకోవచ్చునేమో?
ఎనీవే రామూ గారి లాంటి సిన్సియర్ వ్రాస్తే తప్పకుండా ఇంకా చాలా యాంగిల్స్ బయటకు రావచ్చు. కానీ, ఆయన కేవలం సంధర్భానుసారం మాత్రమే ఆ మాట వ్రాసినట్లుగా నాకనిపించింది. తదుపరి వారే చెప్పాలి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి